ఓ పనైపోయింది బాబూ!

గాంక్రెస్ కార్యాలయం దేశ రాజధాని:

“అమ్మా, అబ్బా, అయ్యో, కుయ్యో” మూలుగులతో నిండిపోయింది ఆ ఆఫీస్ అంతా. వారంతా ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పాలైన క్యాండిడేట్స్.

లోపలికి వచ్చిన ఒక జర్నలిస్ట్ ఇది చూసి ఆశ్చర్యపోయాడు. “రైల్ అక్సిడెంట్ కవర్ చేసినప్పుడు కూడా ఇన్ని మూలుగులు వినలేదు. ఏమయ్యింది మీ అందరికి?” అడిగాడు.

“అంతా ఆ సురేంద్ర మోడీ గాడి పని. చచ్చినోడు! వాడి వేవ్ లేదు, రేవ్ లేదు అని బింకానికి పోయాం. 2002లో జరిగిన రైల్ సంఘటన గురించి పదే పదే గుర్తు చేశాం. తద్వారా అహ్మదీయుల ఓట్లు అన్నీ మాకే అనుకున్నాం. కానీ వాడి జిమ్మడ! ఆ మోడీ మమ్మల్ని ఒక మోత మోసేశాడు,” గాంక్రెస్ తరపున గెలిచిన 44 ఎం.పీ.లలో ఒకతను చెప్పాడు.

“డిపాజిట్ కూడా దక్కలేదు, బాబూ!” భోరుమన్నాడు గాంక్రెస్ తరపున పోటీ చేసిన ఒక ఆకు రౌడీ.

“మీరు నోరు మూయండి. ఇవన్నీ జర్నలిస్టులతో చెప్పాల్సిన మాటలా? అంతగా ఏడవాలనుకుంటే లోపలకి తగలడండి. ఆ రూం సౌండ్ ప్రూఫ్ కూడా చేశాం. కాసేపట్లో ప్రెస్ కాన్‌ఫరెన్స్ ఉంది,” విసుక్కున్నాడు పీ. ఏకాంబరం.

“అన్నట్టు అదొకటి ఉంది కదూ, ఇప్పుడు ఇంత నికృష్టంగా ఎందుకు ఓడిపోయామో కారణాలు అడుగుతారు అనుకుంటా. భగమంతుడా!” ఇంకో పేట రౌడీ ఘొల్లుమన్నాడు.

“ఈ ప్రెస్ కాన్‌ఫరెన్స్‌ని డీల్ చేయాలంటే మనకు పిచ్చి వాగుడు వాగే ఒక పెద్ద మనిషి కావాలి. అఫ్ కోర్స్! మనందరం కూడా అదే టైప్ అనుకోండి, కానీ ఆ లెవెల్ సరిపోదు. మనిషి మాటలు వినగానే వికారంగా అనిపించాలి. జర్నలిస్టులంతా ప్రెస్ కాన్‌ఫరెన్స్ ముగించి లగెత్తాలి. ఎవరు అలాంటి యోధుడు, ఎవరు?” అడిగాడు పీ. ఏకాంబరం.

“నేనొచ్చేసినా!” అంటూ లోపలికి ఎంటర్ అయ్యాడు దిక్-అపజయ్ సింగ్. మూర్చ రోగుల మల్లే ఆయన తన ముందు వెనక రెండు బోర్డులు కట్టుకుని ఉన్నాడు. ముందు బోర్డ్ మీద ఢిల్లీ అమ్మ ఫోటో ఉంటే, వెనక బోర్డ్ మీద సాహుల్ గాంధి ఫోటో ఉంది.

అందరూ ఊపిరి పీల్చుకున్నారు. “కరెక్ట్ టైంకి వచ్చారు సింగ్ గారు. కాసేపట్లో ప్రెస్ కాన్‌ఫరెన్స్. మీరే కాపాడాలి,” అన్నాడు ఏకాంబరం రిలీఫ్‌గా.

“జై అమ్మ, జై బాబు. నేను పుట్టిందే ఇలాంటి వాటికోసం. రానివ్వండి ఎంత మంది వస్తారో నేనూ చూస్తాను,” నవ్వుతూ అన్నాడు దిక్-అపజయ్ సింగ్.

ఆయన మాట్లాడుతుండగానే బిల బిలమంటూ బోలెడు జర్నలిస్టులు వచ్చేశారు.

“కి కి కి, ఈ సారి గాంక్రెస్‌ని మరీ చితగ్గొట్టేశారు. దీనికి కారణం ఢిల్లీ అమ్మ అసమర్థత అని కొందరు అంటూంటే, సాహుల్ గాంధి అవివేకత్వం అని ఇంకొదరు అంటున్నారు. మీరేమంటారు సింగ్‌జీ?” అడిగాడు ఒక జర్నలిస్టు.

“అవేవి కాదు, మా అంతట మేమే కావాలనే ఓడిపోయాం,” చెప్పాడు దిక్-అపజయ్ సింగ్.

“ఏంటీ? కావాలనే ఓడిపొయారా?” అందరు జర్నలిస్టులు షాక్‌తో అడిగారు.

“అవును అలా చేస్తే కానీ ప్రజలకి మా విలువ తెలిసి రాదు అనిపించింది. ఆల్‌రెడీ పదేళ్ళు సుపరిపాలన అందించాం. మరీ ఎక్కువ తీపి ఐనా వెగటు పుడుతుంది. కాబట్టే ఈ సారి జే.బీ.పీ.కి అవకాశం ఇచ్చాం. వాళ్ళ మత ఛాందసత్వాన్ని సంకుచిత భావాల్ని చూసి, పిచ్చి పిచ్చిగా దేశ సగటు ఆదాయం పెంచడం లాంటి చేష్టలు గమనించి, ప్రజలు కళ్ళు తెరుచుకుని మాకే ఇంకో పదేళ్ళు అధికారం ఇస్తారు,” ఉద్ఘాటించాడు సింగ్.

అదే హాల్‌లో మూలన నిల్చుని ఉన్న ఒక గ్రూప్ గట్టిగా చప్పట్లు కొట్టారు. వాళ్ళందరికీ మొహాలు కనిపించకుండా ముసుగులు ఉన్నాయి.

“ఈ ముసుగు బ్యాచ్ ఎవరు?” కుతూహలంగా అడిగాడు ఇంకో జర్నలిస్ట్.

“వీళ్ళంతా మన దేశ మేధావులు. ఒక వేళ సురేంద్ర మోడీ గెలిస్తే జంబూ ద్వీపం వదిలి వెళ్ళిపోతామన్నారు. ఎలాగూ గెలవడులే అన్న నమ్మకంతో అలా ఛండాలమైన ప్రామీస్ చేశారు. తీరా ఆయన గెలవడంతో ఏం చేయాలో తెలీక, మొహం చెల్లక, ఇలా ముసుగులు తగిలించుకుని తిరుగుతున్నారు,” చెప్పాడు పీ. ఏకాంబరం.

“ఎహె, నా ఫ్లోకి మధ్యలో అడ్డు పడకండి. ఇప్పుదు అర్థం అయ్యింది కద, మేము ఎంత దూరాలోచనతో, ఎలా ప్రజల కళ్ళు తెరిపించాలన్న సదుద్దేశంతో ఓడిపోయామో?” కోపంగా అన్నాడు దిక్-అపజయ సింగ్.

“బాగా అర్థమయ్యింది. అసలు మీ నోట్లో నోరు పెట్టడం మాదే బుద్ధి తక్కువ,” కోరస్‌గా అంటూ అక్కడనుంచి నిష్క్రమించారు జర్నలిస్టులంతా.

“చూశారా, ప్రెస్‌ని అలా హ్యాండిల్ చేయాలి,” గర్వంగా చెప్పాడు దిక్-అపజయ సింగ్.

గాంక్రెస్ కార్యకర్తలంతా గంగిరెద్దుల్లా తలూపి, చప్పట్లు కొట్టారు.

“ఈయన లాంటోళ్ళు మీ పార్టీని హ్యాండిల్ చేయబట్టే, జనం ఈ సారి మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేశారు. అయినా మీ బానిస రక్తానికి అది అర్థం కాదులే,” అనుకున్నాడు గాంక్రెస్ కార్యాలయానికి బయట కాపలాగా నిలబడి ఉన్న దర్వాను. (అతను కూడా ఈ సారి జే.బీ.పీ.కే తన ఓటు వేశాడు.)

(శుభం)

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

17 Responses to ఓ పనైపోయింది బాబూ!

 1. Zilebi says:

  వః వః వః !!

  చప్పట్లో య్ చప్పట్లు !!

  జిలేబి

 2. TVS SATRY says:

  అందుకే గాంగిరేసు వారు పరాభవింపబడ్డారు!

 3. suresh says:

  Good One…

 4. సూపర్…
  కానీ రిచంజీవి ప్రసక్తి లేనందుకు చింతిస్తున్నానండీ

  • Murali says:

   అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన ప్రస్తావన ఉంటుంది. 🙂

   • Siva Kumar K says:

    అవసరాలొచ్చేదామా మీరాగటమా…?? సృష్టికర్తలే ఇలా అంటే కష్టం కదా.. మాకోసం ఒకే ఒకసారి రిచంజీవి గారి దేశభక్తి(అదే అదే మేడంభక్తి) గురించి వ్రాయండి ప్లీచ్ ప్లీచ్… 😉 🙂

   • Murali says:

    మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు… సరే, అలాగే రాస్తాను.

 5. hari.S.babu says:

  బృందగానాలో సంబరాలు!>విలీనమా, తొక్కా!>ఓ పనైపోయింది బాబూ!>తర్వాత యేంటి?
  ::-P)

  • Murali says:

   రుణ మాఫీ నాకు ఎంతో నచ్చిన స్కీం. అదే తరువాత టపా!

 6. hari.S.babu says:

  బృందగానాలో సంబరాలు!>విలీనమా, తొక్కా!>ఓ పనైపోయింది బాబూ!>తర్వాత యేంటి?
  >>
  అక్కడ జరిగుతున్న వాటిని మీరు ఇంత ఖచ్చితంగా యెలా చూడగలుగుతున్నారబ్బా?!

 7. Jitu says:

  kinchittah lavanamein lope’nah, paalasa kusumam yathaa.

 8. Siva Kumar K says:

  😉 😀 Sooper…!!!!!!!!!!!!!!!!1

 9. hari.S.babu says:

  ఈ మధ్యనే సొంత వూరు వెళ్ళా.పక్క వూళ్ళో మా మామయ్య ఒకాయన వున్నారు.ఆయన యెంత కాంగ్రెసు ద్వేషి అంటే జలగం వెంగల రావుని గెలిపిస్తున్నారని ఖమ్మం జిల్లాని ఖర్మం జిల్లా అంటుంటారు.మాటల మధ్యన చాలా కసితో ఆణిముత్యం లాంటి ఒక సుభాషితం చెప్పారు.ఆ బోగం రాజు కాంగ్రెసు చరిత్ర సగమే రాసాడు.త్వరలోనే పూర్తవుతుంది.”అఖిల భారత జాతీయ కాంగ్రెసుకి మొదటి, ఆఖరి అధ్యక్షులు విదేశీయులే” అనే ఆఖరి వాక్యం తో దాని చరిత్ర ముగుస్తుంది – అని!

 10. venkateswararao says:

  Hari.s.babu garuu bhale maatalu cherchhaaru.congress modati chivari adhyakshulu videseeyule antuu…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s