అరెమికాలో లైఫే వేరు


రమేష్, సురేష్ ఇస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. జంబూ ద్వీపం అర్థికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, వారికి మాత్రం ఎలాగైనా అరెమికాలో సెటిల్ కావాలని కోరిక. జంబూ ద్వీపం అర్థికంగా పైకి వస్తున్నా కూడా, అరెమికాలోని infrastructure వాళ్ళిద్దరూ బ్రతికుండగా రాదని వారి అభిప్రాయం. ఇంకా, అరెమికాలో ఉండే వ్యక్తిగత స్వేచ్ఛ, శాంతి భద్రతలు, లంచగొండితనం లేకపోవడం కూడా వారికి అరెమికా మీద మక్కువ పెంచిన అంశాలు.

***

భరత్, భారతి జంబూ ద్వీపం నుంచి అరెమికా వెళ్ళి అక్కడ స్థిరపడిన ఎన్నో జంటల్లో ఒకరు. వాళ్ళు అద్దెకి, బాగా దేశీలు ఉన్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో దిగారు. ఆ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ ప్రత్యేకత ఏంటంటే చుట్టు పక్కలే చాల కన్వీనియంట్‌గా జంబూ ద్వీపపు సరుకులు దొరికే దుకాణాలు, త్రిలింగ భాషకు చెందిన సినిమాలు ఆడే ఒక థియేటర్, దగ్గర్లో ఉండడం.

***

రమేష్, సురేష్‌లు సినిమా చూసి బయట పడ్డారు. “ఆ గొడవేంట్రా అసహ్యంగా? అదే అరెమికాలో ఐతే థియేటర్స్‌లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుందట,” అన్నాడు రమేష్ సురేష్‌తో. “ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉందిరా,” అన్నాడు సురేష్.

***

శుక్రవారం రోజు భారత్,భారతి ఇంటి దగ్గర్లో ఉన్న థియేటర్‌కి బయలుదేరారు. జంబూ ద్వీపంలో రిలీజ్ ఐన రోజే ఇక్కడ కూడా రిలీజ్ చేశారు డిస్ట్రిబ్యూటర్స్. చాలా కోలాహలంగా ఉంది. టికెట్లు కొని లోపలికి వెళ్ళారు భారత్, భారతి. థియేటర్ లోపల భాగం చాలా నాసి రకంగా ఉంది. అంతకు ముందు షో వదలడంతో కొందరు ప్రేక్షకులు సినిమా ప్రదర్శింపబడుతున్న హాల్ నుండి పొలోమంటూ వచ్చేశారు. స్థలం తక్కువ కావడంతో ఆ రష్‌లో చాలా ఇబ్బంది అయ్యింది భారతీ భారత్‌లకు. కానీ సర్దుకుపోయారు వాళ్ళు. అది అసలే జంపింగ్ స్టార్ జనక్ సినిమా. మొదటి రోజే చూసే అదృష్టం కలిగింది. దానికోసం ఎన్ని ఇబ్బందులు ఐనా భరించడానికి తయారుగా ఉన్నారు.

సినిమా మొదలయ్యింది. జంపింగ్ స్టార్ జనక్ తెర మీదకు రాగానే ఫ్యాన్స్ ఆనందంతో రెచ్చిపోయి రంగు కాగితాలు, కాయిన్స్ పైకి విసిరేశారు. ఓ రెండు నాణేలు భారత్ భారతీల నెత్తి మీద కూడా పడ్డాయి. “అచ్చూ జంబూ ద్వీపంలో సినిమ చూసినట్టే ఉంది కద?” అన్నాడు భారత్ భారతితో. “అవునండి,” సమధానమిచ్చింది భారతి.

జనక్ ఎంట్రీ తరువాత, జనాలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ, కామెంట్స్ చేస్తూ, విజిల్స్ వేస్తూ సినిమా చూడ్డం మొదలెట్టారు. కొందరు చిన్న పిల్లలు ఏదుస్తున్నారు. ఇంకొందరు థియేటర్‌లో అటూ ఇటూ పరిగెడుతున్నారు.

ఇంటర్వెల్‌లో అదే థియేటర్‌లో ఉన్న ఫుడ్ స్టాండ్ దగ్గర అత్యధిక ధర చెల్లించి, పాసిపోయిన సమోసాలు, కావలిసినదానికంటే ఎక్కువ ఉడికించిన టీ కొనుక్కున్నారు భారత్ భారతీ.

మొత్తానికి సినిమా ముగించి బయట పడ్డారు భారత్ భారతీ. ఆ రద్దీలో ఎక్కడో పార్క్ చేసిన కార్ తీసి (మరి ఆ థియేటర్ దగ్గర పార్కింగ్ లేదు) ఇంటికి చేరుకున్నారు. రాగానే జంబూ ద్వీపంలో ఉన్న వారి ఇంటికి ఫోన్ చేసి, సినిమా టాక్ ఎలా ఉందో కనుక్కున్నారు. అలా ఆ ప్రహసనం ముగిసింది.

***

“అరెమికాలో జీవితంలో ఒక బ్యాలన్స్ ఉంటుందటరా! పని, రిలాక్సేషన్ అన్ని తగు పాళ్ళలో ఉంటాయట,” అన్నాడు రమేష్ సురేష్‌తో.

“అవునురా, ఇక్కడ ఒక్కటే డబ్బు యావ మనుషులకు. అక్కడ రక రకాల హాబీస్, యాక్టివిటీస్ పెట్టుకుంటారట అందరూ,” అన్నాడు సురేష్.

***

పద్మాకర్ చాలా ఆనందంగా ఉన్నాడు ఆ రోజు. పద్మ విషయమేంటని అడిగింది.

“ఏం లేదోయి. మన ఇంటి మీద అప్పు పూర్తిగా తీరి పోయింది కద! అందుకు,” చెప్పాడు పద్మాకర్.

“అవునండీ. ఏడేళ్ళలోనే mortgage మొత్తం కట్టేశాం,” గర్వంగా అంది పద్మ.

“ఇదే కాదోయి, మన జంబూ ద్వీపంలో కూడా ఒక ఫ్లాట్ కొనుకున్నాం కద?” గుర్తు చేశాడు పద్మాకర్. అవునన్నట్టు తల ఊపింది పద్మ.

సడన్‌గా వేదాంత ధోరణిలోకి వెళ్ళిపోయాడు పద్మాకర్. “దీని వెనుక ఎంతో కృషి ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎప్పుడూ హాలిడేస్ కదా అని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి అటూ ఇటూ ట్రిప్స్ పైన వెళ్ళలేదు. మనం వేరే వాళ్ళింటికి పార్టీలకు, పండగలకు వెళ్ళడమే కాని, ఎప్పుడూ మనింటికి పిలిచి డాలర్లు తగలెయ్య లేదు. ఇక సినిమాలు, షికార్లు లాంటివి అస్సలు పెట్టుకోలేదు. దాని బదులు బంగారం కొనుక్కున్నాం. అనవసరమైన చెత్త వస్తువులేవీ కొనుక్కోలేదు. ఆ కొన్నవి కూడా సేల్‌లోనే కొన్నాం. అదే మా ఫ్రెండ్స్ అంతా ఈ రూల్స్ పాటించకుండా, సేవింగ్స్ లేకుండా ఎందుకూ పనికి రాకుండా పోయారు. ఇప్పుడు చూడు జంబూ ద్వీపంలో మన చుట్టాల మధ్య మనకెంత పరపతి ఉందో!” ఉటంకించాడు పద్మాకర్.

“నిజమేనండి. మీ లాంటి భర్త దొరకడం నా అదృష్టం,” అర మోడ్పు కన్నులతో అంది పద్మ.

***

సురేష్, రమేష్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళారు. బఫే దగ్గర, పెళ్ళికి వచ్చిన జనం ఎగబడి తిండి కోసం వెతుక్కోవడం చూసి అసహ్యించుకున్నాడు సురేష్. “చూడరా ఎప్పుడూ తిండి తిననట్టు ఎలా వెంపర్లాడుతున్నారో?” అన్నాడు రమేష్‌తో.

***

భరత్ ఆఫీస్‌లో ఉన్నాడు. లంచ్ టైం అయ్యింది. యధావిధిగా మిగతా కొలీగ్స్‌తో లంచ్ చేయొచ్చని బ్రేక్‌రూం వైపు బయలుదేరాడు. అతను లోపలికి ఎంటర్ అవుతూంటే అతని కొలీగ్స్ అందరూ లేచి నిలబడుతున్నారు. “అదేంటి, మీ లంచ్ అయి పోయిందా?” ఆశ్చర్యపోయాడు భరత్.

“కాదు. మనం రెగులర్‌గా మీట్ అయ్యే కాన్‌ఫరెన్స్ రూంలో ఈ రోజు ఫ్రీ ఫుడ్ అట. అదే ఫ్లోర్‌లో పని చేస్తున్న పద్మాకర్ గాడు ఫోన్ చేసి మరీ చెప్పాడు. అందరం అక్కడికే బయలుదేరుతున్నాం,” చెప్పాడు ఆ గుంపులో ఒకతను.

“మరి, మనం తెచ్చుకున్న లంచ్ బాక్సులు?” అడిగాడు భరత్.

“అది డిన్నర్ బదులు రాత్రి తినేయొచ్చు. అలా ఆదా అవుతుంది. త్వరగా పద. అసలే ఆ ఫ్లోర్‌లో దేశీలు ఎక్కువ. ఆలస్యం చేస్తే మనకేం మిగలదు,” అన్నాడు అతనే మళ్ళీ. అందరు జమిలిగా కాన్‌ఫరెన్స్ రూం వైపు పరిగెత్తారు.

***

“ఇక్కడ మధ్య తరగతి బతుకు ఎంత దుర్భరం కదరా! పైసా పైసా లెక్క కట్టి బ్రతకాలి,” బాధగా అన్నాడు సురేష్ రమేష్‌తో.

“నిజమేరా, అరెమికాలో ఐతే లో ఇన్‌కం గ్రూప్స్ కూడా హ్యాపీగా బ్రతికేస్తారట,” బదులిచ్చాడు రమేష్.

***

ఆదివారం. సరుకులు కొనడానికి బయలుదేరారు భరత్, భారతీ. Mr. Johns స్టోర్ ముందు కార్ పార్క్ చేయబోతూంటే, గట్టిగా అరిచింది భారతి. “ఏమయ్యిందే, అలా అరిచావు. నాకే కనుక గుండె నొప్పి ఉండి ఉంటే ఈ పాటికి మన దివంగత ముఖ్య మంత్రి వై.నో. గారి పక్కకు చేరుకుని ఉండే వాడిని,” ఉలిక్కిపడుతూ అన్నాడు భరత్.

“ఈ స్టోర్‌లో సరుకులు చాలా ఖరీదండీ! అదే Mr. Smiths లో ఐతే చవక. అటు వెళ్దాం,” అంది భారతి.

“నీకెలా తెలుసు?”

“పద్మాకర్ గారి భార్య పద్మ చెప్పింది.”

Mr. Smiths లో షాపింగ్ అయ్యాక ఆనందంగా డిక్లేర్ చేసింది భారతి. “ప్రతీది కనీసం రెండు సెంట్లు ఐనా తక్కువుందండీ ఇక్కడ. ఇక్కడ కొనడం వల్ల మొత్తం ఒక్క డాలర్ ఆదా అయ్యింది,” అంటూ.

***

“ఈ మధ్య వీడియో పైరసీ ఒకటే ఎక్కువ అయిపోయిందిరా. దీని వల్ల త్రిలింగ సినిమా ఇండస్ట్రీ మొత్తం మూత పడే ప్రమాదముంది అంటున్నారు,” అన్నాడు రమేష్ సురేష్‌తో.

“నిజమేరా, అదే అరెమికాలో ఐతే చాలా స్ట్రిక్ట్ యాంటీ-పైరసీ లాస్ ఉన్నాయట. ఇలా పైరసీ చేస్తే పెద్ద ఫైన్ వేసి జైల్లో పెడతారట.” అన్నాడు సురేష్.

***

“ఈ ఫ్రైడే రోరింగ్ స్టార్ రంజన్ మూవీకి వస్తున్నారా?” అడిగాడు భరత్ పద్మాకర్‌ని.

“ఏంటి, నువ్వు డబ్బులు పెట్టి సినిమా చూస్తావా?” ఆశ్చర్యంగా అడిగాడు పద్మాకర్.

“మరి?” బుర్ర గోక్కున్నాడు భరత్.

“మేమైతే ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీ గా చూస్తాం. బోలెడు వెబ్ సైట్స్ ఉన్నాయి కద అలాంటివి! మరీ అంతగా కావాలంటే మన “ప్రైడ్ అఫ్ జంబూ ద్వీప్” స్టోర్‌లో చాల చవకగా పైరేటెడ్ డీవీడీలు అద్దెకీ, కొనుక్కోవడానికీ దొరుకుతాయి,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు పద్మాకర్.

“ఇన్ని రోజులనుంచి నేను బోలెడు డబ్బు వృధా చేశానన్న మాట,” అనుకుని బాధ పడ్డాడు భరత్.

సాయంత్రం భారత్, భారతీ “ప్రైడ్ అఫ్ జంబూ ద్వీప్” స్టోర్‌నుంచి తెచ్చుకున్న “నీతి నా ఊపిరి, నిజాయితీ నా దైవం” సినిమా చవకగా చూసేశారు.

***

నీతి: దేశ కాల పరిస్థితులతో సంబంధం లేదు. ఏబ్రాసుల్లా బ్రతకాలి అని కంకణం కట్టుకుంటే, ఎక్కడైనా అలాగే బ్రతక వచ్చు.

Advertisements
This entry was posted in ప్రవాసాంధ్రులు. Bookmark the permalink.

28 Responses to అరెమికాలో లైఫే వేరు

 1. Sravya Vattikuti says:

  Truly said !

 2. అబ్రకదబ్ర says:

  సరదాగా ఉంది. కానైతే నాకు ‘అరెమికాలో’ మీ కథలో పాత్రల బాపతు వ్యక్తులు పెద్దగా తగల్లేదు. పద్మ, పద్మాకర్ పాత్రలనవసరం. ఆ లక్షణాలూ భరత్, భారతిలకి ఆపాదిస్తే సరిపోయేది. మొత్తమ్మీద మీ శైలి మాత్రం నవ్వులు పంచింది.

  చివర్లో నీతి నొక్కి వంకాణించకున్నా ఫర్లేదనుకుంటా. We got the point already 🙂

  • Murali says:

   అబ్రకదబ్ర గారూ,

   నాకు తెలిసి ఇలాంటి వర్గం ప్రతి చోటా ఉంటారు అరెమికాలో. ముఖ్యంగా మన ఖాళీ-ఫోర్నియాలో మరీ ఎక్కువ.

   పద్మాకర్ పద్మల పాత్రలు నా దృష్టిలో అవసరమే. ఎందుకంటే ఇలాంటి గురు వర్యులు కూడా ప్రతి చోటా ఉంటారు. “తా చెడ్డ కోతి…” చందానా అందరికి అడగకుండానే అమూల్యమైన సలహాలు ఇస్తూ ఉంటారు.

   ఇక నీతి వక్కణించడం అంటారా. ఒక్క పాఠకుడు కూడా అది మిస్ కాకూడదు అన్న తపన, తాండ్ర నాతో అలా చేయించింది.

   • అంతేనంటారా. నాకున్న పరిచయాలు, మిత్రులు చాలా తక్కువలెండి. అందుకే ఎక్కువగా ఆ బాపతోళ్లు తగల్లేదనుకుంటా.

    సినిమాహాళ్ల భాగోతం మాత్రం కళ్లక్కట్టినట్లుంది. నేను డీవీడీల్లో తప్ప తెలుగు సినిమాలు చూట్టం మానుకున్నా. మన సినిమాలు ధియేటర్లో చూడాల్సినంత గొప్పగా ఎటూ ఉండవనుకోండి. చివరగా ధియేటర్లో చూసింది మృగవీర. అంత బిల్డప్పుకి తగ్గట్లు లేదు – అంతోఇంతో ఆ గుర్రం లగెత్తే సన్నివేశం ఒక్కటి తప్ప.

   • రామ says:

    తపన – తాండ్ర బాగుంది. చిత్రం భళారే కి తీసుకెళ్ళారు :).

 3. teresa says:

  🙂

  ఈ కంకణం తొడుక్కున్న జనాభా శాతం ఈ మధ్య మరీ ఎక్కువైంది! అదృష్టం కొద్దీ వీరు చిన్న ఊర్లలో ఉండరు.

 4. రవి says:

  గురూ గారూ, ఇదివరకు అరెమికా, దుబాయి నుంచి ఇండియాకొచ్చి, “హే, వాట్ ఈజ్ దిస్? నో కరెంట్? ఇంత ఎండలో ఎలా ఉంటున్నారు మీరసలు?” అని పోజులు కొట్టే క్యారక్టర్లను చూశాను. అరెమికా కెళ్ళి జనాలెలా బతుకుతారో ఓ సేంపుల్ చూపించారు.

 5. సునీల్ says:

  కరెక్ట్.

 6. sam says:

  Sadly this is true in US these days.
  I would like to make one small change.
  Nowadays nobody are able to payoff mortgage in 7 years unless they are living in mid-western cities and they are paying whatever they get to mortgage.

  • Murali says:

   Sam,

   You would be surprised how persistent some people can be. 🙂
   You forgot about double income families. 🙂

   -Murali

 7. cbrao says:

  బాగా చెప్పారు.
  మీ ఊరు, వేగు చిరునామాతో నాకు ఒక ఉత్తరం వ్రాస్తారా? e-తెలుగు, Bay Area Meeting కు ఆహ్వానం పంపుతాము.
  cbraoin at gmail.com
  Mountain View, CA.

  • Murali says:

   ఇన్‌విటేషన్‌కి థాంక్సండీ! మీటింగ్‌కి రాలేను కాని, ఇలా కలుసుకుంటున్న బే ఏరియా రచయితలందరికి నా శుభాకాంక్షలు.

 8. suresh says:

  “నీతి: దేశ కాల పరిస్థితులతో సంబంధం లేదు. ఏబ్రాసుల్లా బ్రతకాలి అని కంకణం కట్టుకుంటే, ఎక్కడైనా అలాగే బ్రతక వచ్చు”

  మీ నీతి నాకు మాబాగా నచ్చేసిందండి…

 9. ఇంతకీ మీరెక్కడున్నారు? అరెమికాలోనేనా?

 10. sowmya says:

  ఇంతకీ మీరెక్కడున్నారు? అరెమికాలోనేనా? 😀

 11. sunita says:

  బాగా రాసారు.ఇంకా ఘోరంగా ఉన్న వాళ్ళున్నారు.నాకు తెలిసిన ఓ కొత్తగా అరెమికా వచ్చిన జంట లో ఇంటాయన కాఫీ, టీ, జూస్ ఏమీ కొనడంట.ఇదేంటీ నేనేమో ందరు ఫ్రెండ్స్ ఇళ్ళకూ వెళ్ళి వాళ్ళు పెట్టినవన్నీ తిని వస్తున్నాను, వాళ్ళు మనింటికోస్తే ఎలా? అని అడిగితే ఏముందీ? సింపిల్. నువ్వు వెళ్ళకు. వెళ్ళినా తినకు. అప్పుడు నువ్వూ పెట్టాలిసిన పని ఉండదు అని సెలవిచ్చాడంట. ఆ తెలివి తేటలకు తట్టుకోలేక ఓ నమస్కారం చేసి ఊరుకున్నాను. అరిమికా వచ్చిన 8 నెలల్లో ఓ ఫ్లాట్ కొన్నాడు ఇండియాలో.

 12. Rao S Lakkaraju says:

  చాలా రియలిస్టిక్ గా ఉంది. మీరు ఉదాహరించిన అన్నీ నేను చెయ్యను గానీ కొన్ని చేస్తాను. ఎంత అయినా ఎక్కడ ఉన్నా ఆంధ్రా బుర్ర కదా.

 13. అనవసరం says:

  నీతి బాగుందండి :).

 14. భావన says:

  Funny. 🙂 అన్ని కాక పోయినా చాలా మట్టూకు అందరం ఎన్నో కొన్నైనా చేస్తాము అనుకుంటా. మీరు ఆఖరు లో చెప్పిన నీతి మాత్రం నిజం.

 15. మురళి says:

  బాగుందండి … ఎప్పటి నుంచే మీకు కామెంట్ రాద్దాం అనుకుంటున్నాను … మీ రమణ రావు – సీనియర్ చదివినప్పుడే రాయాలసింది …. సింప్లీ సూపర్బ్ …. నేను మీలాగా రాద్దాం అనుకుంటున్నాను కానీ అనువాదం కొంచెం కష్టం అయ్యేట్టు ఉంది.. పని ఒత్తిడి వల్ల టైం సరిపోవటం లేదు … కానీ తప్పకుండా రాస్తా ….keep it up Murali…

 16. prasad says:

  Adirindi Keka

  Ikkada okkokkadu okko type

 17. Anil Jyothi says:

  Dear Muraliji,
  Very true..thank you,keep going.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s