గూఢచారి 232 – ఆట మధ్యలో ఏంటీ డిస్టర్బెన్స్?


గూఢచారి జట్టు పేరు ఎర్ర బొద్దింకలు. అవతలి జట్టు పేరు మండ్రగబ్బలు. ఈ పేర్లు సైకాలజిస్టే పెట్టాడు. దీని వల్ల ఆటగాళ్ళలో ఇన్సెక్ట్ సైకాలజీ ప్రవేశించి ఆట రక్తి కడుతుందని ఆయన నమ్మకం.

ఆ విధంగా ఎర్ర బొద్దింకల తరపు నుండి 232 రంగ ప్రవేశం చేయగానే, ముగ్గురు బవిరి గడ్డాలు, రవి కిరణ్, కణ్ణన్, రాధేశ్యాం, రమణా, శ్రీనివాస్, హనుమంత రావు, మహేంద్ర వరుసగా లైన్లో నిల్చుని అతనికి ఎదురు పడ్డారు.

232 చక చకా ఆ కొస నుండి ఈ కొస వరకు అందరి చేతులు ఒకసారి తాకి “కబడ్డి కబడ్డి” అంటూ తన వైపు వచ్చేశాడు.

“అందరూ ఔట్!!! ఇదేంటి ఇంత తొందరగా ఔట్ అయ్యారు? అసలు గెలుద్దామన్న ప్రయత్నమే లేదు! కనీసం సాలెపురుగులకున్న పట్టుదల కూడా మీకు లేదు,” మండ్రగబ్బలపై విసుక్కున్నాడు సైకాలజిస్ట్ రెఫరీ.

“ఔట్ ఏంటి? ఇంకా ఆయన మాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చాడు కాబోలు అనుకుని చేయి తాకించి వెళ్తూంటే ఊరుకున్నాము,” ఆశ్చర్యంగా అన్నారు మండ్రగబ్బలు.

“మీరు వీళ్ళకి రూల్స్ సరిగ్గా చెప్పలేదా?” చిరాకు పడ్డాడు 232.

“చెప్పాను. కానీ అర్థం అయినట్టుగా లేదు. ముఖ్యంగా ఆ గడ్డాలకు. సరేలే, మళ్ళీ చెప్తాను,” అంటూ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు సైకాలజిస్ట్.

“సరే చెప్పండి, ఇంతకు ముందు ఆట దేవుడికి, ఇదే అసలైన ఆట అని” సజెస్ట్ చేశాడు 232.

“దేవుడికా, అదేం కాన్సెప్ట్?”

“మా చిన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళం. ఉదాహరణకు నేను నా ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడుతున్నాను అనుకోండి, ఆ బ్యాట్ నాది అనుకోండి, అప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ ఎలాగూ నేనే చేస్తాను. కొంప దీసి నేను ఫస్ట్ బాలే ఔట్ ఐతే, నేనింక ఆడను కద! నా బ్యాట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. కాబట్టి, అలాంటిది జరిగితే, ఈ బాల్ దేవుడికి అని అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ నన్ను ఆడనిస్తారు. అలా వీళ్ళకు ఇంకో చాన్స్ ఇస్తున్నాను అన్న మాట.”

“ఇంటరెస్టింగ్.”

అలా మళ్ళీ ఆట ఫ్రెష్‌గా మొదలయ్యింది.

మళ్ళీ 232నే బరిలోకి దూకాడు, “కబడ్డి, కబడ్డి” అంటూ. ఈ సారి అందరూ ఒకేసారి 232 మీద పడ్డారు. 232 విడిపించుకునేంతలో, ముగ్గురు గడ్డాలు ముష్టిఘాతాలతో 232ని చావగొట్టారు. ఆ తరువాత పక్కకు ఈడ్చి కూడా పారేశారు.

“ఓలమ్మో, ఓలక్కో, ఏంటీ దారుణం. అసలు ఏం రూల్స్ చెప్పారు సార్ వీళ్ళకి?” మూలుగుతూ అడిగాడు 232.

“ఏం చేసైనా సరే, నిన్ను గీత తాకకుండా చూసుకోవాలి అని చెప్పాను.”

“ఏడ్చినట్టుంది. ఇదేమన్నా యుద్ధమా! మీరు అలా చెప్తే, నెక్స్ట్ టైం నన్ను కత్తులతో కూడా పొడిచేలా ఉన్నారు. ముఖ్యంగా, ఆ గడ్డం వెధవలు కుళ్ళబొడిచేశారు, కుయ్యో, మొర్రో,” అన్నాడు 232.

“చెప్తాను లెండి, కాని మీరు ఔట్ అయ్యారు. పక్కకు తప్పుకోండి. ఈ సారి మండ్రగబ్బల వంతు. వారి వైపు నుంచి ఎవరైనా రావాలి,” అనౌన్స్ చేశాడు రిఫరీ.

మండ్రగబ్బల వైపు నుంచి ఒక గడ్డం వీరుడు వచ్చాడు. అతను లోపలికి రాగానే సదానంద్ యాదగిరి అతన్ని హ్యండిల్ చేశారు. హ్యాండిల్ అనడంకంటే మ్యాన్ హండిల్ అనడం కరెక్టేమో. సదానంద్ అతని గడ్డం గట్టిగా పట్టుకున్నాడు. యాదగిరి అతని కాళ్ళు పట్టుకుని లాగేశాడు. ఈ డబుల్ అటాక్ తట్టుకోలేక గడ్డ ధారి ఔట్ అయిపోయాడు. దీంతో 232 ఆటలోకి తిరిగి ప్రవేశించాడు.

కొన్ని కూతల తరువాత ముగ్గురు గడ్డాలు ఔట్ అయ్యారు. ఎందుకంటే గడ్డాలని ఔట్ చేసే టెక్నిక్ బొద్దింకలు సులువుగా పసి గట్టారు. మిగిలిన ఇద్దరు గడ్డాలు గడ్డాలని రక్షించుకోవడానికి చేతులు అడ్డు పెట్టుకున్నారు. గడ్డాలు సేఫ్ అయ్యాయి కానీ, చేతులు ఉపయోగించడానికి లేకుండా పోయింది కనుక వీళ్ళు కూడా తొందరగానే ఔట్ అయ్యారు.

“అదీ వరస, ఇంకో ఏడు మంది ఔట్ ఐతే మనమే గెలుస్తాం. బొద్దింకల్లారా, విజృంభించండి,” ఆటగాళ్ళని ఉత్సాహ పరిచాడు 232. లంబు, జంబు బొద్దింకల్లా అటూ ఇటూ పాకి తమ క్రీడా స్ఫూర్తి వెల్లడించారు.

232 మళ్ళీ బరిలోకి దూకాడు. “కబడ్డి, కబడ్డి,” అంటూ కూత ప్రరంభించాడు. ఇంతలో అతని కూతని డామినేట్ చేస్తూ, “ఆపండెహే, ఆపండెహే,” అంటూ కేకలు వినబడ్డాయి.

రెండు జట్లు వెనక్కి తిరిగి చూశాయి. ఇద్దరు వ్యక్తులు పైలట్ యూనిఫారంలో ఉన్నారు.

“ఎవరు మీరు?” అడిగాడు రిఫరీ.

“మీరు ఆదరా బాదరాకి వెళ్ళే ఫ్లైట్ పైలట్లం.”

“ఐతే ఏంటంట? ఎందుకు మా ఆటని ఆపారు?” కోపంగా అడిగాడు 232.

“అవును, ఆట మధ్య్లలో ఏంటీ డిస్టర్బెన్సు?” విసుక్కున్నారు మిగతా అందరూ.

“వార్నీ! ఫ్లైట్ బాగా లేట్ కావడంతో మీరు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న సంగతి కూడా మర్చిపోయినట్టున్నారు. బోర్డింగ్ అనౌన్స్ చేసి గంట అయ్యింది. ఎంతకీ ఒక్కరు కూడా రాకపోయేసరికి మేమే వచ్చాము. పదండి, పదండి,” అన్నాడు ఆ ఇద్దరిలో ఒక పైలట్.

అప్పుడు ఒక్క సారి గుర్తొచ్చింది అందరికీ. ఫ్లైట్ లేట్ కావడం వల్ల తామంతా టైంపాస్ చేయడానికి కబడ్డి ఆడుకుంటున్నామని. అందరూ బోర్డింగ్ గేట్ వైపు నడిచారు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in గూఢచారి - 232. Bookmark the permalink.

One Response to గూఢచారి 232 – ఆట మధ్యలో ఏంటీ డిస్టర్బెన్స్?

  1. Anuradha says:

    😀

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s