“ఎర్రి” మొహాలు, కొడగట్టిన సూరీడు, అత్యధిక మెజారిటీలు


“దోమ నిన్ను కుట్టింది, చీమ నిన్ను కుట్టింది, నేను నిన్ను కుట్టితే తప్పా?

దోమ రాత్రి కనపడదు, చీమ సౌండు వినపడదు, ఏమిటంట నీలోని గొప్ప?

అవి కుడితే నీకు డేంజర్ లేదమ్మా, నే కుడితే సెప్టిక్ అయిపోతుందమ్మా.

నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా, నువ్వందకపోతే వృధా ఈ జన్మ”

మగ ఆడ గొంతులు మార్చి మార్చి ధన్వంతరి గాడు పాడుతున్న పాట వినపడి తలుపు బయటే ఆగిపోయాను నేను. వీడు కవి కావాలని ఏ ముహూర్తాన నిర్ణయించుకున్నాడో కానీ, ఈ మధ్య కరెంట్ అఫెయిర్స్ డిస్కస్ చేయడానికి వీడింటికి రావాలంటే భయం పట్టుకుంది నాకు. కానీ ఏం చేస్తాం, సివిల్స్ పాస్ కావాలంటే తప్పదు మరి. గుండె రాయి చేసుకుని వాడింట్లో అడుగు పెట్టాను.

“రారా, నీకోసమే వెయిటింగ్. ఆలస్యం అవుతుందని కాస్త కవిత్వం ప్రాక్టీసు చేసుకుంటున్నా,” బ్రైట్‌గా అన్నాడు ధన్వంతరి.

“ప్రాక్టీస్ చేసుకోవడానికి అదేమన్నా హ్యాండ్ రైటింగా? ఐనా ఇది కూడా ఇంద్ర బోస్ రాసిన పాటే కద?”

“ఆయనే నాకు ఇన్స్పిరేషన్ గురూ, సింపుల్ పదాలు వాడి సెన్సేషనల్ మీనింగ్ సృష్టిస్తాడు. గత వారం పాడిన పాట ‘ మౌనంగా మొరగమని ‘నే తీసుకో. అది..”

“వద్దు, మళ్ళీ ఆ పాట పాడొద్దు. కావాలంటే నువ్వు ఆయన కంటే గొప్ప కవి అని ఒప్పుకుంటా.”

“థాంక్యూ గురూ! మరి వార్తలు చూద్దామా?”

“పద, నీదే ఆలస్యం.”

టీవీ ఆన్ చేయగానే గడప డిస్ట్రిక్ట్ నుంచి లైవ్ ప్రసారం. ఒక పెద్ద గుంపు అందరు మొహాల మీద గుడ్డేసుకుని వెళ్తున్నారు.

నేను ధన్వంతరి వైపు ప్రశ్నార్థకంగా చూశాను.

“వీళ్ళంతా వై.నో. గగన్‌కి పోటీగా నిల్చుని ఎలెక్షన్లలో డిపాజిట్ కోల్పోయారు,” వివరించాడు వాడు.

“అంటే వై.నో. గగన్ మచ్చ లేని నాయకుడు అని ఋజువు అయ్యిందన్న మాట. అంత అధిక మెజారిటీతో గెలిచాడంటే, అదే కదా అర్థం!” అన్నాను నేను.

“ఏరా నువ్వేమన్నా ఛాఛీ దిన పత్రికకి పని చేస్తావా? జర్మనీలో ఒకప్పుడు హిట్లర్ కూడా అతి పెద్ద మెజారిటీతో గెలిచాడు. ఆయన వొంటి నిండా మచ్చలే అని ఇప్పుడు లోకానికంతా తెలుసు కద. మన దేశంలో ఎన్నికల్లో గెలవాలంటే ఎన్నెన్నో సమీకరణాలు ఉంటాయి. అది వై.నో. గగన్ కంచు కోట. ఆ నియోజకవర్గానికి ఆయన ఫ్యామిలీ చాలా చేసింది (మిగతా రాష్ట్రాన్నంతా కొల్ల గొట్టి అనుకో). డబ్బు మంచి నీళ్ళలా ప్రవహించింది. ముఖ్య మంత్రి కాగల సత్తా ఉన్న క్యాండిడేట్‌ని ఏ నియోజకవర్గ ప్రజలు వదులుకోరు. ఇలా ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి.”

“ఇంతకీ మన రిచంజీవి గడప నడి బొడ్డున తొడ గొట్టాడు కద! ఆయనేమయ్యాడు?”

“ఇక ప్రచారం చేసే అవసరం లేదు కద. ఇప్పుడు ఆయన ఒక పుస్తకం రాసుకుంటున్నాడంట. అది కాబోయే రాజకీయ నాయకులకు ఎంతో ఉపయోగపడుతుందంట!”

“ఏం పుస్తకం అది?”

“దాని టైటిల్ – కొత్త పార్టీ పెట్టి భ్రష్టు పట్టడమెలా? – అట.”

“బెస్ట్ సెల్లర్ అవుతుందిలే. చానెల్ మార్చు.”

ఈ సారి అరవనాడు దర్శనమిచ్చింది.

కర్కశ నిధి విలేఖరులతో మాట్లాడుతున్నాడు. “ఎక్కడ తప్పు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. మా పార్టీ ఎవరికీ అన్యాయం చేయలేదు. 2G కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన డబ్బంతా పార్టీ క్యాడర్స్ నుంచి లీడర్స్ వరకు అందరము చాలా సామరస్యంగానే పంచుకున్నాం. మరి తేడా ఎక్కడొచ్చిందో అర్థం కావట్లేదు.”

“బహుశా ప్రజలు మీరు వారితో కూడా పంచుకోలేదని ఫీల్ అయినట్టున్నారేమో,” సజెస్ట్ చేశాడు ఒక రిపోర్టర్.

“వాళ్ళకు ల్యాప్‌టాప్స్, కలర్ టీవీలు ఇస్తామన్నాం కద? చీ! ఈ జనానికి బొత్తిగా విశ్వాసం లేదు.”

“ఇప్పుడు మీ స్ట్రాటెజీ ఏంటి?” ఇంకో విలేఖరి అడిగాడు.

“నాతో పాటూ మా పార్టీ సభ్యులు కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని కొన్ని రోజులు ఆత్మ విమర్శ చేసుకుంటాం. ఈ సారి తిరుగులేని వ్యూహంతో వస్తాం. ఐతే ఈ మధ్యలో 3G స్క్యాం మిస్ అవుతామని కొంత బాధగా ఉంది,” అన్నాడు కర్కశ నిధి.

“పాపం కర్కశ నిధి గారికీ, ఆయన కుటుంబానికీ ఎంత కష్టమొచ్చిందో! చానెల్ మార్చు,” అన్నాను నేను.

ఈ సారి వంగ భూమి స్క్రీన్ మీద కనిపించింది.

“మీరు ఓడిపోవడానికి కారణం ఏంటంటారు?” ఒక విలేఖరి మైక్‌ని (త్వరలో మాజీ కాబోయే) ముఖ్య మంత్రి బుద్ధావతారం ముందు ఉంచి అడిగాడు.

బుద్ధావతారం మైక్ కేసి అసహ్యంగా చూశాడు.

“మా క్యాడర్ల వల్లే మేం ఓడిపోయాం. పైగా కొందరు జనం ఆ మడతా బెనర్జీ మాయ మాటలు నమ్మారు.”

“మీ క్యాడర్లు సరిగ్గా ప్రచారం చేయలేదంటారా?”

“కాదు, సరిగ్గా రిగ్గింగ్ చేయలేదు. బద్ధకించారు. వెధవలందరికీ మొహానికి ఎర్ర రంగు పూసి వదిలేస్తాను. తిక్క కుదురుతుంది.”

అంతలో నలుగురు జమా జెట్టిలాంటి “కత్తి కొడవలి” పార్టీ సభ్యులు వచ్చి బుద్ధావతారం మొహాన ఎరుపు రంగు పులిమి, “ఇంతటితో ఈయన ఉపన్యాసం అయిపోయింది,” అని అక్కడి నుంచి ఎత్తుకెళ్ళి పోయారు.

“పాపం బుద్ధావతారం గారు, ఎరుపు రంగు ఎవరినీ క్షమించదు అని అర్థం చేసుకోలేక పోయారు. చానెల్ మార్చరా!” అన్నాను నేను.

ఈ సారి జంబూ ద్వీపపు ముద్దు బిడ్డ సాహుల్ గాంధి కనిపించాడు. తను రైతులతో కలిసి కాసేపు ధర్నా చేయించడం, అతన్ని ఉత్త ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం చూపించారు.

“ఏం జరిగింది?” అడిగాను నేను.

“హైవే కోసం తీసుకున్న భూములకు ఉత్త ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరైన ధర చెల్లించలేదని, గొడవ చేస్తూంటే పోలీసులు పట్టుకుపోయారు.”

“సాహుల్‌కి ఆ ఊర్లో భూమి ఉందా?”

“కాదెహే, అక్కడి రైతుల భూములని స్వాధీన పరుచుకున్నారని వాళ్ళు ఉద్యమం మొదలెట్టారు. ఇతగాడు కన్‌వీనియెంట్‌గా ఆ ఉద్యమంలో దూరాడు.”

“ఎందుకు దూరాడు?”

“అతన్ని ఉత్త ప్రదేశ్‌లొ ముందుకు మల్లే ఎవరూ తమ గుడిసెల్లో దూరనివ్వడం లేదంట. సో, ఇలా నరుక్కొచ్చాడు.”

“ఎంతైన సాహుల్ గాంధి భలే యాక్టివ్‌గా ఉంటాడురా! నాయకుడంటే అలా ఉండాలి.”

“శుభం! నీ లాంటి వాళ్ళు అలా అనుకోవడమే అతనికి కావల్సింది కూడా.”

“ఈ న్యూస్ అంతా చూస్తూంటే కడుపు నిండిపోతూంది. మన త్రిలింగ చానెల్ ఏదైనా పెట్టు. మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.”

“బృందగాన కోసం సభ ఏర్పాటు చేయండి. ఓకే! కేంద్రాన్ని నానా తిట్లు తిట్టండి. డబుల్ ఓకే! కాని మన తెగులు దేశం పార్టీ జెండాలు ఎందుకు పెట్టలేదు,” కోపంగా సర్పం జనార్ధన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు సూర్య బాబు.

“ఎందుకు పెట్టలేదంటే,” గొంతు సవరించుకున్నాడు సర్పం.

“ఆ! ఎందుకు?”

“అసలు నేనే కొత్త పార్టీ పెట్టాలా, లేక ఉన్న పార్టీల్లో ఒక దానిలోకి జంప్ చేయాలా, ఇంకా నిర్ణయించుకోలేదు. ఆ లొల్లి తేలిపోగానే, సరైన పార్టీ జెండాలు తప్పకుండా పెడతాను,” బదులు చెప్పాడు సర్పం.

టీవీ స్విచ్ ఆఫ్ చేశాడు ధన్వంతరి.

“సరే, వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం,” వాడికి చెప్పి అక్కడినుంచి బయటపడ్డాను నేను.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

22 Responses to “ఎర్రి” మొహాలు, కొడగట్టిన సూరీడు, అత్యధిక మెజారిటీలు

 1. Anuradha says:

  LOL

 2. KumarN says:

  You are, what you are..simply amazing…subtle at times, in-the-face at other times..you have a special knack for the satire…Great..

  I was half asleep when I started reading this post. And the below one completely cracked me up.

  అంతలో నలుగురు జమా జెట్టిలాంటి “కత్తి కొడవలి” పార్టీ సభ్యులు వచ్చి బుద్ధావతారం మొహాన ఎరుపు రంగు పులిమి, “ఇంతటితో ఈయన ఉపన్యాసం అయిపోయింది,” అని అక్కడి నుంచి ఎత్తుకెళ్ళి పోయారు.

 3. shiva bandaru says:

  🙂

 4. sanjeev says:

  thamashaaga raasaru. chaala baavundi.. perlu chaala baaga pettaru. navvu aapuko leka poyaanu…thanks navvinchinanduku..

 5. ram says:

  but not upto the mark

 6. sree says:

  simply superb 🙂

 7. rambabu says:

  Excellent. Congrats

 8. kamudha says:

  అతన్ని ఉత్త ప్రదేశ్‌లొ ముందుకు మల్లే ఎవరూ తమ గుడిసెల్లో దూరనివ్వడం లేదంట.

  ఇది సూపర్
  కాముధ

 9. రవి says:

  కర్కశ నిధి?? :)))

  భారీలలిత వస్తూనే బియ్యమూ, నగా నట్రా దానం చేసిందట. అది కూడా రాసి ఉండాల్సింది.

  • Murali says:

   ఆవిడ ఇప్పుడే పవర్లోకి వచ్చింది కద. ముందు ముందు బోలెడు అవకాశాలు వస్తాయి లెండి బ్లాగ్ చేసుకోవడానికి. 🙂

 10. Sreenivas says:

  పాట సూపర్ 🙂

 11. Oorodu says:

  Paata parody adirindi…

 12. హరే కృష్ణ says:

  :))

 13. RG says:

  That was the funniest parody song ever sir, n mounamgane moragamani too 🙂

 14. madhu sudhan says:

  అంతలో నలుగురు జమా జెట్టిలాంటి “కత్తి కొడవలి” పార్టీ సభ్యులు వచ్చి బుద్ధావతారం మొహాన ఎరుపు రంగు పులిమి, “ఇంతటితో ఈయన ఉపన్యాసం అయిపోయింది
  chalabagundi
  inta mandini navvistunnaru mee arogyam bagundali
  mee sreyobilashi

  • Murali says:

   Thanks! నవ్వితే అందరి ఆరోగ్యం బాగు పడుతుందని నా నమ్మకం. 🙂

 15. Thanks for the great comedy with informative message…really glad to read this……thank you……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s