న్యూ ఇయర్ రెజొల్యూషన్స్!


వీ.సీ.ఆర్: ఈ సంవత్సరం బృందగానా ఇవ్వాలన్న డెడ్‌లైన్స్ అన్నీ ఇప్పుడే డిసైడ్ చేయాలే. జనవరి 28 తరువాత బృందగానా రాకపోతే, మే 1 వరకు వెయిట్ చేస్తామని, గప్పుడు కూడా రాకపోతే, పంద్రాగస్ట్ వరకు సూస్తామని, గప్పటికి భీ రాకపోతే చాచా హెన్రూ బర్త్‌డే, గదేనే నవంబర్ 14, దనకా సూస్తమని అనౌన్స్ జేశేయ్యాలె. గప్పుడు డెడ్‌లైన్స్ నడిమిట్ల వ్యూహాత్మక మౌనం ఏడ ప్రాక్టీసు చేయాలొ క్లారిటీ వస్తది.

వై.నో. గగన్: కనీసం ఈ సంవత్సరం అయినా జైలునుంచి బయట పడాలి. ఇక్కడ అంతా బాగా సౌకర్యంగానే ఉంది, అన్ని రకాలుగా బాగానే చూసుకుంటున్నారు, కానీ బయట నిజంగా ఏం జరుగుతూందో అర్థం కావడం లేదు. పైగా కదలకుండా ఒకే చోట ఉండడంతో, బద్ధకం పెరిగి పోతూ ఉంది. ఒక వేళ పాద యాత్రల్లాంటివి చేయాల్సి వస్తే కనీసం ముడుపులపాయ సరిహద్దులు ఐనా దాటుతానని నమ్మకం లేదు. హ్మ్…

సూర్యబాబు నాయుడు: పాదయత్ర చేస్తే కాళ్ళు బొబ్బలెక్కుతాయన్న విషయం ముందే ఊహించాను. కానీ మరీ ఇలా జవ సత్వాలు ఉడిగిపోతాయని అనుకోలేదు. ఈ కొత్త సంవత్సరంలో శోకేశ్‌తో పాద యాత్ర మొదలు పెట్టించి నేను ఆపేయాలి. అయినా నేనైతే తీరికగా ఉన్నా కాబట్టి పాదయత్ర చేస్తున్నా. దారి పొడుగునా ఈ ప్రజలంతా ఏంటి ఇలా తండోపతండాలుగా వచ్చేస్తున్నారు? పనీ పాటా లేదా వీళ్ళకి?

హిరణ్ కుమార్ రెడ్డి: ఏదో ఒకటి చేసి ఇంకో ఆరు నెలలు ముఖ్య మంత్రి పదవి కాపాడుకోవాలి. అప్పుడు 2014 ఎన్నికల వరకు నేనే ముఖ్య మంత్రిగా ఉంటాను. చివరాఖర్లో కొత్త ముఖ్యమంత్రిని తెచ్చే సాహసం ఢిల్లీ అమ్మ చేయదు.

రిచంజీవి: ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. నాకు సామాజిక న్యాయం జరిగింది. నేను అడిగినట్టే టూరిజం శాఖ ఇచ్చారు. 2014 ఎన్నికల వరకు అంధేరా ప్రదేశ్‌లో కాలు పెట్టకుండా టూర్లు చేస్తూ కాలక్షేపం చేయొచ్చు. టూర్ల మధ్య అబ్బాయి శ్యాం చరణ్ సినిమాల్లో మార్పులూ, చేర్పులూ సూచించవచ్చు. ( అన్నట్టు ఇష్టా రాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో, పరపతి నియోజక వర్గంలో కొన్న ఇల్లు, మంచి లాభానికి అమ్మేయాలి.)

బీర్బలుద్ధిన్ ఓ.ఐ.సీ: ఈ సంవత్సరం అంతా మౌన వ్రతం చేయాలి. నోరు తెరిస్తే నాకు కంట్రోల్ ఉండదు.

సగటు త్రిలింగ సినీ ఫ్యాన్: ఈ సంవత్సరం మా హీరో సినిమాలు హిట్ కాకపోయినా పర్లేదు. ఆ ఎగస్పార్టీ హీరోల సినిమాలు అన్నీ ఫ్లాప్ కావాలి. అలా జరగడానికి చేతబడి చేయించాలి.

సగటు త్రిలింగ దర్శకుడు: ఈ సంవత్సరం ఒక సినిమా మొత్తం ఐటం సాంగ్స్‌తోనే తీయాలి. ఒక్క ఐటెం సాంగ్ బాగుంటేనే పీకుడు సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. ఇక ఐదు పెట్టి తీస్తే నా సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది. యా-హూ!

శ్యాం గోపాల్ వర్మ: “నా ఇష్టం, చదివితే మీకే నష్టం” పుస్తకం రాశాక చాలా గ్యాప్ వచ్చింది. ఈ సంవత్సరం కనీసం ఒక కొత్త పుస్తకం అయినా రాయాలి. “5డీ క్యామెరాతో కొంగల ముఠా లాంటి సినిమా తీయడం ఎలా?” అన్న టైటిల్ పెడితే ఎన్ని కాపీలైనా హాట్‌కేకుల్లా అమ్ముడు పోతాయి. ఆ పుస్తకం అమ్ముడు పోకపోతే, ప్రజలు ఒట్టి బేవార్సు గాళ్ళు అని తిట్టడానికి ట్విట్టర్ ఉండనే ఉంది.

ఢిల్లీ అమ్మ: ఈ జగన్‌మోహన్ మొహం చూసి చూసి విసుగు వస్తుంది. పైగా ఆయన ఈ మధ్య నా చెప్పులు కూడా సరిగ్గా క్లీన్ చేయడం లేదు. ఇంకో వైపు సాహుల్‌ని చూస్తూంటే పుత్ర వాత్సల్యం పొంగుకుని వస్తూంది. ఈ సవంత్సరం అయ్యే లోపల సాహుల్‌ని ప్రధాన మంత్రిని చేసేయాలి. పిచ్చి నాన్నా! ముచ్చట పడుతున్నాడు.

నశీలా దీక్షిత్: ఈ రేప్ సంఘటన గురించి ఈ ప్రజలు ఇంత గోల ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. బహుశా, దేశ రాజధానిలో కూడా ఇంకెక్కడా దొరకనట్టు, బస్సుల్లో రేప్ చేయాల్సిన దుస్థితి అబ్బాయిలకి వచ్చిందే అన్న బాధ వల్ల కావచ్చు. కొత్త సంవత్సరంలో నా ప్రజలకు ఇలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకోవాలి. ఐనా నిరాశారాం బాపు చెప్పినట్టు ఆ అమ్మాయి వాళ్ళని, “అన్నయ్యా” అని సంబోధించి ఉంటే ఏ అనర్థం జరిగేది కాదేమో. It’s okay.

ప్రజలంతా: ఈ కొత్త సంవత్సరం అయినా దేశంలో పరిస్థితులు బాగు పడాలి. అందుకు ఒకటే మార్గం. ఈ అసమర్థ గాంక్రెస్‌ని నిలదీయాలి. ధర్నాలు జరపాలి. కొవ్వొత్తులు వెలిగించాలి. అలా చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు 2014లో మళ్ళీ వాళ్ళనే తిరిగి ఎన్నుకుంటే, బుద్ధిగా పడి ఉంటారు. ప్రజలా, మజాకానా!

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

2 Responses to న్యూ ఇయర్ రెజొల్యూషన్స్!

  1. Anuradha says:

    🙂

  2. రామ. says:

    చుర్రుమనిపించారు కదా అందరికీ. బాగుందండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s