జ్వాలా ద్వీప రహస్యం – 14


బెంగ నగరము చేరువ అవుతూంటే నరస సింహుడి మది ఆనందంతో నిండిపోయింది.

“ఇక త్వరలోనే కొండ మీద కోతిని సంపాయించి దోమ దేశమునకు తిరిగి వెళ్ళవలెను. ఆశ్చర్యముగా నాకు ఇంటి మీద బెంగ ఎక్కువ అయినది. ఆఖరికి పొద్దున్నే నిద్ర లేపే ఆ మేలుకొలుపు బృందం యొక్క గోల కూడా ఎంతో మధురానుభూతిలా అగుపించుచున్నది,” అనుకున్నాడు తనలో తాను.

గ్రామీణులు చెప్పినట్టే బెంగ నగరం చుట్టూతా కొండలు కనిపించాయి నరస సింహుడికి. “ఇక కొండ మీద కూర్చున్న కోతి కనపడడం ఒక్కటే తరువాయి,” సంతోషంగా నిశ్వసించాడు యువరాజు.

నగర ద్వారాలు దాటి లోపలికి వెళ్ళగానే, జనాలందరి మొహాల్లో విచారం స్పష్టంగా కనిపించింది నరస సింహుడికి. “అందుకే కాబోలు ఈ పట్టణాన్ని బెంగ నగరం అంటారు,” అనుకున్నాడు.

అక్కడేదో పెద్ద సమావేశం జరుగుతున్నట్టుంది. నాలుగు రహదారులు కలిసిన కూడలి మధ్యలో ఒక మహారథమూ, కొన్ని అశ్వాలు నిలబడి ఉన్నాయి.

ముందుకు వెళ్ళాలి అంటే ఆ గుంపుని దాటుకు వెళ్ళాలి కాబట్టి, నరస సింహుడు ఆ కూడలి వద్ద ఆగిపోవల్సి వచ్చింది. సకల రాజాలంకారాలతో రథం మీద నిల్చుని ఉన్న ఒక పెద్ద మనిషి అక్కడ చేరిన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు.

“మీ అందరికీ తెలుసు, ఈ దేశానికి కాబోయే మహారాణి, నా కుమార్తె ఆత్రవింద నిన్న ఆత్రంగా నౌకా విహారానికి వెళ్ళి జ్వాలా ద్వీపపు ప్రాంతాల్లో తప్పి పోయింది అని. ఆమెని వెదికి నా దగ్గరకు తీసుకొచ్చినవాడిని, నా అల్లుడిగా చేసుకుంటాను. అర్ధ రాజ్యం ఇస్తాను,” ఆవేశంగా అంటున్నాడు ఆయన.

“ఓహో, ఈయన ఈ దేశపు రాజు కాబోలు,” అనుకున్నాడు నరస సింహుడు.

వెంటనే ఒక సందేహం వచ్చింది అతనికి. పక్కన ఉన్నతన్ని అడిగాడు, “ఒక వేళ ఎవరైన అమ్మాయి కనుక ఆత్రవిందని వెదికి తెస్తే ఆమెని అల్లుడిగా ఎలా చేసుకుంటాడు మహారాజు?”

“అలా జరిగితే ఆమెని తన అర్ధాంగిగా స్వీకరించవచ్చు. మహారాజుగారి భార్య పోయి చాలా కాలమయ్యింది కద,” జవాబిచ్చాడు అతను.

“ఓహో, అదే నిజమైన ఈ దేశపు ఆడపడుచులు ఎవరూ ఈ అన్వేషణలో పాల్గొనరు అనుకుంటా,” సాలోచనగా అన్నాడు నరస సింహుడు.

“మా దేశపు ఆడపడుచులు ఆ జ్వాలా ద్వీపపు జోలికి ఎలాగూ పోరు పరదేశీ! అది మిక్కిలి భయంకరమైన ప్రదేశం,” చెప్పాడు అతను మళ్ళీ.

“నాదొక సందేహం. నన్ను చూడగానే పరదేశీ అని ఎలా గుర్తు పట్టావు?” కుతూహలంగా అడిగాడు నరస సింహుడు.

“అది చాలా సులువు. నీవు ధరించిన దుస్తులు మా చింత దేశంలో పదేళ్ళ కింద ధరించే వారు. ఇది పాత అలంకారం. మా దేశంలో ఇప్పుడు ఎవ్వరూ ఈ రకం దుస్తులు వేసుకోరు,” వివరించాడు అతను.

గతుక్కుమన్నాడు నరస సింహుడు. “మా దేశంలో ఇదే కొత్త అలంకారములే. ఐననూ ఇక్కడికి నేను వచ్చిన పని వేరు. నా కార్య సాధన నాకు ముఖ్యము. బయలు దేరెదను,” అంటూ షట్ కళ్యాణిని కదిలించడానికి పాట అందుకోబోయాడు.

అనుకోకుండా చింత దేశపు మహారాజు దృష్టి నరస సింహుడి మీదకు ప్రసరించింది. “ఆగు పరదేశీ, ఆగు,” అన్నాడు గంభీరంగా.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

3 Responses to జ్వాలా ద్వీప రహస్యం – 14

 1. JYOTHI REDDY says:

  “అందుకే కాబోలు ఈ పట్టణాన్ని బెంగ నగరం అంటారు,”
  Meelo maroo Thrivikram gaaru kanpisthunnaru sir….Keep going

 2. Sirisha says:

  very interesting and funny..naku chandamama kadhalu antey chala istam…is this ur own?

  • Murali says:

   అవునండీ, ఇది నా కథే. పూర్తి బాధ్యత నాదే. 🙂

   ఐనా ఇలాంటి (అప)హాస్యపు కథలు చందమామలో వేయరనుకుంటా..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s