సాహో రే సాహుల్!

“జగన్మోహన్, జగన్మోహన్,” పిలిచింది ఢిల్లీ అమ్మ. ఆవిడ ఆఫీస్ గది బయటే నిలబడి ఉన్న జంబూ ద్వీప ప్రధాని జగన్మోహన్ సింగ్ ఆవిడ పాద రక్షలు తీసుకుని లోపలికి పరిగెత్తుకొచ్చాడు. “ఇదిగోండమ్మా మీ చెప్పులు,” ఆవిడ ముందు పెట్టాడు.

“ఛీ, ఇప్పుడివి తెమ్మని ఎవరన్నారు,” కసురుకుంది ఢిల్లీ అమ్మ.

“తెమ్మన లేదా, మరి ఎందుకు పిల్చారు?” బుర్ర గోక్కున్నాడు జగన్మోహన్ సింగ్.

“అబ్బాయి సాహుల్ రాజకీయంగా ఎన్ని తెలివితేటలు సంపాదించాడో, ఎంత ఎదిగిపోయాడో, ఎంత రాజకీయ పరిణితి సాధించాడో తెలుసుకోవాలి.”

“దానికి తెలుసుకోవడం ఎందుకమ్మ. రాజకీయాలకు సింహ ద్వారం అయిన మన వంశంలో పుట్టడమే చెప్తూంది కద, బాబు ఎంత గొప్ప రాజకీయ వేత్తో?”

“మీకు ఇంత పెద్ద డయలాగ్స్ ఎవరిచ్చారు? నేను చెప్పింది చేయండి చాలు.”

“ఏం చెయ్యమంటారు?”

“మన గాంక్రెస్ నాన్-వర్కింగ్ కమిటీకి కాల్ చేసి రేపు సమావేశం కావాలని చెప్పండి. రేపు మీటింగ్‌లో బాబుని పరీక్ష చేయాలి. సాహుల్‌ని టెస్ట్ చేయడానికి అందరూ రెడీగా ఉండాలని చెప్పండి.”

“చిత్తం!”

***

మరుసటి రోజు గాంక్రెస్ నాన్-వర్కింగ్ కమిటీ సమావేశమయ్యింది. అతి రథ మహారథులు అందరూ విచ్చేశారు. అంటే వృణబ్ ముఖర్జీ, దుర్జన్ సింగ్, P.ఏకాంబరం, దిక్-అపజయ్ సింగ్ లాంటి వారన్న మాట.

ఢిల్లీ అమ్మ దర్బారు తీర్చింది. సాహుల్ ఆవిడ పక్కనే ఉన్న చిన్న సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. గదిలో వలయంగా మహారథులంతా కూర్చుని ఉన్నారు. మధ్యలో ఎత్తైన టీవీ స్క్రీన్ ఉంది.

ముందుగా P.ఏకాంబరం లేచి నుల్చుని గొంతు సవరించుకున్నాడు. “సాహో సాహుల్ సామ్రాట్, మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. మీకు ఎన్నో పనులుంటాయి, ఎన్నో గుడిసెల్లో దూరాలి. అందుకే పరీక్ష నిడివి చిన్నదిగా ఉంటుంది.”

“గుడిసెల్లో దూరడమేంటి, అసహ్యంగా? ఏం మాట్లాడుతున్నారు మీరు?” కోపంగా అంది ఢిల్లీ అమ్మ.

“అదేనమ్మా, బాబు ఈ మధ్య ఊరూరా పర్యటిస్తూ, చలితుల వాడల్లోకి వెళ్ళి, వారి గుడిసెల్లో దూరి మరీ వారి యోగ క్షేమాలు విచారించుకుంటున్నారు కద, దాని గురించి నేను చెప్పేది.”

“ఏడ్చినట్టుంది. ఆ చెప్పేది కాస్త అందంగా చెప్పండి. గుడిసెల్లో దూరడమేంటి మీ మొహం? వారి గుడిసెలకు కూడా వెళ్ళి అనొచ్చుగా?”

“అలాగేనమ్మా తప్పై పోయింది. బాబూ, ఇప్పుడు టీవీ స్క్రీన్‌ని ఒక సారి పరికించండి,” సాహుల్‌ని రిక్వెస్ట్ చేశాడు P.ఏకాంబరం.

టీవీ స్క్రీన్ మీద ముందుగా ఒక కుక్క ప్రత్యక్షమయ్యింది, “భౌ భౌ,” అంటూ. కాసేపటి తరువాత ఒక మేక “మే,మే,” అంటూ స్క్రీన్ మీదకు వచ్చింది.

“దీని మీద మీ విశ్లేషణ?” అడిగాడు ఏకాంబరం.

“ముందు వచ్చింది కుక్క, తరువాత వచ్చింది మేక. రెండూ ఒకటే!” అన్నాడు సాహుల్ గాంధి.

“ఓ, మై గాడ్! వాటే బ్యూటిఫులు అనాలిసిస్!” అంటూ ఆనందం తట్టుకోలేక కింద పడ్డాడు దిక్-అపజయ్ సింగ్.

“ష్, పరీక్ష మధ్యలో టోటల్ సైలెన్స్,” గదిమింది ఢిల్లీ అమ్మ.

తరువాత వృణబ్ ముఖర్జీ లేచి నిలబడ్డాడు. “బోబూ (అంటే వాళ్ళ భాషలో బాబుకి వచ్చిన తిప్పలు), ఇది చూడండి,” టీవీ స్క్రీన్ వైపు చూస్తూ అన్నాడు.

టీవీ స్క్రీన్ మీద ఒక నక్క ప్రత్యక్షమయ్యింది. కాసేపు ఊళలు వేస్తూ గోల చేస్తూ తిరిగింది. ఆ తరువాత పిక్చర్ మారింది.

ఒక దివ్య లోకం టీవీ మీద దర్శనమిచ్చింది. నడుము కింద నుంచి నాగు పాము శరీరం, పైన మానవ దేహం ఉన్న ఆకారాలు కాన వచ్చాయి. కళ్ళు చెదిరిపోయే మణులు మాణిక్యాలు కుప్పలుగా పోసి ఉన్నాయి. నాగస్వరం లాంటి నాదం లీలగా వినపడుతూ ఉంది.

కాసేపు సాహుల్‌ని చూడనిచ్చాక, “దీని మీద మీ అభిప్రాయం?” అడిగాడు వృణబ్ ముఖర్జీ.

“మొదట చూసింది నక్క. తరువాత చూసింది నాగలోకం. రెండూ ఒకటే,” అన్నాడు సాహుల్.

“వాట్ ఎన్ ఇంటెలిజెన్స్! నేను తట్టుకోలేను బాబోయి,” నేల మీద పడి దొర్లాడు దిక్-అపజయ్ సింగ్.

“సైలెన్స్ అన్నానా, ఏమిటీ అల్లరి?” ముద్దుగా విసుక్కుంది ఢిల్లీ అమ్మ.

తరువాత దుర్జన్ సింగ్ లేచి నిల్చున్నాడు. “సాహుల్ యువరాజా, ఈ సన్నివేశాలు గమనించండి,” అన్నాడు టీవీ వైపు చూపిస్తూ.

ఈ సారి టీవీ మీద ముందు ఒక డాక్యుమెంటరీ చూపించబడింది. అది ఎస్.ఆర్.ఆర్. అనే సింధువుల ఆర్గనైజేషన్ గురించి.

ఎస్.ఆర్.ఆర్ కి సంబంధించిన కార్య కర్తలు విపత్కర పరిస్థితుల్లోనూ, ప్రకృతి కలిగించే ఉపద్రవాల్లోనూ మారు మూల పల్లెలకి పోయి మరీ అక్కడ ప్రజలను ఆదుకోవడం, రిలీఫ్ కార్యక్రమాలు చేపట్టడం చూపించారు. 1975లో మందిరా గాంధి ఎమర్జెన్సీ విధించినప్పుడు శాంతియుతంగా సత్యాగ్రహం చేసి స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యి, గాంక్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మళ్ళీ 1977లో ఎలెక్షన్స్ నిర్వహించేలా ఎలా చేసిందో చూపించారు. పది వేలకు పైగా ప్రచారకులు అకుంఠిత సేవా భావంతో జంబూ ద్వీపం నలు చెరగులా వ్యాపించి తమ జీవితానే ప్రజలకోసం ఎలా అంకితం చేశారో చూపించారు.

తరువాత విమీ అనే అహ్మదీయ విద్యార్థి సంస్థ గురించి ఒక షార్ట్ ఫిల్మ్ చూపించబడింది.

అందులో 2006లో మాములురాష్ట్ర రాజధానిలో జరిగిన ట్రెయిన్ విస్ఫోటాలలో విమీ ప్రముఖ పాత్ర ఎలా వహించిందో, 2008లో అహం-దా-బాద్‌లో ఢిల్లీ అమ్మ సొంత ఊర్లో జరిగిన పేలుళ్ళని, తామే జరిపించినట్టు, విమీ ఎలా అంగీకరించిందో చూపించ బడింది.

“మీ అమూల్యమైన అభిప్రాయం?” అడిగాడు దుర్జన్ సింగ్ సాహుల్‌ని.

“మొదట చూసింది ఎస్.ఆర్.ఆర్ గురించి. తరువాత చూసింది విమీ గురించి. రెండూ ఒకటే,” తెలివిగా మొహం పెట్టి అన్నాడు సాహుల్ గాంధి.

అంతే! రూం మొత్తం చప్పట్లతో మారు మోగింది. ఢిల్లీ అమ్మ సింహాసనం దిగి వచ్చి సాహుల్ గాంధిని దగ్గరకు తీసుకుని ఆనంద భాష్పాలతో, “నిజమైన గాంక్రెస్ రాజకీయ నాయకుడివి ఈ రోజు అయ్యావు బాబూ,” అంది గద్గదమైన స్వరంతో.

“సాహో రే సాహుల్,” అన్న అరుపులు ఆ గదిలో ప్రతిధ్వనించాయి.

“Allah is our Lord, the Qur’an is our constitution, Muhammad is our leader, Jihad is our way and Shahada is our desire”. – SIMI’s slogan

“It’s conceded by even their worst detractors that the RSS has been in the forefront of the non-offical rescue and relief(operations). This has led to an upsurge of goodwill for the Sangh.” – India Today, Feb 12, 2001 issue.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

20 Responses to సాహో రే సాహుల్!

 1. చైతన్య .ఎస్ says:

  🙂 🙂

 2. భలే బాగుంటున్నాయండి మీ టపాలు!

  నిన్ననే నేను వ్రాసిన బ్లాగులో, “సాహుల్ బ్రాందీ” అన్న మాటలని ‘ఏకాంబరం’ మళ్లీ అన్నాడని వ్రాయడం మరిచిపోయాను!

  ఆ లోటు మీరు తీర్చారు.

 3. anitha says:

  enti sagam lo vadilesinattunnare??

 4. బాగా నవ్వించారండి. పేర్లు కూడా బాగా పెడతారండీ!

 5. Sravya Vattikuti says:

  🙂

 6. Keshav says:

  Murali Gaaru, thanks andi. Rahul lanti vallu desaniki PM ayithe entha pramadamo baaga funny velo chepparu..Jai Hind.

  -Keshav

 7. Wanderer says:

  అద్భుతమైన పోస్ట్. సాహుల్ అన్న సింపుల్ పేరే కాస్త నిరుత్సాహంగా ఉంది. వాడి లెవెల్ కి వీరంగమైన పేరేదో పెడతారనుకుంటే… ఐనా వాడి చేష్టలు compensate చేసేసాయనుకోండి. సాహుల్ గుడిసెల్లో దూరే అలవాటుని బాగా ఎత్తిచూపించారు. సామెతలో చిన్న సవరణ, “నక్కకీ నాకలోకానికీ పోలికా?” నాకలోకం అంటే స్వర్గలోకమని.

  సెటైర్ లలో మీకు మీరే సాటి.

 8. “నాన్-వర్కింగ్ కమిటీ” – సూపర్! 🙂

 9. మంచు says:

  హ హ హ.. నక్క నాకలోకం(నాగలోకం) చదవగానే అర్ధం అయిపొయింది మీరు దేన్ని టార్గెట్ చేసారొ… మీ సటైర్ లు మాత్రం భలే ఉంటాయ్

 10. Tirupathi Gundu says:

  Hello Teta,
  Good job Teta, as usual! Nakka naagalokam is same for me too. Saahul and Jaganmohan are the only hope for Jumbo Dweep for now.
  SRR is full of VIMI type of people. Dilli amma, Jaganmhan and Saahul just happened to India out of pure luck. Jumbo people(we are not talking about elite) if given a choice will worship people like KCR to become thousand pieces like former VSSR. Currently JUMBO dweep govt. ontrols the metropols and the rest of the Dweepam is under the control of Chaoists from Chinnna desam.
  P Ekaambaram is helpless while our law enforcement agencies and border protection forces dont have the guts to enter our villages.
  Jumbo dweep can become former VSSR very soon as we all revel in the call center success stories.

  Jumbo Dweeep people,genetically prefer slavery, are corrupt to the bone compromising national interests.
  The rare combo of Dilli amma, PM Faganmohan and Saahul is the only most preferred choice for this kind of slave nation that needs selfless dictators who work hard for the welfare of the nation.
  Let us not forget that Jaganmohan brought the reforms as a finance minister too. Jaganmohan need not be a rebel to meet the national interests. I really love your RAATALU.
  Luv,
  Tirapati Gundu

 11. శాలివాహన says:

  ఇప్పుడే అందిన వార్త. నాన్-వర్కింగ్ కమిటీ ఇచ్చిన ప్రోత్సాహంతో సాహుల్ కుమారులవారు అల్లలడేబాద్ హైకోర్ట్ తీర్పుతో హతాశులై గుండెలు బాదుకుంటున్న దేశంలోని సూడో-సెక్యులరిస్టులందరిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం దేశంలో కలుపుమొక్కలు ఎక్కడెక్కడ ఎక్కువున్నాయో నివేదిక సిద్దం చేస్తున్నారని అభిజ్ఞాన వర్గాల భోగట్టా. నివేదిక సిద్దం కాగానే సాహుల కుమారులవారు ఆ ప్రాంతాలన్నిటికి వెళ్ళి వారితో పాటూ కూర్చుని ఏడ్చి, ముక్కు చీది ఓదార్చి వస్తారు.

 12. Shilpa says:

  Murali garu,

  As always, maa feelings ki meeru chamatkara akshra roopam iccharu. Appreciate your talent.

  Tirupathi Gundu garu, Shaalivahana garu – Murali gari resonance ki manchi extension icharu ! I am with you along the same lines of frustration 😦 !

 13. Amun says:

  Excellent

 14. Sandeep says:

  konnaaLLu raahul gaandhi manchi pradhaani avutaaDani anukunnaanu. kaanee, ee madhyana atanu maree mundu, venuka lEkunDaa comments chEstunnaaDu.

 15. Lakshmi says:

  Murali garu me next blog eppuda ani 3 months nunchi chustunnam.Tvaragaa tapa rastarani asistu…

 16. anamika says:

  durjan singh peru sariga saripoyyindi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s