వ్యాలెంటైన్స్ డే!


అంతా ప్రేమ మయం, ప్రతి రోజు ప్రేమించండి.
కానీ ఈ రోజు కాస్త ఎక్కువగా ప్రేమించండి.

ఓస్ ప్రేమించడమే కద దానిలో ఏముంది.
మనకు చిన్నప్పటి నుండి ప్రాక్టీసే కద అనుకోవద్దు.

ప్రేమించడం కాణీ ఖర్చు లేని పని, నిజమే!
కాని బహుమతులు కొనాలంటేనే వస్తుంది చిక్కు.

అందులోనూ ఏదో ఒకటి కొనకూడదు.
అలాంటి గిఫ్ట్ ఇంకేది లేదు అనిపించేలా ఇవ్వాలి

గత సంవత్సరం ఇచ్చిందే ఇస్తే
గడప దాటి కూడా లోపలికి రానివ్వరు.

“నా ప్రేమ నీకు సరిపోదా, గిఫ్టులెందుకోయి?” అని ఊపుకుంటూ వెళ్తే,
“ఐతే దూరంగా ఉండే ప్రేమించుకుందాం డియర్,” అని సాగనంపుతారు.

ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి.
కరిస్తే కప్పకి కోపం, విడిస్తే పాముకి కోపం.

ఏం చేయాలి?

అదే ఒక కవి తన ప్రేయసి కను బొమ్మల మీద కవిత్వం రాస్తే,
వాడే గాయకుడైతే పాత ప్రణయ గీతాలన్నిటిని వరుస పెట్టి పాడుతాడేమో.

అదే ఒక చిత్రకారుడు తన కుంచెతో ప్రియ సఖి అందాలు ఆవిష్కరిస్తే,
వాడే కోటీశ్వరుడైతే హెలికాప్టర్ నుంచి పుష్ప వర్షం కురిపిస్తాడేమో.

ఏ టాలెంటు లేని ఒక మిడిల్ క్లాస్ గాడిని, నేనెలా చచ్చేది?

అందుకే ఈ విదేశీ పండగని నేను మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తాను.
“Valentine, go back!” అని గొంతు చించుకుని అరుస్తాను.

ఇంకాస్త ఓపిక ఉంటే ఇది కూడా చదవండి: ప్రేమికుల దినం

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

6 Responses to వ్యాలెంటైన్స్ డే!

 1. Jitu says:

  Need an extra voice to shout with you?? I ‘ll join hands… err voices to yell at this capitalist holiday. 🙂

  “Valentine’s… Go Away!! 🙂

 2. ప్రాక్పశ్చిమ సంగమమో, సంకరమో తమ తమ విజ్ఞతలపై ఆధారపడుతుందేమో! నాకైతే అర్ధంకాని విషయం: ‘ దినాలు ‘ దీనముగా జరుపుకొనవలసినవా, చిందులు వేయవలసినవా? ఆలోచించే తీరికాలేదు, అవసరములేదు అనిపిస్తోంది, అవకాశాన్ని అంది పుచ్చుకొని,’ అవసరాలు ‘ తీర్చుకోవటమేమో ! అయిన ‘ అక్కర ‘ లేని విషయాలపై ఈ ఆలోచనలెందుకో !

 3. eshwar says:

  Murali garu, We waited enough for new post by not keeping pressure on you.

  • Murali says:

   గురువు గారు, పోతనతో పోల్చుకోవట్లేదు కానీ, నాదీ ఆయన బాటే. దారసుతులకీ, వారి పోషణార్థమై చేస్తున్న ఉద్యోగానికీ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కద!

  • Jitu says:

   Is this about asking Muraligaaru for a fresh post? Then I am with you.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s