ఓదార్పు యాత్ర

“ఏరు దాటాక తెప్ప తగల బెట్టినట్టు, ఏరు దాటాక తెప్ప తగల బెట్టినట్టు,” అని వల్లె వేస్తున్న చుట్టాలబ్బాయిని, “నీకు ఆ సామెత తప్ప ఇంకేం దొరక లేదా?” అంటూ కసురుకున్నాడు వై.నో. గగన్. ఆ కుర్రవాడు బిక్క మొహం వేసుకుని అక్కడినుంచి నిష్క్రమించాడు.

“ఆ కుర్రాణ్ణి కోప్పడి ప్రయోజనం ఏముంది, ఇప్పుడు మనం నిరూపించాల్సింది, ఇంకా చాలా ఏరులు ఉన్నాయని మన తెప్ప ఇంకా పనికొస్తుందని,” అన్నాడు అక్కడే ఉన్న గగన్ ముఖ్య అనుచరుడు సోంబాబు.

“నిజమే, దానికి నేను ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను,” సాలోచనగా అన్నాడు గగన్.

“ఏంటన్నా అది?” అడిగాడు సోంబాబు.

“తెలుసు కద, నాన్నగారు పోయినప్పుడు ఎంతో మంది ఆత్మ హత్యలు చేసుకున్నారని, కొందరు గుండెపోటు లాంటివి వచ్చి మరణించారని?”

“తెలీకపోవడమేంటన్నా! అసలు ఆ లెక్ఖలు అంతా సేకరించింది మన యువసేనే కద!”

“నాన్నగారి దివంగత అభిమానులు మన రాష్ట్రం నలు మూలలా ఉన్నారు కాబట్టి, వాళ్ళందరిని జమిలిగా ఓదార్చడానికి నేను రాష్ట్రమంతటా ఓదార్పు యాత్ర మీద వెళ్తాను. నన్ను కలుసుకోవడానికి వచ్చే జన వాహినిని చూసి మన అధిస్టానం దిగి వస్తుంది. రాకపోతే వేరు కుంపటి ఉండనే ఉంది,” వివరించాడు గగన్.

“ఆహా ఏం బుర్రన్నా నీది, ఇలా చేస్తే ఇందులో రాజకీయం ఏం లేదు అని వాదించొచ్చు. ఇంకో వైపు మన వెనక నిజంగా ఎంతమంది ఉన్నారో కూడా తెలుస్తుంది,” మురిసిపోయాడు సోంబాబు.

“సరే లే. ఆ ఓదార్పు యాత్ర ఏర్పాట్లేవో చూడు,” పురమాయించాడు గగన్.

***

అసలే అనేక రకాల సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మోశయ్య ప్రభుత్వానికి ఈ ఓదార్పు యాత్ర పంటి కింద రాయిలా తయారయ్యింది.

“మేమైతే ఎవరినైనా ఓదార్చాలంటే, వాళ్ళను సైలెంట్‌గా కలిసి అంత కంటే సైలెంట్‌గా దుఖిస్తాం. ఇలా బాజాలు భజంత్రీలతో అట్టహాసంగా యాత్రకు బయలుదేరడం మేమెక్కడా చూడలేదమ్మ,” అంటూ బుగ్గలు నొక్కుకున్నాడు మోశయ్య అక్కసుగా. (ఆయనకు బుగ్గలు లేవనుకోండి. అదే స్థానంలో ఉన్న తన చప్పిడి దవడలను నొక్కుకున్నాడన్న మాట.)

ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన మామూలుగా చేసేదే ఈ సారి కూడా చేశాడు. అర్జెంటుగా ఢిల్లీ అమ్మకు మొర పెట్టుకున్నాడు.

ఢిల్లీ అమ్మ గగన్‌కి నచ్చ చెప్పింది. అప్పటికి విన్నట్టు ఊరుకున్నా, మళ్ళీ ఓదార్పు యాత్రకు వెళ్తాను అంటూ మారాం చేయ్యడం మొదలు పెట్టాడు గగన్.

ఢిల్లీ అమ్మకు గగన్ ధోరణి బొత్తిగా నచ్చలేదు. గాంక్రెస్ పార్టీలో ఆవిడ మాటకు సాధారణంగా తిరుగు ఉండదు. గాంక్రెస్ సభ్యులు, వాళ్ళు కేంద్రంలో మంత్రులైనా సరే, ఢిల్లీ అమ్మ కూర్చోమంటే కూర్చుంటారు, నిల్చోమంటే నిల్చుంటారు. ఉత్త ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి ఒక మాజీ మంత్రి, ఢిల్లీ అమ్మ ఆజ్ఞ కాలేదని, కూర్చోకుండా అలానే నిల్చున్నాడని అందరూ అనుకుంటూ ఉంటారు.

అలాంటిది గగన్ కూర్చోవడం, నిల్చోవడం కాదు, యాకంగా యాత్రకే బయలుదేరుతాననడంతో ఆమెకి వొళ్ళు మండిపోయింది. వెంటనే ఆమె ఫర్మానా జారీ చేసింది. గాంక్రెస్‌లో ఉండాలి అనుకునే ఎవరైనా, గగన్‌కి ఏ రకంగా తోడ్పడ వద్దు అని. ఢిల్లీ తొత్తులు వెంటనే తల నిలువుగా ఊపారు. వై.నో తొత్తులు మాత్రం తల అడ్డంగా ఊపారు.

అధిష్టానం మాటలను ఖాతరు చేయకుండా గగన్ తన యాత్రను కుమ్మం జిల్లాలో ప్రారంభించాడు. అది కుమ్మం కాబట్టి ఏం కాలేదు. యాత్ర బాగానే సాగింది.

కానీ శాపంగల్ జిల్లాలో మాత్రం బృ.రా.స. కార్యకర్తలు గగన్ కనక అక్కడ అడుగు పెడితే కుమ్మేద్దాం అని డిసైడ్ అయిపోయారు. మరి వాళ్ళ జిల్లా పేరు కుమ్మం కాదు కద! గగన్ యువసేన వాళ్ళని రివర్స్‌లో కుమ్మేద్దాం అని ఫిక్స్ అయిపోయారు.

ఈ కుమ్ముడు-ప్రతి కుమ్ముడు కనక జరిగితే సొమ్మసిల్లేది రాష్ట్ర ప్రభుత్వమే కనుక మోశయ్య ప్రభుత్వం, గగన్ శాపంగల్ జిల్లాలో అడుగు పెట్టక ముందే అరెస్ట్ చేసింది.

దీనితో గగన్ వెనుకంజ వేస్తాడు అని కొందరు అమాయకులు అనుకున్నారు. కానీ కొద్ది రోజులు ఆగి, గగన్ రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళ నాన్నగారి పుట్టిన రోజునాడు తన యాత్రకి శ్రీగద్దళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టాడు.

అసలు ఓదార్పు యాత్ర ప్రణాలికే ఎంతో అద్భుతమైనది. దాని ప్రకారం జిల్లాకు పాతిక కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. శాపంగల్ లాంటి జిల్లాల్లో ఓదార్చలేకపొయినా, మిగతా జిల్లాలన్నిటికి కలిసి దాదాపు ఐదు వందల కోట్లు అవుతుంది. వై.నో మృతి తరువాత హతులైన వారికి చెల్లించే నష్ట పరిహారం దానిలొ వందో వంతు కూడా ఉండదు.

ఏంటి ఈ లెక్ఖ ఇలా ఉంది అని మీరనుకుంటే మీకు రాజకీయాల పట్ల బొత్తిగా అవగాహన లేదన్న మాట. రాజకీయాల్లో అసలు సంగతి కంటే అట్టహాసం ఎక్కువుంటుంది. మన ప్రభుత్వ పథకాలనే తీసుకోండి. తొంభై పైసలు ఖర్చు పెట్టి సబ్సిడీల రూపంలో పది పైసలు పంచుతారు. అలా అన్న మాట.

***

మోశయ్య తన ముఖ్య అనుచరులతో సమావేశం పెట్టాడు. “ఈ సమావేశం దేని గురించి సార్?” అడిగాడు మధు డిష్కీ. “నన్ను ఓదార్చడానికి,” నీరసంగా అన్నాడు మోశయ్య.

అందరూ ఆశ్చర్య పోయారు. అప్పుడు మోశయ్య, “జీవితంలో ఎప్పుడూ ముఖ్య మంత్రి కాలేనేమో, ఇలా నంబర్ టూ లానే మిగిలిపోతానేమో అనుకుంటే, ఆఖరి ఘడియల్లో ఈ పదవి దక్కింది. ఆ ఆనందం మిగిలేలా లేదు. చూడబోతే ఈ గగన్ నా కొంప ముంచేలా ఉన్నాడు,” ఎక్స్‌ప్లెయిన్ చేసాడు.

విషయం అర్థమయ్యి అందరూ మోశయ్యని ఓదార్చడం మొదలు పెట్టారు.

“ఊరుకోండి సార్, మీ పదవికేం ఢోకా లేదు. గగన్ ఇలాంటి యాత్రలు ఎన్ని చేసినా సరే, మీరు మొత్తం పదవీ కాలం పూర్తి చేస్తారు,” ఓదార్చాడు మధు డిష్కీ.

“అసలు మన గాంక్రెస్ హై కమాండ్‌ని ధిక్కరించి బ్రతికి బట్ట కట్టిన వాళ్ళు ఎవరూ లేరు మోశయ్య గారు. వై.నో.రాజశేఖర్ రెడ్డికి అసలు వారసులం మనం! ఆ గగన్ కాదు,” బుజ్జగించాడు మత్స్యా సత్యనారాయణ.

మోశయ్య కళ్ళు తుడుచుకున్నాడు.

***

యాత్ర చేస్తున్న గగన్‌ని చుట్టు ముట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు విలేఖరులు.

“మీరు ఓదార్చింది రోజుకు అర్ధ గంటే. మిగతా సమయాన్ని అంతా పార్టీ కార్యకర్తలని కలవడానికి, పబ్లిక్ మీటింగులు పెట్టడానికి వెచ్చిస్తున్నారు. అది కరక్టే అంటారా?”

గగన్: “అంటే మీ ఉద్దేశం? చనిపోయిన వారి కుటుంబాలనే ఓదార్చాలా? బ్రతికుండి కుమిలిపోతున వారిని ఓదార్చే బాధ్యత నాకు లేదా?”

“అదీ నిజమే. ఈ గందరగోళంలో ఎవరు ఎవరిని ఓదారుస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంతకీ ఈ ఓదార్పు యాత్ర ఎవరి కోసం అంటారు?” బుర్ర గోక్కుంటూ అన్నాడు ఇంకో విలేఖరి.

“ఇంకెవరికి? మా నాన్నగారి మరణం వల్ల అందరి కంటే నష్టపోయింది ఎవరు? నా కోసమే ఈ ఓదార్పు యాత్ర!” అనుకోకుండా నిజం చెప్పేసి నాలుక కరుచుకున్నాడు వై.నో. గగన్.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

20 Responses to ఓదార్పు యాత్ర

 1. అజ్ఞాత says:

  మీ శైలిలో చంపేశారు…మోశయ్య కస్టాలు ఇంకేప్పటికి తీరుతాయో మరి!

 2. siddi says:

  Chaala bagundi. Akshara satyalenno chaala andamuga percharu.

 3. krishna says:

  చాలా బాగుంది ! నవ్వాపుకోలేకపోయాను!

 4. బావుంది 🙂

 5. Harish says:

  వై.నో. గగన్.. Cool name.

 6. హ హ బావుంది. మీరు పేర్లు మాత్రం భలే పెడతారండీ 😀

 7. రవి says:

  రిచంజీవికి ఈ ఓదార్పు యాత్రల వల్ల ఏదో ఒనగూరబోతుందని రాచకీయ ఫండితుల విశ్లేషణ.

  పాపం మోశయ్యకు అడుగడుగునా దెబ్బలు తగులుతున్నాయి.

 8. ammaodi says:

  బాగా వ్రాసారు.

 9. jatardamal says:

  ఇంతకీ బృ.రా.స. అంటే ఏమిటి ?

  • Murali says:

   బృ.రా.స అంటే ఏమిటో తెలియాలంటే మీరు నా పోస్ట్ “బృందగానా జిందాబాద్” చదవాలి. 🙂

 10. అసలు మీరు పెట్టే పేర్లకి పేటెంటు తీస్కోవాలి.. ఎలా తడతాయండీ మీకు ఆ పేర్లు? అవి చూసే పొట్ట పగిలేలా నవ్వొచ్చేస్తుంది ముందు. 😀 😀 As usual, too good! 🙂

 11. Padma. says:

  స్వార్ధం కోసమో , ప్రారబ్ధం వల్లో గగన్ ఓదార్పు యాత్ర అధిష్టాన ధిక్కార యాత్ర తెలుగు వారి జైత్ర యాత్ర. గాంక్రేస్ పార్టీ అధిష్టాన ధోరణి నియంతృత్వం . అధిష్టానం అంతే కానియా అమ్మ పాలన అయిపోయింది. మిగతా అంతా గాంక్రేస్ సభ్యులు, అమ్మ తొత్తులు. మంచో చెడో దేముని కెరుక, తెలుగు వీర లేవరా….

 12. సురేష్ says:

  ఇదంతా చూస్తున్న వీ.టి 9 యజమాని ఆనందంగా నేల మీద పొర్లాడుతున్నాడు. కారణం గత నెల రోజులుగా తిన్నది అరగడం లేదు, మనస్సు లో ఏదో బాధగా ఉంది. సరైన అవకాశం చిక్కింది.ఒక పక్క నోసియా బ్రాంది మేడం కి చిడతలు కొట్టే వి.హెచ్. ఆంజనేయులు,కే. శవరావు వినోద ప్రదర్శనలు, ఇంకో పక్క మోశయ్య ఏడుపులు, మోటా స్టార్ ఆనంద భాష్పాలు (ఎట్ట కేలకు బ్రాంది మేడం సర్వ దర్శనం బదులు వి. ఐ. పి దర్శనం జరిగింది కదా మరి), గగన్ కడప సవాళ్ళు వీ. టి 9 కి తెలుగు ప్రేక్షకులకి అందించ గలిగే భాగ్యం కలిగించినందుకు…వెంటనే తన గది లో ఉన్న వీ. టి 9 వంక చూశాడు. అప్పుడే గాంక్రేస్ పార్టీ సమావేశాలు అయినట్టున్నాయి. మోశయ్య మొఖం ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్టున్నాయి.కండువా తో కన్నీళ్ళు తుడుచుకొంటున్నాడు…ఎక్కడో జన్మ మెత్తితిరా..అనుభవించితిరా అన్న పాట విన్పిస్తుంది…

  (మీరు మన మీడియా గురించి చెప్పలేదు…)

 13. Lakshmi says:

  Wonderful..

 14. bharadwaj says:

  over gaa vundi… kevalam navvukovataaniki tappa, vere emi
  ledu…odaarpu yaatra ante chanipokamundu chesedi kaadu..
  yeru daataaka teppa tagalettadam ante emito thelusaa?
  avasaram theerina tharuvaatha vadali veyyadam…
  AP lo anni parties okelaane edusthunnai.. pratyekinchi Congress okate alaaga vundani kaadu.. KCR ku Telangaana pichchi.. Babu Cat On The Wall ( COW )..BJP Matham Pichchi.

  • Murali says:

   భరద్వాజ్,

   ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం ఏంటో తెలుసు కాబట్టే ఆ సామెత ఈ పోస్ట్‌లో ఉంది. వై.ఎస్. వల్ల విజయం సాధించిన కాంగ్రెస్ జగన్‌ని ప్రస్తుతం అతని అవసరం లేదు కాబట్టి వెనక్కి నెట్టేయ్యడం అన్న దానికి పోలిక అది. (అలా అని జగన్ మీద నాకేదో సింపతీ ఉందని కాదు.) మీకెందుకా పోలిక కనిపించలేదో మరి నాకర్థం కాలేదు.

   ప్రస్తుతం ఫోకస్ ఈ పార్టీ మీద ఉంది కాబట్టి దాని గురించి రాయడం జరిగింది. వేరే పార్టీల వాళ్ళు గొప్ప మనుష్యులు అని నేనెక్కడన్నా చెప్పానా? నా మిగతా పోస్ట్స్ చదివితే అది మీకే తెలుస్తుంది. అన్నీ పార్టీలు ఒకే రకంగా ఉన్నాయి అన్న వంకతో ఏ పార్టీ ఏం చేస్తున్నా పట్టించుకోకుడదా?

   ఇక పోతే ఓదార్పు యాత్ర చనిపోయిన తరువాత చేస్తారు అని నాకు తెలుసు. నా పోస్ట్‌లో ఎక్కడైనా చనిపోక ముందు చేస్తారని రాశానా?

   నాకు అసలు మీరు నా పోస్ట్ పూర్తిగా చదివారా అన్న అనుమానం వస్తూంది ఇప్పుడు.

 15. suresh says:

  Dear Murali

  I think you are lacking soft skills (in corporate parlance, as per my 2 week annual evaluation). In earlier posts, when your post was satirical on hypocrisy in Indian society, few readers could not understand and inquired if you are an MCP.

  In modern (but uncivilized, as I opine) world, people have become so sensitive, one (here, You) needs to qualify oneself before saying any thing. I guess you are in US and probably you might have observed people over there always use “I guess”, “I think”, “what i mean” so on so forth to give explanation even for the easiest statements that can be understood without tearing it into absurd pieces of information.

  Well, people are people. I guess you need to adapt strategies in word management, sentence management, blog management etc etc (from corporates like ATnT, MS, AAPL, Shell etc) to make people understand what you mean or what your posts mean…

  or…

  stop responding to such questions/posts..it saves your time..emotions…white space…few bytes online….

  • Murali says:

   Suresh,

   I rarely get such posts. So far, very few posts, probably three, of mine have been misunderstood. May be, that’s why I responded.

   As for soft skills and blog management, even the most lucid writing can be misinterpreted or misunderstood. It can’t be helped.

   But thanks though for your suggestion. I will try to use better discretion next time. 🙂

   -Murali

 16. NaChaKi says:

  I am surprised at Suresh’s comment which was totally unwarranted. I don’t see why a soft skills assessment of a blogger is seen as a necessary or a sensible action, sorry to say! (Oh, yeah, a report on me is also welcome!) Blog management, duh!?

  And, I hope Mr. Bharadwaj got his answer from reading other posts in this blog.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s