ది గ్రేట్ జంబూ ద్వీప్ క్యామెడీ సర్కస్ – 2010

గత సంవత్సరంలో ఎందరో ప్రముఖులు తమదైన శైలిలో (అంటే పిచ్చి వాగుడు వాగడం ద్వారా అని గమనించగలరు) మనకు వినోదాన్ని పంచారు. వాటిలో కొన్ని మచ్చు తునకలు.

 1. బాలిక్ (పీకిస్తాన్ మంత్రివర్యులు): ఉగ్రవాదం వల్ల ఎక్కువగా నష్టపోయింది పీకిస్తానే! ప్రపంచ దేశాలు అన్నీ మాకు దొడ్డ మనసుతో ఆర్థిక సహాయం చేయాలి.
 2. రిచంజీవి: ఇష్టా రాజ్యం పార్టీ గాంక్రెస్‌తో విలీనం చేసే ప్రసక్తే లేదు. అలా చేయడం తల్లి గొంతు నులిమినట్టే!
 3. ఢిల్లీ అమ్మ: కరప్షన్ పైన గాంక్రెస్ యుద్ధం ప్రకటిస్తూంది. జగన్మోహన్‌కి ఏ పాపం తెలీదు.
 4. సాహుల్: “అహ్మదీయ ఉగ్రవాదం కంటే, సింధువుల ఉగ్రవాదంతోనే జంబూ ద్వీపానికి ప్రమాదం ఎక్కువ.” (కాలు నోట్లో ఉండడం వల్ల ఆయన మాటలు పూర్తిగా వినపడలేదు.)
 5. వై.నో. గగన్: ఓదార్పు యాత్రకు రాజకీయ రంగు పులమకండి. ఓదార్పు అనేది రాజకీయలకు అతీతం.
 6. మొద్దియూరప్ప (కంకర్‌నాటక ముఖ్య మంత్రి): నా కొడుకులు అమాయకులు. (అలా అనిపించినా ఇది బూతు కాదని మనవి.)
 7. కీసర బాసర నారాయణ రావు: “పరమ ఘోర చక్ర”లో ప్రదర్శించిన నటనకి బుజ్జి క్రిష్ణకి ఉత్తమ నటుడి అవార్డ్ వస్తుంది. ఈ చిత్రం పట్ల ఆయన అభిమానులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు.
 8. వీ.సీ.ఆర్: బృందగాన ఇస్తే ఢిల్లీ అమ్మ కాళ్ళు కడుగుతాం. బృందగాన రాష్ట్ర సమితిని గాంక్రెస్‌లో విలీనం చేస్తాం. (Dec 26, 2010)
  బృందగాన రాష్ట్ర సమితిని గాంక్రెస్‌లో విలీనం చేసే ప్రసక్తే లేదు. కె.కె. (కె. కాకర రావు) చెప్పింది జోక్ అఫ్ ద ఇయర్! (Feb 7, 2011)

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

2 Responses to ది గ్రేట్ జంబూ ద్వీప్ క్యామెడీ సర్కస్ – 2010

 1. Anuradha says:

  “కాలు నోట్లో ఉండడం వల్ల ఆయన మాటలు పూర్తిగా వినపడలేదు.”
  :))))

 2. రవి says:

  బెస్ట్ కమెడియన్ అవార్డు రేసులో రిచంజీవి, సాహుల్ పోటీ పడుతున్నారు. స్పెషల్ జురీ అవార్డుకు కీసర బాసర ను ఎంపిక చేయవచ్చు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s