ముఖపుస్తకం – 4


అప్పిగాడి మాటలతో నాకు కనువిప్పు కలిగింది. “కాదేదీ కవితకనర్హం?” అని శ్రీ శ్రీ మహాకవి అన్నట్టు, “కాడెవడు ముఖపుస్తకంలో add చేసుకొనుటకు అనర్హుడు” అనుకుని, వల్లకాట్లో రామనాథం & Co.ని నా అకౌంట్‌కి add చేసి పారేశా.

నా హోం పేజ్ రిఫ్రెష్ చేయగానే ఆల్‌రెడీ 20 అప్‌డేట్స్ వచ్చి ఉన్నాయి. ఈ సారి నేనంత ఆశ్చర్య పోలేదు. ముఖపుస్తకం మెంబర్ల కెపాసిటీ నాకు అప్పటికే తెలిసి వచ్చింది.

సరే ఒక్కొక్క అప్‌డేట్ చదవడం మొదలు పెట్టాను. మొదటిది మా ఒకనొక కజిన్‌ది. “ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాను (10:45).” ఐతే ఆల్రెడీ అప్పిగాడి “నేను బాత్‌రూంకి వెళ్తున్నాను” అన్న అప్‌డేట్ చదివి ఉండడం వల్ల ఈ సారి నేనంత ఇబ్బందిగా ఫీల్ కాలేదు.

ఎలా రెస్పాండ్ కావాలి దీనికి? కాస్త ఆలోచించాను. స్నానం చేయడం అన్నది మంచి అలవాటు కాబట్టి “లైక్” మీద క్లిక్ చేసేశా.

నెక్స్ట్ అప్‌డేట్ మా వేలు విడిచిన మేనత్త యొక్క కాలు జారిన కొడుకుది. “గత వారం కాలు జారి పడ్డాను అన్న సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రోజు కాస్త కుంటుతూ నడవ గలుగుతున్నాను,” అని పెట్టాడు.

ఈ సారి ఎలా రెస్పాండ్ కావాలో కొంచెం అర్థం కాలేడు. “లైక్” అని పెడితే, నేను కుంటడం నీకు బాగుందా అని వాడు అపార్థం చేసుకునే అవకాశముంది. అసలే చాల రోజుల తరువాత మళ్ళీ ముఖపుస్తకం ద్వారా కలుసుకున్నాం. సరిగ్గా రెస్పాండ్ కాకపోతే దూరపు చుట్టం కాస్తా ఘోరపు చుట్టమయ్యే అవకాశముంది. అలా అని ఏం అనకపోతే కూడా వాడు ఫీల్ కావచ్చు. కాబట్టి ఒక కామెంట్ వదిలాను, “నువ్వు త్వరలో కుంటడం ఆపేసి నడుస్తావని ఆశిస్తున్నాను,” అని.

నాలో ఇంత లౌక్యముందని నాకు ముఖపుస్తకంలో సభ్యత్వం తీసుకోవడం వల్లే తెలిసింది కదా అని కూసింత ముచ్చట పడ్డాను.

తరువాత అప్‌డేట్, మూడ్ బాగా లేని అమ్మాయిది. “ఇప్పుడు నా మూడ్ కొంత బెటర్. అహహా, మళ్ళీ పాడయ్యింది. కాదులే ఇప్పుడు బెటర్. ఏమో నాకు తెలీదు!” అని ఉంది. దానికి ఎలా స్పందించాలో తెలీక నేను కూడా అది వదిలేసి తరువాత అప్‌డేట్ చూశాను.

వల్లకాట్లో రామనాథం పెట్టాడు, “ఈ ప్రపంచమే ఒక స్మశానం. మనమంతా కాబోయే శవాలం. కాబట్టి జాగ్రత్త చేసుకోవాలి కట్టెలని. అలా అని వదిలిపెట్ట కూడదు బట్టలని,” అని. నాకు ఒక్క సారి నీరసం ముంచుకుని వచ్చింది. అసలే నేను కొంత సెన్సిటివ్. ఇలాంటి డిప్రెసింగ్ మెసేజెస్ అస్సలు తట్టుకోలేను.

వేరే జనాలు మటుకు బాగానే స్పందించారు. దానికి అప్పటికే పది లైక్‌లు వున్నాయి. ఎవరో ఒకతను, “చాలా బాగుంది. ఆ కట్టేలేంటో చెప్తే అవి రెడీ చేసుకుంటాం కద!” అని రిప్లై పెట్టాడు కూడా. రామనాథం గాడి అప్‌డేట్లు ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోవాలి అనుకుంటూ నేను ప్రొసీడ్ అయ్యాను.

తరువాతది నాకు బాబాయి వరస అయ్యే ఒక పెద్దాయన అప్‌డేట్, “మీరు ఫలానా బాబా యొక్క ఫలానా వ్రతం చేస్తే మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి,” అని పెట్టి వ్రతం యొక్క లింక్ కాబోలు, అది కూడా add చేశాడు.

వద్దు అనుకుంటూనే ఆ లింక్ మీద క్లిక్ చేశాను. అందులో వ్రత విధానం విశదంగా చెప్పబడి ఉంది. చదవడానికి ఒక అర్ధ గంట పట్టింది. క్లుప్తంగా సారాంశం ఏంటంటే ఆ ఫలానా బాబా ఫోటోని రెండు చేతులతో గుండెకి హత్తుకుని మన ఇంటి చుట్టూ మనం పొర్లు దండాలు పెట్టాలి. ప్రతి ప్రదక్షిణం తరువాత, గట్టిగా ఆ బాబా పేరు అరిచి చెప్పాలి. దీనికి కూడా స్పందించాలి కాబట్టి, (లేకపోతే దూరపు చుట్టం ఘోరపు చుట్టం అయిపోయే ప్రమాదం ఉంది, వగైరా వగైరా), “నాకు కుదరదులే బాబాయి. మా ఇంటి చుట్టూ ముళ్ళు. ఒక్క ప్రదక్షిణం చేయడమే కష్టం,” అని రిప్లై పెట్టా.

ఇంతలో మా ఒకనొక కజిన్ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది, “నా స్నానం అయిపోయిందోచ్ (11:45),” అని. ఓర్నీ వీడు గంట సేపు స్నానం చేశాడా ఐతే అనుకుని ఆశ్చర్యపోయాను. ఈ లెక్కన వీడు రోజుకో సబ్బు అరగదీస్తూ ఉండాలి. అంటే వీడి సబ్బుల ఖర్చే నెలకు కనీసం మూడొందల రూపాయలు ఉంటుంది. సబ్బులే ఈ రకంగా తగలేస్తున్నాడంటే, షేవింగ్ క్రీం, టూత్ పేస్ట్ కూడా బాగానే వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ రకంగా వాడి పర్సనల్ ఖర్చు ఎంత ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ, ఒక సారి తల విదిలించి, ఆ థాట్ ప్రాసెస్ ఆపేశాను. ఏంటో ఈ అప్‌డేట్శ్ చదువుతూ ఉంటే మనసు పరి పరి విధాల పోతూంది.

నెక్స్ట్, అప్పారావు గాడు ఇంతకు ముందు చెప్పినట్టే వాడు వాకింగ్‌కి వెళ్ళిన ఫోటోలు పెట్టాడు. దాదాపు ఒక యాభై ఉంటాయి. బహుశా నడుస్తున్నంత సేపు, వాడి ఫోన్‌లో ఉన్న క్యామెరా వాడి, దారి పొడుగూతా ఫోటోలు తీసినట్టున్నాడు.

ముందు వాడి ఇంటి గేటు ఫోటో ఉంది. ఆ తరువాత వాడి వీధివి ఒక నాలుగు ఫోటోలు. ఆ తరువాత వాడి పక్క సందులో ఇంకొన్ని ఫోటోలు. ఆ తరువాత మళ్ళీ వాడి సందుకు వచ్చినట్టున్నాడు. ఇంకో మూడు ఫోటోలు. ఆ తరువాత వాళ్ళింటి దగ్గర గుంటలు పడి ఉన్న వాళ్ళ మెయిన్ రోడ్‌వి తీశాడు. ఆ తరువాత ఆ రోడ్ మీద ట్రాఫిక్‌ని తీశాడు. ఆ తరువాత ఒక వీధి కుక్క ఫోటో ఉంది. ఆ తరువాత క్లోజప్‌లో అదే కుక్క ఎగురుతున్నట్టు ఫోటో ఉంది. అంతే! ఇంక ఫోటోలు లేవు.

నా మనసు కీడుని శంకించింది. వెంటనే అప్పారావింటికి ఫోన్ చేశా. వాళ్ళన్నయ్య ఫోన్ ఎత్తాడు. నేనేం అడగక ముందే, “ఓ, అప్పుడే నీకు తెలిసిపోయిందా! అర గంట కిందే వాడిని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళారు,” అన్నాడు.

“ఎందుకు?” ఆందోళనగా అడిగాను.

“ఇంతకు ముందు వాకింగ్‌కి వెళ్ళినప్పుడు కుక్క కరిచింది! అందుకు. ఆస్పత్రికి పోతూ కూడా ఒకటే గోల. నాతో బలవంతంగా వాడి వాకింగ్ ఫోటోలు వాడి ముఖపుస్తకం అకౌంట్‌కి అప్‌లోడ్ చేయించాడు,” కాస్త విసుగ్గా చెప్పాడాయన.

నేను ఫోన్ పెట్టేశాను.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in ముఖపుస్తకం. Bookmark the permalink.

10 Responses to ముఖపుస్తకం – 4

 1. Anuradha says:

  😀 😀

 2. హహహ ముఖపుస్తకం తెరవాలంటే భయపడేలా ఒకరేంజ్ లో అడుకుంటున్నారు సారు 😀

 3. Sravya V says:

  🙂 🙂

 4. Kumar N says:

  మాష్టారూ,
  దాదాపుగా నాలుగేళ్ళనుంచీ చదువుతున్నాను. ఎంతో రెటరిక్ తో పబ్లిక్ డిబేట్ లో నలిగి, చివరకి బేసిక్ విషయం గాలికెగిరిపోయే ముఖ్యమైన విషయాల మీద మీరు subtle humor తో, కొంచెం వ్యంగ్యం మిక్స్ చేసి, మెత్తటి చెప్పుతో కొట్టే మీ శైలి మాత్రమ్ అమోఘం.

  I bow my head to you. Keep going Sir. We all need these laughs. 🙂
  _________

  The below cracked me up,although I don’t have a facebook account. 🙂

  “ఈ ప్రపంచమే ఒక స్మశానం.
  మనమంతా కాబోయే శవాలం.
  కాబట్టి జాగ్రత్త చేసుకోవాలి కట్టెలని.
  అలా అని వదిలిపెట్ట కూడదు బట్టలని,”

  ఎలా రెస్పాండ్ కావాలి దీనికి? కాస్త ఆలోచించాను. స్నానం చేయడం అన్నది మంచి అలవాటు కాబట్టి “లైక్” మీద క్లిక్ చేసేశా.

  “నువ్వు త్వరలో కుంటడం ఆపేసి నడుస్తావని ఆశిస్తున్నాను,” అని. నాలో ఇంత లౌక్యముందని నాకు ముఖపుస్తకంలో సభ్యత్వం తీసుకోవడం వల్లే తెలిసింది కదా అని కూసింత ముచ్చట పడ్డాను”

  దూరపు చుట్టం కాస్తా ఘోరపు చుట్టమయ్యే అవకాశముంది

  దాదాపు ఒక యాభై ఉంటాయి. బహుశా నడుస్తున్నంత సేపు, వాడి ఫోన్‌లో ఉన్న క్యామెరా వాడి, దారి పొడుగూతా ఫోటోలు తీసినట్టున్నాడు.

  • Murali says:

   Thanks. From my personal experience this gets people’s attention. Whether they choose to introspect is a different matter altogether. 🙂

 5. narsinghrao says:

  very humorous…. I like your దూరపు చుట్టం కాస్తా ఘోరపు చుట్టమయ్యే అవకాశముంది

 6. Indrasena says:

  You got ultimate talent Murali gaaru..Very very nice blog..I don’t know why I missed this blog so far,my bad..Thanks for nice post..

 7. Padmaja says:

  Murali garu, mee “facebook” posts super andi, cant wait any longer for the next one. you have to increase the frequency of your updates 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s