మెగా వంచన

ఏ కొంపలు అంటుకున్నాయి?
ఏ ఆకాశం విరిగి పడింది?

సరే, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడానికి
అన్నగారిలా అందరికి చేత కాకపోవచ్చు. (ఆయన రూటే వేరు!)

అప్పుడే నీ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోలేదు కద!
నీ అభిమానులు ఎన్ని తప్పులు చేసినా వెన్నంటే ఉన్నారు కద!

మధ్యస్థంగా మధ్యంతరం ఎలాగూ వచ్చేది.
అలా కాకపోయినా మూడేళ్ళాగితే మళ్ళీ ఎన్నికలు ఎలాగూ వేంచేసేవి.

పదవి కోసం ప్రాకులాడనంటూ ఉటంకిస్తూ (రాజకీయాల్లో అలా చెప్పడం మామూలే అనుకున్నా),
ఒకే సారి మరీ ఇంతా దిగజారుడా?

ఇక మంత్రి ఐనా, ముఖ్య మంత్రి ఐనా లాభం ఏంటి?
మెగా అభిమానాన్ని అప్పనంగా తీసుకెళ్ళి అమ్మకానికి పెట్టాక?

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

10 Responses to మెగా వంచన

 1. Indian Minerva says:

  by the way చిరంజీవిది “ప్రాకులాట” కాదండి అది “డ్రాకులా”ట – అదికారదాహం.

 2. పార్టీ నడపదానికి డబ్బుల్లేవటండీ…అందుకే జెండా ఎత్తేసి జై కాంగ్రెస్ అంటున్నాడు.

  అయినా మీరేంటి ఇంత చిన్నగా రాసారు…ఏదో పెద్ద కథ అల్లి ఉంటారని వచ్చి చూస్తే మరీ బొత్తిగా 10 లైన్లు కనిపించాయి….ఈ అంశంపై మీ స్టైల్లో, పేర్లు మార్చి ఓ కథ రాయండి. 🙂

 3. surya says:

  నేను కూడా “పోస్ట్” అని వాకిట్లో నిలబడిన కుయిలీ, ఏ పనీ లేక నిద్రోతూ ఉలిక్కిపడి లేచి తలుపు తీసిన పరాన్నజీవి, కవరు ఓపెన్ చేసుకుని చూసుకుంటే ఢిల్లీ నించి నార్నియమ్మగారి కొలువులో ఉద్యోగం, నిద్రమత్తు ఎగిరిపోయి ఉక్కిరిబిక్కిరైన అతనూ మరియు అతని చెలికాడు అంబలి…. ఇలాంటి స్టోరీ ఏదో ఉందనుకుని ఊహించేసుకున్నానండి.

 4. రవి says:

  తన్ను తాను వంచించుకున్నాడు. ఇంకెవర్నీ కాదు.

 5. tirapati gundu says:

  what Teta,
  r u out of gas, creativity and humor?
  what is this editorial style?

 6. Anon says:

  @Indian Minerva:

  “అదికారదాహం” Show me one person in current politics who doesn’t have this

 7. చిరంజీవిది మెత్తని మనసు..
  ఆయనకు రాజకీయాలలోని కుళ్ళు కుతంత్రాలు తెలియవు..
  నమ్మించి గొంతులు కోయడం వెనకే గోతులు తీయడం చేతకాదు..
  రాజకీయాలలో వచ్చే విమర్శలను ఎదుర్కోవడం ప్రతివిమర్శ చేయడం ఆయనతో కానిపని..
  రాజకీయాలకు చిరంజీవి తగడు..
  చిరంజీవికి రాజకీయాలు రావు..
  అంతే..

  • Murali says:

   చిరు తను రాజకీయాలకు పనికి రాడు అని అర్థం చేసుకున్నాక, గాంక్రెస్ పార్టీలో చేరడం కంటే తన పార్టీ మూసేసినా ఆయనకి, ఆయన ఇమేజ్‌కి, ఆయన అభిమానులకి, అందరికీ బాగుండేది. Now, Prajaa Raajyam Party will always be remembered as one of the worst political experiments in modern India.

 8. నటన తన సొత పని..అభిమానులను నమ్ముకొని పార్టీ పెట్టాక సొంత బావ అధికారం లాక్కున్నాడు. టికెట్లు అమ్ముకున్నాడు.కంపెనీ అనీ అదనీ ఇదనీ ఒక్కొక్కరూ బురదచల్లి లేదా బురదను అసహ్యించుకొని వెళ్ళిపోయారు.రాజశేఖర్ జీవిత రోజాలాంటి గుంటనక్కలు ఆయనను మానసికంగా కృంగదీయడానికి ఎత్తులు వేసారు.అభిమానులు గెలిపించివుంటే ముఖ్యమంత్రి అయి జనానికి సేవ చేసే దిశగా అడుగులు పడి వుండేవేమో.. 18 సీట్లిచ్చిన అభిమానుల అభిమానులకోసం ఆయన దాదాపు రెండు సంవత్సరాలు నరకం చూసారు..అభిమానులే అభిమానం వేరు రాజకీయాలువేరు అని మొహమ్మీద చెప్పారు..ఆయన సున్నితహౄదయుదైన కళాకారుడు..జంకూ..గొంకూ..సిగ్గూ..ఎగ్గూ..లేని రాజకీయ నాయకుడు కాదు..ఇలాంటి అభిమానులకు ఇంకెలా బుధ్ధి చెబుతారు..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s