పేరులో ఏముంది పెన్నిధి?


రవికిరణ్ గాడు నాకు మార్కెట్‌లో ఎదురయ్యాడు.

“ఒరే రవికిరణ్, దాదాపు ఐదేళ్ళయ్యిందిరా నిన్ను చూసి. నీ పెళ్ళి కాగానే ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోయావు. మళ్ళీ ఈ ఊరిలోనే వచ్చిందా పోస్టింగ్?” ఆనందంగా అడిగాను నేను. రవికిరణ్ గాడు నా క్లాస్‌మేట్.

“అవున్రా, రెండు రోజులయ్యింది వచ్చి. నీకు ఫోన్ చేద్దామని అనుకుంటూనే ఉన్నా. ఇంతలో నువ్వే కలిశావు,” అన్నాడు వాడు కూడా అంతే ఆనందంగా.

“నాన్నా!” అంటూ ఒక చిన్న శాల్తీ వచ్చింది అక్కడికి. నాలుగేళ్ళు ఉంటాయి వాడికి.

“మీ అబ్బాయా?” అడిగాను వాడిని.

“అవున్రా! నిర్ఘాంత్, అంకుల్‌కి నమస్తే చెప్పు నాన్నా!” అన్నాడు వాడు.

“మీ బాబుని ఏమని పిలిచావు?” పేరు నాకు సరిగ్గా వినపడలేదేమో అని అడిగాను వాడిని.

‘నిర్ఘాంత్.”

నిర్ఘాంత పోయాను నేను. “అదేం పేరు రా?”

“ఇప్పుడు ఇదే ట్రెండ్ బాబాయి. ప్రతి ఒక్కరు తమ పిల్లలకి ఎవరికి లేని పేర్లు, అనగా unique names పెట్టాలి అనుకుంటున్నారు. లక్కీగా మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరూ ఈ పేరు పెట్టలేదు. అందుకే నేను టక్కున పెట్టేశా!”

“నిజమా? ఇప్పుడు అందరూ తమ పిల్లలకి ఇలాంటి పేర్లే పెడుతున్నారా?”

“అవున్రా! నువ్వు బహుశా గమనించలేదనుకుంటా. లేకుంటే తెలిసేది నీకు, అందరు తల్లి తండ్రులు తమ పిల్లలకి ప్రత్యేకమైన పేర్లు పెట్టాలని చాలా పట్టుదలగా ఉన్నారు. ఒక్క సారి కళ్ళు తెరిచి లోకాన్ని గమనించు. అలా అని చెవులు మూసుకోవద్దు. అవి కూడా తెరిచే ఉంచు,” అని ఒక ఉచిత సలహా పడేసి వాడి దారిన వాడు పోయాడు.

***

రవికిరణ్ గాడు చెప్పింది అక్షర సత్యమని నాకు తెలిసొచ్చింది. ఎటు చూసినా నాకు నవీన నామాలు (అదేనండి, modern names) కనిపించాయి.

మా కజిన్ శ్రీనివాస్ ఫోన్ చేసి, “ఒరేయి, నాకో సలహా కావాలి,” అన్నాడు. నా ఛాతీ ఒక రెండు అంగుళాలు విస్తరించింది. సాధారణంగా నాకు సలహాలు చెప్పే వారే కాని, నన్ను అడిగిన వాళ్ళు లేరు ఇప్పటి దాక.

“చెప్పరా ఏం కావాలో, నేను కొంచెం బిజీ అనుకో, ఐనా ఫర్లేదు. నీ కోసం ఆ పని పోస్ట్‌పోన్ చేసుకుంటాలే,” అన్నాను. ఇంతకీ నేను చేయబోతున్న ఆ పని టీవీ 999 చానెల్‌లో రాబోతున్న “క్షణం క్షణం సంచలనం” కార్యక్రమం చూడ్డమే.

“నెక్స్ట్ మంత్ మాకు అమ్మాయి పుట్టబోతూంది అని తెలుసు కద? రెండు పేర్లు సెలెక్ట్ చేశాం కానీ వాటిలో ఏది పెట్టాలో తెలీడం లేదు.”

“ఏంటా పేర్లు?”

“మొదటిది యద్భవిష్య, రెండోది యాద్రుఛ్ఛిక.”

“నాకు రెండూ సరిగ్గా అర్థం కాలేదు. ఐనా, నీకు ఇలాంటి బరువైన సంస్కృతం పేర్ల మీద ఎప్పటి నుంచి ఇంటరెస్టురా?” అడిగాను వాడిని.

“సంస్కృతం కాదు ఇక్కడ పాయింట్, కొత్తదనం అసలు పాయింట్,” అన్నాడు వాడు.

“ఏమోరా, నాకు రెండు పేర్లూ పెద్దగా నచ్చలేదు.”

“నచ్చడం పక్కన పెట్టు. ఈ పేర్లు ఎప్పుడైనా వినావా?” కొంచెం టెన్షన్‌గా అడిగాడు వాడు.

“లేదు, విన లేదు. ఆ యద్భవిష్య పేరు ఐతే అస్సలు వినలేదు!”

“అదే నాకు కావల్సింది. ఎవరు ఇప్పటి దాకా విని ఉండని పేరు. సరే అలా ఐతే యద్భవిష్య పేరే ఫిక్స్ చేసేస్తాను. చాలా థాంక్సురా నీ సలహాకి,” అని ఫోన్ పెట్టేశాడు వాడు.

నేను వాడికి ఏం సలహా చెప్పానో నాకు అర్థం కాలేదు. కానీ ఫైనల్‌గా ఎవరికో ఒకరికి సలహా చెప్పాను అని కాస్త ఆనంద పడ్డాను.

***

మా కొలీగ్ శంకర్రావు గాడు పిలిచాడని ఆదివారం, వాడింటికి బయలుదేరాను నేను. ఏదో ఆఫీసుకి సంబంధించిన పని ఉంది, నా హెల్ప్ కావాలి అని నన్ను రమ్మన్నాడు. ఐనా శంకర్రావు ఆదివారాలు పని చేస్తున్నాడంటే ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే వాడు మాములు రోజుల్లో ఎప్పుడు ఆఫీసులో కనిపించిన పాపాన పోలేదు.

నేను వాడి ఇంట్లో అడుగు పెట్టగానే, శంకర్రావు చాలా ఉత్సాహంగా నన్ను ఆహ్వానించాడు. “రారా, ఈ రోజు మా ఇంట్లోనే నీ లంచ్, డిన్నర్ కూడా. బోలెడు ఫైల్స్ ఉన్నాయి,” అంటూ నన్ను కూర్చోమని సైగ చేశాడు.

“ఏరా, కాఫీ/టీ, ఏమన్నా తాగుతావా?” అడిగాడు వాడు నేను కూర్చోగానే. “అవేం వద్దురా, కొంచెం మంచి నీళ్ళు ఇప్పించు చాలు,” అన్నాను నేను. “బాబూ, అంకుల్‌కి కాస్త మంచినీళ్ళు తీసుకురా!” వెనక్కి తిరిగి ఒక్క అరుపు అరిచాడు వాడు.

ఒక ఐదేళ్ళ బాబు పెద్ద గ్లాస్‌నిండా నీళ్ళు తీసుకుని వచ్చాడు. వాడి దగ్గర్నుంచి గ్లాస్ తీసుకుంటూ, “నీ పేరేంటి, బాబూ?” అడిగాను నేను. “గ్రనోదల్,” అన్నాడు వాడు.

నాకర్థం కాలేదు. శంకర్రావు గాడి వైపు ప్రశ్నార్థకంగా చూశాను. “వాడికి ఇంకా కొన్ని మాటలు సరిగ్గా పలకవురా!” అన్నాడు వాడు.

“మంచిదేగా! ఐతే, మన త్రిలింగ సినిమాల్లో హీరో అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్న మాట. ఇంతకీ వాడి పేరేంటి?” మళ్ళీ అడిగాను నేను.

“ఘనోధర్,” చెప్పాడు వాడు.

“ఘనోధరా? అది ఒక రాక్షసుడి పేరు కదూ?” ఆశ్చర్యపోయాను నేను.

“ఎలా తెలుసు? నీ ఫ్రెండ్స్‌లో కానీ చుట్టాల్లో కానీ ఎవరైనా తమ పిల్లలకి ఈ పేరు పెట్టారా?” ఆందోళనగా అడిగాడు వాడు.

“లేదురా. మా తాతయ్య చిన్నప్పుడు బలవంతంగా కూర్చోపెట్టి మరీ పురాణాలు చెప్పే వాడు. అలా విన్నట్టు గుర్తు,” అన్నాను నేను.

“హమ్మయ్య, రక్షించావు! ఇంకా ఎవరన్నా ఈ పేరు పెట్టుకున్నారేమో, మా వాడి ప్రత్యేకత ఎక్కడ పోతుందో అని ఖంగారు పడ్డాను,” కాస్త రిలాక్స్ అవుతూ అన్నాడు వాడు.

“అంతే కానీ, మీ అబ్బాయి పేరు ఒక రాక్షసుడి పేరు అని బాధ కలగట్లేదా?” తల బరుక్కున్నాను నేను.

“ఆ! దానికి బాధెందుకురా! చాలా మంది తల్లి తండ్రులకే వాళ్ళ పిల్లల పేర్ల అర్థాలు తెలీవు. మా వాడి పేరు ఇలాంటిది అని ఎందరికి తెలుస్తుంది? ఇంకా ఎవరన్నా ఆల్‌రెడీ పెట్టేశారేమో అని కాస్త ఖంగారు పడ్డాను,” నవ్వుతూ అన్నాడు వాడు.

***.

హోటల్ “పరపాకం”లో టిఫిన్ చేస్తున్నాను నేను. నా ప్రమేయం లేకుండానే నాకు నా పక్క టేబుల్ వద్ద ఉన్న ఇద్దరి మాటలు వినవచ్చాయి.

“మీ అమ్మాయి పేరు ఏంట్రా?” అడుగుతున్నాడు మొదటి వాడు.

“ఆపాద,” చెప్పాడు రెండో వాడు.

“అపాదా? అదేం పేరు రా?” ఆశ్చర్యపోయాడు మొదటి వాడు.

“అంటే బహుమతి అని ఒక అర్థంలే. మీ బాబు పేరేంటి?”

“మస్తక్!”

“మస్తకా? అదేం పేరు రా?” ఈ సారి రెండోవాడు ఆశ్చర్యపోయాడు.

“అంటే శిఖరం అని ఒక అర్థంలే,” వివరించాడు మొదటి వాడు.

తింటున్న టిఫిన్ వెగటుగా అనిపించి లేచి నిలబడ్డాను నేను. , బిల్‌కి డబ్బులు టేబుల్ మీద వదిలేసి, ఆ ఇద్దరినీ ఆపాదమస్తకం ఒక సారి చూసి అక్కడినుంచి బయట పడ్డాను.

***

ఇంటికి రాగానే ఫ్యాన్ వేసి దాని కిందే కూలబడ్డాను నేను. “ఎండలు మండిపోతున్నాయి కదండి?” అంటూ వచ్చి చల్లని మజ్జిగ నాకందించింది మా ఆవిడ.

“నాకు తెలిసి నా చిన్నప్పటినుంచి ఎండలు మండిపోతూనే ఉన్నాయి. చల్లగా ఉన్నట్టు నాకెప్పుడూ గుర్తు లేదు,” గ్లాస్ అందుకుంటూ అన్నాను నేను.

“ఈ సెటైర్లంటేనే నాకు చిరాకు. అన్నట్టు, ఇంతకు ముందే మన పక్కింటి పార్వతి పాప బారసాలకి వెళ్ళి వస్తున్నానండి,” చెప్పింది మా ఆవిడ.

“పేరేం పెట్టారు?” అని అడుగుతూనే నేను నాలుక కరుచుకున్నాను.

“ఎప్పుడూ ఎవరూ పెట్టుకోని పేరు, ఎవరూ కని విని ఎరగని పేరు పెట్టాలని చాల రోజులు ఆలోచించి పాపకి నిర్లజ్జ అని నామకరణం చేశారండి,” బదులిచ్చింది మా ఆవిడ.

దబ్‌మన శబ్దంతో నేను స్పృహ తప్పి పడిపోయానని ఆ తరువాత మొహాన నీళ్ళు కొట్టి లేపిన మా ఆవిడ చెప్పింది,

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

64 Responses to పేరులో ఏముంది పెన్నిధి?

 1. Padma. says:

  ROFLOL! Again, you did it tetageeti garu. Many good writers fail before you. Coming to the topic, my brother’s friend named his son as Vishnu Soodan Rao.My brother astonished and asked his friend, does he know the meaning of Vishnu Soodana Rao? His friend proudly and authentically declared that it is the replica of Madhu soodana Rao. My brother, who is a great worshipper of Lord Vishnu explained him Madhu soodana means the one that killed Rakshasa Madhu, meaning soodana implying killer. Hence Madhusoodana=killer of Monster/rakshasa Madhu, meaning Lort Vishnu. My brother further explained his friend that Vishnu soodana means killer of Maha Vishnu. Ithi pradhamodhyayaha.
  Second episode, my husband’s friend approached a highly literate national award winning Oria writer who happens to be our contemporary’s mother, to suggest a unique name for his new born son in mid 80s implying a meaning of ‘dear son’ ( priyamaina tanayudu). The communication medium was English and he asked what is the right word for ‘dear’? She suggested ‘ Hiran’ ( she thought it was Deer) and further aked her what is the best word for ‘Son” and she with her excellence in Sankrit, suggested ‘ Aaditya’ thiking that ‘Sun” ( soorya). My husband’s son named him Aditya Hiran and till 2008 he was under the impression that Aditya Hiran means ‘son, my dear ( priyamaina koduku). Iti: dwiteedyoyah:

  Bhavadeeyuraalu.
  Aprastuta adhika prasangini.( ilaa peru maarchukundaamani anukuntunnaa.. mimmalni gabharaagaa salahaa korutunnaa.. before some one steals this name.. tondaraga cheppandi.
  You can feel happy that someone else is asking for suggestion(which is free). We want your cell number, office number, home number, all kinds of emails so that we can take free suggestions all the time.

 2. Murali says:

  Padma gaaru,

  Great examples! They emphasize the theme of this post very well. 🙂 Especially the example of Vishnu Soodhana Rao is top-notch.

  -Murali

 3. రవి says:

  కేకో కేక! మా పాప పుట్టినప్పుడు నేను సుబ్బలక్ష్మి, కీర్తన, శిరీష ఇవన్నీ సజెస్టు చేస్తే మా ఆవిడకు నచ్చలేదు. అయితే ప్రమాదం గట్టెక్కించాన్లెండి.

  ఇదో క్రియేటివ్ ఫీల్డు. నా వంతుగా ఓ నాలుగు పేర్లు..పురీష్, దేభ్య, మలామి, వంచక్

 4. Malakpet Rowdy says:

  LOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOl :))

  LOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOL :))

  One LOL aint sufficient!

  Padmagaru … mee story ki kooda LOOOOOL …

  and a small LOL for your typo “My husband’s son named him”

  • padmarpus says:

   TYPO…
   Thanks for informing the type ..

   ledandee.. maa abbayiki Apparao ane peru pettesaamu.. vizag nunchi lendi memu. nootiki tombhay mandi mari apparavule akkada.

 5. JYOTHI REDDY says:

  Chaalaaa Bagundhi Muraliji……

 6. సుజాత says:

  అబ్బబ్బ, రవి గారూ, ఆ ఏం పేర్లండీ బాబూ! మీ సృజనాత్మకత ఎవరికో ఒకరికి నచ్చే తీరుతుంది.

  నా ఫ్రెండ్స్ సర్కిల్లో వీళ్ళున్నారు….

  ఆష్క,న్యాస,సాన్వి(సాన్వి అంటే గాడెస్ లక్ష్మి అట),యదూష(అంటే సాయంకాలపు ఆకాశం ఎరుపు అట),శ్రీక,క్షితిజ్,స్వయం,మహిష్,విమోల్,హనుష్,కుశాగ్ర్, ..!ఇంకా కొన్ని గుర్తు రావడం లేదు.

  పద్మ,

  విష్ణుసూదన్……కేకండీ! !

  • రామ says:

   విరేచన్ అని ఒకళ్ళు పెట్టారు – విష్ణు సహస్రనామాలలో విన్నారుట. దిరేన్ అని ఒక పేరు చెప్పారు ఒకళ్ళు. నియంత్ అని ఒకళ్ళు పెట్టేసారు కూడా.

 7. sowmya says:

  హ హ హ బాబోయ్ కేక పెట్టించారు.
  నేను చూసిన వాటిల్లో అతి విచిత్రమైన పేరు “అనామిక”. పేరు లేనిది అని పేరు పెట్టడమేమిటో నాకు అర్థం కాలేదు.
  నాకు తెలిసిన ముగ్గురు అక్కచెల్లెళ్ల పేర్లు “అనామిక, ఆకస్మిక, ఇతిశ్రీ”. వీటి అర్థాలు వాళ్లకి తెలుసో తెలియదో నాకు తెలీదు. “అ, ఆ, ఇ” అని రావాలని పెట్టిన పేర్లు. అనామిక, ఆకస్మిక పేర్లు చూసి నవ్వలేక చచ్చాననుకోండి. “ఇతి శ్రీ వశిష్ఠ ఉవాచ” అన్నదాన్లోనుండి ఇతిశ్రీ లేపినట్టున్నారు 😀

  విష్ణుసూధన మాత్రం అదిరిపోయింది 😛

  • Murali says:

   I am glad I wrote this post. లేకుంటే, ఇన్ని అద్భుతమైన ప్రత్యేకమైన పేర్లు తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. 🙂

   • sowmya says:

    మరే, మీ పిల్లలకి వీటిల్లో ఏవో ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి 😀

    ఒహో ఎవరికీ ఉన్న పేర్లు పెట్టకూడదు కదూ, అయితే మీ క్రీయేటివిటీ చూపించాల్సిందే, తప్పదు 😛

 8. అద్దరగొట్టేసారండీ మీ స్టైల్లో..
  అసలు మీరు సెలెక్ట్ చేసిన పేర్లు మామూలు కేక కాదు… నవ్వలేక చచ్చాను. 😀
  అప్పుడెప్పుడో నేనూ ఓ పోస్ట్ రాశాను. వీలైతే చూడండి.
  http://madhuravaani.blogspot.com/2009/08/blog-post_13.html

  • sowmya says:

   మీ పోస్ట్ బాగుందండీ, ఇంతకుముందే చూసాను. మళ్లీ ఇప్పుడు చూసి నవ్వుకున్నాను 🙂

   నేను కూడా త్వరగా ఇలాంటి కొత్తపేరు ఆలోచించి దాచిపెట్టేసుకోవాలి…సరికొత్తగా, అత్యంత విచిత్రంగా, వింతగా ఉండాలి. భవిష్యత్తులో పనికివస్తుంది కద. ఈ విషయంలో మురళి గారి సహాయం కూడా తీసుకోవాలి. వారి క్రియేటివిటీ స్టైలే వేరు 😛

   • sitaram says:

    సౌమ్య గారు,
    భూత రక్షతి, .. ఒక పేరు.. చాలా ఇంకా కావాలా?
    CEO,
    Innovativenames Inc.,
    No name street.

  • Murali says:

   Madhuravani gaaru,

   I read your post. Pretty humorous. Actually your post covers more aspects of this “naming” process than mine does. 🙂

   -Murali

 9. నావైపు నుంచి కూడా కొన్ని క్రియేటివ్ పేర్లు 😉
  జస్ట, త్రష్య, చాస్య, పౌర్మ, క్రధ్య, ప్రమాష్, ప్రరణ్, కర్పణ్, క్రిమిక్..

  • sowmya says:

   క్రిమిక్..ఈ పేరు నాకు నచ్చింది. క్రిమిసంహారి అనే అర్థంలో చెప్పుకోవచ్చు. అంటే చీడపురుగులు ఏరేవాడు అంటే భగవంతుడు…భలే అర్థాలొచేస్తున్నాయి బాబోయ్ 😛

 10. sunita says:

  హహహ!బాగుంది. మాకు తెలిసినొకావిడ ఈమధ్యనే మనవడు పుట్టాడని, నేను చూడకపోతే నా కళ్ళు పోతాయన్నంత బిల్డప్ తో పిల్లవాణ్ణి చూపించింది. ఏమి పేరు పెట్టారు అని అడిగాను ఆ ఐదురోజుల వాణ్ణి బుగ్గ మీద చిటికె వేస్తూ. “అనిష్కృతిన్ ” అని చెప్పింది. దెబ్బకు నోట మాట పడిపోయి మరలా గొణిగాను.పేరు అర్ధం కాలేదు అంటూ. కొత్త పేరని వాళ్ళ అమ్మా నాన్న నెట్లొ వెతికి మరీ పెట్టారని గొప్పగా చెప్పింది.దేవుడా! నాకు నిష్కృతి లేదా? అనుకున్నాను.

  @ పద్మ–విష్ణు సూదన్ సూపర్!

 11. krishnapriya says:

  చాలా రోజులకి పడీ పడీ నవ్వాను…

  మా ఇంటి పక్క పిల్ల పేరు గర్భిత,
  ఇంకో పాప పేరు స్వస్తి

  మా చుట్టాలబ్బాయి.. ఒకతను.. అస్రవి అని పెట్టారు పేరు.

  అది వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మొదటి అక్షరాలతో కూడినదట

  అ : అనిత పేరు లోంచి
  స్ : శ్రీనివాస్ నుండి
  ర : రామానుజం నుండి
  వి : విజయ నుండి..

 12. krishnapriya says:

  ఇంకోటి మర్చిపోయాను.

  ప్రాణనాథ్

 13. సుజాత says:

  మధురవాణీ,
  మీరు చెప్పిన పేర్లు పిలవడం కంటే ఏ ఋగ్వేదమో, యజుర్వేదమో తప్పులేకుండా ఏకిబిగిన చదవడం ఈజీ కదూ!

 14. suresh says:

  @padma

  విష్ణు సూదన రావు పేరు బాగుంది….ఈ సారి నా ఫ్రెనెమీ ఎవదైనా సలహా అదిగితే, ఇదే చెప్తాను 🙂

 15. vijaya kranthi says:

  నా రాళ్ళు ఇక్కడ :

  ధరిత్రి ( అరవ వాడితే త బదులు ద కూడా వాడొచ్చు 🙂 ).
  చెత్రి(గొడుగులా నీడనిచ్చే వారు.అజ్ఞానాంధకారం చేత తెలుసుకోలేము మనలాంటివారు )
  సుసంకర ( శంకర కు వచ్చే గొడవ ఇది )
  విముక్తి ( మనకు )
  ఇంకా చాల వున్నాయి …. 😦
  🙂

 16. virochana says:

  Promise. Naa peru enchakka VIROCHANA. 1983 born. Naa peru valla sambandhaalu raavadamledu. Tasmaat jaagratta.
  VIROCHANA, Eluru.

 17. Ganesha says:

  మలబద్ధాక్ విరోచన పేరు నచ్చి పెళ్లి చేసుకుందుకు రెడీ గా వున్నాడు. విరోచన అనే పేరు ఒక ప్రముఖ వ్యక్తి పోస్టింగ్. అది సీతారాం ది కాదు.

 18. AJEERTHI says:

  Hi Viro,
  Don`t worry. I am AJEERTHI, 1981 born. Looks like we are made for each other. My dad is anxious to get in touch with your dad.
  Proddutur, India.

 19. KK says:

  మురళి గారూ, ఎప్పటిలాగే అదిరేటి బ్లాగు మీర్రాసారు.

  “విరోచన” అన్నది విష్ణుసహస్రనామం లోని పేరు. అజీర్తిగారూ, మీరు వెతుక్కోవల్సింది “విరేచన”ని. “విరోచన”ని కాదు.

 20. మేధ says:

  నావి ఓ నాలుగు..
  సాన్వి (పైన సుజాత గారు కూడా చెప్పారనుకుంటా)– దీనికి రష్యాలో Knowledge అని అర్ధమట!

  విరహిత్
  అలేఖిత
  చర్చిత

 21. prasad says:

  Bagundandi
  Emadya chala names vinnattugane vuntayi kani oka letter different ga vuntadi

  a madya edo cinema lo choosinattu

  3 ammayila perlu Shubra , Parishubra,Aparishubra

  Padama gari sudana rao keka

 22. Nisapathi says:

  Congratulations.Your skit is very good.This reminded me of one of my stories written long back, though the context is different.
  Meerannatlu perlu vilakshanamga ga kanipinchalane unmadam rojurojuki mudurutondi.
  Good satire.Congrats again.
  Nisapathi
  (M.H.V.Subbarao)
  Rtd Chief Engineer
  Secy,Andhra padyakavitha sadassu
  Editor, SahithiKoumudi

  • రామ says:

   అయ్యా.. తెలుగు లో వ్రాసాను అంటున్నారు.. మీకు చెప్పేంత వాడిని కాదు కాని – కంప్యూటర్ లో తెలుగు వ్రాయాలంటే ఒక సాధనం ఇక్కడ ఉంది – ముత్యాల లాంటి అక్షరాలలో వ్రాయండి ఈ సారి: http://www.google.com/transliterate/indic/telugu

 23. tara says:

  kani vini erugani perlu telisayi ee post dwara. Kevvu, Keka… perlu anukuneru

 24. lakshmi madhav says:

  మీ పెరులో ఏముంది చదివి నవ్వలేక చచ్చాను. నెను ఇదివరలో వ్రాసిన నామావళి అన్న కధ జ్ఞాపకం వచ్చ్చింది.మా అమ్మయి పుట్టినప్పుడు మా పక్కింటావిడ ఓ కొత్త పేరు సజెస్ట్ చేస్తానని స్రుంఖల అని పెట్టమంది. అది నచ్చక పోతే విస్రుంఖల అని కూడ పెట్టవచ్చని ఉచిత సలహా పారేసింది.ఇక పొడిగిస్తే ఉచిత్ అని అధిఖప్రసంగ్ అనో కూడా చెప్తుందని ముక్తాయింప్ అని పెడ్తున్నానని చెప్పాను .

 25. lata says:

  Hi everybody ,

  Peraabhimanulandariki naa pera O vandanam.

  I really enjoyed all the postings .

  “Yevaroo pettakapothe kotha perlu ekkadinundi vasthyi mari ?!? ” ( dialogue komcham marinaa .. copy right naade )

  Mee creativity ki mechhi meka tholu kappuda manukunnanu gaanee nenu Vegetarian avadam valla andarikee thaloka “veera thadu ‘ vesthunnanu.
  Ante yemitani adige vallaki – cheppina ardham kadu kabatti
  cheppadam ledu.

  Perla dictionary ki Yee madhya ne naa friend dwara vinna mari konni add chesthunnanu.. Bhayapadakunda vinamdi. Thasmat jagratha !!!

  1. Hrullekha 2. Opush 3. Arany

  Yevarikaina meeku thelsina vallaki twins putti mee salaha adgithe …you can suggest the names mentioned below:

  Apeksha – Upeksha ( if they are baby girls)

  abbayi laitheno ? ani meelo yevaroo adagarani mee thelivi thetala meeda naaku nammaka mundi lendi …

  Naaku ardhamayyindi baaboi….

  Apeksh – Upeksh ani meeru kanipetteserani

  Hats off to every body

  • sowmya says:

   అపేక్ష-ఉపేక్ష….కేక్ బాబోయ్, మీకు పేర్ల మీద ఉన్న ఆపేక్షని నేను ఉపేక్షించలేను 🙂

 26. G.V.Subrahmanyam says:

  Some more names.
  1.Ajeerth
  2.prakampan
  3.Twins- Pratishta, Apratishta
  4.manush- Amaanush
  5.Subudhi-Durbuddhi
  6.Aalapan-Prelaapan
  7.Adrusht-Duradrusht
  8.Aakaar-Vikaar
  9.Avasth
  10.Prastuth-Aprastuth
  11.Prakruth-Vikruth
  12.Maanav-Daanav
  13.Nireekkshan
  14.Sphuradroop
  15.Panchabhooth, Rest later!!!

 27. Dr. Acharya Phaneendra says:

  మా అమ్మాయి క్లాస్మేట్ పేరు ” విజిత “… అంటే ” ఓడింపబడినది ” అని అర్థం.
  ఇది సత్యప్రమాణంగా సత్యం. కించిత్తు కూడా అబద్ధం కాదు.

 28. Murali says:

  The response to this post has been amazing. Not because of the number of comments, but because of the way everybody has contributed in their own way. It’s as if the post is extending itself without any action on my part. 🙂

  • lata says:

   It’s true Murali garu ..

   Manishannaka kasintha kalaposhana tho patu perla poshana kooda undalani janaalu prove chesthunnaru..I’m happy!

   While typing this mail itself – without my intention – meeru kanipettero ledo ” Poshana ” anna kotha peru vachesimdi.

   Poshan/Poshana , Uposhana , Auposhana

   Baboi, nenu aasu ” ritari” ni (femela gender of writer) ayipoyetatlu unna nemiti ?!?

   I wish the postings not only make a half century – but should make a Century. ( Gavaskar la slow ga aadina century cheyyalannadi naa abhimatham annamata.. choosera ..chosera ..inko kotha peru ” Abhimath ” ) pch! Collor ledu yegaresu kundamante)

   Ippude andina vaartha … Breaking News…

   Govt.Hospitals lo Suicide chesukundamani mandu , maaku mingina vallaki stomach wash easy ga cheyyalante – gotaalu gatra akkarlekunda – Murali gari Blog loni perlu vinipisthe kadupolo thippesi – vikaram dani anthata ade thannukochi – stomach clean ayipoyi – emchakka lechi velli potharata – Janma lo malli suicide alochana chesthe ee perla meeda ottu antunnaru !!!

   Lata

 29. స్నేహ says:

  నేను ఈమధ్య విన్న కొన్ని విచిత్రమైన పేర్లు
  చాక్రిక,షారూజ,నోషన,తక్షకన్, కుశల్. ఈ పేర్లుకు గల అర్థాలేంటో మరి నాకు తెలీదు. ఇంకా సాన్వి అన్న పేరు గల అమ్మాయిని ఇంట్లో సాన, సాను అని పిలుస్తుంటే వినడానికి విచిత్రంగా అనిపిస్తుంది.

  • Wanderer says:

   స్నేహ గారు, సాన్వి ని సాన సాను అని పిలిస్తే పర్వాలేదు, భరించగలం. “సానీ” అని పిలిచేవారిని కూడా చూసాను నేను.

 30. surya says:

  అశుద్ధ, అసహ్య, భ్రష్ట, ఉచ్చిష్ట, వమన, విసర్జన్, వికార్ ..

 31. kalidasu says:

  my daughter name is “yuktha” meaning young / lakshmi devi

 32. RAM says:

  ha ha ha manchi pointe chepparu jagratta padataniki

  hayya baboi i perlu vintomte kadupu pagilipotomdi…. kaani ekmduko ippati pata perlu janaki, tulasi, dasaradhi, ramana ilamtivi vinnappudu pilichinappudu vunde hayi i kotta perlato vachi chavadu…. i kotta verity perlu pillalu chinnappudu, komche perige varaku bane vuntayi gaani, vallu mid 30, taruvata ebbettuga anipistayemo pilvataniki, pilipimchukovataniki koodaa…. kaani ikkado vishayam emitamte, peddavalla perla mojulo 25/30 yella taruvata ibbamdi padedi pillale

  mee blog bagunnadi, comments bahu bagunnavi 😉 ilamtivi meenumchi inka asistooo

 33. Chala Bavundi Murali garu.

 34. tanmayi says:

  my friend named her daughter “ipsa” meaning “wish”, my brother guessed that if she gets her second child, her name might be “jugupsa”.. lol

 35. Rangaswamy says:

  These are great stories and very well put in Telugu.
  Telugu itself is very sweat, and the way these stories are put are outstanding. This is the first time i came to this website and Really enjoyed.

  Wish to listen many more nice stories from this website.

  with bestwishes.
  Iyyengar.

 36. sandy says:

  నేను ఆఫీసు లో ఇది చదివి ఎవరికీ వినిపించకుండా పొట్ట పగిలేలా నవ్వుకుంటుంటే … ఎలాగో మా కొలీగ్ విని నేను ఏడుస్తున్ననేమో అనుకుని ఆవిడ నాకు నాప్కిన్ ఇవ్వబొయింది … హహహ

 37. Ramana Rao says:

  oka prakka, bhasha parigyanam leka, kotta taraha vinta perulu sristinche vaaru unte, maro prakka, desa pranta paristithulu artham chesuko kunda, perulu pette vaaru kooda unnaru. udaharana ki:
  Aryaman (americans ‘are ya a man?’ ani palukutaaru)
  Aryan (americans ki ee jaati varante maha chedda chiraaku)
  Stalin, Lenin etc (ammo! communistulu)
  I-shit-a, Har-shit-a, Go-pi, As-u-tosh, etc

 38. Sai Praveen says:

  సూపరో సూపరు. మీ పోస్ట్ తో పాటు అందరి వ్యాఖ్యలు కూడా చాలా నవ్వించాయి.
  ఇది చదివి నాకు చాలా సంవత్సరాల క్రితం ఇదే టాపిక్ మీద ఈనాడు లో చూసిన కార్టూన్ గుర్తొచ్చింది.
  ఒక వ్యక్తి తన స్నేహితుడితో అంటాడు “ఎంత వెరైటీ కోసం అయితే మాత్రం, నీ కూతురికి ‘బుచికి’ అని పేరు పెట్టడం నాకు ఏమి నచ్చలేదు రా”

 39. చాలా వినూత్నమైన పేర్లున్నాయే ఇక్కడ…’కొత్తొక వింత’ని మీ శైలిలో భలే రాశారు….

 40. hi this is s.v.achuta rao

  vilakshanam!

 41. chandu t says:

  hi i am searching meaning for a word ‘tetageeti’.if u know please forward to my mail.

 42. బాబోయ్ నవ్వలేక ఛస్తున్నా మహప్రభో ..

 43. Jitu says:

  ROFL…

  I have no words to say. This was supercalifragilisticexpialidocious!

  Nenu ilaage “unique ga undaali ani… maa ammai ki Tanvi ani peru pettukunaanu. Appati Varku… oka Tanvi Azmi (actress) tappa ekkada aa peru vinaledu… so rare ga undi kadaa… ani pettemu. Baarsala tarvaatha maa colony lo inko naluguru Tanvilu unnaaru ani telisindi. Anndulo iddaru waala paapaki Perlu maarcheseru. Maaku peru maarchaalani leka… illu maarchesemu. Next colony lo aiduguru Tanvilu unnaaru. Aa Tarvatha school lo o o dozen Tanvi lu.

  E he! India lo intha mandi Tanvilu unnaaru… US oste… ikaada ee peru rare ga untundi anukunaanu.

  Ikkada just o ara-dozen Tanvi le unnaaru. Sare ani ika sadduku poyamu.

 44. Zilebi says:

  నా తరపున కూడా రెండు పేర్లు రాసేసు కోండి !!

  జిలేబి
  జాంగ్రీ
  రాస్మలాయ్
  మిష్టీ దోయ్

  చీర్స్
  జిలేబి

  • Jitu says:

   Zilebi gaaru,

   Ee perlu panikiraavu. Eevi already janaalu vaaduthunna perle kadaa… Manshulu ki kaakapena… Mithaayilu ki. Perulu… eppudu evaru vini eraganivi unndaali.

   😀 😀

 45. Jyoti says:

  Muraligaaru,

  Unique peru pedtaarani anndaru ilaa vekrichutunnaaru. Anndariki unna pere pedte yenviti avutundo… cheptaanu.

  Chinnappudu, naa class lo inko mugguru Jyotilu unde vaaru. Maa perlu… B. Jyoti, I. Jyoti, M. Jyoti, C.M.P. Jyoti.

  Maa di o chinna ooru. So naa majority classmates’ parents… doubled up as colleagues. So naa tho ade grade lo, vere section lo maa amma colleague abbaiy chadivevaadu. Waadu evaro naaku teleedu, nenu evaro.. waadiki teleedu. Maaku telee kunda maa ammaki aa aunty ki unsaid competition undedi.

  O saari term end exams tarvaatha.. o roju amma office ninchi intiki ochi.. nannu chitaka baadindi. Enduko naaku teleedu. Adigite kopam thattukoleka… yenvi cheppadu. Mottaniki baaga dabbalu thinnaanu. Tarvaatha amma kopam taggeka… “nuvvu parikshalo fail ayevu. Ayinattu naaku cheppaledu. Maa colleague office lo anndara mundu nannu vekrinchindi. Nee valla nenu navvulupaalu ayenu”, ani cheppindi. “Amma nenu fail avaledu. Maaku inka papers ivvaledu” ante nammadu. Malli abadhamaaduthunaanu ani kooda kottindi.

  Mottaniki… neeku evaru chepperu ani adigenu. Ayithe falaana aunty cheppindi. Aa aunty abbaiy nee class lone unnadu ata. waadu cheppedu. Jyoti fail ayindi ani. … ani cheppendi.

  Rendo roju nenu school lo aa rendo section ki velli, aa abbaiy evaro kannukoni, waadi class peekenu. “Yenvi raa, nenu neeku asalu telusaa? Nenu fail ayenu ani cheppevaadu nuvvu evaru ani.” Waadiki kooda vishayam ardham kaa ledu. “I am sorry. I don’t know you. ” ani annaadu.

  Mottaniki ki kadha yenviti ante…. waadi section lo unna inko Jyoti fail ayindi. Maatallo… waadu, maa class lo Jyoti fail ayindi ani cheppedu. Aa maata pattukoni waalaa amma maa ammani vekrinchindi. Adi back story.

  Evaro fail ayithe, nenu dabbalu thinnaanu endukante… we both had the same name. :-/

  So… moral of the story… ‘kids should have unique names’. 😀

 46. బాలంత్రపు వెంకట రమణ says:

  అబ్బా, అందరూ కలిపి చంపారు కదండీ – నవ్వలేక కడుపు నొప్పి వచ్చింది.
  మొదలుపెట్టిన తేటగీతి గారూ, మొదటి స్పందించిన చెల్లి పద్మ గారూ (ఏవిటీ విష్ణు సూధనా! అయ్యో …), మిగతా అందరూ ఎవరికీ వారె – అద్భుతం.
  లాలూ ప్రసాద్ గారి శ్రీమతి గారి పేరు రబ్రీ దేవి (వాళ్ళు రబ్డీదేవి అంటారట) ; వారి అమ్మాయి ఎమర్జెన్సీ విధించినప్పుడు పుట్టిందిట – మీసా (MISA) అనో ఎస్మా (ESMA) అనో అని నామకరణం చేసారు – అని చదివినగుర్టు.

 47. Muralidhar Lanka says:

  Very hilarious Murali Garu.

  Padma garu, Vishnu Soodan was top notch!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s