రిచంజీవి 150వ సినిమాకి కథ కావాలి!


త్రిలింగ సినిమా ఇండస్ట్రీ అంతా ఈ వార్తతో అట్టుడికిపోయింది. ఎవరి నోట విన్నా ఇదే మాట. ఎన్నికలయిపోయాయి కాబట్టి రిచంజీవి తన 150వ చిత్రం పూర్తి చేద్దామని కృత నిశ్చయంతో ఉన్నాడని, ఆ సినిమా కోసం ఒక మంచి కథ వెతుకుతున్నాడు అని, మంచి కథ ఎవరు చెప్తే వారికి కోటిన్నొక్క రూపాయలు ఇస్తాడన్న విషయం దావానలంలా వ్యాపించింది.

“ఈ కోటిన్నొక్క రూపాయలేంటి?” సందేహం వచ్చింది ఒక ఛోటా రచయితకి.

“ఏం లేదు, కథ నచ్చితే ముందు ఒక రూపాయి ఇస్తాడు, సినిమా తీశాక బాగా ఆడితే మిగతా కోటి రూపాయలు ఇస్తాడు,” చెప్పాడు ఇంకో మోటా రచయిత.

“ఎంతైనా గిగా స్టార్ తెలివే వేరు. ఇలా చేస్తే రచయితలు అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కథ రాస్తారని ఆయనకి తెలుసు,” మెచ్చుకున్నాడు ఛోటా రచయిత.

“సర్లే, కథ వాస్తవికతకు దగ్గరగా ఉండాలట, పైగా, ఆయన ఇమేజ్‌కి సరిపోయేలా కూడా ఉండాలట. కత్తి మీద సాము లాంటి యవ్వారం. అందరూ ఎడా పెడా కథలు రాసేస్తున్నారు. నేను కూడా రాయాలి. మూడ్ రావడానికి చిన్నాపురం వెళుతున్నా. అక్కడైతే ప్రశాంతంగా రాసుకోవచ్చు,” చెప్పాడు మోటా రచయిత.

“నిజమే, ఈ పాటికి ఇడ్లీ జగన్నాథ్ బ్యాంగ్‌బ్యాంగ్‌కి వెళ్ళి పోయి ఉంటాడు. ఆయన కథ రాయాలంటే అక్కడికే వెళ్తాడు కద!” సాలోచనగా అన్నాడు ఛోటా రచయిత.

“నీ మొహం. ఈ ఫ్లైట్ చార్జులు భరించలేక నిర్మాతలంతా ఆయనకి బ్యాంగ్‌బ్యాంగ్‌లోనే ఒక ఇల్లు కొనిచ్చారు,” చెప్పాడు మోటా రచయిత.

“అంతటి అదృష్టం అందరికు ఉండదు కద. నేను మా సత్తిబాబు హోటెల్‌కి వెళ్ళి కథ రాసుకుంటా,” అంటూ బయలుదేరాడు ఛోటా రచయిత.

***

ఒక పది రోజులయ్యేప్పటికి రిచంజీవి ఆఫీసుకి ఒక లక్ష కథలు వచ్చి పడ్డాయి. ఒక టీంని పెట్టి అందులోంచి టాప్ 3 స్టోరీస్ సెలెక్ట్ చేయించాడు రిచు.

ఫైనల్‌గా స్టోరీ సిట్టింగ్ పెట్టుకున్నారు. షార్ట్ లిస్ట్‌లో ఉన్న మొదటి రచయిత తన కథని మోసుకుని చిరు ఉన్న రూంలోకి వచ్చాడు.

“చూడండి, అసలే చాలా రోజుల తరువాత మళ్ళీ సినీ రంగంలోకి అడుగు పెడుతున్నాను. కథ నా ఇమేజ్‌కి తగ్గట్టు ఉండాలి,” హెచ్చరించాడు రిచు.

“అంతేనా, కథ వాస్తవికతకు దగ్గరగా కూడా ఉండాలి. నాకు తెలియదుటండి! అలాంటి కథనే పట్టుకొచ్చాను. చిత్తగించండి,” వినయంగా అన్నాడు రచయిత నంబర్ 1.

“చెప్పండి.”

“మన కథలో హీరో ఎన్నో కష్టాలు పడి పైకొస్తాడు. సంఘంలో ఒక గొప్ప శక్తిగా ఎదుగుతాడు. ప్రజలకు తన వంతు సేవ చేయాలి అనుకుంటాడు.”

“ఇంటరెస్టింగ్, ప్రొసీడ్!”

“కాబట్టి ఒక పొలిటికల్ పార్టీ పెడతాడు. ప్రజలకి ఎన్నో వాగ్ధానాలు చేస్తాడు.”

ఉలిక్కి పడ్డాడు రిచంజీవి. కానీ సర్దుకుని, “ఆ తరువాత?” అన్నాడు.

“ఆ తరువాత అనుకోకుండా ఎన్నికలలో ఓడిపోతాడు. కొన్ని నెలల తరువాత అతని అభిమానులు సైతం బాధ పడేలా రూలింగ్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తాడు. ఆ రూలింగ్ పార్టీ, మన హీరో సొంత రాష్ట్రాన్ని అక్రమంగా చీల్చడానికి ప్రయత్నిస్తూంటే కూడా అడ్డుకోకుండా నిస్సహాయంగా ఉండిపోతాడు. ప్రజలంతా అతని పదవీ వ్యామోహాన్ని చూసి అసహ్యించుకుంటారు. చివరకి అతని రాష్ట్రం చీలనే చీలుతుంది. ఈ సారి వచ్చిన ఎన్నికలలో అతను చేరిన రూలింగ్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు.”

“మీరింక వెళ్ళొచ్చు,” లేచి నిలబడి డోర్ చూపిస్తూ అన్నాడు రిచంజీవి.

“అదేంటి సార్? అలా అంటారు? అసలు ఇప్పుడే కథ రసకందాయంలో పడుతుంది.”

“ఎక్కడైన పడనీ, నాకు ఇంత వాస్తవికమైన కథ అక్కర్లేదు,” గట్టిగా అరిచాడు రిచు.

దడుసుకున్న రచయిత అక్కడినుంచి శరవేగంతో నిష్క్రమించాడు.

రెండో రచయిత ఎంటర్ అయ్యాడు.

“మీ కథేంటి?” కాస్త చిరాకుగానే అడిగాడు రిచు.

“ఇది ఒక అన్నాదమ్ముల కథ.”

“రక్షించారు. చెప్పండి.”

“మన కథలో హీరోది అన్నయ్య పాత్ర. తన స్వశక్తితో కష్టపడి పైకి రావడమే కాకుండా, కుటుంబ సభ్యులని కూడా పైకి తెస్తాడు.”

రిచంజీవిలో ఆశలు చిగురించడం మొదలు పెట్టాయి. “ఆ తరువాత?”

“ముఖ్యంగా మన హీరో చిన్న తమ్ముడికి అన్నయ్య అంటే ఎంతో ఆరాధనా, అభిమానం. కాని రానూ రానూ పరిస్థితులు మారి పోతాయి. అన్నయ్య ప్రవర్తన తమ్ముడిని బాధ పెట్టడం మొదలు పెడుతుంది. ముఖ్యంగా అన్నయ్య ప్రజా వ్యతిరేక శక్తులని సమర్థించడం తమ్ముడు తట్టుకోలేకపోతాడు. చాలా రోజులు మధన పడతాడు. ఎట్టకేలకు అన్నయ్యని ఎదిరించడానికే నిర్ణయించుకుని ప్రజలని చైతన్యవంతులని చేస్తాడు. విజయం సాధిస్తాడు. అన్నయ్య జీరో, తమ్ముడు హీరో అవుతారు. ఇక్కడే కథ ఒక మలుపు తిరుగుతుంది.”

“గెట్ ఔట్!” గట్టిగా అరిచాడు రిచు.

రచయిత నంబర్ 2 బయటకి పరిగెత్తడం, రిచంజీవి బావ మరిది సొల్లు అరవింద్ లోపలికి రావడం ఒకే సారి జరిగాయి.

“ఏమయ్యింది బావా, అంత గట్టిగా అరిచావు?” ఆందోళనగా అడిగాడు సొల్లు అరవింద్.

“చూడు అరవింద్. ఏదో వాస్తవికతకి దగ్గరగా ఉన్న కథలు చెప్పండి అంటే వీళ్ళు యధాతథంగా నా స్టోరీని దించేస్తున్నారు,” బాధ పడ్డాడు రిచు.

“ఈ మూడో రచయితకి నేను సర్ది చెప్తాలే బావా!”

“సరే, అతన్ని లోపలకి పంపించు.”

రచయిత నంబర్ 3 ప్రవేశించాడు.

కానివ్వండి అన్నట్టు చేత్తో సైగ చేశాడు రిచు.

“మన కథలో హీరో గొప్ప ధనవంతుడు. ఆగర్భ శ్రీమంతుడు. కానీ ప్రజల కష్టాలని చూసి చలించి వారికి సహాయం చేయడానికి తన ఆస్తిని అంతా దానం చేస్తాడు.”

రిచు పెదవులు చిరు నవ్వుతో విచ్చుకున్నాయి. “ఇంకా చెప్పండి.”

“ప్రజల తరపున పోరాడుతూ ఆ దేశపు పాలకులకు శత్రువు అవుతాడు. అతన్ని లొంగ దీసుకోవడానికి ఆ దేశపు రాణి ఎన్నో ఆశలు పెడుతుంది. ఎన్నో పదవులు ఎరగా వేస్తుంది. ఊహూ! మన హీరో దేనికీ చలించాడు. తన ఆత్మాభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టేది లేదని చెప్తాడు. ప్రజల తరపునే నిలబడతాడు. రాణిని గద్దె దింపుతాడు. చివరికి చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలిచిపోతాడు,” ముగించాడు రచయిత నంబర్ 3.

“వండర్‌ఫుల్. ఫెంటాస్టిక్. తొక్కలో వాస్తవికత. ఈ కథ నా ఇమేజ్‌కి తగినట్టు ఉంది. ఈ కథనే ఫిక్స్ చేయండి!” ఆనందంగా అన్నాడు గిగా స్టార్ రిచంజీవి.

***

బయటకు గెంటేయబడ్డ రచయితలు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు.

“తన తప్పు తెలుసుకున్న హీరో పశ్చత్తాపంతో పరివర్తన చెంది, ఎక్స్-రూలింగ్ పార్టీనుంచి రాజీనామా చేసి, మళ్ళీ ప్రజల్లో ఒకడై, పూర్వపు ఇమేజ్ సంపాదించుకుంటాడు అని చెప్పేంతలోపలే ఆయన పంపించేశాడు,” విషాదంగా అన్నాడు మొదటి రచయిత.

“మరే, అన్న తమ్ముడినుంచి స్పూర్తి తెచ్చుకుని, ఒక సారి ఆత్మ పరిశీలన చేసుకుని, మళ్ళీ కష్టపడి పైకి వచ్చి, తమ్ముడికి తిరిగి ఆదర్శప్రాయంగా తయారవుతాడు అన్నది నా ముగింపు. వినకుండా నన్నూ తరిమేశాడు,” భోరుమన్నాడు రెండవ రచయిత.

“ఆయనకు అంత సహనమే ఉంటే, పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిండేది కాదేమో!”

“నిజమే!”

 

Advertisements
This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

19 Responses to రిచంజీవి 150వ సినిమాకి కథ కావాలి!

 1. Siva Kumar K says:

  ROFL…………………… 😀 😀 😀

 2. karthik says:

  >>“ఆయంకు అంత సహనమే ఉంటే, పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిండేది కాదేమో!”

  BINGO BINGO!

  ఉయ్యాలవాడ రెడ్డిగారి బయొగ్రఫి అని వార్తలు వస్తున్నాయి.. ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో..

  • hari.S.babu says:

   ఈనాటి భవిష్యత్తును ఆనాడే చూదగలిగితే ఉయ్యాలవాడ అంత సాహసం చేసి ఉందేవాడు కాదేమో?!

   • Murali says:

    పోతన కవిత్వాన్ని ఎవరైనా పామరుడు ఎగతాళి చేసినంత మాత్రాన, దాని వన్నె తరిగిపోదు. ఉయ్యలవాడ జీవిత చరిత్రని చిత్రంలా ఎవరైనా అనర్హుడితో నిర్మించినా ఆయన కీర్తికి వచ్చిన నష్టం ఏమీ లేదు.

    మహనీయులు తమ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని త్యాగాలూ, పోరాటాలు చేయరు. 🙂

 3. Paramesh reddy says:

  Back to pavilion

 4. పాపం! ఆ పెట్టుబడిదారులు, పంపిణీదారులు వేరే వ్యాపారాలను ముందరే ఖాయం చేసుకొని ఈ సాహసానికి సిద్ధమైతే మంచిదనుకొంటున్నారని ఫిలింటౌన్ గుస గుస. రికార్డింగ్ డాన్సులు చేయటానికి శరీరం సహకరించదు. సెంటిమెంటు అయితే జనం శోకరసము బదులు హాస్యరసము అనుభవించటానికి ప్రయత్నించి విఫలులౌతారు. తన్ను పట్టుకొని వ్రేలాడే తమ్ముణ్ణి, పల్లవితేజును, అల్లుకొనే నకులుని పెట్టి మల్టి స్టారర్ ప్లాను చేస్తే ఒక్కొక్క నటుడికి ఒక ఆట చొప్పున మూడు ఆటలు గారెంటి. పేరుమార్పిడి రాజకీయాలకు అచ్చుబాటు కాదు అన్నది స్టోరీ లైన్. దగాపడిన అన్నయ్య అనేది సినిమా టైటిల్ కారు యాత్రలు, లారీ యాత్రలు సందర్భశుద్ధిలేకుండ పెట్టి రిస్కు తీసుకోవచ్చు. ఇంతకంటే చెడేదేముంది?

 5. Hilarious. BTW, what/who is Uyyalavada??

 6. హహహహ సూపర్ అండీ :-))

 7. yosepu says:

  “… నాకు ఇంత వాస్తవికమైన కథ అక్కర్లేదు,” గట్టిగా అరిచాడు రిచు. 🙂

 8. Jitu says:

  Present Saar!

 9. Chellayi says:

  మురళిగారూ, 5 ఏళ్ళ తరువాత వచ్చే ఎలెక్షన్ లో వోట్లు రావాలంటే మూడో కథే కరెక్ట్ కదా. అసలు రచయితలకి డబ్బులు ఎగ్గొడితేనే సినెమా సక్సెస్ అవుతుందని అందరు ప్రొడ్యూసెర్లు గాఠ్ఠిగా నమ్ముతారుట, మీకేమైనా తెలుసా?

  • Murali says:

   అలాంటి దరిద్రపు సెంటిమెంట్ కూడా ఒకటి ఉందా? 🙂

 10. hari.S.babu says:

  మురళి గారూ,

  విజయవాదలో ఆంధ్రా గాంక్రెసు వారి మీటింగ్ జరిగింది.పేపర్లో చదివుతుంటూనే నవ్వొచ్చింది!అసలోడికి పెళ్ళి కాకుండా యేడుస్తుంటే ముసలోళ్ళకి ప్రేమలు పెళ్ళిళ్ళు కావల్సి వచ్చాయా:వివేకా. మీరు కాస్త అటువైపు దృస్టి పెట్టాలి.

  మాంచి పోష్టు కోసం యెదురు చూస్తున్నాం 🙂

 11. నాగరాజ్ says:

  సూపరండీ 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s