అకటా వికటపు రాజు


అది ఢిల్లీ అమ్మ నివాసం. ఆవిడ డ్రాయింగ్ రూంలో కూర్చుని ఫిడేలు ప్రాక్టీసు చేసుకుంటూంది. ఎదురుగా రోమన్ చక్రవర్తి నీరోది నిలువెత్తు చిత్ర పటం ఉంది. ఢిల్లీ అమ్మ ఇటలీ నుండి వచ్చింది కాబట్టి, ఆమెకి నీరో అంటే ప్రత్యేకమైన అభిమానం. ముఖ్యంగా రోం నగరం తగలబడిపోతున్నప్పుడు ఆయన ప్రశాంతంగా ఫిడేలు వాయించుకోవడం ఆమెకి అన్నిటి కన్నా నచ్చిన అంశం.

“అమ్మా, ఘోరం జరిగిపోయింది!” హడావుడిగా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు దిక్-అపజయ సింగ్.

“అబ్బా, నన్ను ప్రశాంతంగా ఫిడేలు వాయించుకోనివ్వరు కద, వెధవ సంత, వెధవ సంత అని! ఏమయ్యిందిప్పుడు?” గద్దించింది ఢిల్లీ అమ్మ.

“ఇంకేముందమ్మా, మొన్నే కద “బ్యాడ్ టైం” మ్యాగజీనులో మన ప్రధాని జగన్‌మోహన్ సింగ్ గురించి అవాకులు చవాకులు పేలుతూ, ఒట్టి అసమర్థ ప్రధాని అని రాశారు,” కాస్త ఊపిరి పీల్చుకున్నాడు దిక్-అపయజ సింగ్.

“అవును, అప్పుడే చెప్పాను కద, ఆ పాశ్చాత్యులకి మన ప్రాబ్లంస్ ఏం తెలుస్తాయి, ఒక సారి ప్రధాన మంత్రి కుర్చీ మీద కూర్చుంటే తెలుస్తుంది, దాని మీద నెగ్గుకు రావడం ఎంత కష్టమో అని! పైగా వాళ్ళ ఆయుధమే వాడి, మన “ఇన్‌లుక్” మ్యాగజీను మీద, వాళ్ళ ప్రెసిడెంట్ ఓబమ్మ కూడా ఒక వాజమ్మే అని రాయించాను కూడా కద!” కించిత్ గర్వంగా అంది ఢిల్లీ అమ్మ.

“కానీ ఆ అప్రాచ్యపు వెధవలకు మీ మెసేజ్ అర్థమైనట్టు లేదమ్మా. ఈ రోజు మళ్ళీ వాషింగ్‌టన్ మెయిల్ అనే పేపర్‌లో జగన్‌మోహన్ ఎప్పుడు మౌనంగా ఉంటాడు, అన్నిటికీ తడబడుతూ ఉంటాడు అని, ఆయన్ని చూస్తే ఎవరికైనా ఘొల్లున ఏడుపొస్తుందని, రాశారు,” ఒగరుస్తూ చెప్పాడు దిక్-అపజయ సింగ్.

“అవునా,” ఆశ్చర్యపోయింది ఢిల్లీ అమ్మ. వెంటనే సర్దుకుని, “వెధవలకు ఇంకా బుద్ధి రాలేదన్న మాట, మళ్ళీ మన ఇన్‌లుక్ మ్యాగజీన్ కవర్ మీద, జగన్‌మోహన్‌ని చూస్తే ఏడుపు మాత్రమే వస్తుందంతే, అదే ఓబమ్మ స్టిములస్ ప్లాన్ చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది అని రాయిద్దాం,” ఉక్రోశంగా అంది.

“ఎంత మందికని అలా ఇన్‌లుక్ మ్యాగజీన్ మీద కవర్ స్టోరీస్ రాయించి జవాబు చెప్తారమ్మా? రేపు థూ-యాక్ టైంస్ అనే ఇంకో న్యూస్ పేపర్‌లో జగన్‌మోహన్ ఒక శిఖండి, అతని వెనుక దాక్కున్న అర్జునుడు మీరే అని కథ రాబోతూందంట, మన అంబాసిడర్ కాల్ చేసి ఇప్పుడే చెప్పాడు,” అప్పుడే లోపలికి వచ్చిన P. ఏకాంబరం అన్నాడు.

“ఏంటి నన్ను అర్జునుడితో పోల్చారా?” ముసి ముసిగా నవ్వింది ఢిల్లీ అమ్మ. “అప్పుడప్పుడు ఈ న్యూస్ పేపర్లు నిజాలు భలే రాస్తూంటారే!”

“మీరు అసలు విషయం మర్చిపోతున్నారు. మన ప్రధానిని అంత మాట అన్నారు, అది మనకెంత అవమానం,” కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు ఏకాంబరం.

“అవును ఆ విషయమే మర్చిపోయాను. దీనికి మనం తప్పకుండా సమాధానం చెబ్దాం,” ఆవేశంగా అంది ఢిల్లీ అమ్మ తన పిడికిలి బిగిస్తూ.

ఇంతలో లోపలనుండి, ఢిల్లీ అమ్మ పర్సనల్ మేనేజర్‌ వచ్చాడు. “అమ్మా, మీరు నాతో ‘ఈ రోజు సాయంత్రం మన గార్డెన్‌లో పార్టీ ఉంది. అసలే చలి కాలం, కాబట్టి కాస్త నెగడు వేయి, వెచ్చగా ఉంటుంది’ అని చెప్పారు కద. నెగడు వెలిగించడానికి బొగ్గులు లేవమ్మా మరి,” అంటూ.

“మనం పాలిస్తున్న దేశంలో, మన గవర్నమెంట్‌కి బొగ్గుల కొరతా! ఇంసల్ట్!” గట్టిగా అరిచింది ఢిల్లీ అమ్మ. “జగన్‌మోహన్‌జీకి ఒక ఫోన్ కొడితే ఆయన చెప్తారు, ఎవరెవరికి ఎంత బొగ్గు ఇచ్చాడో. ఆ పని చూడు,” అంటూ మేనేజర్‌కి పురమాయించింది.

“అదే మరి, పేపర్‌లో చదవలేదా, ఆయన, 1,86,000 కోట్ల విలువ చేసే బొగ్గుని అప్పనంగా అయిన వాళ్ళకి కట్టబెట్టారని? మనకు బొగ్గుకి కొరతేంటి?” విసుక్కున్నాడు ఏకాంబరం.

“అప్పుడు 2G మనదిరో, ఇప్పుడీ బొగ్గు మనదిరో!
ఈ దేశం మన అబ్బ సొత్తురో, ప్రతి స్కాంకి మనమురో.
నడుమ ఈ కొరతేందిరో, ఈ బీద అరుపులేందిరో!”

పాట అందుకున్నాడు ఆవేశంగా దిక్-అపజయ సింగ్.

“ఎహే, నోరు మూయండి, మన గొప్పలు మనమే చెప్పుకోవడం నాకిష్టం ఉండదని ఎన్ని సార్లు చెప్పాలి?” గదమాయించింది ఢిల్లీ అమ్మ. “ముందు ఈ న్యూస్‌పేపర్‌ల వ్యవహారం చూడాలి.”

ఈ సారి వృణబ్ ముఖర్జీ లోపలికి జొరబడ్డాడు. “అమ్మా ఇది విన్నారా? ఎల్లుండి గోడవీధి జర్నల్ అనే పాశ్చాత్య న్యూస్‌పేపర్, అసలు జగన్‌మోహన్ని మన గవర్నమెంట్‌లో ఎవరూ పట్టించుకోరని, ఏ ముఖ్యమైన నిర్ణయానికైనా, ఏం కావాలన్నా మీ దగ్గరకే వస్తారని. ఇలాంటి ప్రధాని పదవి కంటే, పాయిఖానాలు పరిశుభ్రం చేసే పని ఉత్తమం అని రాయబోతూందంట!” అనౌన్స్ చేశాడు.

ఒక్క సారి చలించి పోయింది ఢిలీ అమ్మ. “ఇన్నాళ్ళు నాకు పాశ్చాత్య మీడియా అన్నా, మ్యాగజీన్స్ అన్నా, న్యూస్‌పేపర్స్ అన్నా కొంత గౌరవం ఉండేది. ఈ రోజుతో అది పూర్తిగా పోయింది,” అంది మెల్లగా.

“జగన్‌మోహన్‌గారి గురించి ఇంత ఘోరంగా రాయడం వల్లనా?” ముక్త కంఠంతో ప్రశ్నించారు అంతా.

“కాదు, వారు రాసిందంతా నిజమే! ఈ విషయం తెలుసుకోవడానికి వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు పట్టిందే అని,” తాపీగా జవాబు ఇచ్చింది ఢిలీ అమ్మ.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

10 Responses to అకటా వికటపు రాజు

 1. chavakiran says:

  పేర్లు బాగా పెట్టారు.

 2. Suuuuuper satire andii…

  • kamudha says:

   నాకు నచ్చలేదు. పేర్లు తప్ప అన్నీ నిజాలే. చెణుకులు ఎమీలేవు.

   కాముధ

 3. sushma vedam says:

  aina chetta party ke votelesthaamu memu..India lo…

 4. Shivaji says:

  Kevvu keka…movie mottam lo “PHIDELU” scene chaala baagundi…….

 5. Sarma KSLKS says:

  ఇల్లరికం సినిమాలో ఒక పాటలో ఒక ఖండిక: ” ఛీ ఛా అన్నా చిరాకుపడకా చూరు పట్టుకొని వ్రేలాడే వారికి భలే చాన్సులే, భలే చాన్సులే “. అంతకు ముందు వాహినీ వారి పెద్ద మనుషులు సినిమాలో ” అ ఆ లు రానట్టి అన్నయ్యలందరికి అధికారయోగంబు పట్టేనయా…..”. ఆ పాటలలోని మాటలకు ఇప్పటి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వములోని మంత్రులు, అధికార గణం, ప్రస్థుత రాజకీయం సజీవ సాక్షులు. మనుషులు బాగుచేయలేని వ్యవస్తను పరమాత్ముడే పరిష్కరిస్తాడని కొద్ది రోజులక్రితమే వాడ వాడలా జరిపిన జాతర మూడవసారి గుర్తు చేసింది.

 6. Vamsi says:

  Naku kuda nachaledhu…pedhaga aakattukoledhu..

 7. narsingrao madharam says:

  write about our CM Kiran kumar reddy……

 8. Jitu :) says:

  LOL @ your reference to Nero. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s