ఈ రివర్స్‌లో ఫైరింగ్ ఏంటి ఓలప్పా?


స్థలం: పీకిస్తాన్ మిలటరీ హెడ్ క్వార్టర్స్
సమయం: కొన్ని రోజుల కిందట

పీకిస్తాన్ సైన్యపు చీఫ్ అఫ్ స్టాఫ్ హరీల్ రషీఫ్ తన ముందు నిలుచుని ఉన్న జనరల్‌ని చూసి అడిగాడు, “మన ప్రియమైన పొరుగు దేశం హిండియా ఎలా ఉంది?”

జనరల్ చెప్పాడు, “ఏముంది, ఎప్పటిలానే ఐదేళ్ళకి ఒక సారి ఎన్నికలు అయ్యాయి. ఈ సారి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సురేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు.”

“అతను సింధుత్వ వాది అనుకుంటా? మనకేమన్న కష్టమవుతుందంటావా?”

“ఏం కాదు. అతను పీ.ఎం. కాగానే మన ఫ్రెండ్స్, హిండియాలోని సెక్యూలరిస్టులు ఆయన్ని తూర్పారబట్టడం మొదలు పెట్టరు. రిగీష్ కర్నాడ్, అంతంత మూర్తీ, అదోగతి రాయ్, హమేషా భట్ మొదలైన వారు సమావేశాలు పెట్టి మరీ, మోడీ పాలనలో హిండియా భ్రష్టు పట్టి పోతుందని, త్వరలో జల ప్రళయం కూడా వస్తుందని గొంతు చించుకుని మరీ అరుస్తున్నారు.”

“గుడ్, వెరీ గుడ్. మన నిజమైన స్నేహితులు వాళ్ళే. ఎంత చేసినా వారి రుణం మనం తీర్చుకోలేం. ఎనీ వే, మన కార్యక్రమాలు నిరాటంకంగా సాగించవచ్చు అంటావు, అంతేనా?”

“అంతే. హిండియాలో అహ్మదీయులు కోట్ల సంఖ్యలో ఉన్నంతవరకు, వారు కానీ, వారి మత గురువులు కానీ, పీకిస్తాన్‌ని నోరెత్తి ఖండించనంత వరకు మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఆ వోట్లని దృష్టిలో పెట్టుకుని మోడీ కూడా మనతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే!”

“భేష్! ఐతే ఎప్పటిలానే షాక్మీర్ గురించి చర్చలకోసం ఒక బృందాన్ని పంపించండి. వాళ్ళు వెళ్ళగానే మన సైన్యాన్ని బార్డర్‌కి అటు వేపు కాల్పులు జరపమనండి. ఆ సందు చూసుకుని మన ఉగ్రవాదులు హిండియాలోకి చొరబడతారు. అసలే ఈ మధ్య షాక్మీర్ ప్రశాంతంగా ఉంది.”

“అలాగే సార్!”

***********************************************************************

రషీఫ్ చెప్పినట్టుగానే పీకిస్తాన్ నుంచి శాంతి బృందం హిండియా చేరుకుంది. మోడీ వారిని స్వయంగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా వారికి అప్యాయంగా గరం గరం చాయి కూడా స్వహస్తాలతో సర్వ్ చేశాడు.

“వీడు కూడా తిక్కలోడే. అచ్చం హిండియాలోని మేధావుల్లా ప్రవర్తిస్తున్నాడు. ఈ చాయి తాగేసి స్నేహ హస్తం అందించే రకాలా మనం! కి కి కి,” నవ్వుకున్నారు తమలో తాము పీకిస్తాన్ నుంచి వచ్చిన శాంతి బృందం.

శాంతి చర్చలు మొదలయ్యాయి. మరుసటి రోజు నుంచే పీకిస్తాన్ సైన్యం బార్డర్ మీదుగా షెల్లింగ్ మొదలు పెట్టింది. హిండియా సరిహద్దు లోని ప్రజలు వేలకొద్ది తమ గ్రామాలు విడిచి పరుగులు తీశారు.

హిండియా అట్టుడికి పోయింది. “పీకిస్తాన్ మన మీద దాడులు చేస్తూంటే మోడీ ఏం చేస్తున్నాడు? దేశ రక్షణే పట్టించుకోని ప్రధాని జనాల సంక్షేమం ఏం పట్టించుకుంటాడు?” అంటూ గాంక్రెస్ నాయకులు, మేధావులు, ఎర్ర పార్టీ సభ్యులు అందరూ చెలరేగి పోయారు.

హిండియా సైన్యాధికారులతో సమావేశం అయ్యాడు మోడీ. సైన్యాధికారులు నీరసంగా మొహం పెట్టుకు కూర్చున్నారు. ఛాథూ హెన్రూ నుంచి అందరు ప్రధానులు వారికి చెప్పింది ఒక్కటే. “మనం సంయమనం పాటించాలి. లేకపోతే అంతార్జాతీయంగా మన ప్రతిష్ట దెబ్బ తింటుంది. షెల్లింగ్ చేసి చేసి వాళ్ళే ఆపేస్తారు,” అని.

వారనుకున్నట్టుగానే మోడీ కూడా, “ఇరుగు పొరుగు దేశాలు శాంతియుతంగా ఉండాలి,” అంటూ మొదలు పెట్టాడు. సైన్యాధికారులు ఉసూరుమన్నారు.

“ఐతే మన మీద ముందుగా వాళ్ళే దాడి చేసారు కాబట్టి, తిప్పి కొట్టడం మన కర్తవ్యం. ఈ యుద్ధం గురించి నాకు పెద్దగా తెలీదు. మీకు సర్వాధికారాలు ఇస్తున్నా. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి,” చెప్పాడు మోడీ.

సైన్యాధికారుల మొహాలు గప్పున వెలిగాయి.

***********************************************************************

ఆ తరువాత హిండియా సైనికులు పీకిస్తాన్ సైన్యాన్ని ఒక మోత మోసేశారు. తిరిగి పదింతలు షెల్లింగ్ చేసి జవాబు చెప్పారు. పీకిస్తాన్‌లోని బార్డర్ పోస్టులు ధ్వంసం చేసారు. పీకిస్తాన్ గ్రామస్తులు పదింతల స్పీడ్‌తో పరుగులు తీశారు.

“ఓరి నాయనో! ఈ తిరుగు దాడి ఏంటి? గంగి గోవుల్లా ఉండే హిండియన్స్‌కి ఏమయ్యింది? ఇంతకు ముందు ఎప్పుడన్నా తిరిగి ఫైరింగ్ చేసినా మర్యాదగా చేసే వారు. ఈ దూకుడు ఏంటి?” పరిస్థితిని పర్యవేక్షించడానికి వచ్చి, ఒక అండర్‌గ్రౌండ్ బంకర్‌లో తల దాచుకున్న రషీఫ్, వాపోయాడు.

హిండియా దెబ్బకి తిరిగి పారిపోయి వచ్చిన (అంటే బతికున్న వాళ్ళు లెండి) ఉగ్రవాదులు బాధగా మూలిగారు.

“ఏం చేద్దామంటారు?” అడిగాడు రషీఫ్‌కి హిండియా ఏం మారలేదని నమ్మబలికిన జనరల్.

“ముందు మన వైపు నుంచి కాల్పులు తగ్గించండి. తరువాత మన ప్రెస్‌ని ఈ చాయలకి రానివ్వకండి. ఈ దారుణం చూస్తే వాళ్ళు తట్టుకోలేరు,” ఆర్డర్స్ పాస్ చేశాడు రషీఫ్.

పీకిస్తాన్ ఫైరింగ్ కాస్త తగ్గించినా హిండియా ఆపలేదు. విరగదీస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పీకిస్తాన్ ఎప్పుడూ ఏం చేస్తుందో ఈ సారీ అదే చేసింది. అనైక్య రాజ్య సమితి దగ్గరికి పరిగెత్తి సహాయం చేయమని అర్థించింది.

“ఏం అన్యాయం జరిగింది పాపం మీకు?” పీకిస్తాన్‌ని ప్రశ్నించింది అనైక్య రాజ్య సమితి.

“ఇంకా ఏం జరగాలండి. ఇంతకు ముందు మేము ఇలా షెల్లింగ్ చేసి బాంబులు వేస్తే, హిండియా కిక్కురుమనేది కాదు. జగన్‌మోహన్ సింగ్ గారు, ఈ దుష్చర్యకి సరైన బదులు ఇస్తాం, అని అరిచి, మళ్ళీ నిద్ర పోయే వారు. అదే నమ్మకంతో ఈ సారి షెల్లింగ్ మొదలు పెడితే, ఇలా రివర్స్‌లో ఫైరింగ్ ఏంటి? అన్యాయం! తొండి!” భోరుమంది పీకిస్తాన్.

అదే సమయంలో పీకిస్తాన్ ప్రాణ మిత్రులైన హిండియాలోని మేధావులు కొత్త పల్లవి మొదలు పెట్టారు. “అయ్యయ్యో, హిండియా సైన్యం చేస్తున్న అకృత్యాల వల్ల, పీకిస్తాన్‌లోని అమాయకులు ఎంతో మంది చనిపోతున్నారు. ఇలాంటి సమస్యలు కేవలం చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి,” అంటూ కనీరు మున్నీరుగా విలపించారు.

ఈ చోద్యాన్ని అంతవరకు చూస్తున్న ఊసరవెల్లులు, సిగ్గు పడి, తల దించుకుని, మళ్ళీ పరిసరాల్లో కలిసిపోయాయి.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

6 Responses to ఈ రివర్స్‌లో ఫైరింగ్ ఏంటి ఓలప్పా?

 1. nmraobandi says:

  hindus …

  they also lived …

 2. Siva Kumar K says:

  పీకిస్తాన్ ప్రాణ మిత్రులైన హిండియాలోని మేధావులు కొత్త పల్లవి
  ఈ చోద్యాన్ని అంతవరకు చూస్తున్న ఊసరవెల్లులు, సిగ్గు పడి, తల దించుకుని, మళ్ళీ పరిసరాల్లో కలిసిపోయాయి. —Perfect..!!

 3. karthik says:

  జగన్ మోహన్ సింగ్ గారు నిద్రపొయ్యే వాడు కాదు మహాశయా.. ఆయన “ఇలాంటి దాడులతో మమ్మల్ని మోకాళ్ళ మీద నిలబెట్టలేరు” అని స్టేట్మెంట్ ఇచ్చి 420 జనపథ్ కు వెళ్ళి గోడకుర్చీ వేసేవాడు.

  • Murali says:

   నిజమే! అంత ముఖ్యమైన స్టేట్‌మెంట్ ఎలా మర్చిపోయానబ్బా! Anyway, I am happy he is no longer around to make such moronic statements.

 4. క్లోజింగ్ లైన్స్ సూపర్ అండీ…

 5. hari.S.babu says:

  420 జనపథ్
  8=?)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s