ముగ్గురు మొనగాళ్ళు

“హలో డాక్టర్ గారూ?”

“ఓ తెలుగు తల్లి గారా? చెప్పండి? ఏంటి సంగతులు?”

“నాకు ముగ్గురు కొడుకులు అని మీకు తెలుసు కద?”

“ఓ తెలీకేం? ఏమయ్యింది వాళ్ళకు?”

“ఇంకా ఏం కాలేదు. కాని అవుతుదేమో అని భయంగా ఉంది.”

“అసలు విషయమేంటో చెప్పండి?”

“ఈ మధ్య మా మధ్య వాడికి, పెద్దాడితో చిన్నాడితో పడట్లేదు. ఎప్పుడూ ఏదో గొడవ పెట్టుకుంటాడు. తనకు అన్యాయం జరిగిపోతూంది అని బాధ పడతాడు. కొత్త షరతు పెట్టాడు. ఈ ఇద్దరూ వాడి రూంలోకి రాకూడట. ఇదెక్కడి చోద్యమండి?”

“దీన్ని ఐసోలేషన్ సిండ్రోం అంటారమ్మా! విడిగా ఉంటే చాలు, అన్ని సమస్యలూ తీరిపోతాయి అని ఒక అభద్రతా భావం కలుగుతుంది. మందు ఉంది కాని, అప్పుడప్పుడు పని చేస్తుంది, అప్పుడప్పుడు చేయదు.”

“ఇక పెద్ద వాడు ముందు బాగానే ఉండే వాడు. అన్ని విషయాలు పట్టించుకునే వాడు. ఇంటి పరువు, మన సంస్కృతి కాపాడాలని తాపత్రయ పడే వాడు. అలాంటిది ఇప్పుడు, తమ్ముళ్ళని కూడా చూడకుండా, మధ్య వాణ్ణి, చిన్నాడిని తక్కువ చేసి మాట్లాడతాడు. పైగా ఒకటే డబ్బు యావ. డబ్బు కాకుండా వేరే విషయాలు కూడా ఉన్నాయిరా అంటే నమ్మడు. కడుపు తరుక్కుపోతూంది.”

“దీన్ని మోనో మ్యానియా అంటారమ్మా! ఇలాంటి వాళ్ళకు ఒక విషయం మీదే ధ్యాస ఉంటుంది. మిగతావి ఏవీ పట్టించుకోరు. ‘పుడమిని చూడని కన్ను, నడుపదు ముందుకు నిన్ను, నిరసన చూపకు నువ్వు ఏనాటికీ’ అన్న కవి వాక్యాన్ని మర్చిపోవడం వల్ల ఇది జరుగుతుంది.”

“దీనికి మందు?”

“ఇస్తాను కానీ గ్యారంటీలు లేవమ్మా!”

“ఇక చిన్నాడికి ఆవేశం ఎక్కువ. తగవు పెట్టుకునే తత్వం. జీతం అంతంత మాత్రమే. తన పరిస్థితిని మెరుగు చేసుకోవాల్సింది పోయి, ఎప్పుడూ ఎవడో ఏదో అన్నాడని, తొడ కొట్టుకుంటూ వాడి మీదకు వెళ్ళి నానా రభస చేస్తూ ఉంటాడు.”

“దీనికి ఏంగర్ మ్యానేజ్‌మెంట్ పని చేయొచ్చు. వైద్యం చేస్తాను కానీ, మీరు పక్కనుంటే మంచిది. మళ్ళీ నా మీదకే వస్తే?”

“చేతికి అంది వస్తారనుకున్న బిడ్డలు ఇలా తయారయితే చాలా బాధగా ఉంది డాక్టర్ గారూ…”

“మన ప్రయత్నం మనం చేసి చూద్దామమ్మా. బాగు పడతారనే ఆశిద్దాం.”

“ఉంటాను డాక్టర్ గారూ!”

“మంచిదమ్మా!”

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

14 Responses to ముగ్గురు మొనగాళ్ళు

 1. బాగుంది. 😛 😛 😛

 2. పవన్ says:

  ఏవరా ఆ three gentleman’s

 3. Jyothi Reddy says:

  Murali ji,

  Just thinking sir,who are they?
  But it is good story,keep going andi.

 4. rama subba reddy says:

  పెద్దోడు ఎప్పుడూ అంతే.. టపా రాసిన మనిషి కి పెద్దోడు దగ్గరోడేమో.. అందుకే పెద్దోడిని కొంచెం పొగుడుతూ రాశాడు…

 5. Malakpet Rowdy says:

  Excellent! ఏకిపారేశారుగా. ముగ్గుర్నీ మన భరతమాత మొదటిబిడ్డ చేత చెప్పుతో నాలుగేళ్ళపాటు వాయగొట్టిస్తేగానీ కుదరదు రోగం వీళ్ళకి!

  • Murali says:

   Malakpet Rowdy గారూ,

   భరత మాత మొదటి బిడ్డ అంటే కొంప దీసి మన ఎక్స్-గవర్నర్ తివారి గారు కాదు కద. 😉

   -Murali

 6. రవి says:

  పెద్దోడు, చిన్నోడుల రోగాలు రోగాలే కావు. మధ్యోడి పక్కన చిల్లరమూక బాగా చేరారు. నూరిపోస్తున్నారు. అందుకే వాడే ఇప్పుడు అసలు విషయం.

 7. karthik says:

  perfectly written!!

 8. eswar says:

  maa chinnodi gurinchi correct ga rasaru

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s