యదా ప్రజా తథా రాజా (ఆధునిక బేతాళ కథలు – 1)

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పై నుంచి శవాన్ని తీసి భుజాన వేసుకుని ఎప్పటి లాగే మౌనంగా స్మశానము కేసి నడువ సాగాడు.

అప్పుడు శవంలోని కరప్షన్ బేతాళుడు, “నువ్వు దేన్ని సాధించగోరి అర్ధరాత్రి స్మశానంలో ఇంత కష్టపడుతున్నావో ఆ కోరిక తీరుతుందని నాకు అనిపించడం లేదు. కరప్షన్‌ని నిర్మూలించడం ఈ శవాన్ని తగలబెట్టినంత సులభం కాదు. అది నీకర్థమయ్యేలా ఒక కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను,” అని కథ మొదలు పెట్టాడు.

“పూర్వం జంబూ ద్వీపం అనే దేశంలో అంధేరా ప్రదేశ్ అనే ఒక రాష్ట్రముండేది. దాన్ని వై.నో. రాజశేఖర్ రెడ్డి అనే ఆయన ముఖ్య మంత్రిగా పరిపాలించే వాడు. ఆయన పార్టీ గాంక్రెస్ పార్టీ. ఆయనకి ఒక అబ్బాయి ఉండేవాడు. పేరు వై.నో. గగన్. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవాడు.

గాంక్రెస్ పార్టీ ఒక అంధేరా ప్రదేశ్‌లోనే కాకుండా, జంబూ ద్వీపం యొక్క కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ గాంక్రెస్‌వే అన్న మాట. కేంద్రంలో జగన్మోహన్ అనే ఆయన (అ)ప్రధాన మంత్రిగా ఉన్నప్పటికి, వెనక నుండి చక్రం తిప్పేది, ఢిల్లీ అమ్మ అన్న సంగతి అందరికి తెలుసు.”

మౌన భంగం ఐతే ఎక్కడ బేతాళుడు మాయం అవుతాడో అన్న భయంతో, శబ్దం చేయకుండా తన జుట్టు పీక్కున్నాడు విక్రమార్కుడు. ఇలాగే ఇంతకు ముందు చాలా సార్లు కథ చెప్పి అతన్ని దెబ్బ తీశాడు బేతాళుడు. ఎన్నో సుగుణాలు ఉన్న విక్రమార్కునికి ఒక దురలవాటు ఉంది. ఏదైనా ప్రశ్నకి సమాధానం తెలిస్తే చెప్పకుండా ఉండలేడు. చిన్నప్పుడు కూడా క్లాస్ రూంలో ఇలానే టీచర్ వేరే వాళ్ళని అడిగిన ప్రశ్నలకి తగుదునమ్మా అని సమాధానం చెప్పి, చాలా సార్లు బెంచ్ ఎక్కి నిలబడ్డాడు. ఇప్పుడు బేతాళుదు మళ్ళీ అతన్ని తెలివిగా ఇరికిస్తున్నాడు.

“పెద్దాయన బతికి ఉన్నప్పుడు, రాష్ట్ర గాంక్రెస్‌లో ఎలాంటి గొడవలు ఉండేవి కావు. ఆయన నంది అంటే నంది, పంది అంటే పందిలా ఉండేది పరిస్థితి. హఠాత్తుగా ఆయన యాక్సిడెంట్‌లో దుర్మరణం పాలవ్వడం వల్ల అంధేరా ప్రదేశ్‌లో సంక్షోభం ఏర్పడింది.

తండ్రి పోగానే తనే ముఖ్య మంత్రి అవుతాడు అని గంపెడాశాలు పెట్టుకున్నాడు వై.నో. గగన్. ఐతే ఎందుచేతనో అతనికి ఆ పదవి రాలేదు. ఢిల్లీ అమ్మకి అజీర్తి చేసి, కడుపులో గడబిడగా ఉన్నప్పుడు, మాటి మాటికి గగన్ ఫోన్ చేసి, “నాకు ముఖ్య మంత్రి పదవి కావాలి, ఊ ఊ, నాక్కావాలి,” అని విసిగించడంతో ఢిల్లీ అమ్మకి చిర్రెత్తుకొచ్చి అతన్ని ముఖ్యమంత్రి చేయలేదని ఒక రూమర్ ఉంది.

గాంక్రెస్‌లో ఉంటే ఇక లాభం లేదనుకుని, గగన్ బయటకి వచ్చేసి వై.నో.గాంక్రెస్ అనే కొత్త పార్టీ స్థాపించాడు. ఢిల్లీ అమ్మ కోపం నషాళానికి అంటింది. గగన్ అక్రమాస్తుల వివరాలు కూపీ లాగి అతన్ని రకరకాల కేసుల్లో ఇరికించమని ఛీ.బీ.ఐకి ఆదేశాలు జారీ చేసింది. ఏదో ఒక పని దొరికింది అన్న ఆనందంతో ఛీ.బీ.ఐ ఎగిరి గంతేసి, గగన్‌ని నానా కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేసి, చుంచుల్ గూడా జైల్‌లో పెట్టింది.

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. గాంక్రెస్ ఐనా, వై.నో. గాంక్రెస్ ఐనా, ప్రధాన ప్రతిపక్షం తెగులుదేశం ఐనా, బృ.రా స. ఐనా అన్నీ కరప్షన్‌లో ఓలలాడుతున్నవే. ఐతే గగన్ ఈ కరప్షన్‌లో నాలుగు ఆకులు ఎక్కువ చదివాడు (విజ్ఞులు నాలుగు స్కాములు, ఎక్కువ చేశాడని చదువుకోమని మనవి.) పైగా పొలిటికల్ సపోర్ట్ లేదు కాబట్టి ఈజీగా దొరికిపోయాడు. (రౌడీలు ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు అని సందేహ పడే వాళ్ళలో మీరొకరా?)

ఇక్కడ వై.నో. అభిమానులు ఇలా వాదిస్తారు. “మా గగన్ ఒక్కడే తిన్నాడా? సూర్యబాబు తినలేదా? వీ.సీ.ఆర్. తినలేదా, ఢిల్లీ అమ్మ తినలేదా? దేశంలో ఎవరూ లేనట్టు మా గగన్ బాబునే ఎందుకు అరెస్ట్ చేయాలి. ఇది రాజకీయ ప్రతీకార చర్య తప్ప మరేమీ కాదు,” అని.

వాళ్ళు చెప్పేది నిజమే. ఇది రాజకీయ ప్రతీకార చర్యే. గగన్ గాంక్రెస్‌లోనే ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఐతే నేను బేతాళుడిని కాబట్టి కాస్త తేడాగా ఆలోచిస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ శూరప్పన్ లాంటి గజ దొంగని వెతికి వేటాడి పట్టుకుందనుకో రాజా, అప్పుడు శూరప్పన్ అభిమానులు (అవును గజ దొంగలక్కూడా అభిమానులు ఉంటారు), “అదేంటి, దావూద్ ఇబ్రహీంని పట్టుకోలేదు, కాశ్మీరు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. పాత కక్షల వల్ల మా శూరబాబుని మాత్రం వేసేశారు,” అంటే నాలాంటి బేతాళుడు, “ఏదో ఒక సమస్య తీరింది అని ఆనందించకుండా, సమస్యల ప్రయారిటీ గురించి ఆలోచిస్తారేం?” అని ఎదురు ప్రశ్నిస్తాడు. ఇక జనంలో ఉన్న మద్దతు అంటావా, అరవనాడులో శూరప్పన్‌కి కూడా బాగానే మద్దతు ఉంది. ఆయన కులం, ఛీ ఛీ, ఆయన సామాజిక వర్గం వారు అరవనాడులో దాదాపు ముప్ప్పై శాతం ఉన్నారు మరి.

ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటె, మిగతా దొంగలు దొరకలేనంత మాత్రన, దొరికిన దొంగ దొర అయిపోడు. నేను చెప్పింది అర్థమయ్యిందా, రాజా?” ఆగాడు బేతాళుడు.

మౌనంగా తలూపాడు విక్రమార్కుడు, “నాకర్థమయ్యింది, గగన్ అభిమానులకి ఎప్పటికీ అర్థం కాదులే,” అని మనసులో అనుకుంటూ.

“గగన్ జైల్‌లో ఉన్న కొద్ది అతని పాపులారిటీ పెరిగిందే కానీ, తరగలేదు. ఉప ఎన్నికలలో వై.నో. గాంక్రెస్సే గెలిచింది. అందరూ గాంక్రెస్ అంధేరా ప్రదేశ్‌లో భూస్థాపితమయి పోయింది, ఇక కేంద్రంలో కూడా అధికారంలోకి రాదు అనుకున్నారు.

ఐతే సూర్యబాబు నాయుడు మాత్రం, “ఈ దెబ్బతో గాంక్రెస్ వోట్లు చీలిపోతాయి. జైల్‌లో ఉన్న గగన్‌ని ప్రజలు ఎన్నుకోరు. స్కాముల ఊబిలో కూరుకుపోయిన గాంక్రెస్ కేంద్రంలో ఓడిపోతుంది. తెగులు దేశమే పవర్‌లోకి వస్తుంది. పైగా తనకున్న ఎం.పీ.ల వల్ల కేంద్రంలో కూడా చక్రం తిప్పుతుంది,” అనుకుని ఉత్సాహంగా పాదయాత్ర మొదలుపెట్టాడు.

బృందగానా రాష్ట్ర సమితి అధ్యక్షుడు వీ.సీ.ఆర్ బృందగానాలో తన పార్టీనే క్లీన్ స్వీప్ చేస్తుంది అని నమ్మి, బృందగానా వస్తే ఏ మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి అని లెక్కలు వేసుకుంటూ బిజీ అయ్యాడు.

కానీ ఆశ్చర్యంగా 2014 ఎన్నికలలో, గాంక్రెస్ కేంద్రంలో, వై.నో. గాంక్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. సూర్యబాబు, వాచిపోయిన తన కాళ్ళ ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకి వెళ్ళాడు. బృందగానా రాలేదు. వీ.సీ.ఆర్. ఒక ఆరు నెలలు డీ.వీ.డీలు చూసుకుని కాలక్షేపం చేసి తరువాత మళ్ళీ ఉద్యమం మొదలు పెడదామని డిసైడ్ అయిపోయాడు.

ఇప్పుడు చెప్పు రాజా. ఈ వింత ఎలా జరిగింది? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల వెయ్యి ముక్కలు కాదు కానీ, నిన్ను ఇంటర్‌నెట్ లేని చోటికి పంపించి శాశ్వతంగా అక్కడే ఉంచేస్తాను,” కథ ముగించాడు బేతాళుడు.

గతుక్కుమన్నాడు విక్రమార్కుడు.

“ఇందులో వింత లేదు, విడ్డూరం లేదు. బహుశా నువ్వు జంబూ ద్వీపపు వోటర్లు దేశానికి మంచి చేసే పార్టీని గెలిపిస్తారు అన్న భ్రమలో ఉన్నట్టున్నావు. అలాంటిదేం లేదు. జంబూ ద్వీప ప్రజలు సాధారణంగా సోషలిస్టులు, సోమరిపోతులు. వారికి గగన్ ఎంత దోచుకున్నాడు అన్న విషయం గురించి పట్టింపు లేదు. తాము ఎన్నుకునే నాయకుడు ఉచిత సేవా పథకాలు అందిస్తాడా లేదా అన్నదే వాళ్ళకి ముఖ్యం.

ఇక పోతే సూర్య బాబులో ఒక క్యాపిటలిస్టు దాగున్నాడు అని వారికి తెలుసు. ఆయన్ని నమ్మడానికి వీల్లేదు. పైగా పదవి కోసం ఈ రోజు సోషలిస్ట్ అయిన వాడు, రేపు అదే పదవి కోసం మళ్ళీ క్యాపిటలిస్ట్ కాడు అన్న గ్యారంటీ ఏమీ లేదు. కానీ గగన్ తండ్రి వై.నో. పాలనలో వాళ్ళకి రక రకాల సబ్సిడీలు, ఉచిత పథకాలు, ఉచిత విద్యుత్ లాంటివి ఠంచనుగా అందాయి కాబట్టి, గగన్‌ని నమ్మచ్చు అన్న భరోసా వాళ్ళకి కలిగింది. దోచుకోవడం కూడా క్రమబధ్ధంగా ఉంటుంది కాబట్టి, కనీసం లంచాలు ఇస్తే అయినా పనులు జరుగుతాయి అన్న భద్రతా భావం ఏర్పడింది. పైగా అక్కడ వోటు వేసేదంతా ఇలాంటి సోషలిస్టులే. చదువుకున్న వారు ఎలాగూ వోటు వేయడం లాంటి పనికి మాలిన పనులు చేయరు. అందుకే గగన్ గెలిచాడు. సూర్యబాబు, వేడి నీళ్ళ బక్కెట్‌లో తన కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు. వీ.సీ.ఆర్, డీ.వీ.డీలయిపోయాక, బ్లూ రే డిస్కులు చూడ్డం మొదలు పెట్టాడు,” ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు విక్రమార్కుడు.

“మరి కేంద్రంలో గాంక్రెస్ ఎలా గెలిచింది?” ఆసక్తిగా అడిగాడు బేతాళుడు.

“అసలు ఈ ఉచిత పథకాలూ, సబ్సిడీలూ ఇచ్చి జనాన్ని సోమరిపోతుల్ని చేసిందే తల్లి గాంక్రెస్. తాతకి దగ్గులు నేర్పించగలమా? సరిగ్గా ఎన్నికలకు సంవత్సరం ముందు, గాంక్రెస్ నగదు బదిలీ పథకం మొదలు పెట్టింది. సంవత్సారానికి దాదాపు ముప్ఫై వేల రూపాయలు, UID ఉన్న వాళ్ళందరికి, డైరెక్టుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోనే వేస్తామని వాగ్ధానం చేసింది. అంతే జనం రెచ్చిపోయి వోట్లు వేశారు.

ఇంకో వైపు గగన్ మీదకు ఉసిగొల్పిన ఛీ.బీ.ఐని వెనక్కి లాగింది. దానికి ప్రతిగా అంధేరా ప్రదేశ్‌లో గెలిచిన గగన్ ఎం.పీలందరూ, కేంద్రంలో గాంక్రెస్‌కి మద్దతు ఇవ్వడంతో, గాంక్రెస్‌కి సులభంగా మెజారిటీ వచ్చింది,” దిగులుగా చెప్పాడు విక్రమార్కుడు.

“అసలు గగన్‌ని తన్ని తగలెయ్యడం ఎందుకూ, మళ్ళీ అక్కున చేర్చుకోవడం ఎందుకు?” వదలకుండా అడిగాడు బేతాళుడు.

“నువ్వు మళ్ళీ మన నాయకులు దేశం మేలు కోరే వారు అన్న భ్రమలో ఉన్నట్టున్నావు. ఈ గొడవ సృష్టించడం వల్ల ప్రజలు డిస్ట్రాక్ట్ అయి అసలు సమస్యల గురించి ఐదేళ్ళ పాటూ మర్చిపోయారు,” బదులిచ్చాడు విక్రమార్కుడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, కరప్షన్ బేతాళుడు శవంతోసహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు. విక్రమార్కుడు ఈ-మెయిల్ చూసుకోవడానికి పరిగెత్తాడు.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

19 Responses to యదా ప్రజా తథా రాజా (ఆధునిక బేతాళ కథలు – 1)

 1. kalyani says:

  Nice one. Waiting for the next story. Keep going.

 2. Sushma says:

  We dont want your predictions to come true Murali garu..heart of hearts we all are worried about it :(((

  • Murali says:

   Me neither. But that’s the way democracy seems to work in India.

   The amazing thing is there are NRIs here who talk as foolishly or parochially or as brazenly as the so called illiterate in India. 🙂

 3. Jitu says:

  Not about the post per say… but wrt your comment about NRIs and their outlook.

  I believe ( and I may be wrong and stand corrected if someone can convince me otherwise ) that NRIs seem to have more insular attitude than the uneducated in India. And what’s worse… unlike our illiterate who do things cause they know no better… our NRIs shirk onus knowingly. The so called “literate uneducated” have simply amassed degrees and material wealth. I don’t quite see much “educated” behavior.

  If questioned… the response I hear is…
  “Anndaru chestaaranndi. Memu chestein emi?”
  “Sabhi karte hain. Ham karein toh aapko kyun nazar aata hai??”

  And it is not just the question about bribes or getting things done in the corrupt government machinery. I understand if a person needs some service and needs to bribe his way into getting it. Probably that is the only way left for the mango-man. But my resentment is more towards things that are practiced by the crème de la crème of our society… the much sought after NRIs. Practices that are totally avoidable.

  Watching pirated stuff. ( Totally avoidable)
  Breaking rules of the country they live in. And if they get caught… there is a huge uproar in the media.
  Passing the buck every time things go wrong. ( It’s never we who do wrong things. It’s always them. I wonder who the “them” are. )
  I have met highly qualified professionals who are pro female feticide. That outlook can hardly be categorized as educated.

  Many follow the rule… as long as we can get away with it it’s ok. Choosevaadevaru?? Adigevaadevaru??

  There’s nothing amazing about parochial behavior. It’s disgusting at every level.

  • Murali says:

   One of the best comments I have received so far. Very well put. The ‘literate uneducated’ are the ones that are screwing up everything from the top.

   • Jitu says:

    🙂

    Making that comment was relatively easy.

    What’s not so easy is living up to that comment every moment. What not easy… is not giving up hope and feel… what’s the point of holding on to a belief when no one else does. The daily battles to not give in to the easy way… when the easy/wrong choices beat the right ones a hundred to one.

    At the end of it all when I look back… I do hope I see more of these battles won than lost. 🙂

   • kslkss says:

    screwing from the top is needed when the ‘ends’ are loose. That is the deed of the hour.

   • Jitu says:

    Already there are way too many people doing a good job screwing things up from all sides. Do we really need any more?

    The ‘need’ of the hour is someone to wrench out the loopholes, square the system and hammer some sense into people. While he’s at it… he might as well saw out the loose ends and drill in some ethics too.

    But I suppose… that’s asking for too much.

   • Murali says:

    By ‘screwing up’ I meant messing up things, not the literary meaning of the word. 🙂

 4. kastephale says:

  చాలా బాగుంది. మీ బ్లాగులో అక్షరాలు చాలా చిన్నవిగా ఉండి చదవడానికి ఇబ్బందిగా ఉంది. గమనించగలరు.

 5. Snkr says:

  /జంబూ ద్వీప ప్రజలు సాధారణంగా సోషలిస్టులు, సోమరిపోతులు. /
  🙂 శోషలిస్టులంతా సోమరిపోతులంటున్నారు, అద్దెచ్చా. చైనా తొత్తులు ఒప్పుకోరు. జెండాలు నాటే కార్యక్రమాలు, ధర్నా, రైల్‌రోకో లాంటి ప్రజాకంటక కార్యక్రమాలు చేపడతారు.

  /దోచుకోవడం కూడా క్రమబధ్ధంగా ఉంటుంది కాబట్టి, కనీసం లంచాలు ఇస్తే అయినా పనులు జరుగుతాయి అన్న భద్రతా భావం ఏర్పడింది./
  హా.. హా.. అంతేనేమో.
  ” ఓ..ఓ..కాలే గగన్ కె తలే
  ధర్‌తీకా ప్యార్ ఫలే ”
  మన ప్రియతమ దొంగలరాజన్న రాజ్యం వస్తుందంటారా?

  బాగా రాశారు. 🙂

  • Murali says:

   ప్రస్తుతానికి అలాగే అనిపిస్తుంది. ఒక వేళ అలా జరిగితే, “చూశారా, ప్రజా కోర్ట్‌లో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది,” అని మురిసిపోతారు.

 6. kslkss says:

  సుమతీ శతకములో పద్యం స్వల్ప మార్పులతో ” ఎప్పుడు సంపద కలిగిన అప్పుడె మందలు వత్తురు అది ఎట్లన్నన్ గంపలుగ ధనము చేరిన భోక్తలు పదివేలు చేరు గదరా మురళీ ”
  వై. నో. కాక ఓ.స్. అమరిక సందర్భోచితముగా ఉండునేమో ! అమ్మకు ఓ.స్, పెల్లికాని పెద్దకు ఓ.స్, మొహమ్మదుకు ఓ.స్, గులాములకు ఓ.స్ కదా !
  గగనము ఎక్కడవున్నా ఒకటే అని ఆది శంకరుల అద్వైతం: ఘటాకాశం, ఫటాకాశం. గగనము తామర కొలనులో ఉన్నా, చుంచుల గూడులో ఉన్నా గగనమదియేకదా! ఇంటికంటె గూడు పదిలం.
  చక్కటి రచన

  • bharadwaj says:

   MEEKU CHANDRABABU ANTE CHAALAA ISHTAM ANUKONTAA…
   AAYANA GAARI AVINEETHI GURINCHI PALLETHTHU MAATAINAA VRAYATAM LEDU… JAGAN THAPPA MEERU EVARINEE TARGET
   CHEYATAM LEDU… ENDUKANI ?

   • Murali says:

    భరద్వాజ్ గారూ,

    నేను ఈ బ్లాగ్ రాయడం మొదలు పెట్టినప్పటి నుండి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీనే రాజ్యమేలుతూంది. కాబట్టి నా సెటైర్లు వారి మీదే ఎక్కువగా ఉండడం అన్నది సహజం.

    మన రాష్ట్రంలో దాదాపు అందరూ అవినీతిపరులే అయినప్పటికీ, వై.ఎస్. కుటుంబం హయాంలో, రాష్ట్రంలో అవినీతి పరకాష్టకు చేరుకుంది. మిగతా వారు గుడిలో లింగాన్ని దొంగలించేవారు అనుకుంటే, వీరు గుడినే మాయం చేయగలరు.

    నాకు చంద్రబాబు గురించి చాలానే కంప్లెయింట్స్ ఉన్నాయి. ఆయన నీతిమంతుడు అని నేనెన్నడూ చెప్పలేదు. మీరు నా ముందు టపాలు చదివితే ఆయన దిగజారుడుతనం పట్ల నా అభిప్రాయం మీకు తెలుస్తుంది. చిరంజీవి నా అభిమాన నటుడు. నేను ఎక్కడా ఆయన్ని కూడా వదిలి పెట్టలేదు.

    నాకు మీరు “వేరే వాళ్ళు అవినీతి పరులు కాదా?” అన్న వాదనని వినిపించకండి. వై.ఎస్. కుటుంబం అవినీతిలో కూరుకుని పోయి ఉందా, లేదా?

    Yes or No?

   • kslkss says:

    ఈ మధ్య కొన్ని కొన్ని కారణాల వల్ల ప్రభుత వాక్స్వాతంత్రం అరికడుతున్నా, ఇటువంటి స్వచ్ఛంద వ్యవస్థల ద్వారా మన అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నాము. మీకు నచ్చని వ్యక్తి గురించి మీరు వ్రాయుటకు నా అభ్యంతరము లేదు. అలాగే నాకు తెలిసినంత మేరకు నేను వ్యక్త పరచిన అభిప్రాయములనుబట్టి మీరు ఆ విధమైన ముగింపుకు రావటము ఎంతవరకు సమంజసమో అలోచించుకోండి. ఇప్పుడు జరుగుతున్న అరాచకకీయములో నా బంధు మిత్రులెవరూ లేరని స్పష్టము చేయుచున్నాను.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s