జ్వాలా ద్వీప రహస్యం – 9


“పదండి యువ రాజా! ఎంత తొందరగా బయలు దేరితే మీరు అంత తొందరగా తిరిగి రాగలరు,” వినయంగా అన్నాడు వృద్ధభట్టు.

“ఇప్పుడేనా? ఇంత అర్ధ రాత్రా? వేకువనే ప్రయాణం కావించెదను,” అన్నాడు నరస సింహుడు.

“మీ మంచికే చెప్పితిని యువరాజా. మళ్ళీ పొద్దున్నే నాలుగు గంటలకు దోమాంబ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. దేవికి పూజలు పునస్కారాలు మొదలవుతాయి. దోమదేవికి పూజ చేయకుండా మీరు వెళ్ళలేరు. ఈ సారి ఒక వెయ్యి బొట్ల రక్తం చిందించ వలసి రావచ్చు. ఆలోచించుకోండి,” హెచ్చరించాడు వృద్ధ భట్టు.

నరస సింహుడి మొహం పాలిపోయింది. “వెయ్యి బొట్ల రక్తము చిందించిన పిదప, దేశాటనకు పోయే ప్రసక్తి ఉండదు. తండ్రిగారి పక్క తల్పము మీద నేను పవళించవలసి వచ్చును. మీరు చెప్పినది నిజం. ఇప్పుడే బయలుదేరెదను,” అన్నాడు.

“మీకోసం పంచ కళ్యాణి గుర్రం తయారుగానున్నది. పదండి యువరాజా!” సేనపతి భుజబలుడు అర్థించాడు.

“పంచకళ్యాణా? అది కొంత పొగరుబోతు గుర్రం కద?” అడిగాడు నరస సింహుడు.

“రాచబిడ్డలు దేన్ని అయినా లొంగదీసుకో గలిగిన ప్రతిభా పాటవములు కలిగి ఉండవలె కుమారా!” మూలిగాడు నీరస సింహుడు.

“సరి, సరి. ఆ పంచ కళ్యాణి మీదే బయలు దేరెదను. పదండి,” బయటకు దారి తీశాడు నరస సింహుడు.

బయట పంచ కళ్యాణి చిందులు తొక్కుతూంది. అది చూడగానే గతుక్కుమన్నాడు నరస సింహుడు.

“కొంచెం మకురు గుర్రం యువరాజా! పైగా ఈ రోజు శిక్షకుడిని కింద పడవేసి కాళ్ళతో మట్టగించినది. ఐననూ మీరు దీన్ని ఇట్టే లొంగదీసుకోగలరని నా నమ్మకము,” అన్నాడు భుజబలుడు.

“లొంగదీసుకోగలను. కానీ లొంగదీసుకోను. ఇలాంటి మొండి గుర్రాలకు మమ్ము మోసే అర్హత లేదు. కొంచెం బుద్ధిగా ఉండే గుర్రము ఏదీ లేదా?” గుంభనంగా అడిగాడు నరస సింహుడు.

“లేకేం! ఉన్నది. షట్ కళ్యాణి అని. కొంచెం నిదానమైన గుర్రం. కానీ ఎవరిని ఎత్తి పడవేయడం, కాళ్ళతో మట్టగించడం లాంటివి చేసిన దాఖలాలు లేవు,” చెప్పాడు భుజబలుడు.

“సొబగు సొబగు. మాకు ఆ గుర్రమే కావలెను. తీసుకుని రండు,” అజ్ఞాపించాడు నరస సింహుడు.

భుజ బలుడి ఆజ్ఞ మేరకు ఇద్దరు సైనికులు షట్ కళ్యాణిని తీసుకుని వచ్చారు. రికాబులో కాలు పెట్టి దాన్ని అధిరోహించాడు నరస సింహుడు. “పద షట్ కళ్యాణి, మన సాహస యాత్రకు వేళయినది,” గుర్రాన్ని ఉత్తేజ పరుస్తూ గర్జించాడు.

షట్ కళ్యాణి చిన్నగా సకిలించి మెదలకుండా ఊరుకుంది.

“చెప్పానుగా యువరాజా. కొంత నిదానమైన గుర్రం,” చెప్పాడు భుజ బలుడు.

“నిదానమే ప్రదానము. కానీ మరీ ఇంత నిదానమైన మేము కొండ మీద కోతిని సమయానికి ఎటుల తీసుకుని రాగలము?” సాలోచనగా అన్నాడు నరస సింహుడు.

“షట్ కళ్యాణికి పాటలు ఇష్టము యువరాజా! ముఖ్యంగా ఈ పాట. ‘ అందరు ఇంట్లో వెచ్చగా, మనము బయట కచ్చగ. పదవే పదవే పోదాం ‘ ఆ పాట మీరు పాడారంటే షట్ కళ్యాణి పరుగు తీయడం మొదలు పెడుతుంది,” విన్నవించాడు భుజ బలుడు.

“చేయునదేమున్నది. అటులనే. పద షట్ కళ్యాని. అందరు ఇంట్లో వెచ్చగా, మనము బయట కచ్చగా. పదవే పదవే పోదాం” అంటూ పాడ సాగాడు నరస సింహుడు. షట్ కళ్యాణి దౌడు తీయడం మొదలు పెట్టింది.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

6 Responses to జ్వాలా ద్వీప రహస్యం – 9

 1. Kanth says:

  నాకు పేరు కావాలి. మీ జ్వాలాద్వీప రహస్యం కథ ని సినిమా గా తీయాలనుకుంటున్నాను – దోమ సినిమా ప్రొడక్షన్స్ పేరు మీద. మీకు OK నా?

  • Murali says:

   డబుల్ ఓకే! ముందుగా స్యాంపుల్‌కి దోమాంబకి ఒక 10 బొట్ల రక్తం చిందించి రండి. తరువాత నా స్విస్ బ్యాంక్ అకౌంట్‌లో ఒక 10,000 డాలర్లు వెయ్యండి. కథ పూర్తి హక్కులు మీకే!

 2. Wanderer says:

  ఈ ఎపిసోడ్ అదిరింది. షట్ కల్యాణి, దాన్ని పరిగెత్తించడం కోసమో పాట…. బాగా నవ్వించాయి.

 3. Jyothi Reddy says:

  Muraliji,
  Good one….
  AP antha atu itu ga undhi kadha saar…Mee satire kosam waiting andi…

 4. MADHU SUDHAN says:

  మాయబజర్ లొ రెలంగి గారు గుర్తుకు వస్తున్నరు బాగు బాగు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s