బెంగారక గ్రహ యానం (300వ టపా)

సురేంద్ర మోడీ జంబూ ద్వీపానికి ప్రధాన మంత్రి అయ్యాక ఆయన అభిమానుల కంటే వ్యతిరేకులే ఆయన పరిపాలనని కళ్ళు పత్తికాయల్లా చేసుకుని పరిశీలించ సాగారు. దానికి బలమైన కారణం ఉంది. ఇన్ని రోజులూ ఈ మేధావులంతా, మోడీ కనక అధికారంలోకి వస్తే దేశం అట్టుడికి పోతుందని, మత కలహాలు చెలరేగుతాయని, రక్తం వరదలై పారుతుందని గొంతు చించుకుని అరిచారు. ఒక వేళ అలా జరగకపోతే అసలే అంతంత మాత్రంగా ఉన్న తమ పరువు పూర్తిగా భ్రష్టు పడుతుందని వారి భయం.

కాబట్టి వారంతా, మోడీ ఏదన్నా తప్పటడుగు వేస్తే చీల్చి చెండాడుదామని తయారుగా ఉన్నారు. ఏమీ లేక పోతే కానీసం ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగినా సరే, దాన్ని మోడీ మీదకు తోసేసి నానా హంగామా చేయాలని నిశ్చయించుకున్నారు.

ఐతే వారి దురదృష్ట వశాత్తు అలా ఏం జరగలేదు. పైగా, పులి మీద పుట్రలా గాంక్రెస్ ప్రభుత్వం కాలంలో మొదలైన బెంగారక గ్రహ యాత్ర సఫలవంతం అయ్యింది. హిండియా పంపించిన శాటిలైట్ బెంగారక గ్రహం కక్ష్యని సురక్షితంగా చేరుకుంది. మన వెర్రి గొర్రెల్లాంటి ప్రజలు ( కోప్పడకండి, గొర్రెలని అవమానించడం నా ఉద్దేశం కాదు), ఈ విజయాన్ని కూడా సురేంద్ర మోడీ ఖాతలోకే వేసేశారు.

గాంక్రెస్ పార్టీకి ఒళ్ళు మండి పోయింది. “యూ బ్లడీ, మన విజయం వాళ్ళు సొంతం చేసుకోవడమేంటి? అసలు మన పార్టీ ఇలాంటి నీచమైన పనులు ఎప్పుడన్నా చేసిందా?” హుంకరించింది వెర్రమ్మ.

(ఇక్కడ పాఠకులకు, కొంత బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వాలి. ఒకప్పుడు ఈవిడనే ఢిల్లీ అమ్మ అని పిలిచేవారు. కాని ఎప్పుడైతే ఆమె తను చేసిన తిక్క చేష్టల వల్ల, గంగి గోవుల్లాంటి జంబూ ద్వీప ప్రజలకి కూడా కోపం తెప్పించి ఓడిపోయిందో, అప్పటి నుంచి అందరూ ఆమెని వెర్రమ్మ అని, వాళ్ళ అబ్బాయి సాహుల్ గాంధిని జోకర్ గాంధి అని పిలవడం మొదలు పెట్టారు. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని మన్నించి మనం కూడా వాళ్ళని అలాగే పిలుద్దాం.)

సమాధానం చెప్పడానికి గొంతు సవరించుకున్నాడు పీ. ఏకాంబరం. నిజానికి ఆయన “ఎందుకు లాక్కో లేదమ్మా? అసలు మీరు గానీ, మన పార్టీ గానీ ఎవరినైనా, ఏదైనా వదిలారా? మహాత్ముడి పార్టీని మన జాగీరుగా మార్చేసాం. ఆయన ఇంటి పేరుని కబ్జా చేశాం. హెన్రూ గారు తప్ప అసలు స్వాంతంత్ర్య పోరాటంలో ఎవరూ పాల్గొనలేదన్నట్టు పాఠ్య పుస్తకాలు తిరగ రాయించాం. మరుగు దొడ్లను కూడా వదలకుండా మన వంశస్తుల పేర్లే పెట్టుకున్నాం. ఆఖరికి 2004లో జే.బీ.పీ మనకు మిగిల్చిన సర్‌ప్లస్ బడ్జెట్ అంతా మీ దిక్కు మాలిన పథకాలకు దోచి పెట్టాం,” అని చెప్పాలి.

కానీ ఆయన అలా చెప్పలేదు. ఆయనే కాదు, గాంక్రెస్‌లో ఎవరూ కూడా అలాంటి నిజాలు చెప్పరు.

“మీ అంత ఉదార హృదయం ఎవరికి ఉంటుందమ్మా! ఆ సురేంద్ర మోడీ గాడు సైంటిస్ట్స్ అందరితో కలిసి ఫోటోలు దిగుతూంటే నా కడుపు తరుక్కు పోయింది. దీనికి నిరసనగా ఒక ప్రజా ఉద్యమం చేపడుదామా?” వినయంగా అడిగాడు.

“మీ ఐడియా బాగానే ఉంది ఏకాంబరం గారు. కానీ ప్రజల్ని ఎక్కడనుండి తెస్తారు. మా ఆయనే ఉంటే బార్బర్ ఎందుకన్నట్టు, అంత మంది మన వెనక ఉంటే ఇంకాసిన్ని సీట్లే గెలిచే వాళ్ళం కద. లాభం లేదు, నేనే మోడీతో డైరెక్టుగా మాట్లాడి దీన్ని ఖండిస్తాను.” సాలోచనగా అంది వెర్రమ్మ.

“చిత్తం, ఇప్పుడే ఆయన నంబర్ కలుపుతున్నా,” అంటూ మోడీకి ఫోన్ చేసి వెర్రమ్మ చేతికి ఇచ్చాడు పీ. ఏకాంబరం.

అటు మోడీ, వెర్రమ్మ గొంతు విని చాలా ఆనందించాడు. “మీరే నాకు స్వయంగా ఫోన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పదండి మనందరం కలిసి కట్టుగా హిండియాని ముందుకు తీసుకెళ్దాం,” అన్నాడు మోడీ.

“అబ్బో భలే చెప్పారండీ! మీరు ముందు పూలదండలు వేయించుకుంటూ వెళ్తూంటే మేము వెనకాల కుంటుకుంటూ రావాలా? నేను ఫోన్ చేసింది దాని కోసం కాదు. బెంగారక గ్రహ యాత్ర క్రెడిట్ అంతా మీరు కొట్టేయడం గురించే నా బాధ. ఆ విజయం మా ఖాతాలోకి రావాలి,” అంది వెర్రమ్మ.

కాసేపు మౌనంగా ఉండిపోయాడు మోడీ, “మీరు చెప్పింది కూడా సబబుగానే ఉంది. మీకు తప్పక న్యాయం చేస్తాను,” హామీ ఇచ్చాడు మోడీ.

********************************************************************

మరుసటి రోజే మోడీ అనౌన్స్ చేశాడు. “బెంగారక గ్రహాయానం విజయవంతమైన సందర్భాన, ఇప్పుడు ఏకంగా దంచమామ మీద మన హిండియన్స్ అడుగు పెట్టేలా చేయడమే మా తరువాతి ధ్యేయం.”

“దంచమామ మీదకి అడుగుపెట్టబోయే ఆ అదృష్టవంతులైన హిండియన్స్ ఎవరు?” గోల గోలగా ప్రశ్నించారు విలేఖరులు.

“ఇంకెవరు! అసలు పుట్టినప్పటినుండీ త్యాగాలు చేయడంలో బిజీగా ఉన్న గాంధీ వంశమే దీనికి అర్హత కలిగింది. వెర్రమ్మని, జోకర్ గాంధీని, ఆయన అక్కయ్య ప్రియాంకా వడా పావుని ఈ యాత్ర మీద పంపిస్తాం. వారికి తగినంత ట్రైనింగ్ ఇచ్చాకే ఈ యాత్ర మొదలవుతుంది,” గంభీరంగా సెలవిచ్చాడు మోడీ. అందరూ చప్పట్లు కొట్టారు.

ఈ వార్త దేశమంతా దావానలంలా వ్యాపించింది. తమకు దక్కిన ఈ అరుదైన గౌరవానికి వెర్రమ్మ, జోకర్ గాంధీలు పొంగిపోయారు. కానీ ప్రియాంక మాత్రం వాళ్ళాయన రాబర్ట్ వడా పావుని కూడా పంపించాలని పట్టు పట్టింది.

ఈ లోపల దేశంలో ఉన్న మేధావులు అంతా మోడీకి అర్జీ పెట్టుకున్నారు. “మీరు చేసిన పాపాలు కడుక్కోవాలంటే ఇదే మంచి అవకాశం. మా అందరిని కూడా అదే వ్యోమ నౌకలో పంపించండి. మేమంతా దంచమామ మీదకి వెళ్ళి అక్కడ ముందు మా సెక్యూలరిస్ట్ పాదాలు మోపి ఆ గ్రహాన్ని పవిత్రం చేస్తాము,” అని. ముఖ్యంగా అధోగతి రాయ్ మరీ ముచ్చట పడింది.

ఇంకో వైపు ఇతర రాజకీయ నాయకులు కూడా దంచమామ మీదకి వెళ్ళాలన్న ప్రగాఢమైన కోరికను వెలిబుచ్చారు. ముభావం సింగ్ యాదవ్ ఐతే పార్లమెంటులో పిల్లి మొగ్గలు కూడా వేశాడు.

మోడీ అందరికీ సరే అన్నాడు. కానీ సైంటిస్టులు అభ్యంతరం చెప్పారు. “ఎలా కుదురుతుందండి, ఏదో ఒక ఎనిమిదో పదో ఐతే కష్టపడి చేయొచ్చు. వీళ్ళంతా కలిపి ఓ వందమంది ఉంటారు. ఇసుక లారీ కూడా సరిపోదు,” అన్నారు.

“ఖర్చు గురించి మీరు భయపడకండి. ఈ యాత్ర హిండియా దశని, దిశని కూడా మార్చేస్తుంది. అతి త్వరగా ఒక వంద మంది పట్టే వ్యోమ నౌకని తయారు చేయండి. టైం లేదు. పైగా అందరికి అంతరిక్షంలో ఉండగలిగే ట్రెయినింగ్ కూడా ఇప్పించాలి,” అన్నాడు మోడీ.

********************************************************************

మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. ఇప్పటి దాక ఎవరు తయారు చేయని అతి పెద్ద వ్యోమ నౌకని హిండియా సైంటిస్టులు తయారు చేశారు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో. దంచమామ మీదకి వెళ్ళే వారి ట్రైనింగ్ కూడా ముగిసింది.

వ్యోమ నౌకని లాంచ్ చేసే రోజు మొత్తం ప్రెస్ అంతా అక్కడ చేరుకుంది. దంచమామ మీదకి వెళ్తున్న వెర్రమ్మని, జోకర్ గాంధీని, ప్రియాంకా మరియు రాబర్ట్ వడా పావులని అప్యాయంగా పలకరించాడు మోడీ. ముభావం సింగ్ యాదవ్‌ని ఆలింగనం చేసుకున్నాడు. అధోగతి రాయ్‌కి నమస్కారం చేశాడు.

అత్యంత కోలాహలం మధ్యన వ్యోమ నౌక బ్లాస్ట్ ఆఫ్ చేసి దంచమామ వైపు బయలు దేరింది.

ఆ తరువాత ప్రెస్‌తో ఇష్టాగోష్టి జరుపుతూ, “ఈ రోజు జంబూ ద్వీప చరిత్రలో పర్వ దినం,” అన్నాడు మోడీ.

“అది సరే, ఇంత డబ్బు ఎలా సమాకూర్చగలిగారు?” అడిగారు విలేఖరులు.

“దేశ విదేశాల్లో ఉన్న హిండియన్స్ అంతా విరాళాలు దండిగా ఇచ్చారు. మన సైన్యంలో అందరూ ఆరు నెలలు జీతం తీసుకోలేదు. ఎంతో మంది త్యాగ ఫలితమే ఈ దంచమామ యాత్ర,” చెప్పాడు మోడీ.

“బాగుంది. ఈ యాత్రకి సంబంధించిన ఏర్పాట్లపై మీకేదన్నా అసంతృప్తి ఉందా?” అడిగారు జర్నలిస్టులు.

“ఒకే ఒక అసంతృప్తి. ఇన్ని నిధులు సేకరించినా డబ్బులు సరి పోక, మన వ్యోమ నౌక తిరుగు ప్రయాణానికి కావల్సిన ఫ్యూయెల్ సమకూర్చలేక పోయాం!” బాధ పడుతూ అన్నాడు మోడీ.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

11 Responses to బెంగారక గ్రహ యానం (300వ టపా)

 1. హహహహ 🙂 ఈ ఐడియా ఏదో బాగుందండీ.

 2. Jitu says:

  LOLOLOL…

  If only this were to happen in real life…

 3. Naresh says:

  Wish such a day truly comes

 4. aksastry says:

  Wonderful………….as usual. Congrats.

 5. Siva Kumar K says:

  ROFLOL as usual 😉 😛 😀

  దంచమామేఎందుకు?? వాళ్ళ తాలూకా నిశ గ్రహానికి ఎందుకు పంపలేదు..

  సురేంద్ర గారు నాదగ్గర చందా తీసుకుంటూ నా చెవిలో సీక్రెట్ రగస్యంగా ఇంధనం సగమే ఫిల్ చేపిస్తా అని మాటిచ్చి ఎందుకు తప్పారు..?? (వ్యోమనౌక వెళ్ళేదానికి సరిపడే దాంట్లో సగం ఇంధనం) ;):)

  • Murali says:

   నిశ గ్రహం అంటే అంత మంది వచ్చేవారు కాదేమో? ఇంకా ఎవరూ వెళ్ళలేదు కద? మన వాళ్ళు రిస్క్ చేయకపోవచ్చు. దంచమామ ఐతే సేఫ్ అనుకుంటారు, మిగతా దేశస్తులు వెళ్ళారు కాబట్టి.

   వాళ్ళు కానీసం దంచమామ మీద ల్యాండ్ ఐతే, మన వాళ్ళు లారీల కొద్ది అక్కడ దిగారన్న కీర్తి వస్తుంది. ఫోటోలు ఉంటాయి. అందుకే మన మోడీ గారు అక్కడి వరకు వెళ్ళేంత ఫ్యూయెల్ ఉంచారు. 🙂

   • youknowwho says:

    Murali garu, really enjoyet laughing a lot after a long, long time. this q & ans remints me of wikram-bethal stories, where the story is followet by thought prowoking questions from bethal. He’s as kool as wikram. 🙂

    siwa kumar garu, I wish you ask more questions like this. :-))
    great q & exkellent, kreatiwe answer, awesome.
    sorry, some keys got messet up in my komp.refraining from typing anything, but I just wasn’t able to stop myself. Hope it’s funny to reat. :-))

 6. karthik says:

  super as usual..

  ఇవన్నీ సరేగానీ మా ఏజెంట్ 232 పరిస్థితి ఏమిటి? ఆ కథను కూడా కొంచెం ప్రియారిటీ ఇవ్వండి మురళిగారూ..

  • Murali says:

   232 త్వరలో మీ ముందుకి వస్తాడు. 300వ టపాలో మన దేశాన్ని ప్రక్షాళనం చేద్దామని టెంప్ట్ అయి ఇది ముందు రాశాను. 🙂

 7. hari.S.babu says:

  అప్పుడు గుణ్ణంరాజు గారు దంచమామ మీద వెర్రామృతం – అనే ఒక సీరియల్ కూడా లాగిస్తారు!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s