“పీకుడు” సూపర్ హిట్! ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం?


“పీకుడు” సినిమా సూపర్ డ్యూపర్ పాపర్ హిట్ అయ్యింది. ఈ పాపర్ హిట్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మన దగ్గర ఒక్క సినిమా అంత పెద్ద హిట్ కావాలంటే, మిగతా సినిమాలు మట్టి కొట్టుకుని పోయి, ఆ సినిమాలు తీసిన వాళ్ళు pauper అయిపోవాలి . అందుకే పాపర్ హిట్ కూడా అన్న మాట.

ఈ విజయాన్ని తట్టుకోలేక “పీకుడు” నిర్మాత వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ తరువాత పొరపాటున ఎవరైనా సినిమా ఫ్లాప్ అయ్యింది అని ఏడుస్తున్నాడు అనుకుంటారేమో అని, వెర్రిగా నవ్వాడు.

ఆ తరువాత కొంత కుదుటపడి ఆలోచించాడు. హిట్ సినిమా తీయడం ఇంత సులభమా అని ముందుగా ఆశ్చర్యం వేసింది అతనికి. పీకుడు సినిమాలో కథ లేదు, క్యారక్టర్ డెవెలప్‌మెంట్ లేదు, హీరోయిన్ లేదు, ఆఖరికి విలన్ కూడా లేడు, ఒకరిద్దరు హీరో కాళ్ళకూ చేతులకూ అడ్డు పడే వాళ్ళు తప్ప. ఒక ప్యాపులర్ హీరో, అతనికంటే ప్యాపులర్ కమెడియన్స్ కొందరు ఉన్నారు. ఫరవాలేదనిపించే క్యామెడీ ట్రాక్స్ ఉన్నాయి అంతే. ఆ మాత్రం దానికే పీకుడు, త్రిలింగ ఇండస్ట్రీ హిట్ “శెగవీర” రికార్డ్స్‌కే శెగ పెట్టేస్తూంది.

మళ్ళీ నిర్మాతకి ఏడుపు తన్నుకుని వచ్చింది. అనవసరంగా పీకుడు కథ డిస్కషన్ మీద దర్శకుడితో కలిసి ఒక మూడు నెలలు వేస్ట్ చేశాడు తను. ఇన్ని రోజులు తాను తీసిన సినిమాలు ఈ కథ అనబడే విషయం అడ్డు పడ్డం వల్లే ఫ్లాప్ అయ్యాయని ఇప్పటికి అర్థం అయ్యింది అతనికి. త్రిలింగ ప్రేక్షకులు తమ నిర్మాతలనుంచి ఏనాడూ కథని కోరుకులేదు అనే సత్యం ఒక్క సారి తెలిసి వచ్చి హృదయం చలించిపోయింది అతనికి. ఇంక ఆలస్యం చేయదలచుకోలేదు అతను. వెంటనే పీకుడు డైరెక్టర్ చీను పైత్యకి ఫోన్ కొట్టాడు, వచ్చిన తనని కలుసుకొమ్మని. అలానే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.ధనాధన్‌కి, మిగతా ముఖ్యమైన యూనిట్ మెంబర్స్‌కి కూడా కబురు పెట్టాడు. కాసేపయ్యాక అందరూ నిర్మాత ఇంట్లో సమావేశం అయ్యారు.

“పీకుడు ఎంత విజయవంతం అయ్యిందో మీ అందరికి తెలిసిన విషయమే” మొదలు పెట్టాడు నిర్మాత.

“అవును, అసలు సినిమా టికెట్లకోసం జనాలు ఒకటే లాక్కోలేక పీక్కోలేక చస్తున్నారట,” అడ్డు పడ్డాడు చీను పైత్య.

“ఇలాంటి సక్సెస్ వచ్చాక అనవసరంగా టైం వేస్ట్ చేస్టే మాటొస్తుంది. కాబట్టి ఇదే కాంబినేషన్‌తో ఇంకో సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఏమంటారు?”

“సూపర్ ఐడియా, నా దగ్గరో కథుంది కూడా,” చెప్పాడు చీను పైత్య.

“వద్దు!” గట్టిగా అరిచాడు నిర్మాత. “వద్దు బాబోయి వద్దు! ఈ దిక్కుమాలిన కథకి ఇంపార్టన్స్ ఇవ్వడం వల్లే పీకుడుకి ముందు నా సిన్మాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. త్రిలింగ సినిమా హిట్ కావడానికి అవసరమైన ఎలిమెంట్స్ మాత్రం రెడీ చేసుకుందాం. కథ వాటి చుట్టు ఏదైనా అల్లుకోవచ్చు.”

“ఆ ఎలిమెంట్స్ ఏంటో కూడా మీరే చెప్పండి,” ఉక్రోశంగా అన్నాడు పైత్య.

“సారీ! ఫీల్ అయ్యారా? హిట్ సినిమాలో ఏ ఎలిమెంట్స్ ఉండాలో మీకు చెప్పేంత వాడిని కాను. మీరే చెప్పుకుంటూ పోండి,” పక్కనే చేతులు కట్టుకు నిలబడ్డాడు నిర్మాత.

“ముందస్తుగా, మన సినిమాలో ఐటం సాంగ్‌కి ఒక ఆర్టిస్ట్‌ని సెలెక్ట్ చేయాలి. ఆ ఐటం సాంగ్ ఒక క్లబ్ వాతావరణంలో చిత్రీకరిస్తాం,” చెప్పాడు డైరెక్టర్ పైత్య.

“మన మొహంమొత్తే ఖాన్ ఉంది కద. ఆవిడని తీసుకుందాం,” ఉత్సాహంగా అన్నాదు నిర్మాత.

“అందుకే మీరు నిర్మాత, నేను డైరెక్టర్. ఐటం సాంగ్‌కి షాక్ వాల్యూ ఉండాలి. అప్పట్లో మొహంమొత్తే ఖాన్ సరి పోయింది. ఇప్పుడు ఐ-ప్యాడ్లూ ప్లాజ్మా టీవీలూ అన్నీ వచ్చేశాయా? మన దైనందిన జీవితంలో ఎలా ఐతే వేగం పెరిగిందో మన ఐటం సాంగ్ ఆర్టిస్టుల సెలెక్షన్‌లోనూ పెరగాలన్న మాట.”

“ఓహో!”

“కాబట్టి ఇప్పుడు షాక్ వాల్యూ ఉండాలంటే, ఒక టాప్ హీరోయిన్‌తో ఐటం సాంగ్ చేయించాలి. ఎంత హోంలీ ఫేస్ ఉంటే అంత షాక్ వాల్యూ ఎక్కువుంటుంది. కాబట్టి అలాంటి హీరోయిన్‌ని వెతికే పనిలో ఉండండి.”

“మరి పీకుడులో ఉన్నంత గొప్ప పాట కూడా కావాలి కద?” అన్నాడు నిర్మాత.

“మరదే! పాట కాదు కావాల్సింది, ట్యూన్! నాయనా ధనాధన్, తగులుకో బాబూ తగులుకో,” అన్నాడు చీను పైత్య.

ఎస్.ఎస్. ధనాధన్ ఆల్‌రెడీ మెడలో ఒక డోలు తగిలించుకుని వచ్చాడు. పైత్య అలా అనగానే ఢమ ఢమా డోలు వాయించడం స్టార్ట్ చేశాడు.

“ట్యూన్ చెప్పమంటే ఈ దరువు ఏందయ్యా?” చెవులు మూసుకుంటూ అన్నాడు నిర్మాత.

“సారీ సర్! డప్పో డోలో తాకకుండా నేను ట్యూన్స్ కట్టలేను,” బిక్క మొహం వేసుకుని చెప్పాడు మ్యూజిక్ డైరక్టర్ ధనాధన్.

“అబ్బా, అతని క్రియేటివిటీకి అడ్డు పడకండి,” విసుక్కున్నాడు పైత్య.

జాతరలో అమ్మోరికి బలి ఇచ్చే టైంలో కొడుతున్నట్టు డోలు వాయిస్తూ, ఒక అరగంటలో ఒక ట్యూన్ కట్టేశాడు ధనాధన్.

“ట్యూన్ సూపర్! శాస్త్రి గారూ, పాట రాసెయ్యండి!” ఆర్డర్ జారీ చేశాడు పైత్య.

వక్కపొడి నములుతూ పదిహేను నిమిషాల్లో పాట రాశేశారు శాస్త్రి గారు. ఆ పాట ఇలా ఉంది.


నా బిగువేమో జర్దా పానూ, నా సొగసేమో ఆలీషాను,
ఈ యెధవ సచ్చినోళ్ళతో నాకెప్పుడూ ఐతది పరేషాను.

నువ్వు పది కోట్లిచ్చిన ఫిర్ భీ, నీ తానకి రాను, రాను.
నా కైపుకి కండ్లు తిరిగి నువ్వు ఎక్కుతవు దావఖాన వ్యానూ, వ్యాను!

“అద్భుతం. ఈ పాటతో అసలు మన సినిమా సగం హిట్ ఐపోయినట్టే,” ఆనందంగా అన్నాడు పైత్య.

“మరీ నాటుగా ఉన్నట్టుంది?” సందేహంగా అన్నాడు నిర్మాత.

“మన సినిమాలు చూడ్డానికి అభిరుచి గల ప్రేక్షకులు ఎక్కడ వస్తారండీ బాబూ! వచ్చేదంతా ల్యారీ డ్రైవర్లు, కాలేజ్ స్టూడెంట్లు, ఎన్.ఆర్.ఐ.లు అంతే. వాళ్ళకి ఈ మాత్రం నాటు ఉంటే కానీ ఘాటు ఎక్కదు,” సర్ది చెప్పాడు పైత్య.

“ఐతే ఓకే!” ఆనందంగా అన్నాడు నిర్మాత.

“తొందర పడకండి, ఈ పాట బాబు ఓకే చెయ్యాలి.”

“బాబా? వాడెవడు?”

“మీరు నోరు మూయండి, కొంపలు మునుగుతాయి. బాబంటే మన హీరో ఉమేష్ బాబు.”

“ఓ అతనా!” నాలుక్కరుచుకున్నాడు నిర్మాత.

ఫోన్‌లోనే ఉమేష్ బాబుకి పాట వినిపించాడు పైత్య.

“బాగుంది. దీనికే ఫిక్స్ అయిపోండి,” తన మద్దతు ప్రకటించాడు ఉమేష్.

“మీరు కూడా ఒప్పుకున్నారంటే, ధనాధన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సార్!”

“క్యారియర్లు క్యారియర్లు ట్యూన్స్ వేసుకుని తిరుగుతూంటాడు తను. నా సినిమాకి ఒక మంచి ట్యూన్ ఇచ్చినందుకు నేనే హ్యాపీగా ఫీలవ్వాలి.” ఫోన్ పెట్టేశాడు ఉమేష్ బాబు.

“సరే బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంక నెక్స్ట్ ఏంటంటే…”

“కొంప తీసి, కథా?” ఆందోళనగా అన్నాడు నిర్మాత.

“ఛీ ఛీ అప్పుడే కథేంటి, ఇప్పుడు క్యామెడీ ట్రాక్స్ గురించి ఆలోచించాలి,” చెప్పాడు పైత్య.

“ఐతే మళ్ళీ ఓకే,” అన్నాడు నిర్మాత.

“సరే, నాకు ఒక కొత్త క్యామెడీ ట్రాక్ తట్టింది, వినండి,” అన్నాడు పైత్య. అందరూ చుట్టూతా చేరి కూర్చున్నారు.

పైత్య చెప్పిన క్యామెడీ ట్రాక్ ఇది.

కమెడియన్ పరమానందం ఒక కంపెనీలో డైరెక్టర్‌గా ఉంటాడు. అందులో అతని ఎగస్పార్టీగా ఇంకో పేరు మోసిన కమెడియన్ ఎస్.ఎం. నారాయణ పని చేస్తూంటాడు. ఇతని ధ్యేయం పరమానందాన్ని దించేసి తను డైరెక్టర్ కావాలని. అదే ఆఫీసులో ఉమేష్ బాబు ప్యూన్‌లా పని చేస్తూంటాడు. వీళ్ళిద్దరి వైరం అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళ మీద చాలా ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ ఉంటాడు.

“మరీ ప్యూన్ వేషమా?” సందేహంగా అడిగాడు నిర్మాత.

“ఉమేష్ బాబు ఇమేజ్‌కి ఏం ప్రాబ్లం ఉండదు. ప్యూన్ ఐనా అన్నీ డిజైనర్ బ్రాండ్సే వేస్తాడు. పైగా దీని వల్ల మాస్ ఆడియెన్స్ మన సినిమాకి కనెక్ట్ అవుతారు. ప్యూన్లు అందరి కంటే ఒక పది సార్లు ఎక్కువ చూస్తారు,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు పైత్య.

“ఐతే డబుల్ ఓకే,” అన్నాడు నిర్మాత.

ఆ తరువాత చీను పైత్య ఉమేష్ బాబు ప్లే చేసే కొన్ని ప్రాక్టికల్ జోక్స్ చెప్పాడు. అందరూ దొర్లి దొర్లి నవ్వారు.

నిర్మాత కళ్ళు తుడుచుకుంటూ, “భలే ఉంది, కానీ ఉమేష్ బాబు అసలు ఆ ఆఫీస్‌లో ప్యూన్‌గా ఎందుకు పని చేస్తాడు?” అడిగాడు.

“అది నేను కూడా ఆలోచించ లేదు, ఏదో కథ రాసి ఇరికించేద్దాం లెండి,” హామీ ఇచ్చాడు పైత్య.

“అందుకే మీరంటే నాకు అడ్మిరేషన్. కొందరు సిల్లీ ఫెలోస్‌లా మీరు కథకి ఇంపార్టన్స్ ఇవ్వరు,” మెచ్చుకున్నాడు నిర్మాత.

“సరే, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన పార్ట్,” అనౌన్స్ చేశాడు పైత్య.

“కొంప తీసి కథా?” అని అడగబోయి ఎందుకన్నా మంచిది అని నోరు మూసుకున్నాడు నిర్మాత.

“ఇప్పుడు పంచ్ డయలాగ్స్ రాసుకోవాలి. తెలుసు కద, మన ఉమేష్ బాబుకి ఉన్న ఇమేజ్? అది దృష్టిలో పెట్టుకుని రాయండి,” హెచ్చరించాడు పైత్య.

బోలెడు పంచ్ డయలాగ్స్ ఇచ్చేశారు అందరు. వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేశాడు పైత్య.

“సూటిగా వస్తే నీటుగా చూసుకుంటా, పోటీగా వస్తే నూతిలో తోసుకుంటా.”

“దేవుడు నీ జాతకం రాస్తాడు. వీడు నీ స్నాతకం చేస్తాడు.”

“పప్పులో ఉప్పు తక్కువైనా, మనిషిలో నిప్పు తక్కువయినా నాకు నచ్చదు.”

అంతలో పైత్య ఆలోచనగా మొహం పెట్టాదు. “ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం. బృందగానాలో మన సినిమా హిట్ కావాలాంటే ఆ యాసలో కొన్ని డయలాగ్స్ ఉండాలి,” అన్నాడు.

“పంచ్ ఉండాలా?” అడిగారు అందరూ.

“అక్ఖర్లేదు, వాళ్ళకు తమ యాసలో చెప్తే చాలు, ఎలా ఉన్నా విజిల్స్ కొడతారు,” చెప్పాడు పైత్య.

వెంటనే కొన్ని బృందగానా డయలాగ్స్ ఇచ్చేశారు అందరూ.

“నువ్వు షేర్ ఖాన్ ఐతే నేను తుర్రుం ఖాన్”

“నువ్వు వస్తే భయపడేటందుకు నేను హౌలా పాషా అనుకున్నావు రా!”

“బొక్కలిరగ గొట్టి బొంద కడ్త బిడ్దా”.

“చాలు మన సినిమా రెడీ అయినట్టే, ప్రెస్‌కి అనౌన్స్ చేశెయ్యండి,’ నిర్మాతతో చెప్పాడు పైత్య.

“పేరేంటి అని అడిగితే?” అన్నాడు నిర్మాత.

“పీకుడు కంటే పవర్‌ఫుల్ మూవీ, అందుకే ‘లాగి పీకుడు ‘ అని పెట్టాం అని చెప్పండి,” సెలవిచ్చాడు పైత్య.

“సార్ ఐతే ప్రెస్ వాళ్ళకు కాల్ చేయనా? మనం ప్రొసీడ్ అవుతున్నట్టే కద, లేక ఏమన్నా మనసు మార్చుకునే చాన్స్ ఉందా?” అడిగాడు నిర్మాత సెక్రెటరీ.

“గుండులో ఫిక్స్ ఐతే మొండిగా వెళ్ళిపోతా!” గంభీరంగా అన్నాడు నిర్మాత.

Advertisements
This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

42 Responses to “పీకుడు” సూపర్ హిట్! ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం?

 1. అదరహో! నిర్మాత చెప్పిన చివరి డైలాగ్ మరీను.

 2. రవి says:

  You Rock Murali! :))

  నాకూ భావావేశం వస్తూంది. కొన్ని డైలాగులు పీకుతా.
  “నువ్వు నాలుగంటే నాలిక కోస్తా, మూడంటే మాడు పగలగొడతా, రెండంటే రెచ్చిపోతా, ఒకటంటే ఒంటేలు పోయిస్తా”, “కళ్ళున్నోడు ముందు జూస్తడు, కూలింగ్ గ్లాసులున్నోడు సూర్యుణ్ణి జూస్తడు”, “నేను సినిమా తీస్తే ఝండూబాములు బయట బ్లాకులో కొంటార్రా”

  ఒకప్పుడు కాఘవేందర్రావు, మోసరి నారాయణ లాంటోళ్ళని బూతులు తిట్టుకుని మనశ్శాంతి పొందేవాళ్ళం. పైత్య సీను వంటి వాళ్లొచ్చి మనశ్శాంతి అనే మాటనే మర్చిపోతున్నాం.

 3. Sravya V says:

  🙂

 4. వావ్ సూపరండీ

  వర్మ గారి కథ స్క్రీన్ ప్లే లో కూడా ఇలాగే కథ లేకుండా సినిమా తీయడం చెప్పాడు.

 5. టపా సూపరు.

  ఇంతకీ యెన్నారైలకి పోలిక స్టూడెంట్లూ, లారీడ్రైవర్లతోనన్నమాట అభిరుచి విషయంలో 😀

  • Murali says:

   మీరు పాయింట్ బాగా అర్థం చేసుకున్నారు. ఇంకా లారీ డ్రైవర్లైనా కొత్త ప్రయోగాలని ఆదరిస్తారేమో కానీ, ఈ గ్రూప్‌కి మాత్రం కొత్తదనం అంటే అసహ్యం. 🙂

 6. మొత్తానికి కథగురించి రాయడం మానేసారు..!
  ఫేమిలీ సెంటిమెంట్‌ ఏది..?
  డ్రామా ఏదీ..?
  సీను పైత్య సినిమాల్లో ఇవన్నీ ఉంటాయి కదా..! మీరెలా మిస్సయ్యారు..?
  (ఒక ఉ(అను)చిత సలహా., ఉమేష్‌ బాబు తండ్రి ఫైర్‌ స్టార్‌ గారు అదే ఆఫీసులో ప్యూన్‌ కింద వర్క్‌ చేసేవారు..! కొడుక్కూడా అక్కడే పనిచెయ్యాలని ఆశ..! UNO జనరల్‌ సెక్రటరీ అయిన హీరోగారు ఇందుకోసమే ఆ ఆఫీసులో ప్యూన్‌గా చేస్తూ ఉంటే బావుంటుంది)

  • Murali says:

   అసలు మన త్రిలింగ సినిమాకి కథ అక్ఖర్లేదు అని చెప్పడమే ఈ టపా ఉద్దేశ్యం. మీరు చెప్పిన టైప్ లాజిక్‌తో ఏదో ఒక కథ అల్లేస్తారు లెండి. అందుకే నేను చేయి చేసుకోలేదు.

 7. koganti says:

  Suprb title 🙂 ‘laagi peekudu’

 8. bonagiri says:

  బాగుంది. కొంప తీసి మీరు పీకుడు టీములో పనిచేయలేదు కదా!

  ఈ రోజుల్లో సినిమాలో కథ ఉందా, లేదా అన్నది ముఖ్యం కాదండి.
  వినోదం పండిందా, లేదా అన్నదే పాయింట్.

 9. Sivakumar says:

  కామెడీ కథల పోటీకి పంపిస్తే మొదటి బహుమతిని కొట్టేసేవారు.

  • Murali says:

   లేదండి,

   ఇంత కాంట్రవర్షియల్ క్యామెడీకి బహుమతులు వస్తాయని అనుకోను. 🙂

 10. Good one Murali gaaru, ROFL 😀 😀 😀 😀

 11. > “నేను సినిమా తీస్తే ఝండూబాములు బయట బ్లాకులో కొంటార్రా”
  > కొడుక్కూడా అక్కడే పనిచెయ్యాలని ఆశ..! UNO జనరల్‌ సెక్రటరీ అయిన హీరోగారు ఇందుకోసమే ఆ ఆఫీసులో ప్యూన్‌గా చేస్తూ ఉంటే బావుంటుంది

  :-))

 12. Padmaja says:

  Murali garu,

  Very hilarious, I couldnt stop laughing :)! Your punch dialogues are superb, enjoyed reading this.

 13. Jai says:

  పిల్లోడు జీరోగా వేసిన పూసరవల్లి కూడా “హిట్” అయిందటగా, మరి దాని గురించి కూడా రాయండి సార్! లేకపోతే ఆ “వర్గం” వాళ్ళు నొచ్చుకుంటారు. ఇంత కష్టపడి బొమ్మను హిట్ చేయుంచుకున్నామీరు గమనించకపోవడం బాలేదు.

  • Murali says:

   ఒక పర్టికులర్ సినిమా గురించో, పర్టికులర్ హీరో గురించో రాసింది కాదండి, ఈ టపా. మన సినిమాలు ఎలా a point of no returnకి చేరుకున్నాయో చెప్పడమే నా ఉద్దేశ్యం. మంచి సినిమా తీయడానికి నిర్మాతలు కానీ, చూడ్డానికి ప్రేక్షకులు కానీ రెడీగా లేరు. సర్వనాశనం అనే పదం ఇలాంటి సందర్భాల్లోనే వాడతారు.

 14. చాలా బాగా నిజాన్ని కళ్ళకి కట్టినట్లు వ్రాసారండి. ఈ పీకుడు పక్కా ఫార్ములా సినీమా. మీరు అన్నట్లు ఈ హిట్టుతో ఇంక వరసపెట్టి చాలా సేం ఫార్ములా “లాగి పీకుడు” సినీమాలు త్రిలింగ దేశం మీద పడతాయి ఇక. ప్చ్. మీరు చెప్పిన క్యామెడీ ట్రాక్ ఆల్రెడీ వచ్చెసిందండీ మిస్టర్ మేధావి సినీమాలో. 😉

  • Murali says:

   అందులో హీరో ప్యూన్ కాదు లెండి. ఆ మాత్రం వెరైటీ చాలు మన సినిమాకి.

 15. kottapalee says:

  fantastic! 🙂

 16. kamudha says:

  ఐటెం సాంగ్ నిజంగా చాలా బాగుంది. సినిమా వాళ్ళకి కాని చూస్తే మీతొ మిగతా పాట అంతా రాయిస్తారు.

  కాముధ

  • Murali says:

   థాంక్స్! నాలోని “ఆ” టాలెంట్ ఎవరూ గుర్తించట్లేదేమిటా అని తెగ ఫీల్ అయ్యాను. మీరా లోటు తీర్చారు!

   • kamudha says:

    నాసొగసేమో ఆలిషాను అంటే, నిజం చెప్పొద్దూ – నాకేమో కాలేజ్ హాస్టల్ లొ నా డెస్క్ ముందు అంటించుకున్న అలిషా చినాయ్ ఫొటొ గుర్తుకొచ్చింది.

 17. Venkat says:

  Super 🙂

  Umesh babu di inko dialogue add cheyyalsindi “Cinema ela unna parledu, twittter lo super hit ani raasesta” ani

 18. KC says:

  Brain lo Fix ayithey chalu cinema ni Drain lo kalipestha…

 19. kiran says:

  😀
  “గుండులో ఫిక్స్ ఐతే మొండిగా వెళ్ళిపోతా!” – hahhahahahha 😀

 20. comedy lover says:

  ‘oosaravelli’ ki kooda ‘kaatravalli’ parody raaseyyandi 🙂

 21. Kumar N says:

  Wow!! Very well written . చప్పట్లు

  బాబోయ్, ఆ “గీకుడు” సినిమా కి నాకు తిక్కలేచి,మధ్యలో సినిమా ఆపేసా.

  “పైత్య సీను వంటి వాళ్లొచ్చి మనశ్శాంతి అనే మాటనే మర్చిపోతున్నాం”
  సో ట్రూ. జనాలకేమయ్యిందో నాకు తెలీదు కాని, ఈయన్ని చాలాఆఆఆఆఆ ఎత్తుకెత్తేస్తున్నారు. he is very mediocre(at best). కితకితలు పెట్టుకొని నవ్వుకోవాల్సిందే. ఆ ఢీ లో కూడా బ్రహ్మానందం లేకపోతే ఆ సినిమా అటకెక్కేది.

 22. Sreeni says:

  this is too good
  apprecaite the work of the writer
  also reflects the reality

 23. murthy says:

  the reality of the current cinema world has been shown clearly.

 24. Sireesha says:

  super vundandi post 🙂

 25. vishnu says:

  ధూకుడు పీకుడు ఇతె మరి రచ్చఏమవుతుంది?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s