బృందగానాలో సంబరాలు!


“వీ.సీ.ఆర్ అన్నకి జై, బృందగానా సింహానికి జై,” గోల గోలగా అరుస్తూ బృందగానా రాష్ట్ర సమితి కార్యకర్తలంతా వీ.సీ.ఆర్. నివాసాన్ని చుట్టు ముట్టారు.

వీ.సీ.ఆర్. బయటకి వచ్చి వారి అభిననందలని స్వీకరిస్తూ, నిశ్శబ్దంగా ఉండమన్నట్టు రెండు చేతులు పైకి ఎత్తాడు. సద్దు మణిగింది.

“ఈయాల మరపు రాని దినమన్నట్టు. ఒక లెక్కన జూస్తే మనకి స్వాతంత్ర్యం వచ్చినట్టు అనుకోరాదే! గిప్పుడు మన మీద మోస్తా ఓల్ల పెత్తనం ఉండదు. బృందగానా అంతటా మా కుటుంబం పెత్తనం మాత్రమె ఉంటది,” గంభీరంగా సెలవిచ్చాడు వీ.సీ.ఆర్.

కార్యకర్తలంతా హర్షధ్వానాలు చేశారు. వీ.సీ.ఆర్. పక్కనే నిలబడి ఉన్న ఆయన కుమారుడు వీ.టీ.ఆర్., తవిక, హరాస్ రావు కళ్ళు తుడుచుకున్నారు.

“అన్న అన్న, నీకోసం ఒకటి దెచ్చినా!” కార్యకర్తల్లో ఒకతను ముందుకి వచ్చి చెప్పాడు. అతని చేతిలో ఒక సంచి ఉంది.

“గట్లనా? ఏం తెచ్చినవు, తమ్మీ?” అప్యాయంగా అడిగాడు వీ.సీ.ఆర్.

సమాధానంగా ఆ కార్యకర్త సంచి తెరిచి చూపించాడు. అందులో ఒక పెద్ద గొంగళి పురుగు ఉంది.

“గొంగలి పురుగు తెచ్చినవేంది?” చిరాకుగా అడిగాడు వీ.సీ.ఆర్.

“బృందగానా గిట్ట వస్తే నువ్వు గొంగలి పురుగుని కూడా ముద్దు పెట్టుకుంటా అన్నావు కదన్నా! నువ్వు మాట తప్పనోడివి, మడమ తిప్పనోడివి అని అందరికి తెలిసెటందుకు తెచ్చినా,” వినయంగా సెలవిచ్చాడు ఆ కార్యకర్త.

“అరే బట్టెబాజ్‌గా, బృందగానా ఇప్పిస్తరంటే గొంగలి పురుగుని కూడా ముద్దు పెట్టుకుంటనన్న గానీ, ఇప్పుడు వచ్చేషినంక ఏ హౌలా గాడైన ముద్దు పెట్టుకుంటాడురా భై! మూసెయి సంచి!” కోపంగా అరిచాడు వీ.సీ.ఆర్.

ఆ కార్యకర్త కాస్త చిన్న బుచ్చుకుని సంచి మూసేసి మళ్ళీ గుంపులో కలిసిపోయాడు.

“మీరేందిరో, గట్లా కన్నీరు పెడుతున్నారు? ఎంత ఆనంద భాష్పాలైనా మరీ ఇంత సేపా? తుడుసుకోండ్రి!” కొడుకుని, కూతురుని, అల్లుడుని చూస్తూ మృదువుగా అన్నాడు వీ.సీ.ఆర్.

హరాస్ రావు గొంతు సవరించుకున్నాడు. “అవి ఆనంద భాష్పాలు కావు. నిఝంగానే ఏడుస్తున్నం,” అన్నాడు.

“ఏడుపెందుకురా? ఏడిస్తే గీడిస్తే ఆ మోస్తా ఓల్లు, వాయల సీమ ఓల్లు ఏడవాలే గానీ!”

“అట్ల కాదు మామా, ఇన్ని రోజులు మోస్తా ఓల్లని తిడుతూ ఉద్యమం నడిపినం గద. ఇప్పుడు మనమే పాలన చేయాల. ఏమన్న తేడాలొస్తె తిట్టెటంద్కు, harass చేసేటంద్కు, ఆల్లు ఉండరు కద! మనకేమో ఉద్యమాలు నడుపుడే కానీ పాలించుడు రాదు. ఏం జెయ్యాలా అని ఆలోచిస్తూంటే ఏడుపొస్తున్నది,” గద్గదమైన స్వరంతో చెప్పాడు హరాస్ రావు.

పక్కనే తవిక గట్టిగా ముక్కు చీదింది.

“అరే ఫికర్ ఎందుకు పడతవ్ అల్లుడూ? మోస్తా ఓల్లు, వాయల సీమ ఓల్లు కలిసి మన బృందగానాని నాశనం చేసిన్రూ. అంతా రిపెయిర్ చేసేటంద్కు కనీసం 20 ఏళ్ళైనా పడతది అని చెప్దాం!”

“గా తర్వాత నాన్న?” అడిగాడు వీ.టీ.ఆర్.

“గా తర్వాత, మనం ఉంటమో ఊడుతమో ఎవడు సూడొచ్చిండ్రా! 20 ఏల్ల కంటే కూడా ఎక్కువ దినాలు పాలిద్దామనా? గంత పదవీ దాహం పనికి రాదు,” మందలించాడు వీ.సీ.ఆర్. కొడుకుని. వీ.టీ.ఆర్. సిగ్గు పడి తల దించుకున్నాడు.

ఈ సారి ఒక ప్రొఫెసర్ ముందుకు వచ్చాడు. “ఇన్ని దినాలు, సాంస్కృతికంగా కూడా మనల్ని నొక్కేశారు. వాళ్ళ భాష మన మీద రుద్దిండ్రు. ఎంత రుద్దినా మనకు రాలేదనుకోండి. అది వేరే విషయం. ఇప్పుడు ఆ అవకతవకలు అన్ని సరి చెయ్యాలె.”

“ఏం జేద్దమంటవు, పెద్దాయానా?” ఆసక్తిగా అడిగాడు వీ.సీ.ఆర్.

“ఈ 56 అక్షరాలు మనకు అవసరమా? మన బృందగాన భాష ప్రత్యేకంగా ఉండాలి అంటే, కొన్ని అక్షరాలు పీకేయ్యాలె.”

“ఎన్ని సరిపోతాయంటవు?”

“నన్నడిగితే మొత్తం 25 ఉంటే చాలు,” సెలవిచ్చాడు ప్రొఫెసర్.

“అంటే సగానికి సగం! మస్తున్నది కద! అట్లైతే మన పోరగాళ్ళకి సదువు కూడా డబుల్ ఫాస్ట్ వస్తుంది,” ఆనందంగా అన్నాడు హరాస్ రావు. అందరూ చప్పట్లు కొట్టారు.

“25 కూడా ఎందుకు వయ్యా, 22 సరిపోవా?” అడిగాడు ఒక కార్యకర్త.

“20 కంటే ఎక్కువ ఉంటే గుర్తు పెట్టుకొనుడు జర కష్టం,” అన్నాడు ఇంకొకతను.

కాసేపు అందరూ గోల గోలగా మాట్లాడారు.

“సైలెన్స్!” గట్టిగా అరిచాడు వీ.సీ.ఆర్. అందరూ సైలెంటయిపోయారు.

“మనం మోస్తా ఓల్లని, వాయలసీమ ఓల్లని అమ్మ నా బూతులు తిడ్తం కద. గందులో ముఖ్యమైన పది బూతులు సెలెక్ట్ చేయుండ్రి,” సాలోచనగా అన్నాడు వీ.సీ.ఆర్.

“ఆ! చేసినంక?” అడిగాడు ప్రొఫెసర్.

“గా పది బూతులకి ఎన్ని అక్షరాలు కావాలో అవి ఉంచి మిగతావన్ని తీసేయండ్రి,” నవ్వుతూ చెప్పాడు వీ.సీ.ఆర్.

“అన్నకు జై! బృందగానా సింహానికి జై!” అన్న అరుపులతో ఆ ప్రదేశం మారుమోగిపోయింది.

Not all 56 letters are required

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

9 Responses to బృందగానాలో సంబరాలు!

 1. Siva Kumar K says:

  హరాస్ రావు 😉 😛 lolz as usual…!!

 2. రవి says:

  ఏం జెప్పినవ్ లే. గీ లెక్కన బృందగానా కోసం ఒక కొత్త నిఘంటువు కూడా డిసైడ్ జేస్తే మంచిదన్నట్టు.

 3. aksastry says:

  అసలు తెలుగు భాష జోలికి రాకుండా, యే ‘తెలంగా’ భాషో మాట్లాడుకుంటే బాగుంటుంది కదా? ఏ వందేళ్ల తరవాతో గిడుగు రామ్మూర్తి సవర భాష కి యేర్పాటు చేసినట్టు యెవరైనా ఓ లిపి యేర్పాటు చేస్తారేమో దానికి! తెలుగు భాషా సిగ్గుపడుతుంది ఇలాంటివాళ్ల వల్ల.

 4. “గా తర్వాత, మనం ఉంటమో ఊడుతమో ఎవడు సూడొచ్చిండ్రా! 20 ఏల్ల కంటే కూడా ఎక్కువ దినాలు పాలిద్దామనా? గంత పదవీ దాహం పనికి రాదు”

  Good! So it is Vision 2034 🙂

 5. Sita says:

  Dear Teta,
  Good job! Telangana bhasha anta authentiq gaa ledemo? plz write more.
  Tirapati Gundu

 6. Lakshmi says:

  మహ బాగుగా రాశారు

 7. Prithvi raj says:

  “గా పది బూతులకి ఎన్ని అక్షరాలు కావాలో అవి ఉంచి మిగతావన్ని తీసేయండ్రి,”
  adirindi……..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s