తల వంచుకు వెళ్ళిపోయావా ఉదయ్?

తల వంచుకు వెళ్ళిపోయావా ఉదయ్?
సెలవంటూ ఈ సినీ మాయాజాలాన్ని వదిలి?

అనుకోకుండా ఆకాశానికి ఎగిరి,
అదే వేగంతో అధ: పాతాళానికి జారావని,
ఉన్నతిలో ఉన్నప్పుడు మొక్కిన వాళ్ళే
కింద ఉన్నప్పుడు కనపడకుండా నక్కారని,

తప్పు నీ ఒక్కడిదే కాకపోయినా
శిక్ష మాత్రం పూర్తిగా నీకే పడిందని,
పద్మవ్యూహంలో అభిమన్యుడిలా
అందరూ నిర్దాక్షిణ్యంగా చుట్టు ముట్టారని,

స్వయంకృషితో పైకొచ్చినవాడే
నిన్ను సాధించాలి అనుకుని తొక్కేస్తే
ఇది తప్పు అని సరి దిద్దాల్సిన పెద్దలే
భయపడి తమ మొహం చాటేస్తే

స్వంత మనుషులే తోడుకి రాక,
నీ కన్నీటిని తుడిచే వారే లేక,
ఇక ఒక్క రోజు కూడ బతకడం ఇష్టంలేక,
తల వంచుకు వెళ్ళిపోయావా!

***

ఎవరు దు:ఖించారులే నువ్వు చనిపోతే,
ఏదో నీ మిగిలిన కొద్దిపాటి అభిమానులు తప్ప.

కాకపోతే మాది సినీ కుటుంబమని,
కళాకారులదంతా ఒకే కులమని,
పనికి మాలిన మాటలు మాట్లాడి
పుష్ప గుచ్ఛాలు నీపై ఉంచి,

తడిలేని కళ్ళని తుడిచినట్టు నటించి,
తమ వంతు కర్తవ్యం పూర్తి అయ్యిందనిపించి
టీవీ సిబ్బందితో పాటూ ‘ఈ పెద్దోళ్ళంతా’,
జారుకున్నార్లే నీ శవం దగ్గర నుంచి

అంతకు మించి ఫేస్‌బుక్, ట్విట్టర్లనుంచి
ఎవరూ మొహమైనా పక్కకు తిప్పలేదు.
ప్రపంచమంతా చుట్టుకు వచ్చే మంత్రులు
కనీసం నీకోసం పెదవి కూడా విరచలేదు.

అగ్ర హీరోల రిలీజ్ ఫంక్షన్లు ఎప్పటిలానే
ఒకరినొకరు పొగుడుకుంటూ కొనసాగిస్తూనే ఉన్నారు.
ముక్కుకి మూతికి బోలెడు ఆపరేషన్లు చేయించి
రోజుకి ఒక వారసుడిని మా మీదకి తోస్తూనే ఉన్నారు.

***

ఎంత పని చేశావయ్యా ఉదయ్!
నిన్ను నువ్వే చేసుకున్నావు మోసం!
ఇంకొద్ది రోజుల్లో కృశించనున్న
ఈ ఇసక మేడల కోసం.

ఐతే ఒకటి మాత్రం అక్షరాలా నిజం
ఆత్మ హత్య అనేదే ఒక తప్పైతే
ఇలాంటి క్షుద్రులు పట్టించుకోలేదని
నీ ప్రాణం తీసుకోవడం ఇంకా పెద్ద పాపం.

కాస్త ఓపిక పట్టి ఉంటే నువ్వే చూసే వాడివి
ఈ విష వృక్షపు వినాశనం.
తమ కాళ్ళని తామే నరికేసుకుని
కూలిపోయే తెలుగు సినీ రంగ పతనం.

(శ్రీ శ్రీ మహాప్రస్థానం ప్రేరణతో)

Advertisements
This entry was posted in సినిమాలు and tagged , , , . Bookmark the permalink.

15 Responses to తల వంచుకు వెళ్ళిపోయావా ఉదయ్?

 1. Mohana says:

  chaala baagaa chepparu.

 2. Sreeni Paidi says:

  Heartfelt tribute, Murali

 3. ఎవడో వ్రాసిన చిలక పలుకులు కాకిలా కూసి, ఎవడో నేర్పిన అడుగులు వేసి, ఎవడో వేసిన ముసుగులో మంచి మనుషులుగా చెలామణి అయిన కుహనా రాజకీయపు చదరంగములో, నమ్ముకున్న ఆ కొద్దిమందిని నట్టేటముంచి, వాళ్ళ కళేబరాలను సోపానముగా చేసికొని, ఆత్మను హననము చేసుకొని, నిస్సిగ్గుగా “అమ్మ” శరణు జొచ్చి, అల్పమై, అశాశ్వతమైన అధికార దాహముతో అకృత్యములాచరించుచు పుట్టినప్పుడు పెట్టిన పేరుతో వ్యవహరించు సౌభాగ్యములేక, మారుపేరుతో చెలామణి అయ్యేవారి అరాచకాలకు బలి అయిన మరో అభాగ్యుడు అస్తమించిన ఉదయ కిరణుడు. అతని ఆత్మకు శాంతికలగాలని ఆ భగవతిని ప్రార్ధిస్తున్నాను. కపటాలతో క్షణిక విజయాలు సాధించవచ్చు. కుటిలుల అంతం చరిత్రలో హీనముగా మిగిలిపోతుందన్న సత్యం పోగాలము దాపురించినవారు కనరు, వినరు.

  • Murali says:

   మీరు ఎవరి గురించి మాట్లాడున్నాడో, ఆ వ్యక్తి ఇప్పటికే చరిత్రహీనుడయ్యాడు. ఐతే ఇంకా తన డొల్ల మాటలు ప్రజలు నమ్ముతున్నారన్న కించిత్ భ్రమలో ఉన్నాడు. (ఇంకా కొంత మంది మూర్ఖాగ్రేసర అభిమానులు ఉన్నారు కాబట్టి.)

   ఇతను పతనమైనంత త్వరగా, సంపూర్ణంగా, తెలుగు వారి చరిత్రలో నాకు తెలిసి ఎవరూ కాలేదు…

 4. Sita says:

  dear teta,
  what a tribute to UK! You expressed our agony in your words.
  bhadhatapta hrudayamto
  tirapati gundu

 5. Venu Aasuri says:

  Murali gaaru – very touching. This event tugs at your heart – a young lad with fair amount of talent, and delivered a number of hits, was crushed to pieces and driven to suicide. I have very little hope for Telugu film industry. Power, money, and blind admiration is bad enough. What we have now is a flood of people who lack character taking over the industry and pushing out decent folks. Its in a death grip.

 6. Jitu says:

  The saddest part of this story is not the death of a poor lad or even that he was driven to commit suicide. The saddest part(for me) is that the news of his death is no more his news.

  I cannot seem to get over the irony of this situation/post.

  Someone took away his career… He took his life… We, the moral guardians of god knows who, are taking away his death from him too. 😦

  And yet we claim to be better than those we choose to criticize.
  And yet we choose to criticize others cause we think we are better.

  Are we really??

  • Murali says:

   Jitu,

   Someone takes away his career. He takes his life. And we should keep quiet, because discussing about his death would be not respecting him?

   His destruction was committed in the public eye. But we should leave his death as a private matter?

   You seem to be indicating that either we should do something good, or just shut up.

   I agree actions are always better than words. The better thing, if possible at all, would have been to help him before he killed himself.

   But that doesn’t mean that talking about his death is in anyway mean-spirited. This kind of discussion is also needed. Not doing so would be playing into the hands of his destroyers who would exactly want this sort of thing; for this thing to silently fade away…

   Lastly, let’s recall what Sri Sri said:

   “ప్రైవేట్ బతుకులు మీ సొంతం.
   పబ్లిక్‌లోకొస్తే ఏమైనా అంటాం!”

   -Murali

   • చక్కటి స్పందన.

   • Jitu says:

    One year. Like I had feared… no dedications. No memorials. His death was talked about then merely because of the involvement of a superstar whom everyone wanted to bash. 😦 His death was not his( Like I said last year.) How many of those who paid tributes would have talked had the celebrity superstar was not involved? 😦 😦 😦

    One year later… his loss is felt just by the immediate family members. 😦 No dedications this year. No one remembered him( No one I know of that is).

    I came back to this post today as I saw someone remembering ANR( a much more celebrated artist and a much respected one) today… almost a year after his death. They both died around the same time. The irony is still as stark as it was last year.

 7. yagnasri says:

  సెలవంటూ వెళ్ళిపోయావా నేస్తం – మహాప్రస్తానం .సమయోచితంగా వాడారు

 8. విన్నకోట నరసింహారావు says:

  నేను ఆత్మహత్యల గురించి వాటి ఉచితానుచితాల గురించి మనస్తత్వ / సామాజిక విశ్లేషణలు చెయ్యలేను; ఆ వ్యక్తి ఇలా చేసుండాల్సింది, అలా చేసుండాల్సింది అనను గాని (అలా అనటం తేలికైన పని గదా) , ఒకటి మాత్రం అనిపిస్తోంది. తమ వారసుల్ని రంగ ప్రవేశం చేయిద్దామని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు, ఎవరో అందమైన కుర్రగాడు – కాని అనామకుడు, అందునా తమకిష్టం లేని వేరే కులానికి చెందిన వాడు – మధ్యలో వచ్చి పైకి దూసుకుపోతుంటే, వీడు ఎప్పటికైనా మనకి సైంధవుడే అనుకుని, ఒక పకడ్బందీ పధకం ప్రకారం అతని మీద పగబట్టి చావు వరకూ తరిమారు అనిపిస్తుంది. పగబట్టినవారు దార్లన్ని మూసేయ్యటం వలన ఏర్పడిన ఉదయకిరణ్ ఆత్మహత్యా పరిస్ధితులకి, వేరే వాళ్ళ (సెలెబ్రిటీలవ్వచ్చు, సామాన్యులవ్వచ్చు) ఆత్మహత్యా పరిస్ధితులకి ఇదీ తేడా అనుకుంటున్నాను.

  @ “కాస్త ఓపిక పట్టి ఉంటే నువ్వే చూసే వాడివి
  ఈ విష వృక్షపు వినాశనం.” @

  మీ ఆశావాదాన్ని మెచ్చుకోవాలి. పెరుగుట తరుగుట కొరకే అన్న సూక్తి ప్రకారం మాత్రమే ఆ “వినాశనం” జరుగుతుందని ఎదురు చూడాలేమో. నాకైతే, “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు” అన్న రీతిలో ఈ “విష వృక్షం” అంతకంతకూ ఇంకా వేళ్ళూనుకు పోతోందనిపిస్తోంది.

  మీరు ఉదయకిరణ్ వేదనాభరిత జీవితం గురించి మంచి టపా వ్రాశారు.

  • ఒక వ్యవస్థలో ఉండే వ్యక్తి గురించి ఒక మాట నే ముందు మనం కుడా అదే వ్యవస్థలో ఉన్నాం అనే మాట మరవకండి . చరిత్రలో హీనుడైన ఒకప్పటి స్టార్ గురించి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడండి . కాని వ్యవస్థ గురించి తప్పుగా మాట్లాడకండి . వ్యవస్థ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది అంటే అది వ్యవస్థ తప్పు ఎలా అవుతుంది . వ్యక్తుల తప్పు కాదా ? వారికి అంత బలాన్ని ఇచ్చిన వ్య్క్తులది కాదా ?

 9. Sushma says:

  No words to express…very sad.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s