గూఢచారి 232 – హైజాక్ ఏల అన్న…

(జరిగిన కథ:

జంబూ ద్వీపపు గూడచారుల్లో అత్యంత సమర్థవంతుడైన 232ని, ఆదరా బాదరాలో పాంచ్ మీనార్ దగ్గర పాతుకుపోయిన పీకిస్తాన్ ముఠా సంగతి కనుక్కోమని పురమాయిస్తాడు, ఛీ.బీ.ఐ. డైరెక్టర్ శాతకర్ణి. స్పెషల్ ఎఫెక్ట్స్ డివిజన్ చీఫ్ ఆధునిక రావు దగ్గర నుంచి రక రకాల వింతైన గ్యాడ్జెట్స్ తీసుకుని, గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి, ఎయిర్ హిండియా ద్వారా, ఆదరా బాదరాకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటాడు 232.

తీరా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక, ఫ్లైటు ఒక్క రోజు ఆలస్యం కావడంతో, మిగతా ప్రయాణీకులతో పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే కబడ్డీ ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తాడు 232. ఎట్టకేలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి సిద్ధం అవుతుంది. అందరు ప్రయాణీకులతో పాటు తను కూడా ఫ్లైట్ బోర్డ్ చేస్తాడు 232.

ఐతే ఈ ప్రయాణీకుల్లో ముగ్గురు బవిగి గడ్డాలు ఉన్న వ్యక్తులని గమనించి, వారి మీద ఒక కన్నేద్దామని నిశ్చయించుకుంటాడు.

232 అనుమానించినట్టే, ఫ్లైట్ టేక్-ఆఫ్ కాగానే ఆ ముగ్గురు ప్లేన్‌ని హైజాక్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు.)


“అదేంటి మీరు తెలుగు మాట్లాడేస్తున్నారు ఎంచక్కా? మీ గడ్డాలు చూసి మీరు ఏ పీకిస్తాన్ నుంచో వచ్చారు అనుకున్నాము,” ఆశ్చర్యపోతూ అన్నాడు శ్రీనివాస్.

“మీరు మా ప్లాన్స్ తెల్సుకోకూడదు అనే అలా నటించాము. అసలు మేము పుట్టింది పెరిగింది రాణిమండ్రీలో,” చెప్పాడు చిన్న గడ్డం.

“రాణిమండ్రిలో పుట్టారా! మీ పాసి గూల! ఐతే ఈ హైజాకింగులు అవీ ఎందుకు?” అడిగాడు లంబు.

“ఏం? హైజాకింగులు చేస్తే పీకిస్తాన్ ఉగ్రవాదులే చేయాలా? జంబూ ద్వీపానికి చెందిన అహ్మదీయులంటే అందరికి చిన్న చూపే! మేం చేయలేమా? యూ బ్లడీ! మా దగ్గరా గన్స్ ఉన్నాయి,” కోపంగా చెప్పాడు మధ్య గడ్డం.

“మీరు తనని పూర్తిగా అపార్థం చేసుకున్నారు. హైజాకింగ్ ఏ తలకు మాసిన వాడైనా చేయొచ్చు. కానీ రాణీమండ్రీలో పుట్టిన మీరు జంబూ ద్వీపపు ఎయిర్‌ప్లేన్ హైజాక్ చేయడం ఎందుకు అని వాడి సందేహం,” వినయంగా చెప్పాడు జంబు.

“ఓస్, మీకు అది కూడా అర్థం కాలేదా? షాక్మీరులో మా వాళ్ళని ఊచకోత కోస్తున్నారు అందుకే ఇది మా ప్రతీకార చర్య,” కోపంగా జవాబిచ్చాడు పెద్ద గడ్డం.

“అందుకే మా పార్టీ చెప్పింది, షాక్మీర్‌ని పీకిస్తాన్‌కి ఇచ్చేయండి బాబూ అని. వినిందా ఈ ప్రభుత్వం! ఇప్పుడు చూడండి, మన జీవితాలు ఎలా ప్రమాదంలో పడ్డాయో,” బాధగా అన్నాడు మన్‌మోహన్ దాస్. ఆయన ఒక ఎర్ర పార్టీకి చెందిన మేధావి.

“అంటే షాక్మీర్‌ని పీకిస్తాన్‌కి ఇచ్చేసి ఉంటే వీళ్ళు మన ప్లేన్‌ని హైజాక్ చేసి ఉండేవారు కాదని అంటారు. నిజమేనాండి?” గడ్డాలను ప్రశ్నించాడు 232.

“ఒక రోజు ఆలస్యంగా చేసేవాళ్ళం,” చెప్పాడు చిన్న గడ్డం.

“ఒక రోజు ఎందుకు?” కన్‌ఫ్యూజ్ అయ్యాడు 232.

“అంటే షాక్మీర్ వచ్చినందుకు సంబరాలు చేసుకుంటాం కద. తరువాత మాకు వేరే సమస్యలు గుర్తు వస్తాయి. వాటికి ప్రతీకారంగా రేపు హైజాక్ చేసేవాళ్ళం,” చెప్పాడు మధ్య గడ్డం.

“ఏం సమస్యలు?” అడిగాడు 232.

“అంటే ఉదాహరణకు, మా పవిత్ర మందిరాన్ని 1992లో కూలగొట్టారు కద. దానికి ప్రతీకారంగా,” జవాబు ఇచ్చాడు పెద్ద గడ్డం.

“అవును అది అహ్మదీయులకు మన సింధువులు చేసిన ఘొరమైన అపచారం. అందుకే వారంతా హోల్‌సేల్‌గా ఉగ్రవాదులయ్యారు,” ముక్కు చీదాడు, మన్‌మోహన్ దాస్.

“ఛీ మీరు నోరు మూయండి,” ఆయన్ను గదిమాడు 232. మళ్ళీ గడ్డాల వైపు తిరిగి, “ఒక వేళ మేమంతా మీ పవిత్ర మందిరాన్ని తిరిగి కట్టేసి, మీకు క్షమాపణలు చెప్పుకుని ఉంటే, అప్పుడు హైజాక్ చేసే వారు కాదా?” అని అడిగాడు.

“ఆశ దోశ, మటన్ కబాబ్! ఎందుకు చెయ్యం. ఐతే అప్పుడు 1947లో, పీకిస్తాన్‌కి పంపకాలు సరిగ్గా చేయలేదన్న బాధతో చేసే వాళ్ళం,” చెప్పాడు పెద్ద గడ్డం.

“మొత్తానికి ఏదో ఒక కారణానికి చేసేవారు, అంతేనా?”

“అంతే, అంతే, హైజాకులు చెయ్యడం మా జన్మ హక్కు. మా హక్కుని మా నుంచి ఎవరూ దూరం చేయలేరు. జిగాద్!” గట్టిగా అరిచాడు పెద్ద గడ్డం.

232 మన్‌మోహన్ దాస్ వైపు తిరిగి తాపీగా, “ఇప్పుడైన మీ మట్టి బుర్రకి అర్థం అయ్యిందనుకుంటాను. ఇక్కడ కారణాలు అన్నవి కేవలం సాకులు మాత్రమే. ఏవీ కారణాలు దొరక్క పోతే, వాళ్ళ ఇంట్లో వండిన కోడి పులావు రుచిగా తయారు కాలేదని కూడా వీళ్ళు మన ప్లేన్ హైజాక్ చేస్తారు.

అసలు కారణం ఇది!

అహ్మదీయ ఉగ్రవాదులకు, వారికి అన్ని రకాల సహాయం అందిస్తున్న పీకిస్తాన్‌కి, జంబూ ద్వీపం అంటే కసి, అసహ్యం. మతాన్ని ప్రాతిపదికగా చేసుకోకపోయినా, జంబూ ద్వీపం వారికంటే ఎంతో అభివృద్ధి చెందింది, చెందుతూనే ఉంది అన్న అసూయ. మనం నాశనమైనా సరే, పక్క వాడు బాగు పడకూడదు అనే తత్వం వీరందరిది. కాబట్టి, మీరు ఓ రెండు గంటలు షట్ అప్ అయిపోండి,” అన్నాడు.

“అన్న నువ్వు ఏం చెప్పినవో సమఝ్ కాలేదే, ఈ మత ప్రాతిపదిక ఏంది, పీకిస్తాన్‌కి మన మీద అసూయ ఏంది? జర క్లియర్‌గా చెప్ప రాదే!” రిక్వెస్ట్ చేశాడు యాదగిరి.

“చెప్తాను, యాదగిరి చెప్తాను! మీది ఉమ్మడి కుటుంబమమా?” అడిగాడు 232.

“అవు. మా నాయనా, ముగ్గురు బాబాయిలు అందరం ఒకే ఫ్యామిలీ అన్నట్టు.”

“అందులో ఎవరైన మీ ఫ్యామిలీ వదిలి వెళ్ళిపోయారా?”

“మా రెండో బాబాయి, తనకు ఏదో అన్యాయం జరిగింది అని బోయి వేరె కాపురం బెట్టిండు.”

“తరువాత ఏమయ్యింది?”

“కొన్ని రోజులు మంచిగనే ఉండె గాని, ఆ తరువాత కాక పరిస్థితి ఎక్ దం బర్‌బాద్ అయిపోయింది.”

“మరి తిరిగి వచ్చేశాడా?”

“లే. మా ఫ్యామిలీ అంటే పగ పెంచుకుండు. సందు దొరికితే ఏదో ఒక కిరికిరి పెడతడు.”

“ఎందుకలా?”

“ఏమున్నది? మేము కలిసి మంచిగా వున్నాం, ఆయన విడిపోయి బట్టెబాజ్ లెక్క అయ్యిండు. అందుకే మేమంటే అసూయ అనుకోరాదే!”

“అర్థమయ్యింది కద, మీ బాబాయే ఇక్కడ పీకిస్తాన్. ఇప్పుడు మన దేశంలో కిరి కిరి పెడుతున్నాడు.”

“ఏక్ దం సమఝ్ అయ్యింది,” అంటూ యాదగిరి మన్‌మోహన్ దాస్ నోట్లో ఓ రెండు పేపర్ న్యాప్‌కిన్స్ కుక్కాడు.

“ఈ తొక్కలో డిస్కషన్స్ ఆపండి. అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కదలకుండా కూర్చోండి,” హుంకరించాడు పెద్ద గడ్డం.

అందరూ ఎవరి సీట్లలో వారు సర్దుకున్నారు. 232 కూడా అవకాశం వచ్చినప్పుడు చూసుకోవచ్చు అని తను కూడా తన సీట్‌లో కూర్చున్నాడు.

“ఇక పదండి, పైలట్ల వద్దకి. పడండి చర చర. పదండి ముందుకు. పదండి తోసుకు పోదాం,” అంటూ కాక్‌పిట్ వైపు బయలు దేరాడు పెద్ద గడ్డం. మిగతా గడ్డాలు అతన్ని ఫాలో అయ్యారు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in గూఢచారి - 232, సీరియల్స్. Bookmark the permalink.

3 Responses to గూఢచారి 232 – హైజాక్ ఏల అన్న…

  1. Siva Kumar K says:

    మనం నాశనమైనా సరే, పక్క వాడు బాగు పడకూడదు అనే తత్వం వీరందరిది — well said…!!

    lol for the rest .. nice one as usual…!! 😀 😀 😀

  2. ఆశ దోశ, మటన్ కబాబ్!

    enduko ee pada prayogam chaala comdey gaa vundhi……..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s