మస్జిద్ వహీ బనాయేంగే! (మసీదు అక్కడే కడతాం)


మా ఫ్రెండ్ రాజేష్ గాడు గొప్ప మేధావి అని మీకందరికీ తెలుసు. నాకేదైనా ధర్మ సందేహం వచ్చినప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి సందేహ నివృత్తి చేసుకోవడం అలవాటు.

అలాగే నాకు వచ్చిన కొత్త డౌట్‌ని తీర్చుకోవడానికి వాడి దగ్గరికే వెళ్ళాను మళ్ళీ. వాడు “ద ఇన్‌ఫ్లూయెన్స్అఫ్ బెంగాలి కల్చర్ ఆన్ గుజరాతీ ఆర్ట్” అన్న పుస్తకం చదువుకుంటున్నాడు.

“ఏంటోరా! అందరూ చక్కగా గ్రేట్ త్రిలింగా లాంటి వెబ్ సైట్స్‌కి వెళ్ళి హాట్ హాట్ న్యూస్ చదువుకుంటూంటే, నువ్వు ఇలా పేర్లు కూడా అర్థం కాని పుస్తకాలు చదువుతూంటావు,” ఫిర్యాదు చేశాను నేను.

“నువ్వు అడిగే రకరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి ఉండాలి అంటే మరి ఇలాంటి జ్ఞాన సముపార్జన తప్పని సరి,” చిరు నవ్వులు చిందిస్తూ అన్నాడు వాడు.

“ఇంతకీ నా సందేహం ఏంటి అంటే,” గొంతు సవరించుకున్నాను నేను.

“నాకు తెలుసులే న్యూ యార్క్ నగరంలో గ్రౌండ్ జీరో వద్ద మసీదు కట్టాలనుకోవడం పట్ల నా అభిప్రాయం ఏంటో కనుక్కోవాలనుకుంటున్నావు, కదూ!”

“నీకెలా తెలుసురా?”

“ఎప్పటినుంచో మనం స్నేహితులం. ఆ మాత్రం తెలీకుండా ఎలా ఉంటుంది?”

“సరే, ఇంతకీ అక్కడ మసీదు కట్టచ్చా లేదా?”

రాజేష్ గాడు గొంతు సవరించుకున్నాడు. “ప్రశ్న చాలా చిన్నది, సమాధానమే ఆకాశమంత పెద్దది,” అన్నాడు గంభీరంగా.

“ఐతే చెప్పొద్దులే,” అన్నాను నేను భయంగా.

“ఎహె, ఎఫెక్ట్ కోసం అలా అన్నాను. క్లుప్తంగా చెపాలంటే లీగల్‌గా వాళ్ళకు ఆ హక్కు ఉంది.”

“మరి చాలా మంది ఎందుకు అక్కడ కట్టకూడదు అని గింజుకుంటున్నారు? ట్విన్ టవర్స్‌ని ముస్లిము ఉగ్రవాదులు పేల్చేశారు కాబట్టి, అక్కడ మసీదు కట్టడం మానుతున్న గాయాన్ని రేకెత్తించినట్టు అవుతుంది అనా?”

“అది కూడా ఒక కారణం. కొంచెం బజారు భాషలో చెప్పాలంటే దాన్నే పని కట్టుకుని కెలకడం అనొచ్చు. నిజంగా అది కొందరు ముస్లిములు వాదిస్తున్నట్టు శాంతికి చిహ్నమే ఐతే, గ్రౌండ్ జీరో దగ్గర కట్టడం వల్ల, శాంతి మాట దేవుడెరుగు, కక్షలు కార్పణ్యాలు ఇంకా ప్రబలుతాయి. శాంతి కోరే వారైతే, జనం నుంచి వచ్చిన ఈ నిరసన చూసి, మసీదు కట్టాలనే ఆలోచన విరమించుకునే వారు. ”

“ఓహో!”

“పోనీ అది కడుతున్న మహానుభావుడెవరు? అబ్దుల్ రవుఫ్ అనబడే ఇమాము. ఆయన గారు 9/11 దాడులు జరగడానికి అమెరికాదే ఎక్కువ బాధ్యత అని ఆరోపించిన మానవతా వాది! ఆయన కడుతున్న ఈ శాంతి మందిరం, 9/11 దాడులలో చనిపోయిన అమెరికన్ల కుటుంబాలను సేద తీరుస్తుందంటావా? ఐనా స్థలం ఉంది కద అని మసీద్ ముందు పందుల పాక పెట్టడం, గుడి ముందు కబేళా షాప్ పెట్టడం ఎంత రస విహీనమైన చర్యలో, ఇదీ అలాంటిదే కాదా?”

“నువ్వు అలా చెప్తూంటే నిజమే అనిపిస్తూంది.”

“అది అటుంచి, అమెరికాలో ముస్లిముల సివిల్ రైట్స్ గురించి గగ్గోలు పెడుతున్న మన మేధావులు, ముస్లిములు మెజారిటీగా ఉన్న దేశాలలో మైనారిటీలకి పౌర హక్కులనేవే లేవు అన్న విషయం గురించి ఏ మాత్రం కిక్కురుమనరు. మలేసియాలో వారానికొక హిందువుల గుడి నేలమట్టం కావించబడినా, 2002 వరకు పాకిస్తానులోని హిందువులకు ముస్లిం క్యాండిడేట్లకు వోటు వేసే హక్కు లేకపోయినా, సౌది అరేబియాలో ముస్లిమేతరులు తమ ఇళ్ళల్లో మాత్రమే తమ పూజలు సాగించాలి, బయట తమ గుడులు చర్చ్‌లు కట్టడానికి వీలు లేదు అని ఆర్డర్లు జారీ చేసినా, మన సెక్యూలరిస్టుల దృష్టిలో అవేవి పౌర హక్కుల ఉల్లంఘన కాదు. కాని ముస్లిముల శాంతి మందిరాన్ని గ్రౌండ్ జీరో వద్ద వద్దు, వేరే ఎక్కడైనా కట్టుకోండి అంటే మాత్రం అది మత మౌఢ్యం.”

“కానీ ఒక పదిహేను శాతం ముస్లిములు మాత్రమే తీవ్ర వాదులట. దాని కోసం అందరిని ఒకే గాట కట్టకూడదట. మా వీధిలో సెక్యూలరిస్ట్ ఒకాయన చెప్పాడు.”

“అది నిజమే అనుకున్నా, ఆ పదిహేను శాతం మంది చేతుల్లోనే మొత్తం పవర్ అంతా ఉన్నట్టుంది. మిగతా 85 శాతం మంది ఏమీ మాట్లాడనప్పుడు, ఏ రకంగానూ మత మౌఢ్యాన్ని ఎదిరించనప్పుడు, వారు ఉంటేనేం, ఊడితేనేం?”

“అంటే?”

“ఏదో చాలా కొద్ది మంది తప్ప, ముస్లిములు ఎప్పుడూ ముస్లిమేతరులకు తమ మతస్తుల చేతుల్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడరు. కానీ దేశంతో సంబంధం లేకుండా సుదూరంగా ఉన్నా సరే, సాటి ముస్లిములకు ఏదైనా చిన్న అన్యాయం జరిగినా వెంటనే తీవ్రంగా స్పందింస్తారు. ఉదాహరణకు, 1991లో అమెరికా ఇరాకుని ముట్టడించినప్పుడు మన హైదరాబాద్‌లో ముస్లిములు గొడవ చేసినట్టు.”

“ఇంతకీ ఏమంటావురా?”

“ముస్లిములు తమ మతానికి జరుగుతున్న అన్యాయం గురించి ఘోషించే ముందు, వాళ్ళు మెజారిటీలుగా ఉన్న దేశాలలో ముస్లిమేతరుల పరిస్థితి ఎంత హీనంగా ఉందో అంగీకరించి, వారి హక్కుల కోసం కూడా అంతే సిన్సియర్‌గా పోరాడితే బాగుంటుంది. గ్రౌండ్ జీరో దగ్గర మసీదు కట్టడం కంటే ఇలాంటివి ప్రపంచ శాంతికి ఎక్కువ దోహదం చేస్తాయి.”

“అలా జరుగుతుందంటావా?”

“చూద్దాం!”

http://www.jihadwatch.org/2006/06/malaysia-temple-demolitions-spell-creeping-islamisation.html

http://www.guardian.co.uk/commentisfree/2008/apr/11/protectingpakistanshindus

http://www.asianews.it/news-en/Police-razes-clandestine-Hindu-temple-in-Riyadh,-deports-three-people-2905.html

Advertisements
This entry was posted in భూగోళం. Bookmark the permalink.

12 Responses to మస్జిద్ వహీ బనాయేంగే! (మసీదు అక్కడే కడతాం)

 1. nrahamthulla says:

  రెచ్చగొట్టేందుకు కాకపోతే మసీదు అక్కడే ఎందుకు కట్టాలి?మసీదే ఎందుకు కట్టాలి?సర్వమత ప్రార్ధనా మందిరం లాంటిది కూడా కట్టొచ్చు.డబ్బుంటే ఇంకా ఎక్కడయినా స్థలాలు కొని కట్టుకోవచ్చు.

 2. చాలా విషయాల్ని కలగా పులగం చేసి మీరు చెపాలనుకున్న దిశగా తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.

  • Murali says:

   ఇందులో కలగాపులగం ఏముంది? ముస్లిములు మిగతా వారి నుంచి పరమత సహనం ఎలా ఆశిస్తారో, అలాగే వాళ్ళు కూడా వేరే మతాల పట్ల సహనం, సమభావం చూపించాలి. తాము మెజారిటీలుగా ఉన్న దేశాలలో ముస్లిమేతరులని అణగ దొక్కి, తాము మైనారిటీలుగా ఉన్న దేశాలలో మాత్రం పౌర హక్కులు ఆశించడం చాల ప్రమాదకరమైన ద్వంద్వ ప్రమాణం.

 3. SNKR says:

  గ్రౌండ్ జీరొలో మసీద్ కట్టినా, ముస్లిం శ్మశానం కట్టినా ఓ శాంతికాముకుడిగా నేను స్వాగతిస్తాను. చైనా తియాన్మన్ స్కేర్ లో కూడా కడితే ఇంతకు 10రెట్లు సంతోషిస్తాను.:P

 4. @#$% says:

  >> చాలా విషయాల్ని కలగా పులగం చేసి మీరు చెపాలనుకున్న దిశగా తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.

  ఏ నీవుచేస్తే మేము విని చప్పట్లు కొట్టడం లేదా? ఎప్పుడైనా ఇలా నిన్ను నిలదీసామా?

 5. Pradeep says:

  Mee comedy track miss ayyina, excellent view on the present issue

 6. SK Reddy says:

  Well written.

 7. KumarN says:

  Murali Garu,
  Good. You have partially succeded in driving the point. Your signature subtle sircasm was missing.

  This is what I wonder…

  We see faces and hear voices opposing and supporting the Mosque at Ground Zero. It speaks great about America to see so many civilians, civil liberty unions, political leaders supporting the Mosque(Bloomberg, Obama, Pelosi, all TV pundits, a good percent of Democratic party etc.,). And ofcourse, we hear lots of opposition as well.

  But I don’t hear any voices from Muslim community taking a compassionate stand to come forward and appeal to Islam community. Why do we not hear any Islamic leader saying..Hey, let’s build the Mosque elsewhere, as this seems to be stirring so much of passion and bringback haunting memories of 9/11 to 9/11 families. The reaction so far seems to be counter-productive to the original intent of that Mosque. So far I heard feeble voices from couple of Canadian muslim women, urging fellow muslims to not take this issue too far and move the Mosque, in the name of harmony. I am not taking sides, all I am wondering is where are diverging voices/views within Muslim community on this issue?

  Why is this Islamic group, so monolithic in nature?

  • Murali says:

   Kumar,

   That’s exactly the point I am trying to make. If Islam needs to shed its negative image, it should allow dissent within its ranks. There are a few Muslims who would like to give a new direction to their faith, but either they are scared to death at worst or ineffectual at best.

   • NaChaKi says:

    This is what I always wondered! In fact, I wanted to suggest to Muslims in the local Islamic Center to start explaining the difference between Islam and Islamism. To be somewhat clearer, Islam has never been a problem but “Islamization” has always been so! (In fact, any religion becomes a problem if there’s “-ization”; that’s why there are people who don’t like the way Christian missionaries work. Thankfully, Hinduism being a non-proselytizing religion, it doesn’t have this issue. Or, well, the groups that want to make Hinduism a proselytizing religion – I wouldn’t take the names unless someone asks me to – are again contributors to a similar problem. Let me end the digression now.)

    In fact, Indian Muslims should lead the way here, IMHO. Muslims in India are usually much different from muslims elsewhere – that’s what _I_ noticed. (No debates here. If you wanted to debate, that’s because you and I didn’t encounter the same kinds of people/situations. I respect your opinion as much as I care for mine.) Country does come prior to religion to many muslims in India (than otherwise), contrary to the belief of a majority of Hindus. Well, I make an appeal to them to prove it!

    …I know, I didn’t even talk about Ground Zero or the proposed Mosque there. Well, I also want to see how many traditional Islamic groups would even consider the ultramodern structure being planned as a mosque, even if it’s built. Like the original article mentions, it’s only aggravating an otherwise peaceful scenario (much akin to what VHP/BJP and the likes have been doing with Ayodhya for decades together)!

 8. రవి says:

  కొన్ని వందల యేళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజానికి, పరమత అసహనానికి ఆద్యులెవరో చిన్నపిల్లాడికి కూడా తెలుసు. అయితే వారి గురించిన చర్చ వచ్చినప్పుడు “Conditions apply” అన్న పేరుతో వారిలో కొందరు మంచివారిని చూసి చర్చించాలి (excuse చేసేయాలి)! దాన్నే లౌకికత్వం అంటారు.

 9. tarakam says:

  the demand for constructions of mosque itself is so outrageous & repulsive.it is a sacrilege to the memory of so many innocent people who were killed on 9/11 in name of propagating the same religion.president obama is supporting this cause not because he is secular but he is sympathetic towards muslim cause.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s