వీ.సీ.ఆర్ విశాల హృదయం


బృందగానా ముఖ్యమంత్రి వీ.సీ.ఆర్. తన మంత్రి వర్గ సభులతో సమావేశమయ్యాడు.

“మన పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నర్ భై?” అడిగాడు మిగతా వారిని ఉద్దేశించి.

“రామ రాజ్యం అంటే ఎట్లుండెడిదో నువ్వు వచ్చినంకే తెలుస్తూంది అని అందరు ప్రజలు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుర్రు అన్నా,” కోరస్‌గా సమాధానం ఇచ్చారు మంత్రి వర్గం.

“సాల్ దీయుండ్రి. అందరూ అట్ల కూడ బలుక్కున్నట్టు చెప్పిందేందిరో! నేను మీ మాటలు నమ్మ గానీ, మీడియా నుంచి తెలుసుకుంటా. రాజేందర్, టీవీ ఆన్ చెయ్యి,” ఆర్డర్ జారీ చేశాడు వీ.సీ.ఆర్.

వెంటనే రాజేందర్ బృందగాన న్యూస్ చానెల్ పెట్టాడు.

“ఇది నిష్పక్షపాతమైన మీడియాకి ఉదాహరణ. ఇక విందాం,” అందరిని సైలెంట్‌గా ఉండమని సైగ చేశాడు వీ.సీ.ఆర్.

“మోస్తా వాళ్ళ మోసం వల్లనే బృందగానకు కరెంట్ రావడం లేదని ముఖ్య మంత్రి వీ.సీ.ఆర్. చెప్పిర్రు. వాటర్ బోర్డ్ చాలా అమానుషంగా ప్రవర్తిస్తుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసిర్రు. వీ.సీ.ఆర్. నాయకత్వంలో బృందగానా రింగపూర్ కంటే అభివృద్ధి చెందుతుందని ఆర్థిక మంత్రి బరిసెల రాజేందర్ పొగిడిర్రు.” ఇలా సాగి పోతూంది న్యూస్.

“చూసినరా, మీడియ చెప్పింది కాబట్టి నమ్ముతున్న, మన పాలన ఏక్ దం జబర్దస్త్ ఉంది అని,” చెప్పాడు వీ.సీ.ఆర్.

“కానీ అన్నా, మన టీవీ చానెల్ వచ్చినంక కూడా ఇంకా భాస మారలేదే! గా మోస్తా వాల్ల లెక్కనే ఇంకా గోస పోసుకుంటున్నరు,” కంప్లెయిన్ చేశాడు ఒక మంత్రి.

“నువ్వు న్యూస్ సరిగ్గ వినలే మరి. అంద్కనే అట్ల మాట్లాడుతూంటివి. ప్రతి వాక్యం చివర్ల చేసిర్రు, చెప్పిర్రు, పొగిడిర్రు అని అంటున్నారా లేదా? అది మన భాసే కద,” సర్ది చెప్పాడు వీ.సీ.ఆర్. ఆ మంత్రి తృప్తిగా తలాడించాడు.

ఇంతలో కరెంట్ పోయింది.

“ఇదేందిరా?” ఉలిక్కిపడ్డాడు వీ.సీ.ఆర్.

“నీకు తెల్వనిదేముందన్నా. ఆ మోస్త వాళ్ళు భూశైలం నీళ్ళు మనం వాడుకో వద్దని ఆర్డర్ తెచ్చిండ్రు కద. గప్పటి సంది, ఇదే పరేషాని,” బాధగా చెప్పాడు హోం మినిస్టర్ నాయాల నరసింహా రెడ్డి.

“ఇంక లాభం లేదు. మనం ఎట్లైన కరెంట్ తేవాల్సిందే. పక్క రాష్ట్రం ఛత్తెరి ఘడ్ నుంచి కొనుక్కుందాం. నేను ఈయాలే ఆడకి పోయి మాట్లాడొస్తా. గా ఏర్పాట్లు సూడుండ్రి,” మీటింగ్ అయిపోయిందన్నట్టు లేచి నిలబడ్డాడు వీ.సీ.ఆర్.

************************************************************************

ఛత్తెరి ఘడ్‌లో జరిగిన సభలో వీ.సీ.ఆర్ ఉద్వేగంగా ప్రసంగించాడు. “హత్తెరి! మనం మనం ఇప్పుడైతే వేరే రాష్ట్రాలు కానీ ఒకప్పుడు మస్తు రాక పోకలు ఉండె. మా కాకలు తీరిన వంశమోల్లు చానా మంది, మీ కాడున్నారు తెలుసా? మనం మనం ఒకటే అనుకోరాదే!” గద్గదమైన గొంతుతో అన్నాడు వీ.సీ.ఆర్.

ఛత్తెరి ఘడ్ ప్రజలు చప్పట్లు కొట్టారు.

అక్కడున్న వారందరితోనూ ఏదో ఒక వరస కలుపుకున్నాడు వీ.సీ.ఆర్.

బుస్సాం రాష్ట్రానికి చెందిన ఒక ఆఫీసర్‌ని పట్టుకుని, ఎంత మంది బుస్సాం పౌరులు బృందగానాలో బతుకుతున్నారో గుర్తు చేసుకున్నాడు. షాక్మీర్‌కి చెందిన ఒక ప్రొఫెసర్‌తో బృందగానాలో షాక్మీరి పులావ్ ఎంత ఇష్టంగా తింటారో వివరించాడు.

ఆఖరికి ఈఫ్రికా నుంచి వచ్చిన ఒక నల్ల విద్యార్థిని కూడా వదల్లేదు. ఎలుగుబంటిలా ఎగిరి కౌగలించుకున్నాడు. అందరూ కాస్త ఆశ్చర్యపోయారు. “అరే మీరందరు సదువుకున్నోల్లు, మీకు తెల్వదా? మన మానవ జాతి మొదలయ్యిందే ఈఫ్రికాలో. ఆ లెక్ఖన చూస్తే గీ నల్ల పోరడు కూడా నాకు చుట్టం అవుతాడు,” ఎక్ష్ల్‌ప్లెయిన్ చేశాడు వీ.సీ.ఆర్.

ఆ విశాల హృదయాన్ని చూసి అందరు అబ్బురపడి పోయి మళ్ళీ చప్పట్లు గొట్టారు.

************************************************************************

ఆదరా బాదరాకి తిరుగు ప్రయాణంలో వెళ్తున్న వీ.సీ.ఆర్.ని, పక్క సీట్లో కూర్చున్న ఒక పెద్ద మనిషి తెగులులో అప్యాయంగా పలకరించాడు.

“నమస్తే మీరెక్కడికెల్లి?” అడిగాడు వీ.సీ.ఆర్. ఆయన్ని.

“ఒకప్పుడు మనమంతా అంధేరా ప్రదేశ్‌లో కలిసి ఉండే వాళ్ళమండి. నేను మోస్తాలో ఉంటాను…”

ఇంకా ఆయన మాటలు పూర్తి కాకుండానే, “మీ లాంటి నమ్మక ద్రోహుల దగ్గర, నాగుం పాముల దగ్గర నేను కూర్సోను కూడా కూర్సోను. ఇగో, ఎయిర్ హోస్టెసమ్మ! నా సీట్ జరంత మార్చు,” తన సీట్ ఖాళీ చేస్తూ రుసరుసలాడాడు వీ.సీ.ఆర్.

************************************************************************

మరుసటి రోజు బృందగాన న్యూస్ చానెల్‌లో విలేఖరి ఇలా చదువుతూంది, “ఈఫ్రికా నుంచి వచ్చిన విద్యార్థిని కౌగలించుకుని, తన విశ్వ మానవ సౌభ్రాత్రాన్ని మన ముఖ్య మంత్రి వీ.సీ.ఆర్. బయట పెట్టిర్రు…”

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

11 Responses to వీ.సీ.ఆర్ విశాల హృదయం

 1. Srikanth says:

  Awesome post. Absolutely realistic.

 2. రవి says:

  వీ సీ ఆర్ జ్ఞానం గురించి కూడా రాయండి. ఛత్తెరి గఢ నుంచి ఒక పైపు లైన్ వేసేస్తే కరెంటు వచ్చేస్తది. వగైరా వగైరా..

  • Murali says:

   అంటే ఏంటి మీ ఉద్దేశం? రాదనా? మూడేళ్ళు పడుతుందేమో కానీ వస్తుందండి!

   • రవి says:

    అమ్మో, వీ సీ ఆర్ అనడమూ అది జరగకపోవడమూనా? నేను సన్నాసి ని గాదండి, నమ్మకపోడానికి. 🙂 నాది ఆయన క్నాలెడ్జీ పరిధుల గురించి క్వీరీ అన్నమాట.

   • karthik says:

    మురళి గారూ,

    వీ.సీ.ఆర్. గారు గతంలో రెండు నెలల్లో చత్తిస్ ఘడ్ విద్యుత్ అని చెప్పాడు.. మీరు అది ఎలా మర్చిపోయారు?

   • Murali says:

    కార్తీక్ గారు,

    ఆయన చెప్పినవి అన్నీ ఆయనకే గుర్తు ఉండవు. పైగా ఆయన ఏదీ రాసివ్వరు. ఇక నాకెలా గుర్తుంటాయి? 🙂

 3. tejaswi says:

  ఈ పోస్ట్ చదువుతుంటే మనసుకు ఎంతో హాయిగా, ఊరటగా ఉందండి! పత్రికలు, ఛానల్స్‌కూడా ఈ వీసీఆర్‌కు భయపడి ఏమీ అనలేకపోతుండటంతో ‘దేవతా వస్త్రాలు-మహారాజు’ కథలోలాగా అయింది ఆదరాబాదరాలోని ప్రజల పరిస్థితి. ప్రజలు లోలోపలే అణుచుకుంటున్న ఫీలింగ్స్ అన్నీ మీ టపాలో ప్రతిఫలించాయి. తుగ్లక్‌ మెరుగు వీడికంటే!

  • Murali says:

   నిజంగా దేవతా వస్త్రాల చందానే ఉంది. 🙂

   To determine the true rulers of any society, all you must do is ask yourself this question: Who is it that I am not permitted to criticize? – Voltaire

 4. kinghari010 says:

  వీసీఆర్ గారి జ్ఞానం అనే అధ్యాయంలో వాహనాల పునః పునః రిజిస్త్రేషన్ కాండను మాత్రము మరువ వద్దు!అత్లు మరచినచో రాసిన వారు చదివిన వారు … అయిపోయెదరు?!

  • Murali says:

   సందు చూసుకుని ఎక్కడో ఉదహరిస్తాను లెండి. ఆయన చేష్టలు, సూక్తులు కవర్ చేయడానికి టైం ఉండడం లేదు. 😦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s