కరప్షన్‌ని నిర్మూలిద్దాం(లంచం ఇచ్చైనా సరే)!


గుండెలు అర చేతిలో పెట్టుకుని ధన్వంతరి గాడి అపార్ట్‌మెంట్ ముందు నిలబడ్డాను నేను. కారణం మీ అందరికి తెలుసు. సరేలే తప్పదు అని తలుపు తట్టబోతే అదే తెరుచుకుంది. గడియ వేయలేదనుకుంటా. లోపలికి అడుగు పెట్టాను. అంతా నిశ్శబ్దం.

నా ఆనందం క్లైమాక్స్‌కి చేరుకోక ముందే ధన్వంతరి గాడి గళం నుండి వెలువడిన శబ్ద తరంగాలు ఆ నిశ్శబ్దాన్ని పారద్రోలాయి.

“జోరీగా జోరీగా ఎందాకా నస పెడతావే, రాకే నా వెంట!
దూరంగా పోకుండా వస్తాగా నీ వెనకాలే వీడని గాయంగా!”
….
….
వామ్మో ఈ చేజింగ్ ఏంటి, వాయ్యో ఈ రన్నింగ్ ఏంటి?
వదిలెయ్యి దండం పెడతా వద్దంటూ!

వాన్నో ఆ చాన్సే లేదు, వాక్కో నే ఆగనే ఆగను.
దొరికి పోవే నా చేతికి నువ్వే ఎంచక్కా!”

నేను అరిస్తే వాడు పాట ఆపేశాడో, వాడు పాట ఆపాక నేను అరిచానో తెలీదు. మొత్తానికి పాట ఆగగానే, “ఆఖరికి శాస్త్రి గారి పాటని కూడా వదిలి పెట్టలేదా?” కోపంగా అడిగాను వాడిని.

“నాకు జెనరల్‌గా ఆయన పాటలు నచ్చవు గురూ, ఈ పాట కాస్త నా స్టాండర్డ్‌కి తగినట్టు ఉంటే ఆగలేకపోయాను,” సంజాయిషీ ఇచ్చుకున్నాడు ధన్వంతరి.

“మన కరెంట్ అఫెయిర్స్ కార్యక్రమం మొదలు పెడదామా?”

“ఈ సారి అంతా ఒకే హాట్ టాపిక్, కరప్షన్‌ని అరికట్టాలని మన జాతి జాగృతమయ్యింది.”

“జాగృతమయ్యిందా? అంటే?”

“నిద్ర మేల్కొంది అని.”

“అంటే ఇన్ని రోజులు నిద్రపోతుందా?”

“మరదే కద అర్థం.”

“సరే, టీవీ పెట్టు.”

టీవీ పెట్టగానే కన్నా ఏక్ హజారే దర్శనమిచ్చాడు.

“ఈయన కరప్షన్ మీద పోరాటం మొదలు పెట్టాడని, డోక్‌పాల్ బిల్ కోసం పోరాడుతున్నాడని తెలుసు కానీ, పూర్తి వివరాలు తెలీవు,” అన్నాను నేను.

“అవినీతిని మన ప్రభుత్వం అరి కట్టలేదని, దానికి ఒక స్వఛ్ఛంద సంస్థ ఉండాలన్నదే కన్నా ఏక్ హజారే పోరాటం.”

“మరి డోక్‌పాల్ బిల్?”

“ఎప్పటిలా కేసులు ఏళ్ళ తరబడి ముదర పెట్టకుండా, త్వరగా పరిష్కారం కల్పించడం, అవినితీ సొమ్ముని లంచగొండుల నుంచి డోకు తెప్పించైనా సరే కక్కించడమే డోక్ పాల్ బిల్ లక్ష్యాలు.”

“ఇదేదో ప్రభుత్వం బాధ్యతలా ఉందే?”

“వాళ్ళు చేయట్లేదు కనకే, డోక్‌పాల్ కావాలని అడిగేది.”

అటు కన్నా ఏక్ హజారే రెచ్చిపోతున్నాడు.

“ఈ ప్రభుత్వం పాసి గూలా! అందరూ అవినీతి పరులే. వీళ్ళకి డోక్‌పాల్ బిల్ ఎందుకు నచ్చుతుంది? ప్రభుత్వ ప్రతినిధులతో కలవడానికి మేమంతా ఢిల్లీ భవన్ వెళ్తే, బక్షీస్ తీసుకొని కానీ ఆ కాపలా వాడు మమ్మల్ని లోపలికి ప్రవేశించనియ్య లేదు. దీన్ని బట్టే తెలుస్తూంది ఎంత అవినీతి పేరుకుపోయి ఉందో”

చానెల్ మారిస్తే ప్రభుత్వ ప్రతినిధి కపిల్ నోబాల్ మాట్లాడుతున్నాడు. “అసలు గాంక్రెస్ పార్టీ అవతరించిందే కరప్షన్ అంతమొందించేందుకు. అలానే మేము పదవిలోకి వచ్చినప్పుడల్లా నిర్మూలిస్తూనే ఉన్నాం. కానీ దాని సిగ్గోసిరి! అది మళ్ళీ మొలకెత్తుతూనే ఉంది. డోక్‌పాల్ బిల్ అంటే మాకు అత్యంత గౌరవం, కన్నా ఏక్ హజారే ఒక గొప్ప వ్యక్తి. కానీ మేము పెట్టిన ఒకే షరతుకి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మరి సంధి ఎలా పొసగుతుంది?”

“ఏమిటి మీరు పెట్టిన షరతు?” అడిగాడు ఒక విలేఖరి.

“ఆ బిల్‌ని రెండు పదాలు లేకుండా రాయమని అడిగాం, అంతే.”

“ఏంటో ఆ పదాలు?”

“లంచము, ఇంకా శిక్ష!”

“విన్నావురా ధన్వంతరి, గాంక్రెస్ పార్టీ అవినీతిని అంతమొందించేందుకే ఉందట!” అన్నాను నేను.

“నిజమే గురూ, హెన్రూ గారు ప్రధాన మంత్రి అయ్యాక, 1948లో, ఆయన మిత్రుడు క్రిష్ణ చేపన్, మొదటి జంబూ ద్వీప – పీకిస్తాన్ యుద్ధానికి, తెల్ల దొరలనుంచి కొన్ని వందల జీపులు ప్రభుత్వం సొమ్ముతో కొనుగోలు చేశాడు. తెల్ల దొరలు మనకు షెడ్డుకెళ్ళడానికి రెడీగా ఉన్న రెండవ ప్రపంచ యుద్ధ వాహనాలను, అవి కూడా, పీకిస్తాన్‌తో మన యుద్ధం అయిపోయాక, తీరికగా పంపించారు. అప్పట్లో హెన్రూ గారు ఏ పాపం తెలీని తన మిత్రుడిని కాపాడారు. మొన్నటికి మొన్న, జగన్మోహన్ సింగ్ మన టెలికాం మినిస్టర్ వాజాని కాపాడగలిగినంత వరకు కాపాడారు. అలా గాంక్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది.”

చానెల్ మళ్ళీ మారింది.

“బాబా శ్యాందేవ్‌ని మొన్న అన్యాయంగా ఆయన ఇష్టానికి విరుద్ధంగా ఢిల్లీనుంచి పట్టుకెళ్ళి పోవడం తప్పు కాదా?” ఒక విలేఖరిణి ప్రశ్నించింది.

“ఓ, ఆ విషయం మీకు తెలిసిపోయిందా. పొరపాటు మాదే. ఈ సారి కన్నా ఏక్ హజారేని ఎవరికీ తెలీకుండానే తరలిస్తాం. ఇలాంటి తప్పులని సహించేది లేదు,” నొచ్చుకున్నాడు పీ. ఏకాంబరం.

“డోక్‌పాల్ బిల్ అంటేనే మన గాంక్రెస్ నాయకులకి డోకొచ్చేలా ఉంది,” అన్నాను నేను.

“మరి రాదా గురూ! గాంక్రెస్ చల్లని పాలనలో, పార్లమెంట్ నుండి, పాల దుకాణం వరకు అందరూ ఒక క్రమ శిక్షణతో లంచాలు వసూలు చేయడానికి అలవాటు పడిపోయారు. మరి సడన్‌గా ఆపేయాలి అంటే ఎలా కుదురుతుంది.”

“ఏమోరా, నాక్కూడా నా వంతు ఏదో చేయాలని ఉంది. నీ కవిత్వం నా శేష జీవితం అంతా వింటే, లంచగొండితనం నిర్మూలింపబడుతుందని ఎవరన్నా హామీ ఇస్తే, నేను దానికి కూడా సిధ్ధమే,” ఆవేశంగా అన్నాను నేను, పిడికిలి బిగించి.

“అబ్బ! ఎంత మంచి మాటన్నావురా! నువ్వు ఆ పిడికిలి అలాగే బిగించి ఉంచు. అష్ట కష్టాలు పడి, ఆఖరికి లంచం ఇచ్చైనా సరే ఆ డోక్‌పాల్ బిల్ పాస్ అయ్యేలా నేను చూస్తాను,” అన్నాడు ధన్వంతరి.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

10 Responses to కరప్షన్‌ని నిర్మూలిద్దాం(లంచం ఇచ్చైనా సరే)!

 1. kamudha says:

  తప్పదు మరి,
  లోక్‌పాల్ బిల్లు కావలంటే లంచం ఇవ్వక తప్పదు.

  ప్రజలు అవినీతిని ఒక issue గా పరిగణించలేదు. జనజీవితం లొ అవినీతి పూర్తిగా పాతుకుపొయింది.
  కాముధ

 2. హరే కృష్ణ says:

  😀 😀

 3. “..సిగ్గోసిరి.” మళ్ళీ చదివించి నవ్వించిరి. 🙂
  అదేంటో మీ టపా చదువుతూంటే కామెడీలా అనిపించినా, చదివేసాక నవ్వు ఆగిపోతుందెందుకో!

 4. Bhuvan says:

  Good one Sir! Ninjanga lokpal bill pass iyyevaraku manamu enni jokulu/dokulu vinalsostundo/choodalsustundo!

 5. MADHU SUDHAN says:

  కరప్షన్‌ని నిర్మూలిద్దాం(లంచం ఇచ్చైనా సరే)!

 6. ssv says:

  well, in India, i guess every one excludes him/her self and talks about corruption. I guess it is the time for Indians to accept they have become corrupted. It is not the system that is corrupted. System is not corrupted, rather the people who are running the system are corrupted who are nothing but us.

 7. Wow….eeee madhya inthaga navvindhi ledhu Dear Murali……thanks a ton…

 8. ram says:

  enti ee madhya rayadam thaggincharu

  • Murali says:

   లైఫ్‌లో కాస్త సినిమా కష్టాలు ఎక్కువయ్యాయి. త్వరలో మళ్ళీ బ్లాగ్ చేసుకుంటాను. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s