ఏంటో, ఈ మూఢ నమ్మకాలు!


“ఇది విన్నావా బావా! ఈ సినిమా పరిశ్రమలో మూఢ నమ్మకాలు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి,” అన్నాడు పేపర్ చదువుతున్న విజ్ఞాన రావు.

“ఇంతకీ దేని గురించి నువ్వు చెప్పేది?” ప్రశ్నించాడు వికాస రావు.

“నీకు తెలుసు కద మన హీరో డి. దామోదర్‌కి ఈ మధ్య హిట్ లేదు. ఆఖరి హిట్ మూడేళ్ళ కింద వచ్చింది. అప్పుడు ఆ పిక్చర్ హిట్ అయిన వాతావరణం లాంటిదే తన కొత్త పిక్చర్‌కి కూడా ఉండేలా చూస్తున్నాడట.”

“ఇందులో కొత్తేముంది, అదే నిర్మాత, దర్శకుడు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, క్యామెరా మ్యాన్ కాంబినేషన్‌తోనే కద గత మూడు సినిమాలూ తీసింది?”

“కానీ ఇంకా ఏదో మిస్సింగ్ అని ఫీల్ అవుతున్నాడట. బాగా పరిశోధించగా తేలింది ఏంటంటే ఆఖరి సారి తన పిక్చర్ హిట్ ఐనప్పుడు, ముహూర్తం క్లాప్ కొట్టినప్పుడు, ఫైటు మాస్టర్ జర్రున జారి పడ్డాడట. కాబట్టి ఈ సారి కూడా ముహూర్తం టైంలో ఆయన జారి పడేలా చూస్తాడంట.”

“ఒక వేళ ఆయన జారి పడకపోతే?”

“బహుశా పడేలా తోస్తారనుకుంటా!”

“ఏంటో, ఈ మూఢ నమ్మకాలు. సరేలే నేనలా బయటకు వెళ్ళొస్తా,” అంటూ చెప్పులు వేసుకున్నాడు వికాస రావు. ఆయన అడుగు బయట పెట్టేంతలో ఒక నల్ల పిల్లి తలుపు ముందు నుంచి పరిగెట్టింది.

“ఛీ, ఛీ! ఎంత అపశకునం,” వెళ్ళబోతున్న వాడు మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చున్నాడు ఆయన.

అది చూసిన పక్కింటి నవీన్ బయట నుంచే, “భలే వారండి! ఆ పిల్లి అపశకునం ఎలా అవుతుంది. తన దారిన ఏ ఎలుకనో పట్టడానికి పోతూ, పొరపాటున మీకు ఎదురు వచ్చింది. అంతే!” అన్నాడు.

“అమ్మో మీకు తెలీదు, పిల్లి ముందు రావడం ఎంత డేంజరో! నాకు తెలిసినంతవరకు మన అల్లూరి సీతా రామ రాజు, ఇలా పిల్లి శకునం పట్టించుకోకపోవడం వల్లే తెల్ల దొరలకు దొరికిపోయాడట,” వికాస రావుకి వత్తాసు పలుకుతూ అన్నాడు విజ్ఞాన రావు.

“ఏంటో, ఈ మూఢ నమ్మకాలు,” తనలో తాను అనుకుంటూ వీధిలోకి వెళ్ళాడు నవీన్. దారిలో అతనికి సిద్ధాంతి రామ శర్మ ఎదురయ్యాడు.

“బాగున్నావా నాయనా! నిన్నే నీ జాతకం వేయడం పూర్తి చేశాను. అష్టమంలో ఉండాల్సిన శని ఈ సంవత్సరం సప్తమంలోకి వస్తాడు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. శాంతి చేయిస్తే మంచిది,” అన్నాడు రామ శర్మ.

“అలాగే చేద్దాం సిద్ధాంతి గారూ, గ్రహాలు మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయని ఈ మధ్య కొందరు సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారట. జాతకం అంటే నాకెంతో గౌరవం,” వినయంగా అన్నాడు నవీన్.

“ఏంటో, ఈ మూఢ నమ్మకాలు,” ఇదంతా చూస్తున్న వివేక్ బయటకే అనేశాడు తన ఫ్రెండ్ ప్రకాశ్‌తో.

“అంతే అంటావా?” అన్నాడు ప్రకాశ్.

“లేకపోతే మరేంటి? ఆ మట్టి ముద్దలు, ఆ గ్రహాలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయా? మన మధ్యనే ఉన్న దేవుడు, మన అఘోరీ బాబా తీర్చలేని సమస్యలేమన్నా ఉన్నాయా?” భక్తిగా అన్నాడు వివేక్.

“నీకు ఆయనంటే బాగా గురి అనుకుంటా?”

“అవును. నాకు ఈ జాతకాలు అంటే నమ్మకం లేదు. నాకే కష్టం వచ్చినా నేను అఘోరీ బాబా దగ్గరికి వెళ్తాను. ఆయన ఆశీర్వాదం పొందితే నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది,” అర మోడ్పు కన్నులతో అన్నాడు వివేక్.

వివేక్ తన దారిన తాను వెళ్ళగానే, “ఏంటో, ఈ మూఢ నమ్మకాలు. ఈ బాబాలు కూడా మనలాంటి మనుషులే. వాళ్ళ వల్ల ఏమవుతుంది? ఆ దేవుడి కంటే గొప్ప వాళ్ళా, వీళ్ళంతా?” అనుకుంటూ దగ్గరలో ఉన్న గుడికి బయలుదేరాడు ప్రకాశ్.

గుడికి వెళ్ళగానే పూజారి అతనికి చెప్పాడు, “ఈ రోజు చాలా మంచి రోజు నాయనా. వెంటనే ఈ గుడి చుట్టూ 108 పొర్లు దండాలు పెట్టి రా. దానితో అన్ని దోషాలూ నివారణ అవుతాయి,” అని.

ప్రకాశ్ పొర్లు దండాలు పెడుతూంటే, బయట కారులో వెళ్తున్న సైంటిస్ట్ ప్రగతి కుమార్, ఆయన భార్య ఈ దృశ్యాన్ని చూశారు.

“ఏంటో, ఈ మూఢ నమ్మకాలు! ఇరవయ్యి ఒక్కవ శతాబ్దంలో కూడా ఇలాంటివి చూస్తే చాలా బాధగా ఉంటుంది. చూస్తూంటే ఆ అబ్బాయి చదువుకున్న వాడిలా కూడా ఉన్నాడు,” కాస్త బాధ పడింది మిసెస్ ప్రగతి కుమార్.

“చదువు వల్ల విజ్ఞానం రాదోయి. మనుషులకి ఒక ఆలంబన కావాలి. ఒక సపోర్ట్! అందుకనే ఆ సెక్యూరిటీని బాబాల్లోనో, జాతకాల్లోనో, దేవుడిలోనో వెతుక్కుంటారు, ” గంభీరంగా చెప్పాడు ప్రగతి కుమార్.

“బాగా చెప్పారండి. మాటల్లోనే మీ ఆఫీసు వచ్చేసింది. మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్తాను,” ప్రగతి కుమార్ ఆఫీస్ రావడంతో చెప్పింది ఆయన శ్రీమతి.

“ఉండవోయి. కాస్త నువ్వు కూడా దిగి, నేను ఆఫీసులోకి వెళ్తూంటే ఎదురు రా. ఈ రోజే నా ప్రమోషన్ సంగతి తేలిపోతుంది. నువ్వెదురొస్తే సాధారణంగా మంచి జరుగుతుంది,” అన్నాడు ప్రగతి కుమార్.

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

17 Responses to ఏంటో, ఈ మూఢ నమ్మకాలు!

 1. laxmi says:

  Good One! By the way congratulations on 200th post 🙂

 2. Sravya Vattikuti says:

  బాగుంది ! అయ్యో చీ చీ ఎవరో తుమ్మారు ఇప్పుడీ కామెంట్ ఏమవుతుందో ఏమిటో 😦

 3. onlyforpraveen says:

  super as usual 😀 😀 😀

 4. Indian Minerva says:

  🙂

 5. 🙂 🙂 superb post…!
  Congratulations on your 200th post. Keep rocking..!!

 6. Ramana Turlapati says:

  subtle satire. names are well chosen too.

 7. satya says:

  ayyo prastutam rahukalam! e pani cheyakudadu!

 8. Venu says:

  Awesome 🙂 … double century … another feather in the cap … next is triple … keep it coming …

 9. GS Kumar says:

  A good one !!

  Some years back we gave an advertisement in a Daily inviting candidates for training. On the day it appeared in the news paper, the only telephone number given in the advt. became non-functional for a few days. We were greatly disappointed. A member commented ” I already warned you.That day was Amavasya!! ”
  Emito ee moodha nammakalu

 10. Venu Aasuri says:

  Murali,

  Congratulations on your 200th post! Nice satire, keep going.

  Venu

 11. Jyothi Reddy says:

  Murali ji,

  COngratulations on the 200th post. Please write on New Telangana Lolli.

 12. Yogi says:

  superb post…!
  Congratulations on your 200th post. Keep rocking..!!

 13. Suresh Thotakura says:

  Bagundi!

 14. sowmya says:

  కత్తిలా రాసారండీ….పేర్లు అదిరాయి
  మీకు సెటైర్ కింగ్ అని బిరుదివ్వొచ్చు !

 15. రహంతుల్లా says:

  మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు

  * పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు
  * పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
  * బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.
  * జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
  * అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
  * చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
  * చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
  * కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.
  * బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.
  * తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
  * కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.
  * నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)

  దేశంలో కొన్ని మూఢనమ్మకాలు

  * ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.
  * మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-‘సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm
  * కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.
  * నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
  * గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,

 16. anamika says:

  muhurtham chusi meeru ee kadha rayaledhu kadha!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s