విలీనమా, తొక్కా!

అక్కటకటా! ఎంత దారుణం జరిగిపోయినది! బృందగానా మీదే తన ఆశలు సర్వస్వం పెట్టుకుని అన్ని ఫణములనూ ఒడ్డిన గాంక్రెస్‌ని బృ.రా.సా బాస్, వీ.సీ.ఆర్. ఎంత మోసం చేసినాడు!

గాంక్రెస్ బృందగానాని ప్రసాదించినచో తమ బృ.రా.సా.ని గాంక్రెస్‌లో విలీనం చేసెదమని, తద్వారా బృందగానాని ఏకఛత్రాధిపత్యంగా ఏలుకొనవచ్చు అని మభ్యపెట్టి, ఇప్పుడు విలీనము కావించనని మడమ తిప్పుట ఎంత దారుణం!

ఆగుము!

మరి మోస్తా వాయలసీమ ప్రజలని శరణార్థుల కన్నా హీనముగా చూసి, వారి గుండెల మీదుగా తొక్కుకుంటూ వెళ్ళి, బృందగానాని ఏర్పాటు కావించిన గాంక్రెస్‌ది ద్రోహము కాదా!

అటువంటి గాంక్రెస్ కంటిని వారి వేలితోనే పొడవడం ఒక విధంగా చూసిన పాడియే కద!

అయినను దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నప్పుడు, ఒకరిది ఎక్కువ మోసము ఏమీ, ఇంకొకరిది తక్కువ మోసము ఏమీ, ఆ!

అదిగో! గాంక్రెస్ వారు గుండెలు బాదుకుంటూ రోదించుట, హాహాకారాలు చేయుట స్పష్టముగా వినిపించుతున్నది.

శత్రువుల ఆక్రందనలు శ్రవణానందకరముగా ఉన్నవి! అహ్హహ్హహ్హ!

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

9 Responses to విలీనమా, తొక్కా!

 1. suresh says:

  excellent post

 2. Anuradha says:

  హ హ హ ! what you give is what you get 🙂

 3. Siva Kumar K says:

  😉 😛

 4. tejasswi says:

  లెస్స పలికితిరి మామా!

 5. హహ్హహ్హా!!

 6. గాంక్రెస్స్‌నే బృరాసాలో విలీనం చేస్తే సరి

 7. Chiru says:

  ఇదియే మన తక్షణ కర్తవ్యము

 8. swathi says:

  wahva wahva

 9. కాలమొక్కరీతి గడవబోదు, దారిమార్పులు సహజంబు ధరణియందు. తమ తమ పధములు తప్పిన తమ మితృలె శతృలౌట తధ్యము ఇలలో. జైరాం అన్నవారే రాం రాం అంటున్నారు. ఈత విత్తుకు తాటి చెట్టు మొలవాలనుకోవటం అసహజం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s