మొండి చేయి

ఏడు కొండలు అరెమికాలో సెటిల్ ఐన ప్రవాస త్రిలింగ వాసి. ఆయన గారికి జంబూ ద్వీపం అంతా చుట్టి చూడాలని కోరిక. చాలా మంది త్రిలింగ ప్రజల్లానే ఆయన జంబూ ద్వీపంలో ఉన్నప్పుడు వాళ్ళ ఊరు కూడా దాటి బయటకు వెళ్ళలేదు. కాని అరెమికాకి వచ్చాక ఈ కోరిక పట్టుకుంది. కాబట్టి జంబూ ద్వీపానికి ట్రిప్ మీద వెళ్ళిన ప్రతి సారి ఏదో ఒక ప్రాంతం కవర్ చేసి వస్తూంటాడు.

ఈ సారి ఆయన గేరళ వెళ్ళాలని డిసైడ్ చేశాడు. గేరళకు “దేవుడి సొంత దేశం” (God’s own country) అని పేరు ఉండడం దానికి ముఖ్య కారణం. అనుకున్నదే తడవుగా గేరళకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఎడ్ (అదే ఏడు కొండలుకి షార్ట్ లెండి). ఊహించుకున్న దాని కంటే ఎంతో అందంగా ఉంది అక్కడ. ఆనంద భాష్పాలు తుడుచుకుంటూ తాను బుక్ చేసిన హోటల్ లాబీలోకి ఎంటర్ అయ్యాడు.

చెక్-ఇన్ దగ్గర మ్యానేజర్ బుకింగ్ కన్‌ఫర్మ్ చేసుకుని కీస్ బల్ల మీద పెట్టాడు. “Thank you very much,” అంటూ అతనితో కరచాలనం చేయడానికి తన చేతిని ముందుకు చాచాడు ఎడ్. మ్యానేజర్ తాళం చెవులు ముందుకు తోస్తూ సమాధానంగా నవ్వనైతే నవ్వాడు కానీ చేతిని అందివ్వలేదు.

కొంచెం హర్ట్ అయ్యాడు ఎడ్. “ఏంటో, చూడ్డానికి మర్యాదస్తుడిలానే ఉన్నాడు. ఇలా మ్యానర్‌లెస్ గా ఎందుకు ప్రవర్తించాడబ్బా?” అనుకుని, తరువాత, “ఇక్కడ కొబ్బరి నూనె ఫేమస్ కద. బహుశా ఒంటికి చేతులకి పట్టించినట్టున్నాడు. నా చెయ్యి ఖరాబు కాకూడదని ఇవ్వలేదనుకుంటా,” అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు.

గదిలో చెక్-ఇన్ అయ్యి కాస్త కుదుట పడ్డాక ఆ రోజు తన ప్రోగ్రాం చూసుకున్నాడు ఎడ్. ఇంకో గంటలో ట్యాక్సీ వస్తే అప్పయ్యర గుడికి వెళ్ళాలి. అంతవరకూ కాసేపు లాంజ్‌లో రిలాక్స్ అవుదామనుకుని కిందకి వెళ్ళాడు అతను. బార్ దగ్గర కూర్చుని ఒక డ్రింక్ ఆర్డర్ చేసి, పక్కనే ఉన్న ఒక పెద్ద మనిషి వైపు చూసి పలకరింపుగా నవ్వాడు. ఆయన కూడ ఓ నవ్వు పారేసి, “హల్లో!” అన్నాడు.

“I am ఏడు కొండలు, call me Ed,” అంటూ తన చేతిని చాచాడు ఎడ్. ఈ పెద్ద మనిషి కూడా చేతిని అందివ్వకుండా తన చెవిలో వేలు పెట్టి తిప్పుతూ, “I am కుట్టి, తంగ కుట్టి,” అన్నాడు.

ఏడు కొండలుకి ఒళ్ళు మండింది. “మీ గేరళాలో షేక్-హ్యాండ్ ఇస్తే చెవిలో వేలు పెట్టి కెలుక్కుంటారా?” కాస్త క్రూరంగా అడిగాడు.

తంగ కుట్టి నవ్వి, “అందుకు కాదు, నాకు చెవిలో దురద పెట్టడం వల్ల అలా చేశాను. ఈ మధ్య మా రాష్ట్రంలో షేక్-హ్యాండ్లు ఇవ్వడం మానేశాము,” చెప్పాడు.

“ఎందుకు?” అయోమయంగా అడిగాడు ఏడు కొండలు.

తంగ కుట్టి దానికి బదులు చెప్పకుండా, “Have a nice stay in గేరళా!” అని అక్కడినుంచి లేచి వెళ్ళిపోయాడు. తన ట్యాక్సీ వచ్చింది అన్న సమాచారం రావడంతో తను కూడా అక్కడి నుంచి నిష్క్రమించాడు ఎడ్.

***

ట్యాక్సీ డ్రైవర్ టూరిస్ట్ గైడ్ కూడా. అప్పయ్యర గుడి ఎడ్ చూస్తుంటే పక్కనే నడుస్తూ ఆ గుడి విశేషాలు చెప్తున్నాడు. అవి వింటూ “Wow”, “Fabulous”, humongous” లాంటి పదాలు వాడుతూ ఊ కొడుతున్నాడు ఎడ్.

ఒక చోట దారి ఏటవాలుగా ఉంది. అలవాటు ఉండడం వల్ల స్పైడర్-మ్యాన్‌లా పాకి, పైకి చేరుకున్నాడు డ్రైవర్. కానీ ఎడ్ వల్ల కాలేదు. “కాస్త నన్ను పైకి లాగు,” తన చేయి డ్రైవర్ వైపు అందిస్తూ రిక్వెస్ట్ చేశాడు.

“కుదరదు సార్, మీరే పాక్కుంటూ రండి,” చెప్పాడు డ్రైవర్.

“ఓరి మీ పద్ధతులు పాడు గానూ! అసలు చేయి ఎందుకు అందించరు మీరు?” కోపంగా అసహనంగా అడిగాడు ఎడ్.

“ఈ మధ్య ఇక్కడ అంతే సార్. కావాలంటే నాకిచ్చే బక్షీసులో కొంత మినహాయించుకోండి. నేను మాత్రం చెయ్యి ఇవ్వను,” తేల్చి చెప్పేశాడు డ్రైవర్.

చేసేది లేక కష్టపడి తానే పైకి పాకేశాడు ఎడ్.

***

మరుసటి రోజు ఎలాగైనా కనీసం ఒక్కరికైనా షేక్-హ్యాండ్ ఇద్దాం అని నిర్ణయించుకున్నాడు ఏడు కొండలు. తన గేరళా సైట్-సీయింగ్ పక్కన పెట్టి, ముందు ఈ విషయం అంతు చూడాలని ఫిక్స్ అయిపోయాడు.

కానీ రోజంతా ప్రయత్నించినా లాభం లేక పోయింది. కనీసం ఒక్కరితో కూడా చేయి కలుపలేక పోయాడతను. కొందరు ఐతే మొహమాటం లేకుండా చేతిని ప్యాంట్ జేబుల్లోంచి బయటకు కూడా తీయలేదు. ఈ విషయం ఇలా తేలదు, తను గూఢచారిలా మారడం ఒక్కటే మార్గం అనిపించింది అతనికి.

***

అనుకున్నట్టుగానే రాత్రి మంకీ క్యాప్ వేసుకుని గూఢచారిలా మారి రోడ్డున పడ్దాడు ఏడు కొండలు. ఐతే పెద్ద పరిశోదన చేయకుండానే అతనికి తనను పీడిస్తున్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆడుకుంటూ చూసుకోకుండా రోడ్డు మీదకి వచ్చేసిన ఒక కుర్రాడిని, ల్యారీ కింద పడకుండా చివరి క్షణంలో కాపాడాడు అతను.

ఆ కుర్రవాడి చుట్టాలు పక్కాలు కామోసు, ఒక గుంపు పరిగెత్తుకుంటూ వచ్చింది. అందులో అందరికంటే పెద్దగా ఉన్న ఒక వ్యక్తి ఏడు కొండలుతో, “నేను ఈ పట్టణంలోని అతి పెద్ద ధనవంతుడిని. నన్ను స్వర్ణ కుట్టి అంటారు. వీడు నా మనమడు. మా కులదీపాన్ని రక్షించావు. నీకేం కావాలో అడుగు,” గద్గదమైన స్వరంతో అడిగాడు.

తాను కేవలం మానవ ధర్మం నిర్వర్తించాడు, ఏమీ అవసరం లేదు అని చెబ్దామనుకున్నాడు ఎడ్. అంతలో అతనికి తన ప్రశ్న గుర్తొచ్చింది. వెంటనే, “ఏమీ అక్ఖర్లేదు లెండి. ఒక షేక్-హ్యాండ్ ఇస్తే చాలు,” అన్నాడు.

అంతే! ఆ మాట వినగానే పెద్దాయనతో సహా గుంపు మొత్తం తమ చేతులు ప్యాంట్ జేబుల్లో కుక్కేసుకున్నారు. (లుంగీలు కట్టుకున్న వాళ్ళు ఆ అవకాశం లేక తమ చేతులు వీపు వెనకాల దాచుకున్నారు.)

“అరే! మీరు కూడా ఇంతేనా? అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూంది. ఎందువలనచేత మీరు షేక్-హ్యాండ్లు ఇవ్వడం కానీ, చేయి అందించడం కానీ చేయట్లేదు?” ఆవేశంగా అడిగాడు ఎడ్.

“అదొక పెద్ద కథ బాబూ!” దీర్ఘంగా నిశ్వసించాడు స్వర్ణ కుట్టి.

“పర్లేదు, కావాలాంటే తెల్లారే వరకు వింటాను. మంకీ-క్యాప్ కూడా వేసుకొచ్చాను,” పట్టుదలగా అన్నాడు ఎడ్.

“ఒక రెండు నెలల క్రింద ఇక్కడ ఒక ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ సందర్భంగా కొశ్చెన్ పేపర్‌లో ఒక ప్రశ్న అడిగాడు. సబ్జెక్ట్ మారల్ సైన్స్‌లే. ఆ ప్రశ్న దేవుడికి, ఒక మనిషికి మధ్య జరిగే ఊహా జనితమైన సంభాషణ గురించి. మరి పొరపాటునో కావలనో, ప్రొఫెసర్ ఆ మనిషికి, ఇక్కడి ఒక మైనారిటీ మతానికి చెందిన ప్రవక్త పేరు పెట్టాడు. అది వాళ్ళకు నచ్చలేదు,” ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు స్వర్ణ కుట్టి.

“ఐతే వాళ్ళు ఏం చేశారు?” సస్పెన్స్ ఆపుకోలేక అడిగాడు ఏడు కొండలు.

“వాళ్ళు అసలే శాంతి కాముకులు బాబూ. మత సహనం ఎక్కువ. కాబట్టి ఆ ప్రొఫెసర్‌ని దారి కాసి ఆపారు. అతను దిగాక చేయి చాచమని అడిగారు. షేక్-హ్యాండ్ ఇస్తారేమో అని ఆ ప్రొఫెసర్ చేయి అందివ్వగానే దాన్ని మణికట్టు వరకూ నరికేశారు. ఇంకో సారి అలాంటి కొశ్చెన్స్ ఎగ్జాంలో అడగకుండా ఉండలని అట.”

“అయ్య బాబోయి! ఈ ఘాతుకమైన చర్యని మేదావులంతా ముక్త కంఠంతో ఖండించి ఉండాలే?”

“మేదావులంటే నీ ఉద్దేశంలో అధోగతి రాయ్ లాంటి వాళ్ళా నాయనా? వాళ్ళు సాధారణంగా ఈ చేయి నరికేసిన మనుషులకు చెందిన మతం గురించి మాట్లాడరు. వాళ్ళు విమర్శించేది ఎప్పుడూ మెజారిటీ మతాన్నే.”

“కనీసం ఆ ప్రొఫెసర్ కాలేజ్ వాళ్ళైనా, అతన్ని ఆదుకున్నారా?”

“లేదు బాబూ. అలాంటి ప్రశ్న పరీక్షలో అడిగినందుకు అతన్ని ఉద్యోగంలోంచి తీసేశారు. గేరళలో శాంతి నెలకొని ఉండడానికే వాళ్ళు అలా చేశారు.”

“ఎంత దారుణం!”

“అందుకే బాబూ, ఈ మధ్య ఇక్కడ అందరూ అపరిచితులకు చేయి అందించడం మానేశారు. ఇప్పుడు అర్థమయ్యిందా?”

నోట మాట రాలేదు ఏడు కొండలుకి. వెన్నెముక ఒక్క సారి వణికినట్టు అనిపించి, అప్రయత్నంగా తన చేతులు కూడా ప్యాంటు జేబుల్లో పెట్టేసుకున్నాడు.

Professor’s hand cut off in Kerala

http://en.wikipedia.org/wiki/2010_hand_chopping_incident_in_Kerala

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

12 Responses to మొండి చేయి

 1. Response

  The Kerala State Assembly raised its voice in unison to strongly condemn the hacking of T.J. Joseph, by fundamentalist elements on the following day.[86]

  Various Muslim organizations including the Indian Union Muslim League(IUML) condemned the attacks ……

  The Kothamangalam diocese demanded National Investigation Agency inquiry in to the entire incident…..

  The Bharatiya Janata Party set up a four-member panel headed by Mr Harin Pathak,senior Supreme Court lawyer, Pinky Anand, Goa BJP Vice-President, Wilfred Misquita and Advocate Balasubramanium Kamarasu…..

  The Hindu in its editorial said “Freedom of expression has increasingly come under attack from religious fanatics in democratic and secular India and it is the duty of society…..

  Littérateur M.N. Karasseri, himself a retired professor and someone who keeps tabs on Muslim politics, …..

  Progressive Muslim writer Hameed Chennamangaloor says in an Economic Times article, …..

  • Murali says:

   చాలా బాగుంది మహేష్ గారు,

   నేను ఇచ్చిన వికీపీడియ లింక్‌లోని సమచారాన్నే మళ్ళీ క్యామెంట్‌లా పేస్ట్ చేశారన్న మాట. బహుశా, “మేధావులు ఖండించలేదా?” అని ఏడు కొండలు అడిగిన ప్రశ్న మీకు ఎక్కడో తగిలినట్టు ఉంది.

   ఈ పోస్ట్ ఒక్క స్పందన గురించే కాదు. మన దేశంలో స్పందనలు ప్రతి స్పందనలు మామూలే. కొంత మంది అరెస్టులు కూడా మామూలే. 9/11 తరువాత తాలిబాన్ కూడా ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడిని ఖండించింది.

   ఇస్లాం మత మౌఢ్యం ఎలా వెర్రి తలలు వేస్తుందో, ఆ ప్రొఫెసర్‌కి అండగా నిలవాల్సిన యాజమాన్యమే భయంతో మళ్ళీ అతన్నే ఎలా శిక్షించిందో అన్నదే ఇక్కడ ప్రధానమైన పాయింట్.

 2. karthik says:

  another perfect one with ur style

 3. జేబి says:

  అయ్యో! మీ పేరడీల్లా సరదాగా చదివి ఆనందిస్తుంటే చివరన అసలు విషయం కలుక్కుమని తగిలిందండి. ఇలాంటివి రాసేటప్పుడు హాస్యం తగ్గించి వ్యంగ్యం పెంచగలరు.

 4. మతమౌడ్యం అన్ని మతాల్లోనూ ఒకటే. అది ఖండించాల్సిందే. అందరూ ఖండించిందే. ప్రొఫెసర్ కు అండగా నిలబడాల్సిన యాజమాన్యం అతన్ని మళ్ళీ శిక్షించడాన్ని గర్హించని మీడియా లేదు.

  ఈ ఘటన మధ్యలో మీరు మళ్ళీ అరుంధతి రాయ్ ని తీసుకురావడం నాకు ఆశ్చర్యంతో పాటూ చిరాకు కలిగించింది. She is fighting for democracy. She is voicing for the voiceless. She is doing what Noam Chomsky did to America to India.

  తను గుజారాత్ అల్లర్లను అత్యంత బలంగా వ్యతిరేకించిందనే ఒకే ఒక్క కారణం కాకపోతే ఎందుకు మీకీ అక్కసు? She is raised her voice for NBA, she brought attention to Dantewada, she is bringing in stories from tribal lands where corporates and Indian state is killing thousands of nameless faceless people. She is fighting against the mighty state of US against its mindless violence across the glob. Don’t you see all that??? are you have not chosen to see all that?

  • Murali says:

   మహేష్ గారు,

   ముందే చెప్పాను. చెయ్యి నరికాక వచ్చిన రెస్పాన్స్ ఈ పోస్ట్‌కి సంబంధించిన మెయిన్ పాయింట్ కాదు అని. కాలేజ్ మ్యానేజ్‌మెంట్, జోసెఫ్‌ని ఉద్యోగం నుంచి తీయకపోతే తమ చేతులు కూడా నరికేస్తారేమో అని భయపడే వరకూ వచ్చిందంటే, దానికి కారణం ఇస్లామిక్ ఉగ్రవాదులు దేశంలో సృష్టించిన సంక్షోభమే. ఇది నా టపా ముఖ్యాంశం.

   అరుంధతి రాయ్‌ని ఇందులోకి లాగడానికి మంచి కారణమే ఉంది. అలాంటి పరిస్థితి రావడానికి తన లాంటి మేధావులు కూడా ఒక ముఖ్య కారణం. (ఎక్కడ అవకాశం వస్తే ఇండియాని దుయ్యబడదామా అని ఆత్రంగా చూసే ఈవిడ చిన్నప్పుడు చదువుకున్న కొట్టాయంలోనే, ఈ సంఘటన జరిగింది. ఈ మహానుభావురాలు కిక్కురుమనలేదు.)

   మీరు అరుంధతి రాయ్‌ని ఎందుకు నెత్తిన పెట్టుకుంటారో కారణాలు వివరించారు. ఆవిడ సాగిస్తున్న మిగతా పోరాటాలు ఈ పోస్ట్‌కి సంబంధించి అప్రస్తుతం. ఉగ్రవాదానికి సంబంధిచినంత వరకూ, అఫ్జల్ గురూని ఉరి తీయొద్దు అని అభ్యర్తించే ఈ మేధావి, 11/26 ముంబాయి దాడులు జరిగింది ఇండియాలోని ముస్లిముల ఆర్థిక పరిస్థితుల వల్లే అని విశ్లేషించే ఈవిడ, నా దృష్టిలో ఒక దేశద్రోహి కిందే లెక్ఖ.

   • తార says:

    హయ్యో, హయ్యో, హయ్యో…
    తా చెడ్డ కోతి వనమంతా చెడిచినట్టు, ఆ రాయ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వారు మహా మేధావులు. తీవ్రవాదులు భారత సైన్యం చేతిలో హింసింపబడ్డ సాధారణ ప్రజలట. వారు వారికే, వారి పోరాటానికే మద్దతు ఇస్తున్నారు..
    జిహాద్

   • I am not shocked by your conclusions. I simply disagree with you.

  • Ravi says:

   Arundhati not only opposed Gujarat Riots but NEVER uttered a word on people killed in Godhra train.

   She also issued a statement saying that Kashmir is never part of India. There is supreme court case pending against her for sedition for the above statement.

   Why Godhra happened, you should read two articles both published in ia.rediff.com; Go google on “We were ready to punish Pakistan” and you will come across two articles. Read them and it will be an eye opener.

   Arundhati Roy is PSUEDO SECULARIST

   So is TEESTA SETALVAD

 5. amun says:

  Nice one 🙂

 6. మురళిగారు చాలా నిజాలు చెప్పారు. నిత్యానంద వీడియో వచ్చినప్పుడు నానా రభస చేసారు ఈ మేధావులు. ఆమధ్య, ఐ.బి.ఎన్.7 ఛానల్ లో కాశ్మీరులో జరుగుతున్న ఆందోళనలకు సంబంధించి ఒక హురియత్ కాంఫరెన్స్ నేత, తన అనుచరులకి ఇస్తున్న టెలిఫోను సూచనల రికార్డు వినిపించారు. అందులో ఆ నాయకుడు, పోలీసులను రెచ్చగొట్టి కాల్పులు జరిపేంత తీవ్రంగా పోలీసులపై విరుచుకుపడమని, కనీసం అయిదారు మంది జనాలైనా చచ్చిపోవాలని ఆదేశించాడు. ఇంత ఘోరంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యక్తుల బండారం బయటపడ్డా ఒక్క మేధావి కూడా వాడిని ఖండించలేదు. వీరంతా సెలక్టివ్ గానే రియాక్టౌతారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s