పుణ్యం కావాలా? ఐతే డబ్బు ఖర్చవుతుంది!


“పురుషోత్తమా, పురుషోత్తమా, పురుషోత్తమా!” అన్నమయ్య సినిమాలో ఎస్.పీ బాలు పాడిన పాట అందుకున్నాడు అప్పారావు. అతను పూజ గదిలో కూర్చుని, వెంకటేశ్వర స్వామి పటం వైపు అర్ధ నిమీలిత నేత్రాలతో చూస్తూ ఉన్నాడు.

“పిలిచావా బావా!” రివ్వున వచ్చేశాడు అతని బావమరిది పురుషోత్తం. అతను రెండు రోజుల కింద డల్లాస్ నుంచి కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాకి (అప్పారావు ఇంటికి) వచ్చి ఉన్నాడు. ఇంకో రెండు గంటల్లో మళ్ళీ డల్లాస్ వెళ్ళే ఫ్లైట్ అందుకోవాలి అతను.

“నిన్ను కాదురా! అయినా నిన్నైతే అంత శ్రావ్యంగా అన్ని సార్లు ఎందుకు పిలుస్తాను. నేను ఎలుగెత్తి పిలుస్తూంది ఆ ఆపద మొక్కుల వాడిని,” చేతులు జోడించి అన్నాడు అప్పారావు.

“బావా నువ్వు చాలా వెనక పడి ఉన్నావు. ఇలా ఇంట్లో కూర్చుని పిలవక్కర్లేదు. ఆ సంకట హరణుడు మీ ఊరికే విచ్చేస్తున్నాడు,” చెప్పాడు పురుషోత్తం.

“ఏంట్రా ఆ పిచ్చి వాగుడు? కొంప తీసి మీ అక్కయ్య ఎక్స్‌పరిమెంటల్ బేసిస్ మీద చేసిన కూర పొరపాటున రెండో సారి వేసుకున్నావా?”

“ఆ కూర తింటున్నప్పుడు నీ మొహంలో ఫీలింగ్స్ చూసి, నేను మొదటి సారి కూడా వేసుకోలేదు బావా! ఇంతకీ సంగతి విను.”

“ఏంటో చెప్పు.”

“మన లాంటి N.R.I. భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు సాక్షాత్తు ఆ తిరుమలనే మన దగ్గరకు తీసుకు రాబోతున్నారు. కొద్ది రోజుల పాటు మీ బే ఏరియా తిరుమల అయిపోతుంది. ఎంతో మంది పూజారులు, దేవుడి విగ్రహాలతో సహా వస్తున్నారు.”

“భక్తుడు భగవంతుడి దగ్గరకు వెళ్ళనప్పుడు, భగవంతుడే భక్తుడి దగ్గరకు వస్తాడట,” భక్తి పారవశ్యంతో అన్నాడు అప్పారావు.

“అంతే బావా, అంతే! నువ్వు వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు కొనుక్కోవచ్చు,” సజెస్ట్ చేశాడు పురుషోత్తం.

సడన్‌గా ఒక డౌట్ వచ్చింది అప్పారావుకి. “అవున్రా, మర్చేపోయాను. సముద్రం దాటడం పట్ల నిషేధం ఏదో ఉంది కద? మరి ఈ పూజారులు ఎలా వస్తున్నారు, అదీ దేవుడి విగ్రహాలతో?” అడిగాడు.

“హయ్యో! ఎంత సత్యకాలపు మనిషివి బావా నువ్వు! విదేశాల్లో గుడులు కట్టడం లేదా, పూజారులు ప్రత్యేక వీసా మీద ఇదే సముద్రాన్ని దాటి రావడం లేదా? ఐనా అప్పట్లో సరయిన టెక్నాలజీ లేదు కాబట్టి, సముద్రం దాటలేకపోయిన పండితుడెవరైనా కడుపు మండి ఆ రూల్ పెట్టి ఉంటాడు. అన్నట్టు నాకు ఫ్లైట్‌కి ఆలస్యం అవుతుంది, నేనొస్తా,” అంటూ నిష్క్రమించాడు పురుషోత్తం.

***

పురుషోత్తం వెళ్ళాక సదరు వెబ్ సైట్‌కి వెళ్ళి వివరాలు కనుకున్నాడు అప్పారావు. టికెట్ల సెక్షన్‌కి వెళ్ళి, వంద డాలర్ల చొప్పున రెండు టికెట్లు కొనుక్కున్నాడు. “వెధవ డబ్బుదేముంది. స్వామికి ఎంత ఇచ్చినా తక్కువే. పైగా వీళ్ళు భక్తుల సౌకర్యం కోసం కామోసు, శని, ఆది వారాల్లోనే దర్శనం పెట్టారు. వాళ్ళు అంత బాగా అన్నీ అరేంజ్ చేస్తూంటే ఆ మాత్రం పెట్టకపోతే ఎలా?” అనుకున్నాడు.

అప్పారావు భార్య రజని కూడా చాలా ఆనందించింది. “చాలా మంచి పని చేశారండీ. ఐతే ఈ వీకెండ్ దేవుడి సన్నిధిలో గడుపుతున్నామన్న మాట,” అంది.

ఏట్టకేలకు ఆ ఘడియ రానే వచ్చింది. అప్పారావు భార్యా సమేతంగా గుడికి బయలు దేరాడు. అక్కడికి చేరుకునేప్పటికి, భక్తుల రష్ ఎంతుందో అర్థమయ్యింది అతనికి. పార్క్ చేయడానికి ప్లేస్ కూడా దొరక్క ఒక నాలుగు వీధులవతల పార్క్ చేసి భార్యతో సహా తిరిగి గుడికి నడుచుకుంటూ వచ్చాడు.

లోపల అడుగు పెట్టగానే గుడి ముందు ఉన్న లైన్ చూసి అప్పారావు, రజని అక్కడికి వెళ్ళారు. అక్కడ జనాల్ని కంట్రోల్ చేస్తున్న ఒక వాలంటీరు “మీదే టికెట్?” అడిగాడు.

“వంద డాలర్లు,” గర్వంగా చెప్పింది రజని.

“ఐతే మీది ఈ లైన్ కాదు. దూరంగా ఒక టెంటు కనపడుతూంది చూశారా? అక్కడికి వెళ్ళి కూర్చోండి,” డైరెక్ట్ చేశాడు ఆ కుర్ర వాడు.

“ఎందుకు?” కాస్త అయోమయంగా అడిగాడు అప్పారావు.

“ఈ లైన్ రెండొందల యాభై టికెట్ కొనుక్కున్న భక్తులకు మాత్రమే. వీరందరి దర్శనం అయ్యాక మిమ్మల్ని పిలుస్తాం. అప్పుడు టెంటు నుంచి లేచి ఒద్దురు గానీ,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ఆ వాంటీరు.

చేంతాడు అంతున్న ఆ లైన్‌ని చూసి దడుచుకున్నారు అప్పారావు రజని. కానీ చేసేది ఏమీ లేక టెంటు వైపు బయలుదేరారు.

“వెధవ కక్కూర్తి, వెధవ కక్కూర్తి అని! మీరు కూడా రెండొందల యాభై టికెట్ కొనొచ్చు కద,” కోప్పడింది రజని.

“వంద డాలర్ల టికెట్ కొనడం కక్కూర్తా! ఐనా ఆ రెండొందల యాభై గ్యాంగ్ పరిస్థితి కూడా అంత గొప్పగా ఏం లేదులే,” సర్ది చెప్పాడు అప్పారావు.

“అన్నట్టు, వీళ్ళే గుడి బయట ఉంటే, లోపల ఉన్న వాళ్ళు ఎంత టికెట్ కొనుకున్నారో?” ప్రశ్నార్థకంగా చూసింది రజని అప్పారావు వైపు.

టెంటులోకి వెళ్ళాక చాలా విషయాలు తెలిశాయి అప్పారావు దంపతులకి. టెంటులో నాలుగు చిన్న టీవీలు ఉన్నాయి. జనమంతా వాటి ముందు నిలబడి తదేకంగా చూస్తున్నారు. అప్పారావు కూడా ఒక టీవీ దగ్గరకు వెళ్ళాడు. టీవీ స్క్రీన్ మీద గుడిలో జరుగుతున్న పూజా తతంగం కనిపిస్తూంది.

“ఇదేం చోద్యమండి, ఈ మాత్రం దానికి టికెట్ ఎందుకు కొనుక్కున్నట్టు?” కాస్త చిరాకుగా అన్నాదు అప్పారావు.

అక్కడ ఉన్న ఒక పెద్దాయన, “మనం నయమండి, ఇంకా యాభై టికెట్ వాళ్ళనైతే గుడి ప్రాకారం బయటే ఆపేశారు,” అన్నాడు.

“ఏంటీ? యాభై టికెట్ వాళ్ళకు అలాంటి ట్రీట్‌మెంటా?” ఆశ్చర్యపోయింది రజని.

“మీకు బొత్తిగా నాలెడ్జ్ ఉన్నట్టు లేదు. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాను. శ్రమ తెలియకుండా వినండి,” అంటూ గొంతు సవరించుకున్నాడు పెద్దాయన.

దాని ప్రకారం వారికి తెలియ వచ్చింది ఏంటంటే యాభై టికెట్ వాళ్ళు గుడి కాంపౌండ్ బయట, వంద టికెట్ వాళ్ళు టెంటులో, రెండొందల యాభై వాళ్ళు గుడి బయట లైన్‌లో ఉన్నట్టుగానే ఐదొందల టికెట్ వాళ్ళు గుడి వెనుక భాగంలో కూర్చుని ఉంటే, వెయ్యి టికెట్ వాళ్ళు గుడి ముందు భాగంలో ఉన్నారట.

“యాభై టికెట్ వాళ్ళు గుడి బయట ఉండి చేసేదేముంది?” సందేహం వచ్చింది అప్పారావుకి.

“అంటే వాళ్ళకు బయట ఒక మైక్ పెట్టారు. దానిలోంచి వాళ్ళు ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు,” చెప్పాడు పెద్దాయన.

“ఐతే వెయ్యి టికెట్ వాళ్ళే దేవుడిని అందరికంటే దగ్గరగా చూస్తారా?”

“లేదు. ఐదు వేల టికెట్ వాళ్ళు మొదటి వరసలో కూర్చుంటారు.”

ఆ ధరలు విని కళ్ళు తిరిగాయి అప్పారావుకి.

“మరేమనుకున్నారు? పుణ్యం ఫ్రీగా వస్తుందేంటి? ఎంత ఖర్చు పెడితే అంత పుణ్యం. ఎంత చెట్టుకి అంత గాలి.”

నిజమే అనిపించింది అప్పారావుకి. ఒక రకంగా ఆశ్చర్య పడాలింది ఏం లేదు. అక్కడ తిరుమలలో జరిగేదే ఇక్కడా జరుగుతూంది. “ఐతే మనది ధర్మ దర్శనం బ్యాచ్ అన్న మాట,” అన్నాడు రజనితో.

అచ్చం అలానే వెయిట్ చేయాల్సి వచ్చింది వంద టికెట్ గ్రూప్‌కి. దాదాపు గుడి మూసే వేళకు వాళ్ళకు లోపలికి ప్రవేశం లభించింది. వాలంటీర్లు జనాలని బారులుగా నిలబెట్టి ఒకరి తరువాత ఒకర్ని దేవుడి దగ్గరకు పంపిస్తున్నారు. తిరుమల గుడిలో లాగానే వాళ్ళు ఇక్కడ కూడా జనాల్ని రఫ్‌గా, తొందరగా కదలమంటూ నెట్టేస్తున్నారు.

అప్పారావు మొహంలో ఆశ్చర్యం గమనించి “అంటే మనకు తిరుమలలో ఉన్న ఫీలింగ్ రావాలని, ఇక్కడ కూడా అలానే చేస్తున్నారు,” ఎక్స్‌ప్లేనేషన్ ఇచ్చాడు పెద్దాయన.

హెడ్ వాలంటీర్‌ది నున్నటి గుండు. “ఇక్కడ కూడా తిరుపతి కొండలా గుండు చేయించుకునే సదుపాయముందా?” ఆశ్చర్యంగా అడిగాడు అప్పారావు.

“మీరు పొరపాటు పడ్డారు. ఆయన ఎప్పటినుంచో గుండుతో ఉన్నారు. జస్ట్ కో-ఇన్సిడెన్స్,” జవాబిచ్చాడు పెద్దాయన.

అందరిలానే అప్పారావు, రజనిలు కూడా దర్శనం కాగానే బయటకు తోయబడ్డారు. చాలా ఆలస్యంగా అర్ధ రాత్రికి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి పటం ముందు నిలబడి, “ఇలా అనడం తప్పేమో స్వామీ. కానీ నాకు ఆ గుడిలో కంటే ఇక్కడే ఎక్కువ ప్రశాంతంగా ఉంది,” అని లెంపలేసుకున్నాడు అప్పారావు.

***

( ఇలా ఉత్సవ విగ్రహాలు సముద్రం దాటించి తీసుకు వచ్చి, ప్రవాస భారతీయులని ధన్యులు చేయడం అన్నది కొత్త ట్రెండేమో కాని. మన పుణ్య భూమి నుంచి రక రకాల స్వాములూ, బాబాలూ అమెరికాకి వచ్చి N.R.I.ల నుంచి దండిగా డాలర్లు తీసుకుని పుణ్యం పంచడమనేది, పాత పద్ధతే.)

Advertisements
This entry was posted in ప్రవాసాంధ్రులు. Bookmark the permalink.

21 Responses to పుణ్యం కావాలా? ఐతే డబ్బు ఖర్చవుతుంది!

 1. challa.jayadevaanandasaastry says:

  TTD-KI marketing techniques vokaru cheppaalaa baava gaarooo……jayadev/chennai-17[in metros its a krores business]

 2. రవి says:

  ఓహో, ఈ వ్యాపారం కూడా నడుస్తూందా?

 3. Indian Minerva says:

  ఇంతకీ దీనికి inspiration ఏమిటో? కొంపదీసి ఇలాంటి విగ్రహాల తరలింపు విధానాన్నేమైనా ప్రవేశాపెట్టబోతున్నారా T.T.D. వాళ్ళు.

  • Murali says:

   ఆల్‌రెడీ జరిగిందిగా మా ఊర్లో 🙂

   అఫ్ కోర్స్ సెటైర్ కాబట్టి కొంచెం అతి చెయ్యడం జరిగింది కానీ మెయిన్ పాయింట్‌లో ఏమీ మార్పు లేదు. ఆధ్యాత్మికత పంచాల్సిన వాళ్ళే, “డబ్బుని బట్టే గౌరవం” అని నిర్మొహమాటంగా చెప్తున్నారు.

 4. yup.
  At the same time, as a counterpoint to this, please take a look at this. What a difference!

 5. durgeswara says:

  భగవద్దర్శనమంటే సౌకర్యంగానూ వేగంగానూ జరగాలనుకునే భక్తులున్నంతకాలం ఈ వ్యాపారులిలానే ఏర్పాట్లుచేస్తుంటారు . కానీయండి ….దాపు కొచ్చినట్లుంది వినాశకాలం

 6. Tirupathi Gundu says:

  Dear Teta,

  Apachaaramu! Apaaacharamu!!!
  Brastu patti poindi sanskaaramu.

  FYI…the Swamijees spend more money on the trips abroad than what they collect during their trips abroad.
  These trips are their summer getaways and ego boosters cum shobha yatraaas.SWAMIJEE IS ON US n EUROPE TOUR TYPES.
  ARDAM CHESUKORU.

  Your 100$ is nothing when compared to the INR500000 darhan FROM 100 METER distance in India. You are brastu pattinching our sampradaayam, Teta!

  Illanti raatalu raayaku nayana kallu potayee! Nee readers ki kooda kopam raavachchcu..swamijee bhakthuku are more powerful than devotees of God. Swamijee lanu alla anachchaaa Teta, Apachaaaram, apaachaaramu!!

  gavarnamentu vaari meedaa raaayachchcugaaa devudu swamijeelu vaddu Teta!

  Tandri lanti vadini chebutunaa, vinu Teta!

 7. Sitaram says:

  1. Every 100 to 1000 people need a spiritual leader. More than that no one spiritual leader can handle…like a family docter
  2. Like monthly/ half-yearly/annul checkup we need to go based on our character and current state of mind to temples and discourses
  3. Do not regret for the hours you spent for darshana after you decide to go not fail to get the darshana. Take the delay as an oppertunity to chant whatever bhagavan namam you like. That would give more peace than prestigious and expensive darshana.
  4. Most importantly, donot talk about howmuch time you spent and how close you are to the statue and how lucky you are. It really does not matter as long as you can imprint what ever shape you imagine and chant his name with utmost bhakti in the holy and sacred places or infact any where .
  Hari omn tat sat .

 8. వ్యాఖ్యలు చదువుతూంటే తెలుగు ‘బ్లాగు వ్యాఖ్యాతలు’ యెంత వెనుకబడి వున్నారో అర్థం అవుతోంది.

  ఈ కల్యాణాలకి ఓ తొంబ బయల్దేరడం, చాలా మందికి వీసాలు రాకపోవడం, చివరికి అర్చకులే బయల్దేరడం, అక్కడ అమెరికా వెంకన్న భక్తుల పాట్లు గురించి టీవీ ఛానెళ్లెప్పుడో ఘోషించాయి. అస్మదీయుడు ‘కృష్ణా! గోవిందా!’ బ్లాగులో టపానెప్పుడో వ్రాశాడు.

  మధ్యలో కొత్తపాళీ, తిరపతి గుండు లాంటివాళ్ళ పిడకల వేటొకటి (ఇదేమైనా తప్పు మాటయితే క్షంతవ్యుణ్ణి).

  మరి, “రుద్రం” నిర్వహించిన “మిషన్” వాళ్ళు యెంత వసూలు చేశారో ఆ టపాలో లేదు. పైగ, విందు భోజనాలతో సహా నిర్వహించారంటే, యెన్ని మిలియన్లు ఖర్చయ్యాయో వూహించుకోవచ్చు. అసలు యేమీ వసూలు చెయ్యలేదు అంటే, ఆ మిషన్ వాళ్ళు యెంత ధనవంతులో అర్థం అవుతోంది కదా? వాళ్ళని ధనవంతుల్ని చేసిందెవరు?

  ‘రోమాలు నిక్కబొడుచుకోవడం’ లాంటివి కరెక్టే–కొంతమందికి. మరి నాలుగు వేదాల్లోంచీ చక్కగా ఆశీర్వచన పనసలు చదివింతరవాత, ‘అబ్బే! కప్పలు బెక బెకలాడినట్లుంది’ అన్నవాళ్లు కూడా నాకు తెలుసు మరి!

  Tirupathi GunDu “Teta…Teta” అంటుంటే యేమిటో అనుకున్నాను–తెలుగులో ‘తేట….’కొచ్చిన పాట్లా ఇవి!

  • Tirupathi Gundu says:

   More pidakala veta

   Krishnaajee,

   YEVADI GOLA VAADIDI. Meereppudo yekkado cheppeste memu cheppakoodadaaa saaaru? Venaka padadam mundu padadamu konchem vivarinchaalani manavi. mee blog adverize chesukovadaaniki kshantavyudivi kaanavasaram ledu.

 9. Ramana Turlapati says:

  ttd is only second to vatican in terms of money it generates – ye muhurtanna mr.venkateswara rao, mr. kuber ki baaki paddado kaani, appati nunchi kotta kotta schemelu petti dabbu gunjadam mamoole. ayina pelliki everaina velataaru – pelli koduku/kooturu mana vooriki vachi pelli chesukoru – anta vishnu maya…

 10. Murali says:

  కొత్తపాళి గారూ ఈ పోస్ట్‌ని తిరస్కరించలేదు. ఈ అంశానికి ఇంకో కొత్త కోణం చూపారు అంతే. నాకు తెలిసినంత వరకు తిరుపతి గుండుది వ్యంగ్యామోదం.

  ఇక భక్తి పారవశ్యం అంటారా, అన్ని కష్టాల్లోనూ, నా పోస్ట్‌లోని యాభై డాలర్ల భక్తుల్లో కూడా కొంత మందికి తప్పకుండా కలిగే ఉంటుంది. అలాగే కొత్తపాళీ గారి “మహా రుద్రం”లో పాల్గొన్న కొందరు పురోహితులకి కూడా ఏ రకమైన తన్మయత్వం కలిగి ఉండకపోవచ్చు. నా పోస్ట్‌కి సంబంధించినంతవరకు ఈ విషయం అప్రస్తుతం.

  ఆధ్యాత్మికత, తాత్విక చింతన హిందూ మతం మనకు ప్రసాదించిన వరాలు. కుల వ్యవస్థ, అర్థం లేని ఆచారాలు వాటితో పాటూ వచ్చిన negative side effects. మూర్ఖంగా ఈ ritualsని పాటించే భక్తుల వైపు (సాధారణంగా వీరు ఇవి ఏదో కోరిక తీరడానికి చేస్తారు), వాటిని ఎగదోసే పండితుల వైపు, నా సెటైరాస్త్రం సంధింప బడే ఉంటుంది. ఈ టపా brazen exploitation గురించి.

  దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయం పక్కన పెడితే, ఫలాపేక్షలేకుండా భక్తి తత్వంలోని తాదాత్మ్యతను అనుభవించే అసలు భక్తులతో నాకెలాంటి పేచీ లేదు. ఇంకా చెప్పాలంటే, వారంటే అసూయ కూడా. నా హేతువాదం నాకు అలాంటి స్థితిని ఎన్నటికి కలిగించదు అని తెలిసి.

 11. Murali says:

  Hi KrishnaSree and Gumdu,

  I had to edit/delete some portions of your comments which I found either offensive or irrelevant to the subject at hand.

  Since I don’t want this to become a forum for one-up-manship, I am not going to entertain any further comments in this thread.

  You can always leave new comments as long as I find them relevant and not personally offensive to anybody.

  Regards

 12. శాస్త్రి says:

  అయ్యా దుర్గేశ్వర గారు,
  ఏవో నాలుగు మంచి మాటలు మాట్లాడతారనుకుంటే ఈ మధ్య ఎక్కడ చూసినా వినాశ కాలం దాపుకొచ్చింది,అనర్థం సంభవిస్తుంది,పాపం పండుతుంది, అంటూ ఇవే శాపనార్థాలు వల్లె వేస్తున్నారే! ఇవి ఎంత జీవిత సత్యాలైనా, అవి వచ్చేదాకా ఆగడం మంచిదేమోగా! అసలు రాకనే పోతేనో?

  అనుమతులు లేకుండా, గుర్తింపు లేకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు స్కూళ్ళు నడుపుతుంటే దేవుడేమంటాడో ?

  మనుషుల్ని కాస్త సంతోషంగా, ఆశతో బతకనీయండి స్వామీ! ఎప్పుడు ప్రళయం ముంచుకొస్తుందో అన్న భయంతో కాకుండా !

  • అయ్యా
   మరో పిడకల వేట
   http://ramakantharao.blogspot.com/2010/05/blog-post_19.html

   మా ఈ గోల చూట్టానికి రెండువేల మంది వచ్చారు.
   ఒక్కోరి దగ్గర రెండు లక్షల డాలర్లు వసూలు చేసారు. నేను తొమ్మిది లక్షల డాలర్లు సమర్పించా కేవలం ముందు వరసలో కూర్చోటానికి. ఏంటట.

   సరే ఫ్లిప్ సైడ్ – ఈ సోకాల్డ్ పిడకలు వెతికేవాళ్ళు
   వాళ్ళ ఆఫీస్ కి పెద్దోళ్ళు అనగా లోకల్ పొలిటీషియన్స్ బిజినిస్ లీడ్స్ లేక ధనవంతులొస్తే ఏసి రూంలో కూర్చోబెట్టి చల్లనిపానీయాలందిస్తారు. అదే నిరుపేదవస్తే పట్టించుకునేవారే ఉండరు విదిలించేవాళ్ళు తప్ప.

   టిటిడి వాళ్ళకి వీళ్ళకీ తేడా ఏంటో నాకర్థం కాలేదు.

 13. Sumna says:

  Murali gaaru, chala baga chepparu.. memu kuda ticket koni pooja cheyinchukunam.. first +ve chepta.. atleast hindu religion ni propagate cheyya taniki try chesaru.. and antha mandini oka choota kurchopetti pooja chesaru ( NJ loo). -Ve .. the way they minted money.. yes, its truly minting.. like most of the money went to Swamy narayan temple which is under construction.. and vigrahalu complete ga kothavi.. just tirupathi loo cheyinchi ikkada prathista chesaru.. ilantivi janalaki cheppakunda cheyyatam matram chala anyayanga anipinchindi…. and the amount they were charging.. the way they distributed prasadam.. idi oka business laga anipinchindi.. kalyanam ayyaka oka 10mins kuda undali anipinchaledu akkada.. dabbulu katti nanaduku siggu anipinchaledu.. kani inni abadhalu cheppi kalyanam chesina vallani chooste siggu anipinchindi.. truly exploiting ppl’s faith on Lord Venky.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s