రుణాలు మాఫీ చేస్తాం! కానీ…


బృందగానాకి ముఖ్య మంత్రి అయ్యాక వీ.సీ.ఆర్. కొలువు తీర్చిన మొదటి దర్బార్! అంతా కోలాహలంగా ఉంది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అని అక్కడ ఉన్న వారందరికి తెలుసు.

“ముందుగాల నా మీద నమ్మకముంచి నన్ను గెలిపించిన ప్రజలకి, గంత కంటే ఎక్కువ నమ్మకం పెట్టి నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న మీ అందరు ఎం.ఎల్.ఏ.లకు నా ధన్యవాదాలు. ఇన్నాల్లకి మనల్ని మనం పాలించుకునే అవకాశం వచ్చింది. గత 15 ఏల్ల సంది ఉద్యమాలు అంటూ తిరిగి తిరిగి ఇప్పుదు ఏక్ దం ఇట్ల చీఫ్ మినిస్టర్ పేషిల కూర్సుంటే గమ్మత్తుగున్నది.” విశాలంగా నవ్వుతూ అన్నాడు వీ.సీ.ఆర్.

“మనం మన లక్ష్యం సాధించినం. ఇంక త్రిలింగ ప్రజలు అందరూ అన్న దమ్ముల్ల్కెక్క బతకొచ్చు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతయి. కలసి మెలసి ముందుకు పోదం,” గట్టిగా అన్నాడు అక్కడ ఉన్న బృ.రా.స కార్యకర్తల్లో ఒకతను.

“ఒక్క పాలి జర దగ్గరకు రా తమ్మి,” అతన్ని పిలిచాడు వీ.సీ.ఆర్. ఉరుకులు పరుగుల మీద వెళ్ళి తమ నాయకుడి దగ్గర వాలాడు ఆ కార్యకర్త.

అతని చెంప ఛెళ్ళుమనిపించాడు వీ.సీ.ఆర్. “ఆ హౌలా మాటలు ఏందిరా? ఇంకా మోస్తా ఓల్లతో మనకు పంచాయితీ ముగిసిపోలేదు. 2019లోనో, ఖర్మ కాలి అంతకు ముందేనో ఎలెక్షన్సొస్తే , మల్లా గెలావాల్నా వద్దా? కలిసి ముందుకు సాగితే ఎట్ల గెలుస్తమురా? అసలు మనం ఎప్పుడు అయినా ఎవరి మాట అన్నా విన్నామా? అందరిని మనతో కలుపుకుని పోయినమా? ఇప్పుడు కలుపుకుపోయెటంద్కు?” గద్దించాడు.

“అంటే ఉద్యమం అయిపోయింది కదా అని…” నసిగాడు అతను చెంప తడుముకుంటూ.

“నువ్వు అసలు సిసలైన ఉద్యమకారుడివి కాదు బిడ్డా. అంద్కనె ఇసొంటి మాటలు మాట్లాడుతున్నావు. మనం సచ్చెంటంత వరకు ఉద్యమం ఇట్లనే నడుస్తది. సంఝయ్యిందా?”

“బాగా ఆయిందన్నా! మనం ఒక వేల అభివృద్ధి చెందితే, మోస్త ఓల్ల కుట్రలను ఎదుర్కొని పైకి వచ్చినట్టు, ఒక వేల మనం ఏమీ సాధించలేకపోతే, తప్పంతా మోస్తా వాయలసీమ వాల్లది,” హడావుడిగా చెప్పాడు అతను.

“గిప్పుడు నాకు నచ్చినవ్. అన్నట్లు ఈ యాల మనం చేయాల్సిన పనులు ఏమున్నాయి?”

“అదే! మనం రైతుల రుణాలు మాఫీ చేస్తం అన్నం కద! రైతులంతా బయట పెద్ద క్యూ గట్టిర్రు,” వినయంగా చెప్పాడు బరిసెల రాజేందర్.

“ఓ, అదొకటి ఉన్నది కద, సరె, నువ్వు బయటకు పోయి అనౌన్స్ చెయ్యి.”

“ఏమని?”

“ఈ రుణ మాఫీ 2013లో అప్పు తీసుకున వాల్లకే అని!”

“బాగుండదేమో అన్న…”

“మనం రుణాలు మాఫీ చేస్తం అన్నం గానీ, అన్నీ చేస్తామని చెప్పినమా? నేనెక్కడైన రాసిచ్చిన్నా?”

“లేదన్నా, మాకు తెలుసు కద, మీరు ఎప్పుడూ ఏదీ రాసివ్వరు…”

“మల్ల అదే. బయట పోయి అనౌన్స్ జేయి. కొంత మంది ఎల్లి పోతరు. ఎంత మంది మిగిలిండ్రో వచ్చి నాకు చెప్పు.”

“అలాగే అన్న,” బయటకు వెళ్ళాడు బరిసెల రాజేందర్.

కాసేపయ్యాక తిరిగి వచ్చి, “సగానికి సగం మంది ఖాలీ అయ్యిండ్రన్న. వీల్ల అప్పులు మాఫీ చేసేయనా?” అడిగాడు ఉత్సాహంగా.

“అంత తొందరెందుకు రాజేందర్? ఇప్పుడు పోయి లక్ష రూపాయల లోపు అప్పు ఉన్న వాల్లకే రుణ మాఫీ అని చెప్పు.”

“…”

“అరే, పోరా భై. నేనేమన్న ఎంత అప్పు తీసుకుంటే అంతా మాఫీ జేస్తనని ఎక్కడైన రాసిచ్చిన్నా? పో!”

“ఇంకో సగం మంది ఖాలీ అయ్యిండ్రన్న!” వెనక్కి వచ్చి చెప్పాడు రాజేందర్.

“ఇప్పుడు మల్లా పోయి, వాయిదా వేయించుకున్నోల్ల రుణాలు మాఫీ చెయ్యమని చెప్పు.”

“మల్లా ఉన్నోల్లలో సగం మంది బయటకి పోయిర్రు,” కాళ్ళీడ్చుకుంటూ వచ్చి చెప్పాడు రాజేందర్.

“ఇప్పుడు పోయి మొదటి మూడు ఇన్స్టాల్‌మెంట్లు కట్టినోల్లకు రుణ మాఫీ ఉండదని చెప్పు.”

“జస్ట్ పది మంది ఉండ్రు, అంతే,” తిరిగొచ్చి నీరసంగా చెప్పాడు బరిసెల.

“ఇప్పుడు పోయి, సొంత ఇంట్లో ఉండేటోల్లకి, రుణ మాఫీ లేదు, పొమ్మని చెప్పు.”

“ఒక్క ముసలోడు మాత్రం మిగిలిండన్న,” రిటర్న్ వచ్చి బావురుమన్నాడు రాజేందర్.

“ఒక్కనికి రుణ మాఫీ ఏందిరా భై? అందరూ సక్కగా కట్టుకుంటూంటే ఈడు గట్టుకోలేడా? ఆడిని గూడా ఇంటికి పొమ్మని చెప్పు!” డిక్లేర్ చేశాడు వీ.సీ.ఆర్.

దబ్ అన్న పెద్ద శబ్దంతో కింద పడి మూర్ఛ పోయాడు బరిసెల రాజేందర్.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

18 Responses to రుణాలు మాఫీ చేస్తాం! కానీ…

 1. Siva Kumar K says:

  😉 😛

 2. karthik says:

  ముక్కు దొర లేటెస్ట్ ఉవాచ ఏమంటే, ఎవరో ఒక మంత్రి తెలిసీ తెలియక మాట్లాడాడంట.. అంత తెలిసీ తెలియని వాళ్ళను మంత్రులుగా చెయ్యడం ఎందుకో!

  • Murali says:

   బాగా గుర్తు చేశారు. వేరే ఏదైనా టపాలో ప్రయోగిస్తాను. 🙂

 3. Anuradha says:

  😀

 4. shravan says:

  సూపర్!

  ఇరగదీశారండి. నవ్వాపుకోలేపోయామంటే నమ్మండి.

 5. Jitu says:

  Back in form… 🙂

  (Y)

 6. Padmaja says:

  మీదైన శైలిలొ చాలా బాగుంది పోస్ట్ 🙂

 7. నోటికి చెవులకు మధ్య ఉన్న దూరముకంటె, నోటికి చేతులకు మధ్య ఉన్న దూరము ఎక్కువని తెలిసుకొనే లోపలే కల నిజమైనది. నిజమౌతున్నదనుకొన్నది కల ఐనది.

 8. hari.S.babu says:

  తర్వాత యేంటి అన్న దానికి జవాబు ఇదన్న మాట!
  ఇక ఇంతేనా?ఇంకేం లేదా:-<)
  అంతా అయిపోయిందా :-@)

  • Murali says:

   కంగారు వద్దు. మన అకటా వికటపు రాజులు ఉన్నంతవరకు, మెటీరియల్‌కి కొదవ ఉండదు.

   🙂

 9. Prithvi raj says:

  మీరు క్లైమాక్స్ హైలెట్ చేసేసారు…..

 10. srk hyd says:

  chala bagundi ap cm gurinchi kuda rayandi

 11. hari.S.babu says:

  సీ||
  ఆంధ్ర బిర్యానీని పేడ యనిం డొక
  బాడుఖావు! పరుల భోజనాన్ని

  కావరమున వెటకారించె టోడు మ
  నిషె కాడుగా, పవరిచ్చి రెట్ల

  ఘనమైన గా తెలంగాణోళ్ళు? మొదలెమొ
  మా తిండిపై వూస్తడా, అటెన్క

  మమ్ముల్ని కడుపుల బెట్కొని సూస్తడా!
  గిట్ల జూస్తె పురుషుడూ గట్ల జూస్తె
  తే||
  ఆడదీ ఐన బహురూపి లాగ వుంది
  గా దిమాగు యెక్వోని నయా జమాన!!
  వూరు పేరు లేనోళ్ళు గొప్పోళ్ళ నేందొ
  పనికిమాలినో ళ్ళంటున్రు పొగరు బట్టి!!!
  (28/07/2014)

  • కడుపులో పెట్టుకోవటమంటే ఇల్వలుడి సూత్రమని అర్ధము చేసుకోనివారు అమాయకులు. ఈడ వారి మాటలకు అర్ధాలు వేరయా ! ఆంగిక వాచికములను సమ్మిళితముజేసి సందర్భమును గుర్తెరిగి ముఖ్యామాత్యుల, వారి అనుచర నాయకగణముల మాటలలోని అంతరార్ధము గ్రహించవలెను. చరిత్రపుటలు పరిశీలించి శివసేన ఉత్థాన పతనాలను గుర్తెరిగి ప్రవర్తిస్తే ఉద్యమాలకు పరిపాలనకు ఉన్న అంతరమెంతదో అవగతమౌతుంది. ఇల్లలకటము శారీరక శ్రమతో సంభవం. పండుగ చేయటమంటే శాస్త్ర పరిజ్ఞానముండాలి, సంబారాలు సమకూర్చుకోవాలి ఎన్నెనో, మరెన్నో! పూర్వభాగముకంటె పరభాగమే దేవుడు మెచ్చేది. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళన్నాడు వెనకటికి ఒక నాయకుడు. ‘ అన్న ‘ వాడు శేషకీర్తిగా మిగిలిపోయాడు.

   • hari.S.babu says:

    శర్మ గారూ, ఇరగ దీసేశారుగా!
    నిజమే శివసేన వారితో చాలా చక్కటి పోలిక తెచ్చారు.వారు భూమి పుత్రు లనే నినాదంతో యేమేమి చేసారో వీరు అవన్నీ మరోసారి ప్రదర్శించి చూసుకుంటున్నారు?

  • Murali says:

   హరి బాబు గారు,

   మీరు లేవనెత్తిన ప్రశ్నకి శర్మగారు చక్కటి సమాధానం ఇచ్చారుగా! 🙂 జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం!

   -మురళి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s