సినిమా కష్టాలు


శనివారం మద్యాహ్నం. నేను మూటా ముల్లే సర్దుకుని ఆఫీస్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడే రాఘవ, మల్లేశ్, గిరి, నా డెస్క్ దగ్గరికి వచ్చారు.

“ఏరా వీకెండ్ ప్లాన్స్ ఏంటి?” అడిగాను నేను. బిక్క మొహం పెట్టారు ముగ్గురూ.

“బాసాధముడు (బాస్ + అధముడు) నాకు అర్జెంట్ పని అని అంటగట్టాడురా. ఈ రోజు సాయంత్రం వరకే కాదు, రేపు కూడా పని చేయాల్సి వచ్చేలా ఉంది,” దిగులుగా చెప్పాడు రాఘవ.

“రేపు డెంటిస్ట్‌తో అప్పాయింట్‌మెంట్ ఉంది, నా పిప్పి పన్ను పీకించుకోవడానికి. తలుచుకుంటేనే నవ్వు ఏడుపు కలిపొచ్చేస్తున్నాయి,” సెలవిచ్చాడు గిరి.

“అయ్యో, మరి నీ సంగతి మల్లేశ్?’ అడిగాను.

“నాదింకా ఖతర్‌నాక్. మా ఆవిడ నా తరపున మొక్కుకుందట. రేపు మా ఊరి దేవత ముందు నన్ను నేను ఐదు కొరడా దెబ్బలు కొట్టుకోవాలి,” చెప్పాడు వాడు.

“బాబోయి, ఏంటీ సినిమా కష్టాలు,” కళ్ళు తేలవేశాను నేను.

“ఇంతకీ నీ ప్రోగ్రాం ఏంటి?” అడిగాడు రాఘవ.

“పెళ్ళయి ఆరు నెల్లయ్యింది కదా, ఐనా మనిద్దరం కలిసి షాపింగే చేయలేదూ, ఈ ఆదివారం నన్ను తీసుకెళ్ళండీ అని చెప్పింది మా ఆవిడ,” అన్నాను నేను.

“అయ్యో నీకెంత కష్టం వచ్చింది!” ముగ్గురూ ఏక కంఠంతో అన్నారు.

“కష్టమేంటి? మీరు కద కష్టాల్లో ఉంది?” ఆశ్చర్యపోయాను నేను.

“నీ కష్టం ముందు మాది ఏ పాటి లే! ఎలా నెట్టుకొస్తావో ఏమో. బెస్ట్ అఫ్ లక్‌రా!” విష్ చేశాడు గిరి.

మల్లేష్ నా వంక జాలిగా చూస్తూ నా భుజం తట్టాడు.

“ఎహె! ఆపండి మీ సానుభూతి ప్రకటనలు. నేను వెళ్తూంది షాపింగ్‌కి, యుద్ధానికి కాదు,” విసుక్కున్నాను నేను.

“మరదే! నీకే తెలుస్తుందిలే,” అన్నారు వాళ్ళు మళ్ళీ ఏక కంఠంతో.

***

“ఇప్పుడు మనిద్దరం కలిసి షాపింగ్‌కి వెళ్తున్నాం,” అని నేను చెప్పగానే, మా ఆవిడ కళ్ళలో ఒక వెలుగు చూశాను. హిరోషిమా మీద అణు బాంబు పడినప్పుడు జరిగిన విస్ఫోటం నుంచి వచ్చిన వెలుగు అది అని తరువాత తెలిసింది నాకు.

“వెళ్దాం, నాకు పెద్దగా ఏం షాపింగ్ లేదనుకోండి. తొందరగానే అయిపోతుంది,” చెప్పింది తను.

“తొందరగా అయిపోతుందంట. ఏదో పెద్ద టార్చర్ లెవెల్‌లో ఉంటుంది అన్నట్టు బిల్డప్ ఇచ్చారు వెధవలు,” అనుకున్నాను నేను.

“సరే! ముందుగా నర్సరీకి వెళ్దాం,” అంది మా ఆవిడ.

“అక్కడికెందుకు, మనకు ఇంకా పిల్లలు లేరు కద!”

“బోడి జోకులు వెయ్యకండి. నర్సరీ అంటే గార్డెన్. అక్కడ నేను కొన్ని మొక్కలు కొనాలి.”

“ఎందుకు?”

“మన పెరట్లొ వేయడానికి. మన సొంత గార్డెన్ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా?”

“ఎవరికి?”

“కుళ్ళు జోకులు ఆపమన్నానా! మనకే! ”

అలా కాసేపయ్యక నర్సరీలో అడుగు పెట్టాం ఇద్దరం.

చాల మంది మొగవాళ్ళలానే, పెళ్ళి కాక ముందు మీకు ఆ నర్సరీ లాంటి ప్రదేశాలు ఉంటాయని కూడా తెలిసి ఉండదు. నాకూ తెలీదు. అసలు మొక్కలను ప్రత్యేకంగా ఎందుకు పెంచాలో నాకు అర్థం కాలేదు. చెట్లూ, మొక్కలు మనకంటే ముందు నుంచి భూమ్మీద ఉన్నాయి. వాటిని ఎవరైనా పెంచారా? చోద్యం కాకపోతే.

“రండమ్మా,” నవ్వు మొహంతో ఆహ్వానించాడు నర్సరీ యజమాని.

“అంటు మామిడి మొక్క కావాలి,” అంది మా ఆవిడ. “ఇటు వైపు ఉన్నాయి, రండి,” అంటూ దారి తీశాడు ఆయన.

“అంటు మామిడి అంటే ఏంటోయి? మామిడే, కాని దాన్ని అంటుకోకూడదా?” భుజాలు ఎగరేస్తూ నవ్వాను నేను.

“లాభం లేదు, మిమ్మల్ని కొన్ని రోజులు ఇక్కడికి వాలంటరీ వర్క్‌కి పంపాలి,” సాలోచనగా అంది తను.

నేను నాలుక కరుచుకున్నాను, “నువ్వు చాలా తొందరగా నిర్ణయాలకు వచ్చేస్తావోయి, అలా జోక్ వేశానంటే అర్థం నాకు అంటు మామిడి మొక్క గురించి తెలుసుకోవాలని ఉంది అని!” బుకాయించాను.

“అంతే అంటారు. మీకు ఏ ఏ మొక్కల గురించి తెలుసు?”

నేను శరవేగంగా ఆలోచించాను. ఒక్కటి కూడా గుర్తు రాలేదు. ఆఖరికి, “జామ మొక్కల గురించి బాగా తెలుసు. చిన్నప్పుడు వాటి మీద రాళ్ళు వేసే వాళ్ళం,” అన్నాను.

“మీ మొహం. అవి జామ చెట్లయి ఉంటాయి. మీకు మొక్కల గురించి ఒక మంచి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందే,”

“నహీ!” అన్నాను నేను. కానీ సౌండ్ బయటకి రాలేదు.

“అసలు మొక్కలు నాలుగు రకాలు,” గొంతు సవరించుకుంది మా ఆవిడ.

అంతే! తరువాత మూడు గంటల పాటు నేను సోదాహరణంగా ఆ నర్సరీలో ఉన్న మొక్కలన్నిటినీ దగ్గర నుంచి చూసి మరీ తెలుసుకున్నాను. ఒక స్టేజ్‌లో దేవుడి మీద కూసింత కోపం కూడా వచ్చింది, ఇన్ని మొక్కలు సృష్టించడం దేనికి అని.

“ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ మొక్కలు భూమ్మీద నుంచి పీకకున్నావా?” అని సైలెంట్‌గా పాడుకున్నాను.

నా మొహంలో మారుతున్న రంగులు గమనించకుండా మా ఆవిడ తన ఫ్లోలో తాను వెళ్ళిపోయింది. “ఇంట్రడక్షన్” అయ్యాక హోరెత్తుతున్న నా చెవులని మసాజ్ చేసుకుంటున్న టైంలో ఒక పది రకాల మొక్కలు కొని మా వ్యాన్‌లో వెనక పెట్టించింది కూడా. కాసేపట్లో, (అంటే ఎంతసేపో నాకు సరిగ్గా తెలీదు. మొక్కల గురించి సమగ్రంగా తెలుసుకోవడం వల్ల నా టైం సెన్స్ అప్పటికే బాగా దెబ్బ తిని ఉంది.) మేము నర్సరీ బయట ఉన్నాం.

***

నర్సరీ నుంచి బయట పడగానే, నా మనస్సు ఒక రకమైన ఉల్లాసంతో నిండి పోయింది. ఇన్ని రోజులు గమనించలేదు కానీ, ఆఖరికి ఆ వీధిలో మూత లేకుండా ఉన్నా డ్రైనేజ్ హోల్ కూడా నా కళ్ళకు ఎంతో అందంగా కనిపించింది. నాకు తెలీకుండానే ఈల వేసినట్టున్నా. మా ఆవిడ వెంటనే స్పందించింది.

“బాగ హుషారుగా ఉన్నట్టున్నారు?” అడిగింది.

“అవును, అహహా లేదు,” చాలా క్లారిటీతో బదులు చెప్పాను నేను.

“షాపింగ్ అయిపోయింది అనుకుని విజిల్ వేశారేమో అని..”

“కాలేదా?” నా మొహం కళ తప్పింది.

“చూశారా, నాకు తెలుసు మీకు షాపింగ్‌కి రావడం ఇష్టం లేదని!”

“నువ్వు నన్ను పరిపూర్ణంగా అపార్థం చేసుకున్నావు. షాపింగ్ అయిపోయిందేమో అని ఆ దిగులు.”

“ఐతే పదండి, పక్క వీధిలో చీరల షాప్‌కి వెళ్దాం.”

“తప్పకుండా వెళ్దాం, నాకేమన్నా భయమా?”

“ఇప్పుడు మీకు భయం అని ఎవరన్నారు?”

“ఎవరూ అనలేదు. ఊరికే క్లారిఫై చేస్తున్నా, నాకు షాపింగ్ అంటే అయిష్టత లేదని.”

“ఐతే పదండి.”

చీరల షాప్‌లోకి అడుగు పెట్టాం మేము. ఒక మూల దుశ్శాసనుడు విప్పినట్టుగా గుట్టలు గుట్టలు చీరలు పడి ఉన్నాయి. ఆ పక్కనుంచే ఒక నలుగురు మనుషులు ఒకతన్ని మోసుకుపోతున్నారు.

“ఏం జరిగింది?” అడిగాను నేను వారిలో ఒకరిని. “Occupational hazard,” సమాధానమిచ్చాడు అతను.

చీరల షాప్‌లో వృత్తి రీత్యా వచ్చే ప్రమాదలు ఏముంటాయబ్బా అనుకుంటూ, మా ఆవిడని ఫాలో అయ్యాను నేను.

షాప్ కుర్రాడు మేము కూర్చోగానే, కొన్ని చీరలు మా ముందు పడేశాడు. నాకన్నీ బాగానే ఉన్నాయనిపించాయి. మా ఆవిడ ఒక ఎర్ర చీర, ఒక లైట్ బ్లూ శారీ తీసి, నాతో, “ఏవండి? వీటిలో ఏది బాగుంది?” అని అడిగింది.

సడన్‌గా నాకు మంచి రోజులు వచ్చినట్టు అనిపించింది. సెలెక్షన్ నాదేనన్న మాట. అసలే నేను చాలా ఫాస్ట్. ఇలా ఐతే ఇంకో అర గంటలో షాపింగ్ ముగించుకుని ఇంట్లో ఉంటాము. “రెడ్ శారీ తీసుకో,” అన్నాను చప్పున.

“నేను కూడా అదే అనుకున్నానండి, మీ టేస్ట్ సూపర్. ఈ లైట్ బ్లూ శారీ బాగాలేదా?”

“బాగానే ఉంది.”

“మరి ఇదెందుకు వద్దన్నారు?”

నా మొహం మళ్ళీ కళ తప్పింది. “అంటే, ఏదో ఒకటి సెలెక్ట్ చేయమన్నావు కద! అందుకని అది చెప్పాను.”

“అంటే, ఏదో పని అయిపోతుంది అన్నట్టు చెప్పారు అన్నమాట. ఇంకా మీకు నాతో షాపింగ్ రావడం ఇష్టం అనుకున్నా!” పెదవి విరిచింది తను.

“ఇష్టమే, ఇష్టమే!” ఖంగారుగా చెప్పాను నేను, ఏంటి నా పరిస్థితి రెండు నిమిషాల్లో ఇంత తారు మారు అయిపోయింది అనుకుంటూ.

“ఐతే అలా మొక్కుబడిగా చెప్పడమెందుకు? ఏ మాత్రం ఆలోచించకుండా?”

“లేదు, ఆలోచించే చెప్పాను, నువ్వు తెలుపు కద, కాబట్టి ఎరుపు రంగు నీకు బాగా నప్పుతుందని.”

“కిందటి వారం బ్లూ శారీ కట్టుకుంటే, చాలా బాగున్నావోయి అన్నారు?”

కిందటి వారం బ్లూ శారీ కట్టుకుందా? అసలు వారం రోజుల కింద కట్టుకున్న బట్టలు ఎలా గుర్తుంటాయబ్బా? నాకు మొన్న వేసుకున్నవే గుర్తుండవు.

“అలా చెప్పానా, అంటే నువ్వు బ్లూ శారీలో కూడా బాగుంటావు.”

“ఐతే బ్లూదే తీసుకుంటా.”

“ష్యూర్ ష్యూర్.”

“మరి ఎర్ర చీర బాగుందన్నారు ఇంతకు ముందే.”

అడ కత్తెరలో పోక చెక్క అనే సామెత ప్రాముఖ్యత నాకు అప్పుడు అర్థమయ్యింది.

“అలా కాదోయి, నాకన్ని రంగులు బాగానే ఉంటాయి.”

“అన్నీ అబద్ధాలు, మొన్న మీకోసం ఒక ఎర్ర షర్ట్ కొనుక్కొస్తే, వేసుకోను అన్నారు!”

“నీకు సూట్ అయినట్టు నాకు అన్ని రంగులు సూట్ కావోయి!”

“అంతే లెండి. మీకు నా మీద బొత్తిగా ప్రేమ లేదు. నేను ఏది కట్టుకున్నా, ఎలా పోయినా మీకు ఫర్వాలేదు. మా వాళ్ళకేం తెలుసు మీకిచ్చి నా గొంతు కోసారని.”

ఈ రంగుల సెలెక్ష్‌కి నాకు తనపట్ల ఉన్న ప్రేమకి లింక్ ఏంటో నాకర్థం కాలేదు.

“సర్లేండి, నేనే సెలెక్ట్ చేసుకుంటా, అంతా నా ఖర్మ” అని అప్పటికి నన్ను వదిలేసి చీరల వైపు తిరిగింది తను. నేను కొంచెం రిలాక్స్ అయ్యాను.

రెండు గంటల తరువాత ఒక ఆకు పచ్చ చీర సెలెక్ట్ చేసింది మా ఆవిడ. చీర ప్యాక్ చేయగానే షాప్ కుర్రాడు కళ్ళు తిరిగి తూలి ధబ్బున కింద పడిపోయాడు. ఇంతకు ముందు మల్లే నలుగురు మనుషులు వచ్చి అతన్ని మోసుకుపోయారు.

“గురువుగారూ ఏమయ్యింది?” అప్పుడే షాప్‌లో అడుగు పెట్టిన ఒక పెద్ద మనిషి నన్ను అడిగాడు.

“Occupational hazard,” అన్నాను నేను క్లుప్తంగా. అతను తల బరుక్కుంటూ వెళ్ళిపోయాడు.

“ఏమోయి ఇక ఇంటికి వెళ్దామా?” మా ఆవిడని అడిగాను.

“వెళ్దాం లెండి. పాపం మీకు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉందనుకుంటా,” అంది మూతి విరుస్తూ తను.

“నువ్వే కద అన్నావు, షాపింగ్ తొందరగా అయిపోతుందని?” అని వెంటనే నాలుక కర్చుకున్నా.

“అవును ఇలాంటివి అన్నీ బాగా గుర్తు పెట్టుకుంటారు. గత వారం మా ఇంటికి ఒక పార్సెల్ పంపమన్నా, అది మాత్రం గుర్తు లేదు. అంతా నా ఖర్మ!”

ఇక నేను కిక్కురుమనలేదు.

“ఈ రెండు చీరల్లో ఏది బాగుంది?” గిర్రున వెనక్కి తిరిగి అడిగింది.

ఈ సారి జాగ్రత్త పడ్డాను నేను. “నాకు తెలీడం లేదు.”

“ఎందుకు తెలీదు? మనిషి అన్న వాడికి ఏదో ఒకటి నచ్చాలి.”

“ఐతే నేను మనిషిని కాదేమో?” ఉక్రోశంగా అన్నాను.

“నిజమే! అది మిమ్మల్ని పెళ్ళి చేసుకోక ముందు తెలిసి ఉంటే బాగుండేది.”

“ఈ ఈ ఈ.”

“అలా పక్కకు వెళి జుట్టు పీక్కోండి.”

అప్పటికి పక్కకి వెళ్ళి జుట్టు పీక్కుని వచ్చినా, మా ఆవిడ నన్ను వదల్లేదు. మాటి మాటికి నా సలహాలు అడుగుతూ, చెప్పక పోతే అలుగుతూ, చెప్పితే దెప్పుతూ, మొత్తానికి తనకి కావల్సిందే సెలెక్ట్ చేస్తూ, ఇంకో రెండు గంటలు గడిపింది.

ఆ టైంలోనే అనుకుంటా నేను ఒక అలౌకిక స్థితికి చేరుకున్నా. తరువాత మా ఫ్రెండ్స్ చెప్పారు. దాన్నే కళత్ర వాణిజ్య వైరాగ్యం అంటారు అని. ఇది వేద కాలం నుంచి ఉందంట. అసలు ఆ కాలంలో ఈ రకమైన షాపింగ్ తప్పించుకోవడానికే రాజులూ, సైనికులూ యుద్ధాలకి వెళ్ళేవారట.

ఆఖరి కుర్రాడు పడిపోయాక షాప్ ఓనర్ వచ్చి మా పక్కన నిలబడడంతో నేను ఆ అలౌకిక స్థితి నుండి బయట పడ్డాను.

“మేడం, ఇక షాప్ మూసేయ్యాలి.”

“ఏం?” కొంచెం కోపంగా అడిగింది మా ఆవిడ.

“మా కుర్రాళ్ళు అందరు ఔట్. అందుకని…”

“మీరు నిలబడే ఉన్నారుగా?”

“షాప్ క్లోజ్ చేయడానికి నేను ఇలానే నిలబడి ఉండడం చాలా అవసరం మేడం. కావాలంటే రేపు పొద్దున్నే వచ్చేద్దురు కాని.”

“సరే ఇంతకు ముందు చీరతో కలిపి ఈ చీరకి కూడా బిల్ రాయండి.”

ఓనర్, ఆనందంతో గెంతులేస్తూ వెళ్ళి పోయాడు. కాసేపట్లో మేము ఆ షాప్ నుండి కూడా బయట పడ్డాం.

“సరిగ్గా షాపింగ్ కాలేదు. మళ్ళీ వచ్చే ఆదివారం వద్దాం,” అంది మా ఆవిడ.

“నెక్స్ట్ వీక్ కుదరదు. యాక్చుయల్లీ స్పీకింగ్, నెక్స్ట్ 16 వీక్స్ కూడా కుదరదు.”

“ఏం, ఎందుకు?”

“చిన్నప్పటి మొక్కు సడన్-అకస్మాత్తుగా గుర్తుకి వచ్చింది. పదహారు వారాల పాటు మా గ్రామ దేవత గుడి ముందు ప్రతి ఆది వారం నన్ను నేను ఒక ఐదు కొరడా దెబ్బలు కొట్టుకోవాలి. శనివారం మజ్జాన్నం బయలుదేరితే మళ్ళీ ఆదివారం అర్ధ రాత్రికి ఇంటికి చేరుకుంటా. మొక్కు మధ్యలో ఆపకూడదు. సారీనోయి నీతో షాపింగ్‌కి రాలేక పోతున్నందుకు చాలా బాధగా ఉంది.”

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

39 Responses to సినిమా కష్టాలు

 1. Amun says:

  Amazing as usual 🙂

 2. Anuradha says:

  😀 😀

 3. Indian Minerva says:

  😀

 4. Rajiv says:

  ఎప్పుడు రాస్తారా అని చుస్తున్నాను…. ఎప్పటి లాగె అదరగొట్టారు

  — “ఎందుకు తెలీదు? మనిషి అన్న వాడికి ఏదో ఒకటి నచ్చాలి.”

  “ఐతే నేను మనిషిని కాదేమో?” ఉక్రోశంగా అన్నాను.

  “నిజమే! అది మిమ్మల్ని పెళ్ళి చేసుకోక ముందు తెలిసి ఉంటే బాగుండేది.”

  “ఈ ఈ ఈ.” — Hilariousss

 5. karthik says:

  kevv.. amazing.. 😀

 6. ఒక మూల దుశ్శాసనుడు విప్పినట్టుగా గుట్టలు గుట్టలు చీరలు పడి ఉన్నాయి.>>>
  అరుపులు .. తెగనవ్వుకున్నా ఈ లైన్ కి..

  ఎక్స్ లెంట్ పోస్ట్ సార్.. పంచ్ లు ఇరగా…

 7. Naga Muralidhar Namala says:

  Hilarious 🙂

 8. kamudha says:

  బాగుంది…..

  ఆఫీసు లొ నవ్వు ఆపుకోలేక చచ్చాను.

  కాముధ

 9. brahmi says:

  *బాసాధముడు
  *ఇన్ని రోజులు గమనించలేదు కానీ, ఆఖరికి ఆ వీధిలో మూత లేకుండా ఉన్నా డ్రైనేజ్ హోల్ కూడా నా కళ్ళకు ఎంతో అందంగా కనిపించింది.
  *ఒక మూల దుశ్శాసనుడు విప్పినట్టుగా గుట్టలు గుట్టలు చీరలు పడి ఉన్నాయి.
  *దాన్నే కళత్ర వాణిజ్య వైరాగ్యం అంటారు

  సూపరు. కేక.

  బ్రహ్మి – సాప్ట్ వేర్ ఇంజినీర్

 10. “దాన్నే కళత్ర వాణిజ్య వైరాగ్యం అంటారు అని. ఇది వేద కాలం నుంచి ఉందంట. అసలు ఆ కాలంలో ఈ రకమైన షాపింగ్ తప్పించుకోవడానికే రాజులూ, సైనికులూ యుద్ధాలకి వెళ్ళేవారట.”….హహహ చాలారోజుల తరువాత దడదడలాడించారు. 😀

 11. 😀 😀 😀 😀 😀 😀 😀

 12. సుజ్ఞాత says:

  మా ఆవిడ నా డబ్బులతో నాకే షర్ట్లు పంట్లాలు షాపింగు చేస్తుంది. పైగా వాటిని సిస్టమాటిక్ గా వేసుకోలేదని, వేసుకున్నప్పుడు చివర్లో దారం బయటికి వచ్చిందని, బురద అంటిందని, వర్షం చినుకులు పడ్డాయని ఇలా రకరకాలుగా వేపుకు తింటూంది.ఈ మధ్య తన డొమైన్ ను సెల్ ఫోన్లకూ విస్తరించింది. కొరడా దెబ్బల ఐడియాలాగా నాకూ ఏదైనా అవుడియా చెప్పండి గురువర్యా.

  • Murali says:

   ఆయనే ఉంటే మంగలాడెందుకు అన్న సామెత తమరు విన లేదా శిష్యులుంగారూ?

 13. Indu says:

  హ్హహ్హహ్హా! పోస్టు కేక…కేకన్నర 🙂 పంచులు బాగున్నాయండీ 🙂 🙂 🙂 🙂

 14. >>దాన్నే కళత్ర వాణిజ్య వైరాగ్యం అంటారు అని. ఇది వేద కాలం నుంచి ఉందంట. అసలు ఆ కాలంలో ఈ రకమైన షాపింగ్ తప్పించుకోవడానికే రాజులూ, సైనికులూ యుద్ధాలకి వెళ్ళేవారట

  >>ఒక మూల దుశ్శాసనుడు విప్పినట్టుగా గుట్టలు గుట్టలు చీరలు పడి ఉన్నాయి
  ఈ రెండూ సూపర్ లైక్ 🙂
  కెవ్వ్ !

 15. andrapilla says:

  too much undi.. enti meeru recent ga shopping ki vellara??

 16. మీ టపా చదువుతూ ఆఫీసులో సౌండ్ లేకుండా నవ్వడం ప్రాక్టిస్ చేస్తున్నా.. నాకొచ్చే నవ్వుకి గట్టిగా నవ్వితే, మా డెలివరీ మేనేజర్ నన్ను బయటికి పంపించేస్తాడు..
  “కళత్ర వాణిజ్య వైరాగ్యం”, “ఆక్యుపేషనల్ హజార్డ్” అమ్మో.. అసలు ఈ అయిడియలు ఎలా తట్టాయి..??? మాటలు లేవు, టపా కెవ్వు కేక..:)))

 17. oorodu says:

  “Occupational hazard” ఇంకా “కళత్ర వాణిజ్య వైరాగ్యం” హైలైట్లు.

 18. kiran says:

  😀 😀 :D………………..:D

 19. దారుణం.. భీభత్సం అంతే!! హ్హాహ్హహాహా..

 20. kamudha says:

  మిమ్మల్ని ఒక టపా రాయమని ఈ క్రింది టపా కామెంట్లలొ అడిగేరు. మీరు చూసేరా?
  http://chaduvari.blogspot.com/2011/08/blog-post_26.html

 21. Jitu :) says:

  Hahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahahaha….

  OMG!!!

  Navvaleka navvaleka kadupu ubbipoyindi.

  “ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ మొక్కలు భూమ్మీద నుంచి పీకకున్నావా?”

  ROFL!!!!

  సడన్‌గా నాకు మంచి రోజులు వచ్చినట్టు అనిపించింది.

  LOLOLOL…

  Just too good!! 😀

 22. :) says:

  A wise man had once said… “Those who do not remember the past are condemned to repeat it” ani. 🙂

  I wonder how many husbands ever forget such “సినిమా కష్టాలు” of their past. 🙂

  Am sure none… but alas!! They do not have the power to stop history from repeating itself… again and again and again.

  😀 😀 😀

 23. K says:

  “తరువాత మా ఫ్రెండ్స్ చెప్పారు. దాన్నే కళత్ర వాణిజ్య వైరాగ్యం అంటారు అని. ఇది వేద కాలం నుంచి ఉందంట. అసలు ఆ కాలంలో ఈ రకమైన షాపింగ్ తప్పించుకోవడానికే రాజులూ, సైనికులూ యుద్ధాలకి వెళ్ళేవారట. ” This line is very funny. I could not stop laughing.

 24. ఎడిటర్ says:

  mee cinema kastalu nu 8.2.2015 aadivaaram sanchikalo sankshipthanga prachuristhunnamu- editor, andhra jyothi

 25. Jitu says:

  Yenvito… Ye muhurtaanni ee blog ki vacheno teleedu. Malli inko saari chaduvalani ani anipinchi, malli blog chadivenu. Asale ikkada flu season, paiga naaku daggu. Asalu maatlaade stithi lo leni nenu, navvaleka navvaleka chachenu. Gontuku noppiki, ippude gargle chesi ochi ee comment raastunnaanu.

  Read it again after two years. 🙂 No words to describe how it was. 😀 😀 😀 😀

  PS: Your blogs are bad for sore throat patients. 😀 😀

  • Murali says:

   I have never been accused in such a way before (bad for sore throat patiens) 🙂

   • Jitu says:

    There’s always a first time. 😛

    They should come with a statutory warning : Do not read if you have a bad throat. It’ll make you laugh so hard, it’ll hurt.

    😀 😀 😀

 26. pooja says:

  very nice story…Enjoyed a lot

 27. sreenivas varanasi says:

  ఈ కథలో చీరల షాప్ లో జరిగిన సంభాషణ అదిరిపోయింది…
  మా ఆవిడని ఆటపట్టించడానికి కథలో సంభాషణ గుర్తుచేస్తుంటాను

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s