జ్వాలా ద్వీప రహస్యం – 1


“రాజాధి రాజ, రాజ మార్తాండ, విజయీ భవ దిగ్విజయీ భవ!”

“ప్రపంచమంతా పనులలో మునిగినది. జాగు చేయక ఇక నిదుర లెమ్ము ప్రభూ!”

“తండ్రి గారు కొలువు తీర్చినారు. తరుణం మించిపోయినది దేవరా!”

ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు నరస సింహుడు. “చీ, చీ, తెల్లవారినట్టు ఉంది. ఒక్క రోజు కూడా వదలకుండా ఏతెంచుతుంది ఈ నికృష్ట బృందం,” తనలో తాను గొణుకున్నాడు కోపంగా.

నరస సింహుడు దోమదేశానికి యువరాజు. తండ్రి నీరస సింహుడి తరువాత దోమదేశానికి కాబోయే రారాజు.

దోమదేశంలో ఆచారాలు ఎక్కువ. అన్నీ పద్ధతి ప్రకారం జరగాలి. నిద్ర లేచినప్పటినుంచి మళ్ళీ పడుకునే వరకూ రక రకాల రివాజులు పాటించాలి.

“మీ ముఖములు వేడెక్కు గాక!! ప్రతి రోజు ఇలా నన్ను నిద్ర లేపడం ఏమన్నా బాగున్నదా?” దీనంగా అడిగాడు నరస సింహుడు.

“మమ్మల్ని ఏమి చేయమందురు ప్రభూ! ఇది రాజు గారి ఆజ్ఞ. ఐనా ఈ కరువు కాలంలో మా ఉద్యోగ భద్రత మేము చూసుకొనవలె కద. మీరు తొందరగా నిద్ర లేస్తే మేమంతా ఇంటికి వెళ్ళి శయనించుతాం,” వినయంగా చెప్పాడు బృంద నాయకుడు.

“ఏమీ? నాకు నీతి వాక్యములు బోధించి మీరు ఇంటికి పోయి నిద్ర పోవుదురా, అక్కటకటా!” బాధగా అన్నాడు నరస సింహుడు.

“యువరాజా వారికి చలి ఎక్కువ అయినట్లు ఉన్నది. పళ్ళు టక టకా కొట్టుకొనుచున్నవి,” ఆందోళనగా అన్నాడు బృందంలో ఒకడు.

“మీ ముఖము! నా ఆశ్చర్యమును ప్రకటించుటకు నేనే అక్కటకటా అంటిని,” కోపంగా గర్జించాడు నరస సింహుడు.

“ఇక మేము వెళ్ళి వచ్చెదము ప్రభూ. వేప పుల్లలూ, ఇటుక రాతి పొడులతో దంత ధావన బృందం ఏతెంచినది,” అని మనవి చేసి తన బృందంతో అక్కడినుంచీ నిష్క్రమించాడు మేలుకొలుపు బృంద నాయకుడు.

“నహీ!!” సంస్కృతంలో పొలి కేక పెట్టాడు నరస సింహుడు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

4 Responses to జ్వాలా ద్వీప రహస్యం – 1

 1. Wanderer says:

  “మీ ముఖములు వేడెక్కు గాక!! ప్రతి రోజు ఇలా నన్ను నిద్ర లేపడం ఏమన్నా బాగున్నదా?”
  మొహం మండా అని ఎంత గ్రాంధికం గా చెప్పారు! జానపదం నవల్లు చదివి చాలా కాలమైపోయింది. మంచి ఐడియా. కడుపుబ్బ నవ్వించారు as usual.

 2. రవి says:

  కొంచెం టపా నిడివి ఎక్కువ చేయవలసినదిగా పురజనుల కోరిక.

  • Murali says:

   రవి గారు,

   ఇలా ఐతే రోజుకి ఒక ఎపిసోడ్ రాసేయొచ్చు అని దుగ్ధ. 🙂

   -మురళి

 3. Naagas says:

  పక్క దేశానికి పోబోయి జ్వాలా దీపానికి ఎలా అరుదెమ్చనొ మా యువరాజావారు తెలుసుకొవలేనని బహు ఉత్సుకతగనున్నది. త్వరితగతిన మిగులు వివరాలు విడుదల చేయవలసినదిగా ప్రార్ధన! ఓను, తెలుగు భాష యందు పరిజ్ఞానం మెండుగా నున్న నీరస సింహం గారు, తన కుమారునికి నరస సింహం అని నామధేయం ఒసుమ్గుట లో అంతరార్ధం నా దోమ మెదడుకు పాలుపోకున్నది. కాస్త సెలవిప్పించవలసినది.

  సి సి, ఒక అరగంట మీ పోస్టు చదివేప్పటికి.. ఇలా తయారయ్యాను. కాని అద్భుతంగా రాసారండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s