పేకల్లో జోకర్లు


సాధారణంగా త్రిలింగ దేశం ఎన్నికల తరువాత మొదటి రెండు సంవత్సరాలు కాస్త ప్రశాంతంగానే ఉంటుంది. ఐతే ఈసారి అలా కాదు. గాంక్రెస్ మంత్రి వర్గం ప్రమాణం చేసి, వాళ్ళకు కేటాయింపబడిన కుర్చీలలో కూర్చునేంతలోనే, ముఖ్యమంతి వై.నో, “ఆపరేషన్ యాక్‌థూ” మొదలెట్టాడు.

ఆపరేషన్ యాక్‌థూ ఉద్దేశం తెగులుదేశం, ఇష్టారాజ్యం లాంటి ప్రతిపక్షాల నుంచి ఎం.ఏల్.ఏ.లను ఆకర్షించడమే. అంటే ఒకప్పుడు తమ పార్టీ అంటే తమకు ఎంత ఇష్టమో చెప్పిన ఎం.ఎల్.ఏ.లు అదే పార్టీ పై “యాక్‌థూ” అని ఉమ్మేసి వచ్చేలా చేయడం అన్న మాట. గాంక్రెస్‌కి బొటాబొటిగా మెజారిటీ వచ్చింది కాబట్టి, వీలైనంత మందిని తమ వైపు లాక్కుంటే ఒక పనై పోతుందని, అదే సమయంలో ప్రతిపక్షాల పని కూడా అయిపోతుందని వై.నో. ఆలోచన.

అలా అని ప్రతిపక్షాలు కూడా ఏం తక్కువ తినలేదు. తమ శాయశక్తులా ఇతర పార్టీలనుంచి తమ పార్టీకి వలసలను ప్రోత్సహించాయి. ఐతే ఎంతైనా అంగ బలం, అర్థ బలం అధికారంలో ఉన్న పార్టీ కంటే తక్కువ కాబట్టి, వాళ్ళ ప్రయత్నాలు అంతగా ఫలించలేదు.

ఎవరూ అనుకోని విధంగా సంభవించిన వై.నో. ఆకస్మిక మరణంతో ఈ వలుసలు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఐతే ఆల్‌రెడీ పార్టీలు మార్చిన వాళ్ళ పరిస్థితి ఏంటో కాస్త చూద్దాం.

గాంక్రెస్‌కి వస్తే:

“మీరెన్నన్నా చెప్పండి, ఆ కూజా మన పార్టీలో చేరడానికి నేను ఒప్పుకోను. ఆమె నన్ను ఎన్ని బూతులు తిట్టిందని!” ఆవేశంగా వాదిస్తూంది చొక్కా అరుణ కుమారి.

“అందుకే కదమ్మా ఆమెని తీసుకు వచ్చింది. మీరిద్దరు మన పార్టీ తరపున కలిసి బూతులు తిడుతూంటే ఇక మనకు ఎదురేముంటుంది,” బుజ్జగించాడు తక్షణ ముఖ్య మంత్రి మోశయ్య.

ఇంతలో ఒక గాంక్రెస్ కార్యకర్త హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. “ముఖ్యమంత్రి గారూ, అసెంబ్లీ ఎదురుగా ఆ కూజా నేలకు తన ముక్కు రుద్ది ఇటే వస్తూంది,” ఒగరుస్తూ చెప్పాడు.

“అసెంబ్లీ ముందు ముక్కు రుద్దిందా, ఎందుకు?” ఆశ్చర్యపోయాడు తక్షణ ముఖ్యమంత్రి మోశయ్య.

“మన మహిళా నాయకురాలు ఖంగాళీ భవాని పత్రికా ముఖంగా చెప్పారట. కూజా కనుక గాంక్రెస్‌లో చేరాలంటే, తను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా అసెంబ్లీ ముందు నేలపై ముక్కు రుద్దితే కానీ కుదరదు అని. కాబట్టి కూజా ఆ పని చేసినట్టుంది,” అన్నాడు అతను.

వీళ్ళిలా మాట్లాడుతూండగానే కూజా అక్కడికి వచ్చేసింది. “మోశయ్య గారూ, ముక్కు నేలకి రుద్దేశా. ఇక గాంక్రెస్‌లో చేరడం ఖాయమే కద?” ఆశగా అడిగింది.

“చెల్లీ, ఇలాంటి త్యాగం చేశాక, నిన్ను ఎలా కాదనగలం చెప్పు?” గద్గదమైన గొంతుతో అంది చొక్కా అరుణ కుమారి.

“అక్కా, నువ్వెంత మంచిదానివి!” అని చొక్కా అరుణ కుమారిని పట్టుకుని భోరున ఏడ్చేసింది కూజా.

ఇష్టారాజ్యం పరిస్థితి:

తన కార్యాలయంలో కూర్చుని ఏదో ఫైళ్ళు చూస్తున్న రిచంజీవిని, ఒక కార్యకర్త కాస్త భయపడుతూనే అడిగాడు. “సార్! ఇంతకీ మన పార్టీ ఉన్నట్టా లేనట్టా?”

“అదేం ప్రశ్న?” విస్తూపోయాడు రిచంజీవి.

“అంటే హనుమంత రెడ్డి గారు మన పార్టీని వదిలేయబోతునారు అన్న రూమర్స్ రాగానే పత్రికలూ, టీవీ చానెల్సూ మిమ్మల్ని అది నిజమేనా అని అడిగితే, మీరు హనుమంత రెడ్డి లేకపోతే ఇష్టారాజ్యమే లేదు అన్నారు. ఒక వారం రోజుల తరువాత ఆయన పార్టీని వదిలేసి వెళ్ళిపోయాడు.” ఊపిరి తీసుకోవడానికి ఆగాడు ఆ కార్యకర్త.

అవునన్నట్టు తల ఊచాడు రిచంజీవి.

“అలాగే ఆ తరువాత డాక్టర్ స్నేహ గారు పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నారు అని పుకార్లు వచ్చాక అదే పత్రికలూ, టీవీ చానెల్సూ నిజమా అని మిమ్మల్ని అడిగితే, మీరు డాక్టర్ స్నేహ లేని ఇష్టా రాజ్యమే లేదు అన్నారు. ఓ రెండు రోజుల తరువాత ఆయన కూడా పార్టీ వదిలేశాడు” మళ్ళీ ఆగాడు కార్యకర్త.

“నిజమే, ఐతే?”

“మరి వాళ్ళు లేకపోతే ఇష్టారాజ్యం లేదన్నారు, ఇప్పుడు వాళ్ళు లేరు కద సార్! మరి మన పార్టీ…”

“ఓ అదా నీ సందేహం. మళ్ళీ ఆ తరువాత ఇంకో స్టేట్‌మెంట్ ఇచ్చాను కద. ఆఖరికి నేను వదిలేసినా ఇష్టారాజ్యానికి ఏమీ కాదు అని. అది వినలేదా?”

“విన్నానుకోండి, ఐతే మరి ఎవరు వెళ్ళిపోతే పార్టీ ఉనికికి ప్రమాదం అంటారు?”

“మా బావ సొల్లూ అరవింద్!”

తెగులు దేశానికొస్తే:

సూర్యబాబుని కలుసుకోవడానికి జంబూద్వీపంలోని వేరే రాష్ట్రాలనుంచి రాజకీయ నాయకులు వచ్చారు. యధావిధిగా మూడో ఫ్రంట్‌ని పునరుద్ధరిస్తే ఎలా ఉంటుంది అన్నది చర్చాంశం.

అప్పుడే భుజం మీద తువ్వాలు వేసుకుని, ట్రేలో టీ కప్పులు పెట్టుకుని ఒక నడివయసు వ్యక్తి రూంలోకి వచ్చాడు.

“ఇతను దేబిరేందర గౌడ్ కదూ? ఇలా టీలు సప్లై చేస్తున్నాడేమిటి?” ఆశ్చర్యపోయాడు వచ్చిన వాళ్ళలో ఒకతను.

దేబిరేందర్ అందరికీ టీ కప్పులు ఇస్తూ వినయంగా చెప్పాడు. “నేనొక చారిత్రాత్మక తప్పిదం చేశాను. తెగులు దేశాన్ని విడిచి వెళ్ళాను. చేసిన తప్పు తెలుసుకుని మళ్ళీ వచ్చేశాను. సూర్యబాబు గారు నన్ను క్షమించి పెద్ద మనసుతో నాకీ పోస్ట్ ఇచ్చారు.”

“సర్లే, టీలో షుగర్ తక్కువయ్యింది. ఇది ఇంకొక చారిత్రాత్మక తప్పిదం. దేబిరించడం మానేసి వెళ్ళి నాకు వేరే టీ తీసుకురా!” గద్దించాడు సూర్య బాబు.

కొసమెరుపు:

“అవును వీజితా, రిచంజీవి ఓడిపోయింది మన ప్రచారం వల్లే కదా! సెరి. మరి మనకు ఏ పోస్టులూ రాలేదెందుకని?” ప్రశ్నించాడు హీరో వాజశేఖర్.

“ఏమో వాజా. నాకూ అర్థం కావట్లేదు. ఈ రాజకీయ నాయకులని అస్సలు నమ్మకూడదు. ఒట్టి మోసగాళ్ళు!” అక్కసుగా అంది వీజిత.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

13 Responses to పేకల్లో జోకర్లు

 1. కొసమెరుపు సూపర్ 🙂

 2. Madhuravani says:

  అబ్బ.. పొద్దు పొద్దున్నే నవ్వలేక చచ్చాను 🙂 🙂
  పేర్లు పెట్టడంలో మాత్రం మీ తరవాతే ఎవరైనా..hilarious..!!

 3. Ramesh Peram says:

  super COMDEY….Ha…haa……ha….inka navvalenu raaa…babu…

  Kosamerupu super….

 4. నిజంగా కొసమెరుపు సూపర్… అలాగే కూజా, సొల్లూ అరవింద్ పేర్లు సూపర్..

 5. sravya Vattikuti says:

  🙂

 6. Jyothi Reddy says:

  Murali ji,

  Meerenti saaaaaaar? mammalni ila navvisthey elaa? Office lo andharu vinthaga chusaru nannu. Adhenti saar mee Richanjeevini maree antha dharunanga thittaru enti…..

  • Murali says:

   నేను రిచంజీవిని తిట్టలేదు. మీ ఉద్దేశంలో అదే తిట్టడం ఐతే, కూజాని, దేబిరేందర్ గౌడ్‌ని అంతకంటే ఘాటుగా తిట్టాను మరి. 🙂

 7. అబ్రకదబ్ర says:

  ఆపరేషన్ యాక్‌థూ …. ఆ పేరుకి అర్జెంటుగా పేటెంటు తీసేస్కోండి 🙂

 8. indu says:

  murali gaaru, memu anukunnavanni meeru vrasesthe elaa?

  • Murali says:

   మన దేశంలో ఎవరో రాసినవే వేరే వాళ్ళు ధైర్యంగా కాపీ కొట్టేస్తున్నప్పుడు మీరు మనసులో అనుకున్నవి నేను రాయడంలో తప్పేముంది? 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s