పొదుపు చేద్దాం రా!


పొద్దున్నే లేచి బద్ధకంగా ఆవులించాడు జంబూ ద్వీప ఆర్థిక మంత్రి P.ఏకాంబరం. ఆయనకు పొద్దున్నే నిద్ర లేవగానే నీలగిరి కాఫీ తాగడం అలవాటు.

“సెంథిల్, సెంథిల్,” పిలిచాడు తన వంటవాడిని.

“వస్తున్నా సార్,” అంటూ పొగలు కక్కుతున్న కాఫీ కప్‌ని ట్రే పై పెట్టుకుని తీసుకుని వచ్చాడు సెంథిల్.

తృప్తిగా తలాడించి కప్ చేతిలోకి తీసుకోబోతూ కెవ్వుమని కేకేశాడు P.ఏకాంబరం.

“ఏమయ్యింది సార్! కాఫీ మరీ వేడిగా ఉండడం వల్ల కప్ పట్టుకోగానే కాలిందా?” ఆందోళనగా అడిగాడు సెంథిల్.

“లేదు. కానీ ఢిల్లీ అమ్మ చెప్పింది గుర్తుకొచ్చింది. ఎక్కడ పడితే అక్కడ పొదుపు చేయమని మొన్నే సెలవిచ్చారు కద. మరి నా వంతు కృషి నేనూ చేయాలి కద,” గద్గదంగా అన్నాడు P.ఏకాంబరం.

అర్థం కానట్టు తల విదిలించాడు సెంథిల్.

“నువ్వు వెళ్ళి నా పాత ఇంక్ ఫిల్లర్ తీసుకురా చెప్తాను,” ఆర్డర్ జారీ చేశాడు P.ఏకాంబరం.

సెంథిల్ ఫిల్లర్ తేగానే దాన్ని కాఫీ కప్‌లో ముంచి సరిగ్గా ఒక్క బొట్టు తీశాడు ఆర్థిక మంత్రి. “ఇదిగో ఈ ఫిల్లర్ పట్టుకెళ్ళి అదే బొట్టు మళ్ళీ కాఫీ గిన్నెలో వేసేయి,” చెప్పాడు.

“దాని వల్ల ఏమవుతుంది,” ప్రశ్నించాడు సెంథిల్.

“ఒక్క బొట్టు కాఫీ ఆదా అవుతుంది కద.”

“అవునా?”

“పిచ్చి వాడా. అందుకే నువ్వు వంట వాడివి. నేను ఆర్థిక మంత్రిని. రెండేళ్ళు ఇలా రోజుకో బొట్టు ఆదా చేస్తే, ఒక కప్ కాఫీ తక్కువ తాగినట్టవుతుంది. అంటే ఒక కప్ కాఫీ ఖర్చు కలిసిచ్చొందన్న మాటే కద! నువ్వు రేపటినుంచి, ఒక బొట్టు కాఫీ తక్కువ చేయి. ఏం?”

“ఒక బొట్టు తక్కువ చేయడం ఎలా కుదురుతుంది సార్.”

కాస్త ఆలోచించాడు P. ఏకాంబరం. “సరే, ఐతే ఒక పని చేయి. మాములుగా చేసేంత కాఫీనే చెయ్యి. కానీ నా కప్‌లోంచి ఒక బొట్టు తీసుకుని నీ కప్‌లో వేసుకో,” చెప్పాడు.

“అది ఆదా ఎలా అవుతుంది? నేను తాగినా ఖర్చు ఐనట్టే కద?”

“కాదు, దీని వల్ల నేను ప్రతి ఏడాది నీకు ఇచ్చే బక్షీసులో ఒక సగం కప్పు కాఫీ ధర మినహాయించుకుంటాను. డబ్బు ఆదా ఐనట్టే కద!” ఆనందంగా అన్నాడు P. ఏకాంబరం.

“అవును ఆదా ఐనట్టే,” ఘొల్లుమన్నాడు సెంథిల్.

“ఊరుకో, ఇలా ఆనంద భాష్పాలు కార్చి అనవసరంగా కన్నీరు వృధా చేయకు. పొదుపు చెయ్యి,” సెంథిల్ తల నిమురుతూ అన్నాడు ఆర్థిక మంత్రి.

“మీరేనా లేక మిగతా మంత్రులు కూడా ఇలానే పొదుపు చేస్తున్నారా?” పళ్ళు పట పటా కొరుకుతూ అడిగాడు సెంథిల్.

“ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేస్తున్నారు. మన విదేశాంగ మంత్రి M.S. కృష్ణ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేయకుండా ఫోర్ స్టార్ హోటల్‌లో విడిది చేస్తున్నారు. కానీ ఆయనకు అక్కడి తిండి పడదు కాబట్టి పక్క వీధిలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటారనుకో. డెలివరీ చార్జీలు ఎక్స్ట్రా.”

“దాని వల్ల ఎంత ఆదా అవుతుంది?”

“రోజుకో రూపాయి అవుతుందిలే. అదేంటి అలా విరుచుకు పడిపోయావు. సెంథిల్? సెంథిల్?”

http://in.reuters.com/article/topNews/idINIndia-42463720090915

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

12 Responses to పొదుపు చేద్దాం రా!

 1. Nice satire………బానే పేలింది

 2. prastuta raajakeeya vinyaasaala vikrutaalu vyangya baanaalesinanta maatraana chaavu.madinchi poeyi vunnaayi.

 3. Amma Odi says:

  టపా బాగుంది.

 4. praveen says:

  ఎన్నాళ్ళకు ఎన్నాలకు
  జ్వాల దీపం రహస్యం ని శోధించి
  వేరే ట్రాక్ లోకి వెళ్తున్నందుకు అభినందనలు

 5. Amun says:

  🙂 Amazing,

  perfect timing

 6. lalita says:

  బావుంది

 7. Pradeep says:

  Super guru

 8. బాందండోయ్ 😀

 9. Raghu says:

  “అవును ఆదా ఐనట్టే,” ఘొల్లుమన్నాడు సెంథిల్.
  -కేక

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s