గూఢచారి 232 – ఇవే మా షరతులు

(

జరిగిన కథ:

జంబూ ద్వీపపు గూడచారుల్లో అత్యంత సమర్థవంతుడైన 232ని, ఆదరా బాదరాలో పాంచ్ మీనార్ దగ్గర పాతుకుపోయిన పీకిస్తాన్ ముఠా సంగతి కనుక్కోమని పురమాయిస్తాడు, ఛీ.బీ.ఐ. డైరెక్టర్ శాతకర్ణి. స్పెషల్ ఎఫెక్ట్స్ డివిజన్ చీఫ్ ఆధునిక రావు దగ్గర నుంచి రక రకాల వింతైన గ్యాడ్జెట్స్ తీసుకుని, గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి, ఎయిర్ హిండియా ద్వారా, ఆదరా బాదరాకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకుంటాడు 232.

తీరా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక, ఫ్లైటు ఒక్క రోజు ఆలస్యం కావడంతో, మిగతా ప్రయాణీకులతో పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే కబడ్డీ ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తాడు 232. ఎట్టకేలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి సిద్ధం అవుతుంది. అందరు ప్రయాణీకులతో పాటు తను కూడా ఫ్లైట్ బోర్డ్ చేస్తాడు 232.

ఐతే ఈ ప్రయాణీకుల్లో ముగ్గురు బవిగి గడ్డాలు ఉన్న వ్యక్తులని గమనించి, వారి మీద ఒక కన్నేద్దామని నిశ్చయించుకుంటాడు.

232 అనుమానించినట్టే, ఫ్లైట్ టేక్-ఆఫ్ కాగానే ఆ ముగ్గురు ప్లేన్‌ని హైజాక్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు. ఆశ్చర్యంగా వారు ముగ్గురూ రాణిమండ్రిలో పుట్టిన తెగులు వారే. హిండియా ఎలాంటి కాంప్రమైజ్‌కి తయారుగా ఉన్నా, తాము హైజాక్ చేయడం మాని ఉండే వారం కాదని, ఒక కారణం కాకపోతే ఇంకొక కారణం సృష్టించుకుని అయినా హైజాక్ చేసి తీరే వారమని చెప్తూ, పైలట్లు ఉన్న కాక్‌పిట్ వైపు బయలుదేరుతారు గడ్డాలు.
కాక్‌పిట్ చేరుకున్నాక అక్కడ పైలట్ల పని తీరు చూసి కోపగించుకుంటారు. ఆ తరువాత తమ షరతులు తెలియజేయడం కోసం కంట్రోల్ టవర్‌కి కనెక్ట్ చేయమంటారు.

ఇక చదవండి.

)

“హలో! కంట్రోల్ టవర్. ఏంటయ్యా అప్పుడే ఆదరా బాదరా వచ్చేశారా?” బద్ధకంగా అటు వైపు నుండి వినిపించింది ఒక గొంతు.

“లేదు సార్, ఇంకా రాలేదు. మధ్యలోనే ఉన్నాం.”

“మరి ముందుగానే ఎందుకు చేశారు? ఇంకా నయం, ఆ శివకోటి ఎత్తలేదు. వాడైతే బండ బూతులు తిట్టుండే వాడు మిమ్మల్ని.”

“అంతా మా అదృష్టం రామకోటి గారు. అందుకే మీరు దొరికారు. ఇంతకి మేం ఎందుకు కాల్ చేశామంటే…”

“ఉండండి, ఇప్పుడే వస్తా.”

ఒక 10 నిమిషాలు గడిచాయి. ఉగ్రవాదులు అసహనంతో ఊగిపోయారు.

“ఈయనెవరు, ఇప్పుడే వస్తాను అని ఇంత సేపు వెళ్ళాడు?” విసుగ్గా అడిగాడు పెద్ద గడ్డం.

“ఏ సమోసాలు తెచ్చుకోవడం కోసమో వెళ్ళుంటాడు సార్. కంట్రోల్ టవర్ నుంచి క్యాంటీన్ కాస్త దూరం. అందుకని…” సర్ది చెప్పాడు పెద్ద పైలట్.

లైన్ మళ్ళీ జీవం పోసుకుంది.

“ఆ చెప్పండి. ఇందాక ఏదో చెప్తున్నారు?” వినిపించింది రామకోటి గొంతు.

“అదే సార్ మా ఫ్లైట్…”

“సారీ, అలా మధ్యలో వెళ్ళినందుకు. కాస్త సమోసాలు తెచ్చుకుందామని మన క్యాంటిన్‌కి వెళ్ళాను. నీకు తెలుసు కద మన క్యాంటిన్ ఇక్కడి నుంచి దూరం అని. లేట్ అయ్యింది.”

“ఫర్లేదు సార్. మా ఫ్లైటూ…”

“అరే. టీ తెచ్చుకొవడం మర్చిపోయాను. ఉండండి ఇప్పుదే వస్తాను.”

మధ్య గడ్డం, చిన్న గడ్డం తమ తమ గడ్డాలు పీక్కున్నారు బాధతో.

“ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు వెయిట్ చేయాలా?” బాధగా అడిగాడు పెద్ద గడ్డం.

“అంతే కద సార్! టీకి కూడా క్యాంటిన్‌కే వెళ్ళాలి. అసలే క్యాంటిన్…”

“పది నిమిషాలైనా పడుతుంది, మాకు తెలుసు కద. @**$$^^^$%”

మళ్ళీ లైన్‌లోకి వచ్చాడు రామకోటి.

“సారీనయ్యా, ఏంటో, నాకు టీ తాగకుండా సమోసాలు తింటే అజీర్తి చేస్తుంది. ఇంతకి ఏదో చెప్తున్నావు.”

“మా ఫ్లైట్ హైజాక్ చేశారు సార్!”

కాసేపు నిశ్శబ్దం.

“నిజమా, అదీ మన ఎయిర్ హిండియా ఫ్లైటుని. ఎందుకబ్బా?”

పెద్ద గడ్డం మైక్ తీసుకున్నడు. “నేను హైజాకర్ల నాయకుడిని మాట్లాడుతున్నాను. మా షరతులు ఒప్పుకుంటేనే మీరు మీ ప్లేన్‌ని, ప్రయాణీకులని క్షేమంగా చూడగలుగుతారు. లేకపోతే అంతా కాలి బూడిదవుతారు.”

“అదేంటి? అందరితో పాటూ మీరూ అవుతారుగా?” రామకోటి గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది.

“అహ్హహ్హ, అలాంటి భయాలు మీలాంటి వాళ్ళకు. మాకు బతికినా బెటరే. చచ్చినా బెటరే. ఇలాంటి పవిత్ర కార్యంలో చస్తే మాకోసం మందల మందల అప్సరసలు స్వర్గంలో వెయిట్ చేస్తూ ఉంటారు.”

“మందలు మందలా? ఇదేదో బాగానే ఉందే. గ్యారంటీగా దొరుకుతారు అంటే నేను కూడా సిద్ధమే. మరి గ్యారంటీ ఉందా?”

“ఒకే ఒక మార్గం. నువ్వు కూడా జిగాద్‌లో ప్రాణ త్యాగం చెయడమే!”

“ఒక వేళ చేశాక స్వర్గానికి పోకపోతే? నిజంగానే చచ్చిపోతే?”

“చచ్చాక ఏం జరుగుతోందో నీకు తెలీదు కద? ఇంకెందుకు భయం?”

ఈ లాజిక్‌కి రామకోటి కూడా సైలెంట్ అయిపోయాడు.

“ఇంతకీ మీ డిమాండ్స్ ఏంటి?” అడిగాడు మెల్లగా.

“షాక్మీర్ జైళ్ళలో ఉన్న మా ఉగ్రవాదుల్నందరిని విడుదల చేయాలి. పైగా వాళ్ళకు చౌరస్తాలో విగ్రహాలు కట్టివ్వాలి.”

“వామ్మో, అందరినీనా? చాల మంది ఉంటారేమో?”

“అదంతా మాకు అనవసరం. మీకు గంట టైం ఇస్తున్నాం. తేల్చుకోండి.”

“సార్. నేను జస్ట్ కంట్రోల్ టవర్‌లో పని చేసే ఉద్యోగిని. ఇది నా పై ఆఫీసర్‌కి చెప్పాలి. ఆయన హోం మినిస్టర్ పీ.యే.తో మాట్లాడాలి. హోం మినిస్టర్ గారు ప్రైం మినిస్టర్‌తో మాట్లాడాలి. వీటన్నిటికి చాల టైం పడుతుంది. ఒక రెండు గంటలు ఇవ్వండి. కనీసం హోం మినిస్టర్ వరకు విషయాన్ని చేరుస్తాను. ఇంతలో ప్యాసెంజర్ లిస్ట్ చెక్ చేస్తాను,” బతిమాలుకున్నాడు రామకోటి.

“ప్యాసెంజర్ లిస్టా? అదెందుకు?”

“ఒక వేళ ఎవరైనా పలుకుబడి కలవారు ఆ లిస్ట్‌లో ఉంటే తొందరగా రెస్పాన్స్ ఉంటుంది. ఉదహారణకు ఏ మినిస్టర్ గారి బామ్మరిదో, లేదా ఏ ఎం.ఎల్.యే.నో…”

“ఐతే ఇప్ప్పుడే కనుక్కుంటాను. ఇదిగో పైలట్. మన ప్యాసెంజర్స్‌లో ఎవరన్నా పలుకుబడి కలవారు ఉన్నారేమో కనుక్కో,” పెద్ద పైలట్‌కి పురమాయించాడు పెద్ద గడ్డం.

పైలట్ బయటకు వెళ్ళి కనుక్కుని వచ్చాడు. “ఒక మన్‌మోహన్ అనే అతని మామయ్య మాజీ సర్పంచ్ అంట,” రిపోర్ట్ చేశాడు.

“అబ్బే! లాభం లేదు సార్. కనీసం ఎం.ఎల్.యే లెవెల్ అయినా ఉండాలి. సరే లెండి. నేను మీ షరతులని వీలైనంత త్వరగా హోం మినిస్టర్ గారికి చేరేలా చూస్తాను,” హామీ ఇచ్చాడు రామ కోటి.

“సరే రెండు గంటల తరువాత మళ్ళీ కాల్ చేస్తాను,” అంటూ డిస్కనెక్ట్ చేశాడు పెద్ద గడ్డం.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in గూఢచారి - 232, సీరియల్స్. Bookmark the permalink.

5 Responses to గూఢచారి 232 – ఇవే మా షరతులు

 1. Siva Kumar K says:

  😉 😛 “చచ్చాక ఏం జరుగుతోందో నీకు తెలీదు కద? ఇంకెందుకు భయం?” –logic.. 🙂
  nice but too short…

 2. karthik says:

  >>ఇలాంటి పవిత్ర కార్యంలో చస్తే మాకోసం మందల మందల అప్సరసలు స్వర్గంలో వెయిట్ చేస్తూ ఉంటారు
  ఓహో సూపరు.. 😀

 3. పైలట్ బయటకు వెళ్ళి కనుక్కుని వచ్చాడు. “ఒక మన్‌మోహన్ అనే అతని మామయ్య మాజీ సర్పంచ్ అంట,” రిపోర్ట్ చేశాడు.

  Ikkada nenu edo pedda VIP vuntaarani expect chesanu…..but idhi kooda bagane vundhi…

 4. Finally, the series has restarted. Have been waiting for this!

 5. suresh says:

  మరి మధ్యలో ఐ.సి.ఐ.సి.ఐ/యాక్సిస్ బ్యాంక్ నుంచి కాల్ రాలేదా (గ్రౌండ్ కంట్రోలు తో పైలట్ మాటలాడుతున్నప్పుడు)? అలానే పైలట్, గ్రౌండ్ కంట్రోలు కి ఫొన్ చేసినప్పుడు కాలర్ ట్యూన్ వినిపించలేదా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s