కిష్కింద కాండ


అది అల్లల్లడేబాద్ హై కోర్ట్. ఆ రోజు కోర్ట్ వారు ఒక సంచాలనాత్మకమైన తీర్పు వినిపించనున్నారు. అది రాఘవ జన్మ భూమి – గాబరా మసీద్ గురించి. అందరికంటే ముందు అక్కడికి చేరుకోవాలని ఎర్ర పార్టీ కార్యకర్తలు, నాయకులు పొద్దున్నే కోర్ట్ దగ్గరకు చేరుకున్నారు. కానీ ఆశ్చర్యం! అధోగతి రాయ్ అక్కడికి ఆల్‌రెడీ వచ్చి ఉంది.

“మా కన్నా ముందే వచ్చి వాలిపోయావు, అంత తొందరేమిటి వదినో!” అంటూ రాగం తీసింది ఒక ఎర్ర పార్టీ మహిళ.

“కుడి కన్ను అదిరితే వచ్చాలే వదినా,” సమాధానం చెప్పింది అధోగతి రాయ్.

“మాకు ఎడమ కన్ను అదిరిందిలే, అందుకే మేమూ వచ్చేశాం,” అప్పుడే అక్కడికి వచ్చిన సూడో సెక్యూలరిస్ట్ పార్టీ ప్రముఖుడు దుర్జన్ సింగ్ అన్నాడు.

“అదే, నా మనసు ఏదో కీడును శంకిస్తూంది. కొంప తీసి గాబరా మసీద్‌కి అనుకూలంగా తీర్పు రాదేమో అని గాబరాగా ఉంది,” ఆందోళనగా అంది అధోగతి రాయ్.

“అయ్యో మీరు ఫీల్ కాకండి! మనదసలే సూడో-సెక్యూలరిస్ట్ దేశం. అంతా మంచే జరుగుతుంది. అసలు రాఘవుడు అనే వాడు ఉన్నాడని గ్యారంటీ ఏంటి? ఆయనేమన్నా ఇంజనీరా? జంబూ ద్వీపానికి, ఛీ లంకకి మధ్య వారధి ఆయనే స్వయంగా కట్టాడా? అని ఎంతో తెలివితేటలతో అడిగిన అరవనాడు ముఖ్య మంత్రి కర్కశనిధి లాంటి వాళ్ళు మన వైపే ఉన్నారు. ఆ రాఘవ జన్మ భూమికి అనుకూలంగా తీర్పు వచ్చే సమస్యే లేదు,” నచ్చ చెప్పాడు దుర్జన్ సింగ్.

“ఐనా సరే, మనమెందుకన్నా మంచిది, రెండు రకాల స్టేట్‌మెంట్స్ తయారు చేసుకుందాం,” చెప్పాడు ఎర్ర పార్టీకి చెందిన సీతారాం నీచూరి.

“రెండు రకాల స్టేట్‌మెంట్సా? అవేంటి?” ఆశ్చర్యంగా అడిగింది అధోగతి రాయ్.

“అదే ఒక వేళ తీర్పు రాఘవ జన్మభూమికి వ్యతిరేకంగా వస్తే, ఇది సూడో-సెక్యూలరిజం శక్తులు సాధించిన ఘన విజయమని, మత ఛాందస వాదులకు చెంప దెబ్బ లాంటిదని అంటాం.”

“ఒక వేళ తీర్పు రాఘవ జన్మభూమికి అనుకూలంగా వస్తే?” అడిగింది అధోగతి రాయ్. ఆవిడ కళ్ళలో అప్రయత్నంగా నీళ్ళు తిరిగాయి.

“అప్పుడు, జంబూ ద్వీప చరిత్రలో ఇదొక బ్లాక్ డే అని, బాపూజీ బతికుంటే భోరుమని ఉండే వాడని, హెన్రూజీ బతికుంటే చొక్క చింపుకుని రోడ్డున పడే ఉండే వాడని స్టేట్‌మెంట్ ఇస్తాం,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు సీతారాం నీచూరి.

“అప్పుడే ఈ స్టేట్‌మెంట్స్ ఎందుకు?”

“మీకు తెలీదు లెండి. ఇలాంటి సంచలనాత్మకమైన తీర్పు రాగానే మన ప్రెస్సోళ్ళు వెంటనే మన అభిప్రాయాలకోసం లగెత్తుకుంటూ వస్తారు, ఇలా ప్రిపేర్ అయి ఉంటే టక టకా చెప్పేయొచ్చు.”

“అబ్బో బెమ్మాండం.”

ఇంతలో అల్లల్లాడేబాద్ హై కోర్ట్ తీర్పు వెలువరించింది. తగాదా పడిన స్థలాన్ని మూడు ముక్కలు చేసి, ఒక భాగం అహ్మదీయులకు, రెండు భాగాలు సింధువులకి చెందుతాయి అని ప్రకటించింది.

అంతే! ఆ తీర్పు విని బయట ఉన్న మేధావులంతా వీరంగం వేయడం మొదలు పెట్టారు. “ఓలమ్మో నానేటి సేతురో దేముడో,” కుమిలిపోయాడు సీతారాం నీచూరి.

“ఇద్దరు సింధువులు, ఒక అహ్మదీయ జడ్జ్ కాబట్టి, రెండు భాగాలు సింధువులకి ఇచ్చేసినారోలప్పా,” మొర పెట్టుకుంది అధోగతి రాయ్.

“పాపం మన అహ్మదీయ సోదరులకు చాలా అన్యాయం జరిగి పోయింది. వాళ్ళని పురికొల్పుదాం. సుప్రీం కోర్ట్‌కి వెళ్ళమని ప్రోత్సాహిద్దాం,” ఆవేశంగా అన్నాడు దుర్జన్ సింగ్.

“వాళ్ళు సుప్రీం కోర్ట్ వెళ్ళాలని ఆల్‌రెడీ డిసైడ్ చేసేశారక్కో. నాకు SMS వచ్చేసింది నాయనో,” దీర్ఘాలు తీసింది ఇంకో ఎర్ర పార్టీ మహిళా కార్యకర్త.

“అదేంటి? కోర్ట్ తీర్పుని శిరసావహిస్తాం అన్నారు కద అహ్మదీయులు,” అడిగాడు అక్కడ నిలబడి ఆ చోద్యమంతా చూస్తున్న అమాయక రావు.

“అది తీర్పు వాళ్ళకు అనుకూలంగా వస్తేనే బిడ్డా,” వివరించాడు అతని పక్కనే ఉన్న అనుభవ రావు.

“ఐనా ఏంటండి ఈ దారుణం, రాఘవుడు లీగల్‌గా ఒక వ్యక్తి ఏంటి నా బొంద. ఆయన ఉన్నాడని అధారాలు లేవు కద. సింధువులకి ప్రత్యేకంగా ఈ లా ఏంటి?” వాపోయింది అధోగతి రాయ్.

“అదే కద, పైగా కూలిపోయిన మసీదు గురించి ఎవరూ మాట్లాడరేం? దాన్ని సింధువులకి ఇవ్వడమేంటి?” అడిగాడు దుర్జన్ సింగ్.

“ఆ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ జంబూ ద్వీప్ వారు అక్కడ ఎన్ని లుకలుకలు చేశారో. అసలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే వారే లేరా?” బాధపడ్డాడు సీతారాం నీచూరి.

అక్కడ అకస్మాత్తుగా ఒక మెరుపు మెరిసింది. ధవళ వస్త్రాలు ధరించిన తేజో మూర్తి ఒకాయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు.

“నువ్వెవరు తమ్ముడూ, ఇలా సడెన్ ఎంట్రీ ఇచ్చావు?” ప్రశ్నించాడు దుర్జన్ సింగ్.

“నా పేరు అరుణ్ శౌర్యం. మీరే కద, సమాధానాలు చెప్పే వారెవరూ లేరా అని ఆక్రోశించారు, అందుకే వచ్చాను,” చిరు నవ్వుతో అన్నాడు ఆ వ్యక్తి.

“ఐతే గబ గబా చెప్పెయ్యి,” అన్నాడు నీచూరి.

“1. అహ్మదీయులు ఎప్పుడైతే యూనిఫార్మ్ సివిల్ కోడ్‌ని ఒప్పుకోలేదో, అప్పుడే సింధువులకు కూడా ప్రత్యేక లా ఏర్పాటయ్యింది. ఇంతకు ముందు తీర్పుల్లో కూడా సుప్రీం కోర్ట్ రాఘవుడిని ఒక judicial personగానే భావించింది.

2. ఇది సివిల్ కేస్. ఇందులో ప్రస్తుతం తీర్మానిస్తూంది ఆ భూమి పై ఎవరికి హక్కు ఉందని మాత్రమే. గాబరా మసీదు విధ్వంసం ఇక్కడ టాపిక్ కాదు.

3. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ జంబూ ద్వీప్ వారి తవ్వకాల సమయంలో, వాటిని పర్యవేక్షించడానికి ఇద్దరు జడ్జ్‌లూ, సింధువులకు మరియు అహ్మదీయులకు సంబంధించిన లాయర్లూ ఉన్నారు. ఆఖరికి అక్కడ తవ్విన కూలీల్లో కూడా అహ్మదీయులు ఉన్నారు. ఆ తవ్వకాల్లో బయట పడిన సింధూ దేవతా విగ్రహాలు ఎవరూ మసి బూసి మారేడు కాయ చేసి ప్రవేశపెట్టలేదు. అక్కడ ఒకప్పుడు సింధువుల గుడి ఉంది కాబట్టే, ఆ విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఈ విషయన్ని అల్లల్లాడేబాద్ అహ్మదీయ జడ్జ్ కూడా ఒప్పుకున్నాడు.

4. మీరడక్క పోయినా చెబ్తాను. ఇద్దరు సింధూ జడ్జ్‌లు కాబట్టి సింధువులకి రెండు భాగాలు ఇచ్చారని మీరనడం మీ ఉడుకుమోత్తనం తప్ప వేరే ఏమీ కాదు. ఇంతకు ముందు చెప్పిన అహ్మదీయ జడ్జే రాఘవుడి విగ్రహం ఉన్న చోటు ఆయనదే అని ప్రకటించాడు,,” చెప్పడం ఆపాడు అరుణ్ శౌర్యం.

“5. నువ్వొక్కడివే మేధావివి మేమంతా చవలాయిలం,” ఉక్రోశంగా అన్నాడు సీతారాం నీచూరి.

“లేదు, నేను ఒక్క impartial observerని. మేధావులు మాత్రం మీరే,” అంటూ మాయమయ్యాడు అరుణ్ శౌర్యం.

“ఏవిటో, అయన పుస్తకాలే కాదు స్పీచులు కూడా అర్థమయి చావవు నాకు, అధోగతి, నీకేమైనా అర్థమయ్యిందా?” అడిగాడు సీతారాం నీచూరి.

“అసలాయన మాట్లాడ్డం మొదలు పెట్టగానే నేను చెవ్వులు మూసుకున్నాగా!” చెప్పింది అధోగతి రాయ్.

“పదండి, పదండి. ప్రెస్సోళ్ళకు బోలెడు స్టేట్‌మెంట్శ్ ఇవ్వాలి,” అందరిని అక్కడి నుంచి బయలుదేర దీశాడు దుర్జన్ సింగ్.

“మాస్టారూ, ఏం జరుగుతూంది ఇక్కడ?” అయోమయంగా అడిగాడు అమాయక రావు.

“సాధారణంగా రాఘవుడికి ఆలయం కట్టాక, కోతులు వచ్చి చేరుతాయి. ఈ సారి కాస్త ముందుగా వచ్చాయి, అంతే,” నవ్వుతూ చెప్పాడు అనుభవ రావు.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

17 Responses to కిష్కింద కాండ

 1. “లేదు, నేను ఒక్క impartial observerని. మేధావులు మాత్రం మీరే,” అంటూ మాయమయ్యాడు అరుణ్ శౌర్యం.

  :))

 2. హిహ్హిహీ! మీ పేరడీలు బాగుంటాయండి.

  • Murali says:

   థాంక్స్ J.B. గారూ,

   మొండి చేయి టపా ద్వారా మీకు కొంత మన:క్లేశం కలిగించాను. I hope I made amends with this one.

 3. KumarN says:

  మురళి గారూ,
  అద్భుతం. ముఖ్యంగా పాత్రలకి పేర్లు పెట్టటం లో మాత్రం మీకు మీరే సాటి.
  అర్ధరాత్రి దాటాక్కూడా గట్టిగా పగలబడి మరీ నవ్వుతూంటే , ఇంట్లో వాళ్ళు కొట్టటానికి సిద్దమయ్యారు ఇక్కడ.

 4. బాగుంది టపా!

  వెలు”గిల్లు”ళ్లూ, ఒ”డలి నురగ”లూ చదివారంటారా?

 5. Shilpa says:

  Baga chepparu 🙂 !

  Could not stop thinking what name you’d have picked for Rahul Gandhi. Demand anukokapothe , Rahul gari RSS, SIMI comment meda mee post chudalani undi.

  • Murali says:

   తప్పకుండా! రోగి కోరింది అదే, వైద్యుడు ఇవ్వబోయేది అదే!

 6. Wanderer says:

  బ్రహ్మాండం!!! అధోగతి పేరు ఎంత aptగా పెట్టారో… చక్కటి పోస్ట్

 7. Sreenivas says:

  అదిరింది మురళి. మీకు మీరే సాటి.

 8. Amun says:

  “సాధారణంగా రాఘవుడికి ఆలయం కట్టాక, కోతులు వచ్చి చేరుతాయి. ఈ సారి కాస్త ముందుగా వచ్చాయి, అంతే,” నవ్వుతూ చెప్పాడు అనుభవ రావు.

  hahaha excellent

 9. Rajiv says:

  చాల బాగుంది ఎప్పటిలాగె… నెను ఈ మధ్య మీ టపాలు పని ఎక్కువగా ఉన్నపుడు మాత్రమె చదువూన్నాను… మంచి రెలీఫ్ ఇస్తాయని..

  “అనుభవరావు” “అమాయకరావు” “నీచూరి” అసలు నవ్వు ఆగట్లెదు ఇంకా..

  ఈ అరున్ శౌర్యం ఎవరొ తెలియలెదు… నెను పెద్దగా ఆ న్యూస్ ఫాలొ అవ్వలెదు లెంది…

  అసలు ఆ తీర్పు ఇస్తున్నారు అని తెలియని వాళ్ళకి కూడా ఈ-మైల్స్ మరియు టివిలలొ తెగ చెప్పారు… ఈ తీర్పు వల్ల అనవసరంగా గొడవల్లొ పదొద్దు అని… అదెం ఆనందమొ ఎమొ

  • Murali says:

   He’s none other than Arun Shourie. For a long time he has been the sole defender, nay bulwark, against the Leftist propaganda.

 10. Ramana Turlapati says:

  sattire adirindi, perulu adiraayi..bapu maatram maraledu, maarakoodadu.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s