జ్వాలా ద్వీప రహస్యం – 12


చెప్పినట్టుగానే పొద్దున్నే తన ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టాడు నరస సింహుడు. షట్‌కళ్యాణి సరైన పాట పాడగానే దౌడు తీయడం మొదలు పెట్టింది.

మద్యాహ్నానికి కొండపల్లి దాటాడు నరస సింహుడు. “అసహ్యకరమైన కోతులు. కొండల మీద ఒకటైనా ఉండవచ్చు కద. క్రిమి కీటకములవలె నేలను అంటిపెట్టుకుని ఉండడమేమిటో?” అనుకున్నాడు.

కొండపల్లి తరువాత ప్రాంతమంతా చదునుగా మారడం చూసి కలవరపడింది నరస సింహుడి హృదయం. “దోమాంబా, దయ ఉంచి రాబోయే దారిలోనైనా కొండలూ, మెట్టలూ ఉండేలా చూడు తల్లీ!” అంటూ ప్రార్థించాడు.

గంటలో ఇంకో చిన్న గ్రామం ఎదురు వచ్చింది నరస సింహుడికి. ఆ పల్లెలో ప్రవేశించగానే ఎదురైన మొదటి వ్యక్తిని యధావిధిగా కొండ మీది కోతి గురించి అడిగాడు నరస సింహుడు.

“ఈ చుట్టు పక్కల కోతులు లేవు దేవరా. బహుశా ర పలకని రాజ్యం దాటాక కోతులుండే ప్రాంతం రావచ్చు,” అన్నాడు అతను.

“ర పలకని రాజ్యమా?” ఆశ్చర్యంగా అడిగాడు నరస సింహుడు.

“అవును దేవరా! ఆ రాజ్యంలో ఎవరికీ ర అన్న అక్షరం పలకదు. అందుకే దానికి ఆ పేరు వచ్చింది,” వివరించాడు పల్లెవాసి.

“ఎందుకైనా మంచిది, ఆ రాజ్యం తాకకుండా ముందుకు పోవుటకు వేరే దారి ఏదైనా ఉందా?” అడిగాడు యువరాజు.

“లేదు. తమరు ఆ రాజ్యము ద్వారానే ప్రయాణించవలెను. మీరు ఎక్కడా ఆగకుండా వెళ్తే సాయంత్రానికి అక్కడికి చేరుకుంటారు,” చెప్పాడు అతను.

“సొబగు, సొబగు. అటులనే కావించెదను,” అంటూ షట్ కళ్యాణిని ముందుకు దూకించాడు నరస సింహుడు.

మూడు గంటల తరువాత మళ్ళీ జనసంచారం కనిపించింది యువరాజుకి.

కట్టె మోపు మోసుకుని వెళ్తున్న ఒక నడివయస్కుడిని ఆపి, “ఇది ర పలకని రాజ్యమేనా?” అడిగాడు నరస సింహుడు.

“అవును ఇది పలకని జ్యమే,” అన్నాడు అతగాడు.

ఒక్క క్షణం అతడేమన్నాడో అర్థం కాలేదు నరస సింహుడికి. “ఓ, వీళ్ళకు నిజంగానే ర అన్న అక్షరం బొత్తిగా పలకదు,” ఆశ్చర్యపోయాడు తనలో తాను.

“తమ నామధేయం?” చేతులు కట్టుకుని వినయంగా అడిగాడు ఆ నడి వయస్కుడు.

“నన్ను నరస సింహుడు అంటారు,” హుందాగా అన్నాడు యువరాజు.

“నస సింహులకు స్వాగతం!” అన్నాడు నడివయస్కుడు వినయంగా.

“నస సింహుడు కాదు, నరస సింహుడు,” కోపంగా అన్నాడు యువరాజు.

“అదే నేను అన్నది కూడా, నస సింహులు,” అంతే వినయంగా అన్నాడు అతను మళ్ళీ.

ఆ నడి వయస్కుడిని వీరబాహుడి దగ్గరకి శిక్షణకు పంపిస్తే ఎలా ఉంటుంది అన్న ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది నరస సింహుడికి.

వెంటనే గుర్తు వచ్చింది. “పాపం ఇతని తప్పేమీ లేదు. ర పలకదు కాబట్టి నా నామధేయములో ర అన్న అక్షారాన్ని ఉఛ్చరించలేదు. అందుకే నస సింహుడు అన్నాడు కానీ, నేను ఏదో నస మనిషిని అన్న దురుద్దేశంతో కాదు,” అనుకుని తృప్తి పడ్డాడు.

“సరే సరే! నాకు కొండ మీది కోతి కావాలి. ఇక్కడ ఏమన్నా దొరుకుతుందా?” అడిగాడు అతన్ని.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

4 Responses to జ్వాలా ద్వీప రహస్యం – 12

  1. రవి says:

    సొబగు సొబగు, ముళి గా !

  2. laxmi says:

    మురళి గారు, అసలు ఒక రేంజ్ లో నవ్విస్తున్నారు కదా. మొత్తం అన్ని ఎపిసోడ్స్ ఈ రోజే చదివాను, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అంటే నమ్మండి. మిగతా భాగాల కోసం ఎదురుచూస్తుంటా

  3. mrudula says:

    My daily schedule begins with watching for your new episodes. Really fantastic!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s