ఏమైపోతుంది ఈ సభ్య సమాజం?

జంబూ ద్వీపంలో పెద్ద కలకలం చెలరేగింది. దానికి కారణం ఒకప్పటి సినీ నటి సువాసన చేసిన సంచలనమైన ప్రకటనే. ఒక ఇంటర్వ్యూలో ఆవిడ, పెళ్లికి ముందు ఆడపిల్లలు సెక్స్‌లో పాల్గొనడం తప్పు కాదని, కాని ఎయిడ్స్ లాంటి రోగాలు, గర్భం రాకుండా జాగ్రత్త పడాలని ఉటంకించింది. ఇంకా చెప్పాలంటే, పెళ్ళి కాని యువకులు ఈ రోజుల్లో తాము వివాహం చేసుకోబోయే అమ్మాయి కన్యత్వం (virginity) కోల్పోనిదై ఉండాలని ఆశించడం పిచ్చితనం అని కూడ సెలవిచ్చింది.

దీనితో జంబూ ద్వీపం అట్టుడుకిపోయింది. మత పెద్దలూ, సాంస్కృతిక సంఘాలూ, ఆఖరికి రాజకీయ నాయకులు కూడా తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సువాసన స్టేట్‌మెంట్ విని యువతీ యువకులు చెడిపోతారని, తద్వారా జంబూ ద్వీపంలో నైతిక విలువలు పతనమైపోతాయని ఘోషించారు. అందరూ కలిసి నటి సువాసన మీద జంబూ ద్వీపం సూపర్ కోర్ట్‌లో 22 కేసులు వేశారు.

***

గోప్యానంద స్వామి ఏకాంత సేవలో ఉన్నప్పుడు టీవీ 999 చానెల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ టైంలో ఎనిమిదిమంది భక్తురాళ్ళు రక రకాల తైలాలతో గోప్యానంద స్వామి వొళ్ళు మర్దన చేస్తున్నారు. అందులో ఒక భక్తురాలు ఫోన్‌ని గోప్యానంద స్వామి నోటికి దగ్గరగా పెట్టింది. “అంతా మాయ, చెప్పు నాయనా!” అన్నాడు స్వామి.

“సువాసన గారి స్టేట్‌మెంట్ మీద మీ అభిప్రాయం?” అటు వైపు నుంచి అడిగాడు టీవీ 999 విలేఖరి.

“జంబూ ద్వీపం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు నాయనా. స్త్రీని గౌరవించడం మన సంప్రాదాయం. అలాంటిది, స్త్రీలు వివాహానికి ముందే కామ క్రీడలు సాగించవచ్చు అని చెప్పడం మన అర్ష ధర్మాన్ని అవమానించినట్టే. ఆమెకి తప్పకుండా ఆ భగవంతుడు శిక్ష విధిస్తాడు,” పక్కన ఉన్న భక్తురాలి తల నిమురుతూ గంభీరంగా అన్నాడు గోప్యానంద స్వామి.

***

“అబ్బా ఈ ముసలి ముండ ఎప్పుడు పోతుందో, నాకు ఈ పీడ ఎప్పుడు విరగడవుతుందో?” మంచాన పడి ఉన్న అత్తగారిని ఉద్దేశించి కోపంగా అంది సక్కూ బాయి, టీవీ ఆన్ చేస్తూ.

టీవీ 999 చానెల్‌లో సువాసన వ్యాఖ్యల పట్ల వేడి వేడిగా డిస్కషన్ జరుగుతూంది. “ఛీ, ఛీ. అది అసలు ఆడదేనా? ఎంత బరి తెగించి ఉండకపోతే ఇలాంటి సిగ్గు మాలిన మాటలు మాట్లాడుతుంది?” అనుకుంది తనలో తాను సక్కూ బాయి.

***

“సువాసన డౌన్ డౌన్. జంబూ ద్వీప స్త్రీ జాతికి ఆవిడ బేషరతుగా క్షమార్పణ చెప్పి తీరాలి,” అంటూ అరుస్తున్నారు జంబూ మహిళా సంఘ కార్యకర్తలు. అంతమంది ఆడవాళ్ళు రోడ్డున పడడంతో ట్రాఫిక్ జాం ఐపోయింది.

ఆ గుంపుకు ముందుగా నిలబడి అందరికంటే బిగ్గరగా అరుస్తూంది ఆ సంఘపు ప్రెసిడెంట్ ఝాన్సీ రాణి. అప్పుడే ఆమె సెల్‌ఫోన్ మోగింది. “హలో,” ప్రశ్నార్థకంగా అంది ఝాన్సీ రాణి. “ఇంకా ఎంత సేపు వెయిట్ చేయాలి డార్లింగ్?” అసహనంగా అంటున్న ఒక మగ గొంతు వినిపించింది.

“సారీ డియర్. కాసేపట్లో ప్రెస్ వాళ్ళు, టీవీ వాళ్ళు వచ్చేస్తారు. మా ప్రొటెస్ట్‌ని వాళ్ళు కవర్ చేయగానే, ఒక్క క్షణం కూడా ఆగను. పది నిముషాల్లో నీ వొడిలో ఉంటానుగా,” సర్ది చెప్పింది ఝాన్సీ రాణి.

“నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ఆయన వచ్చేస్తాడు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కలుసుకోవడానికి మనకు వీలు పడదు,” అంటూ ఫోన్ కట్ చేశాడు అవతల వైపు ఉన్న వ్యక్తి.

***

రాత్రి పన్నెండు గంటలు. తన షాప్ వెనక ఉన్న గోడౌన్‌లో వర్కర్స్ సరుకులు సరిగ్గా కల్తీ చేస్తున్నారో లేదో అని సూపర్‌వైజ్ చేస్తున్నాడు సుబ్బి శెట్టి. బియ్యంలో రాళ్ళు కలుపుతున్న ఒక వర్కర్, “ఆ సువాసన ఇంటర్‌వ్యూ విన్నారా సార్? నాకు వొళ్ళు మండిపోయింది. అదే మా ఊళ్ళో ఇలా మాట్లాడి ఉంటే అక్కడే పాతర వేసి ఉండే వారు,” నోట్లో ఉన్న పాన్ పక్కకు ఊస్తూ అన్నాడు.

“నిజమేరా! కలి కాలం వచ్చేసింది. లేకపోతే అలాంటి కారు కూతలు కూస్తుందా ఆ అమ్మాయి? అలాంటి మాటలు వింటే మన యువతరం ఎంత చెడిపోతారు?” బాధగా అన్నాడు సుబ్బి శెట్టి.

***

దీన జనోద్ధరణ సమితి పార్టీ నాయకుడు ధర్మరాజు చాలా పరధ్యానంగా ఉండడం చూసి, “ఏమయ్యిందండీ, అలా డల్‌గా ఉన్నారు?” అడిగింది నటి పవిత్ర. వాళ్ళిద్దరు సిటీ బయటున్న ఫారంహౌస్‌లో ఉన్నారు. ప్రతి ఆదివారం వాళ్ళు అక్కడ కలుసుకోవడం ఆనవాయితీ.

“ఏం లేదు పవిత్రా. అందరూ నీలా గుంభనంగా ఉంటే ఎంత బావుంటుంది. ఆ సువాసన చూడు ఎంత డ్యామేజింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చిందో. ఇంతకు ముందే ఒక మీటింగ్‌లో ఇలాంటి వాళ్ళు మన సమాజం పతనం కావడానికి ఎలా దోహదం చేస్తున్నారో అన్న విషయం గురించి ఉపన్యాసం ఇచ్చి వస్తున్నాను. అందుకే మూడ్ అలా పాడయి పోయింది,” ఎక్స్‌ప్లైన్ చేశాడు ధర్మరాజు.

“వదిలేయండి. ఆమె మా నటీమణులలో చెడ బుట్టింది. మీరు రిలాక్స్ అవ్వండి. అసలే రేపటినుంచి ఇంకో ఆరు రోజులు మీ ఆవిడ పోరు భరించాలి,” ధర్మరాజు భుజం మీద తల వాల్చి గోముగా అంది పవిత్ర.

***

“ఏంటండీ, ఇంత ఆలస్యమయ్యింది, పెద్ద క్యూ ఉందా?” అడిగింది అభ్యుదయమ్మ.

కిరోసిన్ క్యాన్లు మోసుకుని వచ్చిన ఆవిడ భర్త వాటిని కింద పెట్టి నిట్టూర్చాడు. “ఏమి చెప్పమంటావే? ఎక్కడా స్టాక్ లేదు. ఊరంతా తిరిగి తిరిగి కాళ్ళు పడిపోయాయి,” చెప్పాడు.

“మీరు కిరోసిన్ తెస్తే కోడలిని తగలబెట్టాలి అని ఇక్కడ నేను వెయిటింగ్. ఐనా ఈ సువాసన లాంటి వాళ్ళు ఉంటే ఇంకేమవుతుంది లెండి. కరువూ కాటకాలు తప్పవు,” బాధగా అంది అభ్యుదయమ్మ.

***

అనాథ శరణాలయం. ఒక పెద్ద రూంలో వరుసగా పడుకోబెట్టబడి ఉన్న పసి కందులు గుక్క పట్టి ఏడుస్తున్నారు. కారణం వాళ్లకు రోజుకి తగినంత పాలు దొరక్క పోవడమే. గవర్నమెంట్ ఇచ్చే జీతాలు చాలక, పంపించిన పాల డబ్బాలలో మూడొంతులు ఆనాథ శరణాలయం ప్రతినిధులు బయట మార్కెట్‌లో అమ్మేసుకోవడం వల్ల ఏర్పడిన కొరత అది.

“అబ్బా, తలుపులు వేసినా ఈ గోల వినిపిస్తూనే ఉందక్కా!” విసుక్కుంది అనాథ శరణాలయం సేవిక దయామణి.

“వెధవలు తిండి లేకపోయినా ఎంత గట్టిగా కేకలు పెడుతున్నారో! ఆ సువాసన ఇంటర్‌వ్యూ చూశావు కద! మన సమాజం అలాంటి నీచపు మాటల వల్లే చెడిపోతూంది. ఇదిగో, ఇలాంటి అమ్మా అబ్బా వదిలేసిన అనాథ పిల్లలు మన మెడకు చుట్టుకుంటారు,” చెప్పింది ఇంకో సేవిక కరుణ. నిజమే అన్నట్టు తలూపింది దయామణి.

***

ఐదేళ్ళ తరువాత సూపర్ కోర్ట్ సువాసన మీద వేసిన అన్ని కేసులు అర్థం లేనివని కొట్టి పారేసింది. సువాసన అంతు చూద్దామని కంకణం కట్టుకున్న వర్గాలన్ని నీరస పడిపోయాయి.

ఇలాంటి పరిస్థితుల్లో జంబూ ద్వీపంలోని సభ్య సమాజం ఎటు పోతుంది, ఏమవుతుంది?

***

Khushboo’s sex comment takes political tones

Khushboo gets relife from SC

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

22 Responses to ఏమైపోతుంది ఈ సభ్య సమాజం?

 1. JB says:

  ‘పెళ్ళికి ముందు శృంగారంలో మగవారు పాల్గొనవచ్చ’ని వ్యాఖ్యానిస్తే మీరు ఉటంకించిన సభ్యసమాజము పట్టించుకునేదా?

  • Murali says:

   JB గారూ,

   మగ మహారాజులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చండీ!

   మన సంస్కృతి నాశనమయ్యేది ఆడవాళ్ళు విచ్చల విడిగా ఉంటేనే!

   • JB says:

    🙂 నా వ్యాఖ్య ‘సభ్య సమాజం’ గురించిగానీ ‘మీ రచన’ గురించి కాదు – నేను నా వ్యాఖ్య అసంపూర్తిగా వదిలివేయడంవల్ల వేరే అర్థం వచ్చినట్లుంది.

   • Murali says:

    ఐనా నా సమాధానం సరిపోయినట్టే ఉంది. 🙂
    మన (అ)సభ్య సమాజానికి ఎప్పుడూ ద్వంద్వ ప్రమాణాలే కద!

 2. sowmya says:

  మీరు సరదాకి అంటున్నారా, లేక నిజంగా అంటున్నారో నాకర్థం కావట్లేదు.

  “మగ మహారాజులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చండీ!
  మన సంస్కృతి నాశనమయ్యేది ఆడవాళ్ళు విచ్చల విడిగా ఉంటేనే!”…..do you really mean so?

  • Murali says:

   Of course, I am being sarcastic. The whole post is a satire about how most of the Indians equate morality with sexual chastity and nothing else; how morally bankrupt people proclaim themselves as the guardians of Indian culture.

   • sowmya says:

    హమ్మయ్య బ్రతికించారు….initially i felt that it is a satire, but later i really got confused….thanks for the clarification. I think Mahesh also got confused like me.

    సెటైర్ అయితే ఈ టపా సూపరు…చప్పట్లు, ఈలలు.

    అవును ఏమయిపోతోంది ఈ సభ్య సమాజం….ఆడవాళ్ళు ఇలా బరితెగిస్తే ఎలా……కలికాలం అంటే ఇదే కాబోలు 😛

 3. Sujji says:

  నిజమే ! ఏమవుతుందో ?!

 4. పురుషాహంకారం వెల్లివిరిసే టపా…వ్యాఖ్యలు. అభినందనలు.

  • Murali says:

   మహేష్ గారూ,

   కొంప దీసి మీరు అన్నీ ఇలానే హడావుడిగా చదివేసి విషయం అర్థం కాకుండా స్పందిస్తూంటారా?
   నాకు ఏం అనిపిస్తుందంటే, మీలోని స్త్రీ వాది నా టపా పై పైన చదివి, నా క్యామెంట్ ఒకటి చూసి
   వెంటనే ఆవేశంగా స్పందించారని. ఇంకో సారి పూర్తిగా చదవండి.

   తేటగీతి central theme ఎప్పుడూ వ్యంగ్యమే. నా టపాలు చదివే వాళ్ళు అది గుర్తు పెట్టుకుంటే నా హృదయ ఘోష అర్థమవుతుంది. 🙂

   -మురళి

 5. ఎవరు మంచి పని చేసినా సమాజం మొత్తం బాగు పడిపోదు… ఎవరు చెడ్డ పని చేసినా సమాజం చెడిపోదు. మనవరకు జగ్రత్తగా వున్నామా అన్నదే ముఖ్యం. “బాగుపడే వాళ్ళని చెడగొట్టలేము.. చెడిపోయే వాడిని బాగుచెయ్యాలేము” దీని మీద నేను రాసిన పోస్ట్ చదవండి… పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదా? http://saradaa.blogspot.com/2010/04/blog-post.html

 6. విలువల వలువలు ఉతికి ఆరేసేందుకే, చివికిపోయినాక విసిరి పారేసేందుకే 🙂

 7. suresh says:

  నాకైతే ఈ పోస్ట్ లో వ్యంగ్యాహంకారం, స్త్రీఅహంకారం (Am i too confused ?) ఎక్కువగా కనిపిస్తున్నాయి…. 😦

 8. Wanderer says:

  వ్యంగ్యాస్త్రం బ్రహ్మాండంగా ఉంది. పేర్లని పేరడీ చేసే విద్యలో మీకు మీరే సాటి.

 9. Wanderer says:

  కొత్తపాళీ గారి మాటలు అక్షరసత్యాలు.

 10. kumar says:

  kushbu statements are not correct. andaru tana laga vundaru gaaaaaaa

  • Murali says:

   Kumar,

   This is not about whether Khushbu’s statements are correct or not. This is about freedom of expression.

   Khushbu expressed her opinion. If you don’t like it, ignore it or find a forum to air your disagreement. Filing so many PILs against her is just a different form of harassment. That means, you just want to shut her down and make her think many times before she speaks her mind again. That’s how a theocracy functions, not a free society. (Remember the Taliban who used to kill women simply because they wore lipstick?)

   When there are so many other ills plaguing our society, that have a more direct impact on our well-being, Indians seem to ignore them blissfully but somehow will react violently for anything that involves chastity, (or virgnity for women), making organizations and individuals rush out with daggers in their hands.

   Khushboo was well within her rights to say what she said.

   Regards.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s