జ్వాలా ద్వీప రహస్యం – 13


“కోతుల సంగతి నాకు తెలీదు కానీ మా (రా)జ్యం దాటగానే అన్నీ కొండలే,” అన్నాడు అతను.

“రక్షించితివి. మీ రాజ్యం దాటుటకు ఎంత సమయం పట్టును?” అడిగాడు నరస సింహుడు.

“మద్యాహ్న భోజనానికి, ఆ త(రు)వాత వి(శ్రాంతి)కి, (రాత్రి)భోజనానికి సమయము మినహాయిస్తే (రాత్రి) పది గంటలకు మా (రా)జ్యము దాటే అవకాశముంది,” వినయంగా వివరించాడు ఆ నడి వయస్కుడు.

ఆ వాక్యాలకు కావలసిన “ర”లు కలిపి అర్థం చేసుకునేందుకు ఒక పదిహేను నిముషాలు పట్టింది యువరాజుకి.

“అవి ఏవీ లేకున్న సాయంత్రమునకే బయట పడెదను కాబోలు. ఒక్క నిముషం అదనముగా ఇక్కడ ఉన్ననూ మాకు మతి చలించే ప్రమాదమున్నది,” బాధగా తల విదిలించాడు నరస సింహుడు.

“అది నస సింహుల అభీష్టము,” అన్నాడు నడి వయస్కుడు.

ఆలస్యం చేయకుండా పాట లంకించుకున్నాడు నరస సింహుడు. షట్‌కళ్యాణి వెంటనే బయలు దేరింది.

సాయంత్రానికి అనుకున్నట్టుగానే నడి వయస్కుడు చెప్పిన కొండ ప్రాంతానికి చేరుకున్నాడు నరస సింహుడు. కానీ కోతులు ఏవీ కనిపించలేదు. ఐనా నిరాశ చెందలేదు యువరాజు.

“ఎందులకో గంట నుంచి కుడి కన్ను తెగ అదురుతున్నది. త్వరలో ఏదో మంచి వార్త మా చెవిన పడేట్టు ఉన్నది,” అనుకున్నాడు నరస సింహుడు. విశ్రాంతికి కూడా ఆగకుండా, ముందుకు సాగాడు.

కాసేపట్లో ఒక కుగ్రామపు సరిహద్దులకు చేరుకున్నాడు నరస సింహుడు.

ఆ గ్రామంలో ఉన్న రచ్చబండ దగ్గర కూర్చుని ఉన్న నలుగురు పెద్ద మనుషులని ఉద్దేశించి, “ఇక్కడ చుట్టు పక్కల ఎక్కడా కోతులు కనిపించుట లేదు. ఎక్కడ ఉండునో మీకు తెలుసా?” అని అడిగాడు.

పెద్ద మనుషులు కాస్త చిన్న బుచ్చుకున్నారు. “చెట్టంత మనుషులను దగ్గర పెట్టుకుని, కోతుల గురించి వాకబు చేస్తారేంటి దొర? ఆ కోతుల పాటి మేము చేయమా?” బాధగా అన్నారు.

నాలుక కర్చుకున్నాడు నరస సింహుడు. “మన్నించుడు, నా ఉద్దేశం అది కాదు. కానీ నేను కొండ మీద కోతి కోసం అన్వేషిస్తున్నాను. దాన్ని పట్టుకొనుట నాకు చాలా ముఖ్యం. ఆ తొందరలో మర్యాదని అతిక్రమించితిని,” కాస్త సిగ్గు పడుతూ అన్నాడు.

“అలాగా! ఇంతకీ మీరెవరు దొరా?” అడిగాడు ఆ పెద్ద మనుషుల్లో ఒకడు.

“నన్ను నస సింహుడు అంటారు. ఛీ, ఛీ! నరస సింహుడు అంటారు. మా రాజ్యం ఇక్కడికి కడు దూరంలో ఉన్నది. ఒక ముఖ్య కార్యార్థినై కొండ మీద కోతిని వెతుకుతూ వచ్చాను. ఎక్కడ దొరుకుతుందో కాస్త చెప్పగలరా?” ప్రశ్నించాడు యువరాజు.

“ఇక్కడ కోతులు ఏవీ లేవు దేవరా?” అన్నాడు రెండో పెద్ద మనిషి.

నరస సింహుడి మొహంలో కళ తప్పింది.

“కానీ మా గ్రామము దాటిన పిదప పక్క రాజ్యం చింత దేశము యొక్క రాజధాని ఐన బెంగ నగరము వస్తుంది. అక్కడ మీకు కొండలు, వాటిపై కోతులు అగుపిస్తాయి,” చెప్పాడు మూడో పెద్ద మనిషి.

“సొబగు సొబగు!” గట్టిగా అరిచి తిరిగి బయలుదేరడానికి ఉద్యుక్తుడయ్యాడు యువరాజు.

“నేనింకా ఏమీ అనలేదు. నన్ను కూడా ఒక ముక్క చెప్పనివ్వండి,” కాస్త బాధగా అన్నాడు నాలుగో పెద్ద మనిషి.

“కానివ్వండి,” అన్నాడు నరస సింహుడు.

“విజయీభవ!” దీవించాడు ఆయన.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

One Response to జ్వాలా ద్వీప రహస్యం – 13

  1. JYOTHI REDDY says:

    Muraliji,
    Simply Superb mee “RA” message……lol

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s