అసలైన స్వాతంత్ర్య దినం!


1947లో తెల్ల వారిని ఐతే తరిమేశాం.
కానీ వారి సావాస దోషం పట్టిన
నల్ల దొరలను మాత్రం నెత్తికెత్తుకున్నాం.

ఒక పెద్ద మనిషిని దేవుడిలా భావించి,
అతను సిఫార్సు చేసిన దయ్యాన్ని గద్దెన కూర్చోపెట్టడం వల్ల,
కొందరు సమర్థుల ఆయువు అర్ధాంతరంగా తీరి పోవడం మూలాన,

చాలా రోజులు మన దేశంలో ఒకే వంశం రాజ్యం చేసింది.
కాదు, కాదు, ఎవరు చేయలేనంత అరాచకం చేసింది.
ఈ వేళ ఆ దరిద్రం చాల మటుకు తుడిచి పెట్టుకు పోయింది.

ఒక జాతీయ వాది మన ప్రధాన మంత్రిగా ఉన్న ఈ రోజు,
కాషాయం జెండా ఎర్ర కోటపై రెప రెపలాడుతున్న ఈ నాడు,
జరుపుకుందాం ఆనందంగా, అచ్చమైన, స్వచ్ఛమైన స్వాతంత్ర్య దినోత్సవం!

 

You can read the English version here.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

7 Responses to అసలైన స్వాతంత్ర్య దినం!

 1. Ramireddy says:

  మనది కాషాయం ఝండానా? మువ్వన్నెల ఝండానాండీ తేటగీతి గారూ?

  • Murali says:

   రామిరెడ్డి గారు:

   కాషాయం BJPకి సింబల్. My idea was to convey that for the first time, A true non-Congress government has formed at the center.

 2. hari.S.babu says:

  ఒక పెద్ద మనిషిని దేవుడిలా భావించి,
  అతను సిఫార్సు చేసిన దయ్యాన్ని గద్దెన కూర్చోపెట్టడం వల్ల,
  కొందరు సమర్థుల ఆయువు అర్ధాంతరంగా తీరి పోవడం మూలాన,
  >>
  ఒక దేశపు రాజకీయ చరిత్రకి ఇన్ని సమస్యల్ని అంటగట్టిన దేశాధినేత ప్రపంచ రాజకీయ చరిత్ర మొత్తం తిరగేసినా మరొక వ్యక్తి నాకెక్కడా కనబడ లేదు?!అపూర్వమూ అసదృశమూ అయిన కీర్తి అతనిది.

  తను వేలు పెట్టిన ప్రతి చోటా ఒక కుంపటిని రగిలించాడు! ఆ కుంపట్ల కన్నిటికీ సామాన్య లక్షనం యేమిటంటే అవి యెప్పటికి ఆరుతాయో కూడా యెవరూ చెప్పలేరు!అంత ఘొప్పవాణ్ణి 18 యేళ్ళు మోసారు మన వెనకటి తరం వాళ్ళు?!

  • Murali says:

   మరే! బుడుగు భాషలో చెప్పాలంటే ఇంత పెద్ద దేశాన్ని నడ్డి మీద చంపేశాడు, పోరంబోకు రాస్కిల్!

 3. శతృశేషం, ఋణశేషం ఉండకూడదన్నది ఆప్తవాక్యం. శతృవులు చేసిన ఋణం తీర్చటంతోపాటు విదేశీ శక్తులను సమూలముగా, సబాంధవంగా ఖండభారతమునుండి పారద్రోలినప్పుడే మనకు సురాజ్యమైన స్వరాజ్యం వచ్చినట్లు. మనజాతీయ పతాకము హస్తినలో వినువీధిన సగర్వముగా స్వజాతీయ భావనతో ఎగురుతున్నప్పుడు ప్రసార మాధ్యమముల ప్రత్యక్షప్రసారములో, జాతీయవాదుల హర్షాతిరేకములు కరతాళధ్వనుల రూపమున దిక్కులు పిక్కటిల్లగా, ఒక స్ఫూర్తి, సమర్ధత, నాయకత్వపటిమ, జాతీయత, పట్టుదల, క్రియాశిలత్వము మూర్తీభవించిన ఒక విరాట్ రూపము చేసే ప్రసంగమును కనులారగాంచి, వీనులవిందుగా విని, పులకాంకితమౌతున్న సమయములో కొన్ని అవనత శిరస్సులు కూడ కనుపించిన వేళ దేశభక్తులు కాంక్షించిన ఆ సంపూర్ణ స్వతంత్రభారతావని ఆవిష్కారం అనతికాలములోనే జరుగుతున్నదన్న భావన కలిగింది.
  సందర్భశుద్ధిగా మీరు వెలిబుచ్చిన ఆకాంక్షలకు ‘ తధాస్తు ‘.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s