మా ఊరిలో పార్లమెంట్ ఇలానే ఉంటుంది!

నిన్న జంబూ ద్వీప పార్లమెంటులో జరిగిన తంతు చూసి, ప్రతి పౌరుడి ఛాతీ గర్వంతో ఉప్పొంగింది అంటే అతిశయోక్తి కాదు. ఈ సంఘటన బజారు స్వామ్యానికి ఛీ ఛీ, భేజారు స్వామ్యానికి ఛ ఛ, ప్రజా స్వామ్యానికి పరాకాష్ట అని ప్రతి ఒక్కరు ఒప్పుకుని తీరాల్సిందే. ఈ విషయంలో ప్రముఖుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి జగన్‌మోహన్ సింగ్: నిన్న రైల్వే బడ్జెట్ ప్రసంగానికి మా పార్టీ ఎం.పీ.లే అడ్డు పడినప్పుడు నా గుండె ముక్కలయ్యింది. పోనీ లెండి, ఈ రోజు నేను పార్లమెంట్‌లో లేను. ఈ సారి యాకంగా తలే ముక్కలయ్యేదేమో!

రగడపాటి రాజగోపాల్: మేము పెట్టబోయే కొత్త పార్టీ యొక్క ఎలెక్షన్ సింబల్, Pepper Sprayనే! ఐదు కోట్ల ప్రజల కళ్ళల్లో మా పార్టీ కారం కొడుతున్నప్పుడు, నేను కొందరు ఎం.పీ.ల కళ్ళల్లో కొడితే తప్పెలా అవుతుంది? మా కొత్త పార్టీని గెలిపిస్తే ఇంటింటికి ఒక డజన్ పెప్పర్ స్ప్రేలు ఉచితంగా ఇస్తాం.

గాంక్రెస్ మంత్రి తామర నాధ్: మా పార్టీకి చెందిన మోస్తా వాయలసీమ ఎం.పీ.ల ప్రవర్తనకి నేను సిగ్గుతో కుమిలిపోతున్నా. అదే గాంధి గారి టైంలో ఐతే మా కార్యకర్తలు ఎంత బాదినా బాదించుకునే వారు. ఇలా పెప్పర్ స్ప్రేలు చల్లడాలు, మైక్ విరిచేసి వీరంగాలు వెయ్యడాలు, నేనెక్కడా చూడలేదమ్మ! ఎంత అప్రతిష్ట, ఎంత నామర్ద!

లేడీ సూపర్‌స్టార్ అనబడే విరగ శాంతి: గాలిలో ఎగిరి కిక్కులు కొట్టడానికి, స్టంట్లు చేయడానికి ఈ పార్లమెంట్ బిల్డింగ్ అంత సౌకర్యంగా లేదు. జస్ట్, ఒక పంచ్ మాత్రం ఇచ్చి సరి పెట్టుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం నా కొరడా తెస్తాగా!

కె.ఎల్. అవధాని: ఓరి నాయనో, ఏంటీ ఆవేశాలు, కావేశాలు! బృందగానాకి మద్దతు ప్రకటించి తప్పు చేసినట్టున్నాం. ఒకవేళ మా మద్దతు వల్ల బృందగానా వచ్చినా, ఆ క్రెడిటంతా బృ. రా. స. ఇంకా గాంక్రెస్ తన్నుకుపోతాయి. మోస్తా, వాయలసీమలో చిప్పే. మద్దతు ప్రకటించకపోతే మోస్త వాయలసీమలో కూసింత శాంతిస్తారేమో కానీ, బృందగానాలో చిప్పే. ఎటూ చూసినా చిప్పే కనిపిస్తూంది.

సురేంద్ర మోడి: ప్రధాన మంత్రి అవుతాను అని చంకలు గుద్దుకుంటూంటే, ఈ విపత్కర పరిస్థితి ఏంట్రా బాబూ. ఎలా దీని నుంచి తప్పించుకోవడం? ఆ, ఒక ఐడియా వచ్చింది! బిల్లుకి మద్దతు ఇవ్వడానికి ఒక కండీషన్ పెడతాను! ఢిల్లీ అమ్మ ఒక అరగంట పాటూ, వాళ్ళ వంశం చేసిన త్యాగాల గురించి మాట్లాడకుండా ప్రసంగిస్తేనే మా సపోర్ట్ అని చెప్తాను. యాహూ!

పబ్బం శ్రీహరి: ఈ రోజు కనక బృందగానా బిల్లు ప్రవేశపెడితే, నేను నిజ్ఝంగా ఆత్మ హత్య చేసుకుందామనే వెళ్ళాను. కానీ రగడపాటి గారు పెప్పర్ స్ప్రే కొట్టడం చూసి భయపడి వెనక్కి వచ్చేశాను. నా కళ్ళు చాలా డెలికేట్ బాబూ!

బృ.రా.స. లీడర్ వీసీఆర్: చూషినరా ఈ మోస్త వాయలసీమోల్ల దౌర్జన్యం! గట్లా well దగ్గరకి పరిగెత్తుకుంటూ వస్తారయ్య! ఈ దౌర్జన్యం అణిచేందుకే బృందగానా ఎం.పీ.లు అంతా వాళ్ళని కింద పడేసి డొక్కల్లో తన్నిర్రు. ఇప్పుడు ఉల్టా మాదే దౌర్జన్యం అంటూండ్రు! ఈ అన్యాయాలకి అంతే లేదా?

ఢిల్లీ అమ్మ: బృందగానా ఎం.పీ.లు సరిపోరేమో అని, వేరే రాష్టాలకి చెందిన గాంక్రెస్ ఎం.పీ.లతో కూడా మా మోస్తా, వాయలసీమ ఎం.పీ.లని కొట్టించా. ఈ రోజు సభ భలే రంజుగా ఉంది! ఏది ఏమైనా సరే, నేనూ అబ్బాయి సాహుల్, బృందగానాలో ఎక్కడ ఎం.పీ.లుగా నిలబడినా, గెలవడం ఖాయం. జింగు చక, అహ జింగు చక!

పార్లమెంట్ డాక్టర్లు: ఈ ఉద్యోగంలొ బొత్తిగా పని ఉండదు, పగలూ రాత్రుళ్ళూ నిద్రపోవచ్చు అని కలలు కన్నాము. శుద్ధ అబద్ధం. ప్రతి రోజూ, ఏవో గొడవలూ, కుమ్ములాటలే. డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుండి ఓవర్‌టైం చేస్తున్నాం. కెవ్వు, కేక!

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

12 Responses to మా ఊరిలో పార్లమెంట్ ఇలానే ఉంటుంది!

 1. Anuradha says:

  nenu koodaa chaalaa డెలికేట్.anduke samaavesaalu choodaledu. 🙂

 2. Siva Kumar K says:

  నేను నిజ్ఝంగా ఆత్మ హత్య చేసుకుందామనే వెళ్ళాను. కానీ రగడపాటి గారు పెప్పర్ స్ప్రే కొట్టడం చూసి భయపడి వెనక్కి వచ్చేశాను. నా కళ్ళు చాలా డెలికేట్ బాబూ! –ROFL 😀 😀 😀

 3. tejasswi says:

  చాలా బాగుంది

 4. swetha says:

  maari babu gari meeda coment lede ante ardam meruuuuuuuuuuuuuuuuu

 5. జగడపాటి జరాపాగల్ (బాకుగ్రౌన్డులో “ఇక వాడి వేడి చూపాలంటే, ఇక వాయిలెన్సు జరగాలంతే” పాట): పెప్పర్ స్ప్రే వాడండీ, తెగులు జాతి పరువు నిలపండీ
  గజన్ హోమన్ రెడ్డి (బాకుగ్రౌన్డులో “దేశంలో దొంగలు పడ్డారు” పాట): ఈ చిటుకు ముందే తెలిసుంటే బాగుణ్ణు. అరెస్టు చేయడానికి వచ్చిన సీబీఇ వాళ్ళను స్ప్రే చేసి పారిపోయేవాణి
  ద్వందబాబు రాయుడు (బాకుగ్రౌన్డులో “కనులు కనులు కలిసెను” పాట): ఆంద్ర, తెలంగాణా రెండు ప్రాంతాలు నాకు రెండు కళ్ళు. రెంటిలోనూ పెప్పర్ స్ప్రే కొడతా
  కిర్కిరి కుమార్ రెడ్డి (బాకుగ్రౌన్డులో “బంతీ చామంతీ” పాట): ఆఖరి బంతి బౌలర్లు బంతి బదులు పెప్పేర్ స్ప్రే విసిరితే రన్-అవుట్ అవుతా
  రచింజీవి (బాకుగ్రౌన్డులో “ఇంట్లో రామయ్య వీధిలో తిక్కయ్య” పాట): ఎగస్పార్టీ వాడు మనవేపు ఫేసు టర్నింగు ఇచ్చుకోగానే పెప్పేర్ స్ప్రే కొడతా
  బొచ్చె అసత్యపారాయణ (బాకుగ్రౌన్డులో “నేను పుట్టాను లోకం మెచ్చింది, బెల్టు షాపు పెట్టాను, లోకం తూలింది” పాట): ఈ విషయం తెలిసుంటే నా కాలేజీలపై & మందుకొట్లపై దాడికి దిగిన వారిని స్ప్రే కొట్టేవాడిని
  దయాప్రశాక్ రానాయణ (బాకుగ్రౌన్డులో ఎవరికీ అర్ధం కానీ నాలుగు భాషల పాటలన్నీ ఒకే సారి): పెప్పేర్ స్ప్రే వాడడం రాజ్యాంగం ప్రకారం తప్పు కాదు. అయితే ఇరు పక్షాల మధ్య సామరస్యంగా ఒక ఒప్పందం కుదరాలి. ఆతరువాత ఎంచక్కా పెప్పేర్ స్ప్రే కొట్టుకోవచ్చు. తెగులు ప్రజలు ఒకరి మీద ఒకరు పెప్పర్ స్ప్రే వేసుకోవాలంటే ఫరవాలేదు కానీ డిల్లీ పెద్దల జోక్యం సమాఖ్య స్పూర్తికి విరుద్దం
  దండగమారి లక్ష్మీవార్పతి (బాకుగ్రౌన్డులో “ఒలమ్మి పిచ్చి ఎక్కిందా” పాట): ఎమ్ప్తీ డ్రామారావు గారు ఎన్నో సినిమాలలో విల్లన్లను పెప్పేర్ స్ప్రేతో చిత్తూ చేసారు. అదే ఈనాడు జగడపాటి జరాపాగల్కి స్పూర్తి నిచ్చింది
  గన్నపనెని జరారాముకి (బాకుగ్రౌన్డులో “దుమ్మంటే చేదా” పాట): దుమ్ము పెట్టినప్పుడే అనుకున్నా. ఏదో ఒక రోజు మన జగడపాటి జరాపాగల్ ఇంతపని చేస్తాడని

 6. Devender Babu says:

  ROFL !

 7. Padmaja says:

  Good one!

 8. కమలిన నాధుని ప్రణాలిక, పూర్తిగా అమలుజరినట్లు లేదు. కొందరు బ్రతికి పోయారు. తెల్లమ్మ ముఖం నల్లబడ్డదేమో! చంటిగాడి ముఖం వెల వెల పోయిందేమొ! అఘాయిత్యాలు చేయించటం పుట్టింటి వారసత్వంట. ముసులోని అరాచకీయం వంటబట్టింది తెల్లమ్మకు. ముందుంది ముసులోని ముని ముని మనవరాలి పండగ. ఈ లోపల దొరికినంత వెనకేసుకొంటే కృతాచి సలహాతో చంటివాడికి పెళ్ళి చెయ్యచ్చు. డామిట్ కధ అద్దం తిరుగుతుందేమో! మొహమ్మద్ పాటిల్ పాచికలకు పాచి పట్టినట్లున్నై. చిదంబర రహస్యం తెలిసిపోయింది. అర్ధాయుస్సుగా పోయేవాళ్ళు అర్భకులకు టికెట్లు ఇస్తే పోయేది, వస్తాదులకు ఇచ్చారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s