నందామయా గురుడ నందామయా


నందామయా గురుడ నందామయా
మన దేశస్తులని ఏమి అందామయా?

తరగతులు ఎన్నున్నా వెనకబడి ఉంటారు.
తరతమ భేదాలు పోకుండ చూసేరు.
అభిమాన హీరోకి క్షీరాభిషేకాలు.
అసలైన వీరులు కనుమరుగు అవుతారు.

నందామయా గురుడ నందామయా
మన దేశస్తులని ఏమి అందామయా?

మెట్ట వేదాంతం తప్ప జ్ఞానమ్ము సున్నా.
డబ్బునే దైవముగా కొలుతురోయన్నా.
మూర్ఖుడైనా సరే ముద్దెంటుకుంటారు
నాస్తికుని మాత్రం దుమ్మెత్తి పోస్తారు.

నందామయా గురుడ నందామయా
మన దేశస్తులని ఏమి అందామయా?

నరికినా చంపినా పట్టించుకోరు
రంకు జరిగిందంటె రంకెలే వేస్తారు.
పార్వతీ దేవికి తెగ మొక్కుకుంటారు.
పాప పుడితే పీక నులిమేసి పోతారు.

నందామయా గురుడ నందామయా
మన దేశస్తులని ఏమి అందామయా?

ఎంత చదివిన కాని సంస్కారమూ రాదు,
ఏమి నేర్చిన కూడా కుల గజ్జి పోదు.
పంచితే, దొంగనే తిరిగి ఎన్నుకుంటారు.
పని నేర్చుకోమంటే అలిగి కూర్చుంటారు.

నందామయా గురుడ నందామయా
మన దేశస్తులని ఏమి అందామయా?

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

7 Responses to నందామయా గురుడ నందామయా

 1. Krishna Kishore says:

  పంచితే, దొంగనే తిరిగి ఎన్నుకుంటారు.
  పని నేర్చుకోమంటే అలిగి కూర్చుంటారు.

  Very contextual…

 2. kamudha says:

  చాలా బాగుంది. ఐతే మనం ఎంచేస్తే మార్పు వస్తుంది.

  • Murali says:

   ముందు విద్యాధికుల్లో, సంపన్నుల్లో మార్పు వస్తే, అంటే పైన చెప్పినవి ఏవీ చేయకుంటే, అప్పుడు కింద వర్గాలకు కూడా ఈ మార్పు చేరుకునే అవకాశం ఉంటుంది. మార్పు మన నుండి, మన కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి మొదలు కావాలి.

 3. Naresh says:

  దేశ భక్తి లేదని చెప్తే వెలి వేస్తారు. దేశాన్ని నాశనం చేసే ఐడియాలిచ్చే వాళ్లని మేధావులంటారు. ఇది మిస్సయ్యారనుకుంటా.

 4. sunday andhra jyothi says:

  Sir, mee peradi NANDAMAYA sunday Andra Jyothi lo reprint cesukovachha ?

 5. DaytonVaasi says:

  Liked it Murali. We need more from you.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s