టీవీలో ఏం ప్రోగ్రాంస్ వస్తున్నాయంటే..


పొద్దున్నే చంటి గాడి ఏడ్పుతో మెలకువ వచ్చింది. పాపం వాడు డయాపర్ ఖరాబు చేసుకున్నట్టున్నాడు. నేను వెంటనే కొత్త డయాపర్ తెచ్చి మారుస్తూ వాడితో ఇలా అన్నాను.

“హే చంటిగాడు! నువ్వు వేసుకున్న డయాపర్ త్వరలో ఖరాబు కాక తప్పదు. అప్పుడు నాకు నీ డయాపర్ మళ్ళీ మార్చకా తప్పదు. అనివార్యమగు ఈ విషయం గురించి శోకింప తగదు.”

వాడికి ఏం అర్థమయ్యిందో కానీ, చిరు నవ్వు నవ్వి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు.

ఇక ఎలాగూ నిద్ర పట్టేలా లేదు అని వార్తలు విశేషాలు తెలుసుకుందామని టీవీ ఆన్ చేశాను.

మీ టీవీ చానెల్‌లో “మాలో ఎవరు లూటీశ్వరుడు?” కార్యక్రమం వస్తూంది. కండక్ట్ చేస్తూంది సినీ నటుడు రాగార్జున.

“ఇప్పుడు 1000 రూపాయల ప్రశ్న. మగాళ్ళు ఈ కింది దుస్తుల్లో ఏం వేసుకోరు?

1) పంచ 2) ప్యాంట్ 3) లుంగీ 4) చీర

మీ దగ్గర కేవలం ముప్పై సెకండ్ల టైం మాత్రమే ఉంది.” అంటున్నాడు రాగార్జున కంటెస్టెంట్‌తో.

“చీర,” టక్కున చెప్పింది కంటెస్టెంట్.

“అ హ హ! భలే చెప్పారు! అంత వేగంగా ఎలా చెప్పారు? మీకు జెనరల్ నాలెడ్జ్ బాగా ఎక్కువనుకుంటాను. అ హ హ!”

“నా మొహం. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కద! మా ఇంట్లో మగాళ్ళు ఎవరూ చీర కట్టుకోరు.”

“అ హ హ. పైగా మీకు బోలెడు సెన్స్ అఫ్ హ్యూమర్ కూడా ఉంది. అ హ హ.”

నేను చానెల్ మార్చాను.

వీ.సీ.ఆర్ ఆవేశంగా జర్నలిస్టులతో మాట్లాడుతున్నాడు. “ఎంత భయం లేకుంటె మా ఎం.ఎల్.ఏ.లవి పాచి కల్లు తాగిన మొహాలంటరు? ఎం.ఎల్.ఏ.లే కాదు మా పార్టీల సన్నాసులు కూడా నిఖార్సైన కల్లే తాగుతరు. సాయంత్రం మా పార్టీ ఆఫీస్‌కి వస్తే వాళ్ళకే తెలుస్తుంది.

ఐనా మా ఎం.ఎల్.ఏ.లు “సార్వభౌమాధికారం” అనే పదాన్ని సక్కగా పలకలేదు. గంతే కద. ఈ పెద్ద పెద్ద పనికిమాలిన పదాలు మాకు అవసరం లేదు. ఇప్పటి సంది “సార్వభౌమాధికారం” బదులు “పెద్ద పెత్తనం” అని చెప్తం. ఖేల్ ఖతం. దుకునం బంద్!”

మళ్ళీ చానెల్ మార్చాను.

“డ్యాన్స్ వాజా డ్యాన్స్” ప్రోగ్రాం వస్తుంది. ఒక జంట అప్పుడే తమ పెర్‌ఫార్మెన్స్ ముగించినట్టున్నారు. ముగ్గురు జడ్జెస్ ముందు నిలబడ్డారు. ఒక జడ్జ్ వాళ్ళని కూకలేస్తున్నాడు.

“సారీ మీకు 5 కంటే ఎక్కువ పాయింట్లు ఇవ్వలేను. విజయమాలిని పాటకు అంత మర్యాదగా డ్యాన్స్ చేస్తారా? ఆ ఊపు ఏదీ? ఆ కులుకులు ఏవీ? ఇదేమన్న ఫ్యామిలీ అంతా చూసే ప్రోగ్రాం అనుకున్నారా?”

ఆ జంట “సారీ మాస్టార్!” అని ఘొల్లుమన్నారు.

చానెల్ చేంజ్ చేశాను.

“గంగమ్మ గారి గౌడి గేదె” సీరియల్ వస్తూంది. ఒక మోతుబరి ఆడ లేడీ పశువుల కొట్టంలో కూర్చుని తన గేదెలను శుభ్రంగా తోముతూంది.

“అదేంటి గంగమ్మ గారూ, ఇంత మంది ఉండగా మీరు చేయి చేసుకుంటున్నారు? కోట్లకు అధిపతి అయిన మీరు ఇలా బర్రెలని బరా బరా తోమేస్తూ ఉంటే చూడలేకపోతున్నానమ్మా,” మొర పెట్టుకుంటున్నాడు ఒక పాలేరు.

“మనం ఎప్పుడు మన మూలాల్ని మరిచిపోకూడదురా. ఈ గేదెల వల్లే, నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను. కనీసం ఇవి కంపు కొట్టకుండా చూసుకోవడం నా ధర్మం రా, నా ధర్మం!” ఆవేశంగా అంటూంది గంగమ్మ.

మెల్లగా తల నొప్పి స్టార్ట్ అయ్యింది నాకు. అసలు ఒక్క మంచి ప్రోగ్రాం కూడా రాదా ఈ టీవీలో?

భయపడుతూనే ఒక న్యూస్ చానెల్ పెట్టాను.

“ప్రధాన మంత్రి సురేంద్ర మోడీ ప్రస్తుతం భీటాన్ పర్యటనలో ఉన్నారు. ప్రధాన మంత్రి అయ్యక అయన మొదట సందర్శించిన పరాయి దేశం, ఏ అరెమికానో, నైచానో కాకపోవడం పట్ల పలువురు మేధావులు తమ విస్మయాన్ని వ్యక్తం చేశారు,” అంటూంది న్యూస్ రీడర్.

ఎంత మంచి వార్త! మొదటి సారి మన దేశపు సెక్యూరిటీ అవసరాలను గుర్తించిన ప్రధాన మంత్రి వచ్చాడు. నైచా, డిబెట్‌ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాక, పర్వత సానువులను అంటపెట్టుకుని ఉన్న ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యింది. దాని ఫలితంగా రవాణా వంటి వ్యవస్థలు కూడా వెనకపడ్డాయి. చాలా చోట్ల బార్డర్ చేరుకోవాలంటే రోజుల తరబడి కాలి నడకన వెళ్ళాల్సిన పరిస్థితి. ఒక వైపు నైచా తమ దేశంలో, బార్డర్ పొడుగునా రైలు పట్టాలు, రోడ్లూ నిర్మిస్తూ తమ సరిహద్దులని మరింత పటిష్టం చేసుకుంటూంది. వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే జంబూ ద్వీపం, భీటాన్ కలిసి పని చేయడం ఎంతైన అవసరం.

నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ మా ఆవిడ గొంతు వినిపించింది, “ఈ సురేంద్ర మోడీకి పని పాటా లేదనుకుంటాను. ఆ దిక్కు మాలిన భీటాన్‌కి ఎందుకు వెళ్ళడం? ఆ సోది ఆపి, గంగమ్మ గారి గౌడి గేదె సీరియల్ పెట్టండి,” అంటూ.

నేనూ అప్రయత్నంగా నిట్టూర్చాను.

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

13 Responses to టీవీలో ఏం ప్రోగ్రాంస్ వస్తున్నాయంటే..

 1. Jitu says:

  Innduke poddunne TV pettakoodadu anntaaru. LOL

  Asalu nannu adigite… TVs should be banned.

  News lekapovadam toh akharleni leni poni vaartalu kannibetti mariii 24×7 chnannel choobedtaayi. Asalu evariki kaavaali… 100 24×7 news channels? Mana desam lo anni unnyi. Chivariki cheppuko tagga news leka pilli gattu ekkindi, kukka chettu kinda padukundi… ilaanti news … inka minchi aa news ki analysis, panels, talk shows.

  Poni serials bagunaayi… O manchi director o muchattaina kathani direct chestunnaadu, manchi cheppugotagga acting undaa.. ante adi ledu. O katha undadu, o direction, acting antu evi undavu. Poni ardharaatiri padukoni lechina appude beauty parlour ninchi ochhinattu make up chesukoni unna aa actresses battalena kaneesam choodamuchhatugaa undadu kadaa.

  Ika migilevi… reality shows. Vaati gurinchi cheppukokapovadame manchidi.

  Inka meeru IIFA, FIFA, SOFA… ivii marchipoyeru. 😀 😀 😀

  TV programs o ettu ante advertisements inko ettu. Aa topic meda o post kosam mee blogs lo eduru choostaamu. 🙂

  PS: Although this was a fiction, this sadly reflect reality very closely. Not just the content of TV as depicted here but also the fact that we seek entertainment in TV rather than look for it elsewhere… either outside in nature or within books.

  • Murali says:

   Good comment. The temptation to totally shut away from the pop culture is huge and will probably serve one very well. However, I am still trying to provoke and prevail. 🙂

   • Jitu says:

    I agree. It’s easier said than done.

    As I’ve mentioned before, I had refrained from even owning a TV for about 10 years of my adult life. It was difficult to keep visitors, family and friends entertained. Not to mention the jibes… “They cannot even buy a TV”. 😛 From being labeled weird to be actually pitied… I have seen them all. 😀
    Finally when my kids started feeling the pinch of not having a TV, it became a social and peer pressure issue more than a personal ethical choice.

    Even today, if I wish to participate in a healthy discussion about current affairs, I need not just know what our PM is doing, but also need to know what Saree Sagrika was wearing, What tie Rajdeep was flaunting or what rhetoric question Arnab has asked the night before. To know all of this, reading news paper for news is not enough. I have to watch TV… or at best have some other source which surmises the hot and happening things on TV.

    It’s ironical that… more than news, the newsreader’s attire and more than the books, the book-reviewer’s nasty comment, seems to be what I need to keep abreast with. 😦

 2. Siva Kumar K says:

  Super as usual…
  అప్రయత్నంగా నిట్టూర్చాను–>అప్రయత్నంగా చానల్ మార్చాను…. 😉 😀 😛

 3. sashanka says:

  ఇదేమన్న ఫ్యామిలీ అంతా చూసే ప్రోగ్రాం అనుకున్నారా?

  super … 🙂

 4. suma says:

  nice post…..

  • narsing Rao says:

   You are sparing AP CM. You are intentionally targeting Telangana CM. This shows your real nature.

   • Murali says:

    Rao gaaru,

    Your email says you are an advocate. But I think you should be a psychiatrist. You found out my real nature by just reading this one post!!! You didn’t even care to read my other posts where I did criticize the current AP CM.

    So, does jumping to such a quick conclusion, show your real nature too? 🙂

    -Murali

 5. Chellayi says:

  I want to participate in “మాలో ఎవరు లూటీశ్వరుడు?” program 🙂 I love TV. Don’t we get entertained somehow or the other??? Murali garu, Please listen to TORI radio and write a blog on those programs.

 6. టి.వి అంటే ట్రాష్ వెంటిలేటర్ అని ఒక మిత్రుడు చెప్పాడు. అసలు తెలుగులో ఎన్ని చానెళ్ళు అని రాగార్జున గారి కార్యక్రమములో ఒక జవాబు చెప్పలేని ప్రశ్న వేయచ్చేమో! ఆ ప్యానెల్ చర్చా కార్యక్రమము పులిని చూసి నక్క వాత పెట్టుకొన్నట్లు! మరొక కోణం: 52 : 48 ! ఈ సంఖ్య కూడా జైకృష్ణగౌరీష్ కృతమేమో! అందుకే నా సుపుత్రుడు ఫ్లిప్కార్ట్ లో ఒక పాత ట్రాన్సిస్టర్ కొన్నాదు. మరొక గమనిక : సూపర్ డూపర్ స్టార్ నటించిన ‘ఎవడు ‘, ప్రాకు నకులుని ఫైస్లా అన్న చలన చిత్రాలు ఒక చానెల్లో ఇప్పటికి సహస్ర చంద్ర ప్రదర్శనోత్సవం చేసుకొని గిన్నెల పుస్తకంలోకి ఎక్కాయట ! ‘ ఉదాహరిస్తే ఎన్నో గాధలు, హృదయ విదారక విషాద చరితలు ‘ అన్న అప్పటి మాట ఈనాటి ఈ స్థితికి దర్పణమేమో! ఇన్ని వ్యధలు వ్యక్తం చేసుకునే వీలు కల్పించిన మీ వ్యాసానికి అభినందనలు. ఈ వేదనను అర్ధం చేసుకొని వాతలు పెట్టుకోవటం మానేసి జనరంజకమైన కార్యక్రమాలు రూపు దిద్దుకొంటైయ్యేమో అనేది దింపుడు కళ్ళ ఆశ.

 7. నాగరాజ్ says:

  వండర్ ఫుల్. సూపరుగా రాశారండీ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s