బృందగానా జిందాబాద్!


స్థలం: ఢిల్లీ దర్బార్
జనం: ఢిల్లీ అమ్మ, వృణబ్ ముఖర్జీ, P. ఏకాంబరం

“ఇలా ఎలా జరిగింది?” ప్రశ్నించింది ఢిల్లీ అమ్మ బాధగా.

“మాకు అదే అర్థం కావట్లేదమ్మా,” కోరస్‌గా అన్నారు వృణబ్ ముఖర్జీ, P. ఏకాంబరం.

“జీవితంలో మొదటి సారి నేను నా తెలివి తేటలు ఉపయోగించి ఏదైనా సమస్యను పరిష్కరిద్దామనుకుని, బృందగానా సమస్య తీర్చాను. ఇలా బెడిసి కొడుతుందనుకోలేదు. బృందగానా సమస్య తీర్చాను అనుకుంటే మోస్తా, వాయలసీమలో ఉద్యమాలు మొదలయ్యాయి. వాటిని అణిచేద్దామనుకుని ఇప్పట్లో బృందగానా లేదు అని ఏకాంబరం గారితో మళ్ళీ చెప్పిస్తే బృందగానాలో తిరిగి గొడవలు మొదలయ్యాయి. ఏంటో ఈ రాజకీయాలు! మా అత్తగారు ఎలా తీర్చేవారో ఈ సమస్యలు,” విషాదంగా అంది తను.

“ఆవిడ కూడా సమస్యలు తీర్చే వారు కారమ్మా! కొత్తవి సృష్టించే వారు. ఐతే ఆవిడకి అనుభవం ఎక్కువ కాబట్టి, ఆవిడ సృష్టించే కొత్త సమస్య ఏ లెవెల్‌లో ఉండేది అంటే, జనాలు పాత సమస్యను దెబ్బకు మర్చిపోయే వారు. మీకింకా అంత ఎక్స్పీరియెన్స్ లేదు,” వినయంగా అన్నాడు వృణబ్ ముఖర్జీ.

“ఇంతకీ అంధేరా ప్రదేశ్ నుంచి గవర్నర్ తివాచీ గారిని జరుగుతున్న గొడవలపై స్పెషల్ రిపోర్ట్ పంపమన్నాను. వచ్చిందా?”

“ఇదిగోనమ్మా, ఈ ఫైల్!”

ఫైల్ తెరిచి చూసి కెవ్వున కేకేసింది ఢిల్లీ అమ్మ.

“ఏమయ్యిందమ్మా?”

“ఇదేంటి, ఇందులో తివాచీ గారు రక రకాల అమ్మాయిలతో ఉన్న ఫోటోలు ఉన్నాయి? అవీ చాలా అసహ్యంగా?”

నాలుక కరుచుకున్నాడు వృణబ్. “ఆయన పొరపాటున తన పరిశోధనకు సంబంధించిన ఫైల్ కాకుండా తన పర్సనల్ ఫైల్ పంపించినట్టున్నాడు,” అన్నాడు.

“పొరపాటు కాదు. అలవాటు. ఈ ఫైల్ చూస్తూంటే తెలుస్తూంది. ఆయన చేస్తున్న పరిశోధనలేమిటో!” హూంకరించింది ఢిల్లీ అమ్మ.

“నిజమే అమ్మా తివాచీ గారు ఇంత నీతి మాలిన పని చేస్తారు అనుకోలేదు,” అన్నాడు P. ఏకాంబరం కలుగజేసుకుని.

“మీ మొహం. గాంక్రెస్‌లో మనం చేర్చుకునేదే అలాంటి పనులు చేసే వారిని. కానీ ఇలా ఫైళ్ళు మార్చి పంపడం క్షమించ రాని నేరం. ఇదే ఏ ప్రెస్ రిలీజ్‌కో పంపించి ఉంటే? ఎంత నామర్దా! ఎంత అప్రతిష్ట!”

“ఓహో!”

స్థలం: గాంక్రెస్, తెగులు దేశం, ఇష్టా రాజ్యం కార్యాలయాలు
జనం: మోశయ్య, సూర్యబాబు నాయుడు, రిచంజీవి, వారి వారి అనుచరులు

సూర్యబాబు: బృందగానా ఇప్పట్లో రాదు, ముఖ్య మంత్రి అయ్యాక చూసుకోవచ్చు అని మద్దతు ప్రకటిస్తే, కథ మొత్తానికే అడ్డం తిరిగింది. అందరికంటే ఎక్కువ వోట్లు బృందగానాలో వచ్చి కూడా అడ కత్తెరలో పోక చెక్కలా తయారయ్యింది పరిస్థితి.

రిచంజీవి: సామాజిక బృందగానా ఇస్తామని చెప్పినా, ఒకే సీటు వచ్చిన ప్రాంతాన్ని సపోర్ట్ చేసి, ఉన్న ఓట్లు పోగొట్టుకోవడం కంటే, సమైక్య త్రిలింగ దేశానికి జై పలకడమే బెటర్. ఎందుకు ఇలా మాట మార్చారూ అని ఎవరైనా అడిగితే, తమ్ముడు వాయు కళ్యాణ్‌ని అడగండి అని చెప్తా. వాడి సమాధానం ఎలాగూ వీళ్ళకు అర్థం కాదు.

మోశయ్య: నా బతుకేంటి ఇలా అయి పోయింది? అన్ని గాంక్రెస్ ప్రభుత్వాల్లో నంబర్ టూగా హ్యాపీగా పని చేసుకునే వాడిని. వై.నో గారు పోవడం రాష్ట్రానికేమో కాని, నాకు మాత్రం చాలా నష్టం.

స్థలం: దండకారణ్యం
జనం: పెట్రోమాక్స్ లైట్లు

“ఏం చలి అన్నా! ఈ విప్లవం ఏంటో గానీ ఇలా అడవుల్లో దాక్కోవడం, ఈ తుపాకీలు మోసుకుంటూ తిరగడం, చాలా కష్టంగా ఉంది,” బాధని వెలి బుచ్చాడు బక్కగా ఉన్న ఒక పెట్రోమాక్స్ లైట్.

“బాధ పడకు తమ్ముడూ. త్వరలోనే బృందగానా ప్రత్యేక రాష్ట్రంగా మారబోతూంది. ఆల్‌రెడీ బృందగానాలోని నాలుగు జిల్లాల్లో మనకు బలమైన పట్టు ఉంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మొత్తం బృందగానాని మన వశం చేసుకోవడం కష్టమేం కాదు. అప్పుడు ఈ అడవులకు గుడ్‌బై చెప్పొచ్చు. అందుకే కద మనము బృందగానా రాష్ట్రానికి మద్దతు ప్రకటించింది,” భరోసా ఇచ్చాడు ఆ దళం నాయకుడు ఎర్రన్న.

“బాగ చెప్పావన్నా! పిట్ట పిట్టా పోరు పిల్లికి లాభమైనట్టు త్రిలింగ దేశవాసులు కొట్టుకోవడం మనకు బాగా లాభించింది. లాల్ సలాం!” ఆనందంగా అన్నాడు బక్క పెట్రోమాక్స్ లైట్.

స్థలం: బృందగానా రాష్ట్ర సమితి ఆఫీస్
జనం: వీ.సీ.ఆర్, బృ.రా.సా కార్యకర్తలు, కొందరు జర్నలిస్టులు

బృ.రా.సా నాయకుడు వీ.సీ.ఆర్ (V. చంద్రశేఖర రావు) ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు.

“మీకు ఒక ముచ్చట చెప్తా. బృందగానా రాకుండా ఎవరూ ఆపలేరు. ఎందుకంటే, ఉదారనకు ఒక క్లాస్ రూం తీస్కోండి. ఎనకాల స్టూడెంట్స్ లొల్లి జేస్తున్నారనుకోండి. ఏమవుతది? కొంత సేపు పంతులు కోప్పడతడు. తరువాత గోడకుర్చీ వేయిస్తడు. గట్లనే లొల్లి జేస్తూ పోయినమనుకో, క్లాస్ బయటకి ఎల్లగొడతడు. మనకు కావల్సింది భీ గదే.”

అక్కడ ఉన్న ఒక జర్నలిస్ట్ ఆయనకు అడ్డు తగిలాడు. “బృందగానా అభివృద్ధి చెందక పోవడానికి కారణం మోస్తా వాళ్ళే అంటారా? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అధికారంలో ఉన్న బృందగానాకు చెందిన మంత్రులు/నాయకుల బాధ్యత ఏమీ లేదా?”

“మంత్రులు ఉన్నరు భై, కానీ పవర్ లేదు. బృందగాన తాన డబ్బులు లేవు. గా డబ్బులు మోస్తా వాల్ల దగ్గర ఉన్నాయి. అవి ఎట్లొచ్చినయి? బృందగానా ప్రజలని దోసుకోవడం వల్ల. అందుకే మా రాష్ట్రమేదో ఇస్తే మా లొల్లేదో మేం పడ్తం.”

“అభివృద్ధి చెందని ప్రాంతాలు, వాయల సీమలో మోస్తాలో కూడా ఎన్నో ఉన్నాయి. దానికి కారణం బృందగానా వాళ్ళా? అభివృద్ధి జరగక పోవడం అనేది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. విభేదాలు అనేవి అన్ని చోట్లా ఉంటాయి. దురహంకారులు ప్రతీ చోటా ఉంటారు. పరిష్కారం ఒక్క విడిపోవడమేనా? మరి ప్రత్యేక రాష్ట్రాలుగా మారిన చెత్త గఢ్, ఘోర్ఖండ్‌ల మాటేంటి? అవి ఇంకా దిగజారాయి కద? ప్రత్యేక రాష్ట్రం వస్తే బృందగానా బాగు పడుతందని గ్యారంటీ ఏంటి?”

“గవన్ని మాకు తెల్వదు భై. ఈ మోస్తా వోల్ల జులుం వల్ల దమాక్ ఖరాబయ్యింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే గప్పుడు ఆలోచించుడు మొదలెడతం.”

“వీ.సీ.ఆర్. గారు! ఆదరా బాదరా అందరి రాజధాని అన్న ఉద్దేశంతో వాయల సీమ వాళ్ళు, మోస్తా వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. అదే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్నో సంస్థలు నెలకొల్పింది. మరి ఇప్పుడు ఆదరాబాదరా ఒక్క బృందగానాకే చెందుతుంది అంటే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఆదరా బాదారాని అభివృద్ధి చేయడంలో ఎంతో కొంత వాళ్ళ పాత్ర ఉంది కద. మరి ఆదరా బాదరా మీదా వాళ్ళకు ఎలాంటి హక్కు లేదాంటారా? త్రిలింగ దేశంలో ఆదరా బాదరా లాంటి పెద్ద నగరం లేదు. ఇన్ని దశాబ్దాలుగా అందరు కలిసి అభివృద్ధి చేసిన మన రాజధాని ఒక బృందగానాకే వెళ్తే అదేం న్యాయం?”

“గీడెవడ్రా భై? హౌలా గాని లెక్క మాట్లాడుతూండు? బయటకు ఈడ్చేయుర్రి!”

“ఇది దారుణం! శాంతియుతంగా ప్రశ్నలు అడుగుతూంటే ఇలా దౌర్జన్యం చేస్తారా?”

“శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నం కనకనే ఈడ్చేస్తున్నాం. లేకుంటే పొడుస్తూండే బిడ్డా, ఏమనుకున్నావో!”

స్థలం: బృందగానాలో అన్ని ప్రాంతాలు
జనం: బృందగానా యొక్క నిజమైన ప్రతినిధులు, అంటే అక్కడ నివసించే ప్రజలు

అందరూ: ఇదేమిటి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలెక్షన్లలో పూరా పది సీట్లు మాత్రమే వచ్చి బర్‌ఖాస్ ఐపోయిన వీ.సీ.ఆర్ నిరాహార దీక్ష చేయుడేందీ, మన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందగానా ప్రకటించుడేందీ, గిప్పుడు ఈ ఉద్యమాలేందీ, గీ లొల్లేందీ? అందరు బృందగానా ఎం.ఎల్.ఏలు కలిసి పోరాడుడేంది? ఏం సంఝవుతలేదు.

స్థలం: స్వర్గం
జనం: శ్రీ రామదేవ రాయలు, మహామంత్రి బొమ్మరసు, పొడుగు శ్రీరాములు.

“అప్పాజీ! త్రిలింగదేశం పరిస్థితి ఇంత దయనీయంగా తయారు అయినదేమి? నేను త్రిలింగదేశానికి సార్వభౌముడనై ఉన్నప్పుడు ఈ ప్రాంతీయ భేదాలు లేవే? అభివృద్ధి అనేది సర్వతోముఖంగా ఉండవలనన్నదే అప్పటి మా ఆశయం. అది ఏ ప్రాంతము అన్నది కాదు మాకు ముఖ్యం. ఒకే భాష ఒకే సంస్కృతి ఉన్న మనుషులు కలసి కట్టుగా మనలేనప్పుడు, రేపు ఏర్పడబోయే ఈ చిన్న రాష్ట్రములు మళ్ళీ ముక్కలు కావని ఏమి నమ్మకం? దీనికి అంతేది?” బొమ్మరసుని ఉద్దేశించి బాధగా అన్నాడు రామదేవ రాయలు.

“మీరన్నది నిజం ప్రభూ! త్రిలింగ దేశం జాగ్రఫీ ప్రకారంగా కానీ, సహజ వనరుల పరిస్థితి దృష్ట్యా కానీ, వారు ఒకే రాజ్యముగా ఉండుటయే ప్రస్తుతానికి శ్రేయస్కరం. అందుకే ఆనాడు నేను, నా తోటి త్రిలింగ దేశ వాసులం, ప్రాణాలకు ఒడ్డి త్రిలింగ దేశాన్ని సాధించుకున్నాము,” తను కూడా విషాదంగా అన్నాడు పొడుగు శ్రీరాములు.

స్థలం: అరమికా
జనం: ప్రవాస త్రిలింగ ప్రజలు

పెద్ద దొమ్మీ జరుగుతూంది. త్రిలింగ ప్రజలు ఒకరినొకరు బూతులు తిట్టుకుంటున్నారు.
కొందరు కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు.

(జాన్, పీటర్ల సంభాషణ)
జాన్: What’s wrong with these people? Why are they fighting amongst each other?
పీటర్: Apparently they don’t want to live together in their motherland.
జాన్: Oh

This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

27 Responses to బృందగానా జిందాబాద్!

  1. KumarN says:

    మురళీ గారూ,
    సైటైర్ లో, అందులోనూ పేర్లు పెట్టడం లో మీకు మీరే సాటి. హేట్సాఫ్ .

    కొన్ని పేర్లు చూసి నవ్వాపుకోలేక పోతున్నా.

  2. మీదైన స్టైలులో బాగుంది.

  3. బాగుందండీ !!
    మీరు ఆదరా బాదరా అని ఎందుకు వ్రాసారో నాకు తెలుసు. హైదరాబాద్ అంటే నాలుక కోస్తా అన్నాడు గా మన VCR
    ఇహ మీమీద అజ్ఞాతలు, ప్రొఫైల్ కనపడని పోటుగాళ్ళు , ప్రత్యెక బ్లాగంటూ లేని ప్రత్యెక రాష్ట్రం కోరుకునే వాళ్ళూ దండ యాత్ర సాగిస్తారు , సిద్ధం కండి.
    నేను కూడా ఎక్కడా హైదరాబాద్ అని అనట్లేదు , నాలుక కొస్తారని భయం. పాపం తెలంగాణా ప్రజలని అమాయకుల్ని చేసి VCR ఆరేళ్లుగా ఆడుకుంటున్నాడు.
    ముందు ఫ్లోరైడ్ సమస్యని బాగు చెయ్యమనండి. తర్వాత ప్రత్యెక రాష్ట్రం.

    • Sree says:

      నిజమేనండీ.. ఆ “అజ్ఞాతలు, ప్రొఫైల్ కనపడని పోటుగాళ్లు, ప్రత్యేక బ్లాగంటూ లేని ప్రత్యెక రాష్ట్రం కోరుకునే వాళ్ళూ దండయాత్ర సాగిం”చారు నా బ్లాగ్‌పై. తమ శైలిలో బూతులు, తిట్లు, శాపనార్థాలు, అసలు బ్లాగ్ పోస్ట్‌లో వ్రాసిన దానితో బొత్తిగా సంబంధం లేకుండా అసందర్భ ప్రేలాపనలు.. 😦

  4. nomi says:

    సరైన సమయంలో సరైన టపా!!!!!!!

  5. హ హ …
    పేర్లు సుపరండి 🙂

  6. laxmi says:

    😀 kevvu keka!!!

  7. రహంతుల్లా says:

    రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది కాబట్టి,ఆంధ్రపదేశ్‌ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి లాంటి వితండవాదనలు ఏదో రకంగా మొండిగా సమైక్యవాదాన్ని సమర్దించటం కోసమే గానీ వాదనలో పస లేదు.జై ఆంధ్ర అంటాను జైతెలంగాణా అంటాను.విడిపోతే తప్పేంటి అనే వెంకయ్యనాయుడులాగా సమైక్యవాదులు ఎందుకు కలిసుండాలో కారణాలతో సహా స్పష్టంగా చెప్పాలి.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

    ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
    ఏర్పడిన సంవత్సరం ↓ జిల్లా ↓ జిల్లాకేంద్రం ↓ జనాభా (2001) ↓ వైశాల్యం (km²) ↓ జనసాంధ్రత (/km²) ↓ జిల్లావెబ్ సైట్ ↓
    1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad. nic.in/
    1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 http://anantapur. nic.in/
    1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 http://chittoor. nic.in/
    1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari .nic.in/
    1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 http://guntur. nic.in/
    1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 http://hyderabad. nic.in/
    1910 కడప జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa. nic.in/
    1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar. nic.in/
    1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 http://khammam. nic.in/
    1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 http://krishna. nic.in/
    1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 http://kurnool. nic.in/
    1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar .nic.in/
    1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 http://medak. nic.in/
    1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda. nic.in/
    1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 http://nellore. nic.in/
    1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 http://nizamabad. nic.in/
    1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 http://prakasam. nic.in/
    1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 http://rangareddy. nic.in/
    1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 http://srikakulam. nic.in/
    1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatna m.nic.in/
    1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram .nic.in/
    1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 http://warangal. nic.in/
    1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 http://wgodavari. nic.in/
    విశేషాలు

    * అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,
    గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,పోర్టోరికో,
    కతార్,సీషెల్స్,సింగపూర్,స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ.

  8. Yogi says:

    Perlu pettadamlo meeku meere Sari Murali garu..
    good one..

  9. virajaaji says:

    మస్తు రాసినవ్…. నవ్వి నవ్వి సచ్చిన! పొడుగు శ్రీరాములు గారి బాధ అందరికీ సమఝైతే గీ పరేషానీ అంత పోతది.

  10. Ramana Turlapati says:

    simply superb!

    would love to see NRA/NRT (non-resident andhrites/telanganites)angle in this.

    sthalam: usa
    janam: tandaana, maata, baraata modalagu telugu associations

  11. satya says:

    ADUR’S(SAMAIKYA TRILINGADESAM)

  12. Venu says:

    Awesome … and funny

  13. Hari says:

    Murali,

    Chaala Baagundi. Keep it up.

  14. అదరగొట్టేసారు! “బృందగానా” సూపర్!!

  15. N.C.Mohan says:

    Neekem Boss Tiruguledu!

  16. baagaa vraasaaru. kosamerupu kasakkuna tegindi. (Dialogue courtesy: M.S. Narayana in “kauravuDu”) …

  17. Swarna Kumar says:

    We can see humour in tragedies.

    Today, lakhs of people in Telangana have come out of their homes to express aginst decades of exploitation, at a great risk. It is fight for self respect.

    Telangana people were slaves for a long period. They will take time to understnad what is development.
    There is no need for Andhras to develop Telangana, as there was no need for the British to develop India, nor for USA to save democracy everywhere, by supplying war weapons to all.

    Good wishes to all fair minded persons

  18. Jyothi Reddy says:

    Murali ji,

    Good Job sir! I liked your critique. Vetakaram lo meeku meerey saati.
    Keep going until this issue is solved…

  19. రహంతుల్లా says:

    45 కోట్ల రూపాయల ఖర్చుతో యానాంలో ఈఫిల్ టవర్ కట్టబోతున్నారు.http://epaper.sakshi.com/Details.aspx?id=355564&boxid=28742358

  20. brijbala says:

    స్థలం: దండకారణ్యం
    జనం: పెట్రోమాక్స్ లైట్లు
    is the highlight of the post…

    మరి హైదరాబాద్ లో మకాం పెట్టి ఆపరేషన్స్ ని మాస్టర్మైండ్ చేసే టెర్రరిస్ట్ ఔట్ ఫిట్స్ ఏమీ సంప్రదించుకోలేదా? వాళ్ళని వదిలేసారేం? పాపం వాళ్ళకి పార్టీ లేదనే కదా ఈ వివక్ష?

  21. brijbala says:

    I spoke too soon…. I loved this one too –

    స్థలం: అరమికా
    జనం: ప్రవాస త్రిలింగ ప్రజలు

    పెద్ద దొమ్మీ జరుగుతూంది. త్రిలింగ ప్రజలు ఒకరినొకరు బూతులు తిట్టుకుంటున్నారు.
    కొందరు కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు.

    (జాన్, పీటర్ల సంభాషణ)
    జాన్: What’s wrong with these people? Why are they fighting amongst each other?
    పీటర్: Apparently they don’t want to live together in their motherland.
    జాన్: Oh

  22. raju says:

    super but u dont play with telangana @@joke

  23. Prasad says:

    Don’t play jokes on sensitive Telangana issue. You need to keep in mind people are demanding for separate state for long time.

  24. kanred says:

    మన తెలంగానాంధ్ర లొల్లి హాలీవుడ్ ని కుడా తాకినట్టుంది…….ఇక్కడ చూడండి

    మన తెలంగానాంధ్ర లొల్లి హాలీవుడ్ ని కుడా తాకినట్టుంది…….ఇక్కడ చూడండి

Leave a reply to kanred Cancel reply