గూఢచారి 232 – ఆదరా బాదరా పోదాం, పాంచ్ మీనార్ చూద్దాం, చలో చలో!

ఆధునిక రావు ఇచ్చిన రేజర్‌తో షేవ్ చేసుకుని, స్నానం చేసి రెడీ అయ్యాడు 232.

అతడి మనసు ఆల్రెడీ తన కొత్త అసైన్‌మెంట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. పీకిస్తాను స్పైస్‌ని అతను ఇంతకు ముందు చాలా సార్లే సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆదరా బాదరాలో వాళ్ళకు కూసింత లోకల్ సపోర్ట్ కూడా ఎక్కువ. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

పైగా వాళ్ళ చాప్టర్ ఆదరా బాదరాలోనే క్లోజ్ చేయాలి. పొరపాటున వాళ్ళు ఏ వాయలసీమకో, మోస్తాకో పారిపోతే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. అసలే అక్కడ పరిపాలనా వ్యవస్థ స్తంభించి పోయింది. అక్కడ కరెంట్ లేదు, రైళ్ళు నడవడం లేదు, చాలా అరాచకంగా ఉంది. వాళ్ళని అక్కడ వెతికి పట్టుకోవడం చాలా కష్టం.

శాతకర్ణి గారు ఇచ్చిన ఫైల్ తిరగేశాడు 232. అందులో పీకిస్తాను గూఢచారులు ఎలా ఆదరా బాదరాలో పాతుకుపోయారో వివరంగా రాసి ఉంది.

పీకిస్తానీలకి జంబూ ద్వీపం, అదే, హిండియాలోకి రావడానికి పెద్ద కష్టం కాలేదు. ఆ లెక్ఖన చెప్పాలంటే హిండియాలో జొరబడ్డం అంత కష్టమేమీ కాదు. ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు. అది హిండియా పొరుగు డేశస్తులకందరికి తెలుసు.

మొత్తానికి ఆదరాబాదరా వచ్చాక పీకిస్తానీయులు అక్కడి లోకల్ అహ్మదీయ జన స్రవంతిలో కలిసిపోయారు. కొందరికి హిండియా బాగా నచ్చి, పెళ్ళిళ్ళు చేసుకుని షాపులు పెట్టుకుని స్థిరపడిపోయారు. ఇంకొందరు పాలిటిక్స్‌లోకి దిగి ఎం.ఎల్.ఏ.లు, కార్పరేటర్లు కూడా అయ్యారు. వాళ్లకదే సౌకర్యంగా ఉండండంతో తాము వచ్చిన అసలు పని మర్చిపోయి చేయాల్సిన స్పయింగ్ కూడా మానేశారు.

దీంతో వొళ్ళు మండి పీకిస్తాన్ ఇంకొందరు గూఢచారులని పంపించింది. వాళ్ళతోను అలానే జరిగింది. మొత్తానికి పీకిస్తాన్‌కి ఒక 20 శాతం గూఢచారులు మాత్రమే విధేయంగా ఉన్నారు. మిగతా అందరూ ఆదరాబాదరాలో చక్కగా సెటిల్ ఐపోయారు.

ఐతేనేం. ఆ 20 శాతం మాత్రమే చాలు హిండియాని అల్లకల్లోలం చేయడానికి. చ్యాలెంజ్ ఏంటంటే వాళ్ళని ఆ గుంపులో వెతికి పట్టుకోవడం.

ఫైల్ పక్కన పడేసి స్మార్ట్‌గా తయారయ్యాడు ఏజెంట్ 232. స్మార్ట్ అంటే అందంగా అని కాదు, తెలివిగా తయారయ్యాడు.

ముందు పెద్ద జేబు ఉన్న చంకల బనీన్ ఒకటి వేసుకున్నాడు. దానిలో ఆధునిక రావు ఇచ్చిన గ్యాడ్జెట్స్, డబ్బు దస్కం అన్నీ పెట్టుకున్నాడు. వెళ్తూంది ఆదరాబాదారాకాయె! ఆ మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే, ఎవడో జేబు దొంగ తను కొట్టేసిన నశ్యం డబ్బాని పొరపాటున వాడి పరమపదించే అవకాశం కూడా ఉంది.

అంతలో ఫోన్ మోగింది. 232 షర్ట్ ఓపెన్ చేసి, చంకల బనీన్ జేబులోంచి సెల్ ఫోన్ తీసి ఆన్సర్ చేసేసరికి కాస్త ఆలస్యం అయ్యింది.

“ఏమిటింత ఆలస్యం?” విసుగ్గా అడిగారు శాతకర్ణి గారు.

ఆలస్యం ఎందుకు అయ్యిందో వివరించాడు 232.

“ఏడ్చినట్టుంది. నువ్వు అంతర్జాతీయ గూఢచారివి అనుకున్నావా లేక ఎవరైన పల్లెటూరి మోతుబరి ఆసామివి అనుకున్నావా, బనీన్లలో డ్రాయర్లలో వస్తువులు దాచుకోవడానికి? కనీసం ఫోన్ అన్నా బయట పెట్టుకో.”

“అలాగే సార్! ఇంతకీ ఎందుకు కాల్ చేశారు?”

“నా మొహం. నీ చంకల బనీన్ ప్రక్రియ గురించి విని ఎందుకు కాల్ చేశానో మర్చి పోయాను. ఆ! గుర్తొచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎయిర్ హిండియా ఫ్లైట్స్‌నే వాడాలి . అప్పుడే నీకు చార్జెస్ రి-ఇంబర్స్ చేస్తాం. ప్రైవేటు ఫ్లైట్లు వాడబాకు.”

“ఎలాగూ రి-ఇంబర్స్ చేస్తున్నప్పుడు ఏ ఫ్లైట్ ఐతేనేం సార్?”

“పిచ్చివాడా. ఎయిర్ హిండియా ఐతే వాళ్ళకు పే చేయనక్కరలేదు. వాళ్ళు గవర్న్‌మెంటోళ్ళు కదా! కాబట్టి ఒక చేత్తో నీ దగ్గరనుంచి తీసుకున్నది ఇంకో చేత్తో నీకే ఇచ్చేస్తాం. ప్రైవేట్ ఐతే అలా కుదరదు.”

“అలా ఐతే ఎయిర్ హిండియాకి నష్టమేమో కద సార్?”

“పిచ్చోడా, ఎయిర్ హిండియాకి లాభాలు ఎప్పుడొచ్చాయి గనక, కొత్తగా మనం నష్టం కలిగించడానికి. ఐనా నువ్వు ఇప్పటి దాకా ఫ్లై ఐనట్టు లేదు. ఈ సారి వెళ్తావుగా నీకే తెలుస్తుంది. ఎందుకైన మంచిది, ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే కాస్త ముందు బయలుదేరు. ఎయిర్ హిండియా ఫ్లైట్శ్ కాస్త లేట్‌గా రన్ అవుతాయి.”

“ముందు అంటే ఒక గంట ముందా సార్?”

“కాదు, ఒక రోజు ముందు.”

“అమ్మో, థాంక్స్ సార్ అడ్వాన్స్ వార్నింగ్ ఇచ్చినందుకు. ఐతే రేపు ఆదరా బాదరా వెళ్దామనుకున్నాను. ఈ రోజే బయలు దేరుతాను.”

“గుడ్ లక్ మై బాయ్!”

“పీకిస్తాన్ వాళ్ళ గురించి మీరేం వరీ కాకండి సార్. నేను చూసుకుంటాను.”

“పీకిస్తాన్ గురించి కాదు, ఎయిర్ హిండియాలో వెళ్తున్నావు అని గుడ్ లక్ చెప్పాను,” ఫోన్ పెట్టేశారు శాతకర్ణి గారు.

Advertisements
This entry was posted in గూఢచారి - 232. Bookmark the permalink.

7 Responses to గూఢచారి 232 – ఆదరా బాదరా పోదాం, పాంచ్ మీనార్ చూద్దాం, చలో చలో!

 1. Hilarious. welcome back. Please do one on US govt shut down.

  • Murali says:

   Thanks. చాలా టాపిక్స్ మీద రాయలని ఉంది. కానీ time shortage. రెక్కాడితే కానీ డొక్కాడదు కద! 🙂

 2. Anuradha says:

  పొరపాటున వాళ్ళు ఏ వాయలసీమకో, మోస్తాకో పారిపోతే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం.
  ———————————
  అవును , టైర్లు తగలబడుతున్న మంటల్లో,దాని తాలుకు పొగలో వెతికి పట్టుకోవడం చాలా కష్టం. 🙂

 3. Siva Kumar K says:

  “ఎయిర్ హిండియాలో వెళ్తున్నావు అని గుడ్ లక్ చెప్పాను” 😉 😀

 4. karthik says:

  >>“ముందు అంటే ఒక గంట ముందా సార్?”

  “కాదు, ఒక రోజు ముందు.”

  ఇది అరాచకం.. 😀

 5. అరాచకం కాదు, అల్లకల్లోలం, ఆదరాబాదులో అనిశ్చిత, హస్తినలో అయోమయం, ఇటలియనుకు అగమ్యం

 6. prabhakar says:

  ***ఫైల్ పక్కన పడేసి స్మార్ట్‌గా తయారయ్యాడు ఏజెంట్ 232. స్మార్ట్ అంటే అందంగా అని కాదు, తెలివిగా తయారయ్యాడు.***

  ***వెళ్తూంది ఆదరాబాదారాకాయె! ఆ మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే, ఎవడో జేబు దొంగ తను కొట్టేసిన నశ్యం డబ్బాని పొరపాటున వాడి పరమపదించే అవకాశం కూడా ఉంది.***

  super andee!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s