జ్వాలా ద్వీప రహస్యం – 16


బెంగ నగరం దాటగానే నరస సింహుడి ఉత్సాహం కట్టలు తెచ్చుకుంది. “ఎట్టకేలకు, నా గమ్యం సిద్ధించబోతూంది,” ఆనందంగా నిశ్వసించాడు.

కొండ ప్రాంతం మొదలయ్యింది. “ఈ పండు కోతి ఏ కొండ పైనుందో?” అనుకున్నాడు యువరాజు. ఎక్కువ శ్రమ పడక్కర లేకుండానే అతనికి ఆ కోతి కనిపించింది. ఆ ప్రాంతంలో అన్నిటికంటే ఎత్తైన కొండ శిఖరము పై కూర్చుని, ఏదో పండు కొరుకుతూ తింటూంది.

“మన వాళ్ళు ఎంతో ఆలోచించి కాని ఏ పేరూ పెట్టరు. పండు కోతి అంటే ఎక్కువగా పండ్లు తినే కోతి అన్న మాట,” అనుకున్నాడు నరస సింహుడు.

“ఓ కోతీ, మేము దోమ దేశపు యువరాజులం. కొండ దిగి వచ్చి మాకు లొంగిపోమ్ము,” అజ్ఞాపించాడు నరస సింహుడు.

ఆ కోతి కిచకిచలాడింది కానీ, కదిలే ప్రయత్నం ఏమీ చెయ్య లేదు. “బహుశా, కోతి అని పిలిచినందుకు చిన్న బుచ్చుకున్నట్టుంది. దాని మనోభావాలు దెబ్బ తిని ఉంటాయి,” అనుకుని, “వానరోత్తమా, కొండ దిగి రమ్ము,” వినయంగా వేడుకున్నాడు యువరాజు.

సమాధానంగా ఆ కోతి తను పండు తినగా మిగిలిన టెంకని కిందకి విసిరేసింది. అది సరిగ్గా వచ్చి నరస సింహుడి తలపై పడింది.

యువరాజుకి కోపం ముంచుకొచ్చింది. “అందుకే కోతి బుద్ధి అన్నారు. ఇది ఇలా మాటల్తో వినే రకం కాదు. నేనే దాన్ని ఈడ్చుకు రావాలి,” అనుకుంటూ కొండ పైకి పాకడం మొదలు పెట్టాడు.

కాసేపట్లో తెలిసి పోయింది యువరాజుకి, ఆ పని అనుకున్నంత సులభం కాదు అని. కొంత పైకి పాకగానే జర్రున జారి కిందకు వచ్చేశాడు.

“ఈ కోతులు అనుకున్నంత సామాన్యమైనవి కాదు సుమా! ఈ బండలతో కూడిన కొండలు పాకుట అంత సులభం కాదు. ఐనా ఈ ముసలి వయసులో ఇంత ఎత్తైన కొండ పైన ఎందుకు కూర్చుందో ఈ పాడు కోతి,” విసుక్కున్నాడు నరస సింహుడు.

నాలుగో ప్రయత్నానికి సరిగ్గా కొండ మధ్య వరకు పాక గలిగాడు అతను. ఆ తరువాత విపరీతమైన భయం వేసింది నరస సింహుడికి. అటూ పైకి వెళ్ళే ఓపిక లేక, ఇటు కిందకి జారే ధైర్యం రాక, అలానే కొండను కరుచుకుని ఉండి పోయాడు.

కాసేపయ్యాక కోతికే జాలి వేసినట్టుంది. అది కిచ కిచలాడుతూ కిందకి దిగి వచ్చి నరస సింహుడి పక్కనే ఆగి మొహంలో మొహం పెట్టి చూసింది.

“వెక్కిరించనక్కరలేదు, నేను నేర్చుకున్న విద్యల్లో పర్వతారోహణం లేదు. అసలు కొత్త విద్యలు నేర్చుకోవడానికి సమయం ఎక్కడిది. వీరబాహుడు చేసిన గాయాలకు మందు రాసుకోవడానికే మిగతా సమయం అంతా సరిపోయేది,” కోపంగా అన్నాడు కోతిని ఉద్దేశించి.

కోతి కిందకు దిగడం మొదలు పెడుతూ, మెల్లగా యువరాజు చేతిని బరికి మళ్ళీ కిచ కిచమంది. అప్పుడు అర్థం అయ్యింది నరస సింహుడికి, అది తనకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తూందని. వెంటనే దాని కదలికలని అనుకరిస్తూ తను కూడా కొండని క్షేమంగా దిగాడు.

“ఇప్పుడు దీన్ని బంధించి తీసుకుని పోవలెను కామోసు,” సాలోచనగా అనుకున్నాడు నరస సింహుడు. అతను ఎక్కువగా ఆలోచించి శ్రమ పడాల్సిన అవసరం లేకుండా, ఆ పండు కోతి తనంతట తానే ఎగిరి షట్ కళ్యాణి మీద ఎక్కి కూర్చుంది.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

2 Responses to జ్వాలా ద్వీప రహస్యం – 16

  1. chavakiran says:

    >> వీరబాహుడు చేసిన గాయాలకు మందు రాసుకోవడానికే మిగతా సమయం అంతా సరిపోయేది

    😀

    baaguMdi.

  2. Jyothi Reddy says:

    Next one please…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s