చాచా నెహ్రూకి జేజేలు!

ఈ రోజు పండిట్ నెహ్రూ పుట్టిన రోజు. ఇండియాలో ఈ రోజుని అర్భాటంగా చిల్డ్రెన్స్ డే అన్న పేరుతో జరుపుకుంటారు. నెహ్రూ అనగానే మనకు గుర్తుకు వచ్చే ఇమేజ్, చిన్న పిల్లలతో కలిసి మెలిసి ఆడుకునే ఒక భావుకుడు, పావురాలను ఎగర వేస్తూ ఉండే ఒక శాంతి కాముకుడు మాత్రమే.

దానిలో ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి 30 ఏళ్ళ వరకు కాంగ్రెస్సే మన దేశాన్ని అప్రతిహతంగా పాలించింది కాబట్టి, వాళ్ళు సిస్టామ్యాటిక్‌గా నెహ్రూ గారి గురించి ఈ ఇమేజ్‌ని కల్టివేట్ చేశారు. అయితే ఆయనలో భారత దేశ ప్రజలకు తెలియని చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. తెలియని అనడంకంటే తెలియనివ్వకుండా ఆపిన, అనడం కరెక్టేమో! ఎలాగూ మీరు నెహ్రూ ఎంత గొప్ప మనిషో, దేశానికి ఎంత మేలు చేశాడో లాంటి ప్రసంగాలు ఈ రోజు చాలానే వింటారు కాబట్టి, ఆయన చేసిన చారిత్రాత్మక తప్పిదాల గురించి కూడా తెలుసుకోవడం సబబు.

చారిత్రాత్మక తప్పిదం అన్నది నేను ఆ పదం ఘనంగా ఉంటుందని వాడడం లేదు. నెహ్రూ చేసినవి నిజంగానే చారిత్రాత్మక తప్పిదాలు అంటే historical blunders. మామూలు తప్పులు కొంత కాలం తరువాత మరుగున పడిపోతాయి. మాసిపోతాయి. అవే చారిత్రాత్మక తప్పిదాలైతే, ఒకరిద్దరు మనుషులని కాదు, మొత్తం జాతినే తర తరాల పాటు వేదిస్తాయి. మామూలుగా ఐతే ఎవరైనా ఒక హిస్టారికల్ బ్లండర్ చేస్తేనే చరిత్రలో తమ స్థానాన్ని కోల్పోతారు. కాని నెహ్రూ అలాంటివి నాలుగు చేసి కూడా ఇండియాలో ఇంకా ఒక మహా నేతగానే పరిగణింపబడుతున్నాడు.

నెహ్రూ చేసిన నాలుగు చారిత్రాత్మక తప్పిదాలలో మొదటిది కాశ్మీరు సమస్య.

కాశ్మీరు సమస్య యొక్క నేపథ్యాన్ని పరిశీలిద్దాం. బ్రిటీష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టే సమయానికి దాదాపు 560 పై చిలుకు సంస్థానాలున్నాయి. ఈ సంస్థానాల యొక్క రాజులు బ్రిటీష్ వారి సార్వభౌమాధికారాన్ని మన్నిస్తూనే, కొంత స్వయం ప్రతిపత్తిని కూడా అనుభవించేవారు. (మీలో చాలా మంది లగాన్ సినిమా చూసే ఉంటారు. అందులో రాజుది ఈ సంస్థానాల్లో ఒకటన్న మాట.)

భారత దేశం విభజన సమయంలో, ఈ సంస్థానాలని ఏం చేయాలన్నది కూడా ఒక ముఖ్యమైన అంశం. కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్, భారత దేశం, ఇన్స్ట్రుమెంట్ అఫ్ అక్సెషన్ మీద సంతకం చేశాయి. ఇన్స్ట్రుమెంట్ అఫ్ అక్సెషన్ ప్రకారం, ఈ సంస్థానాల్లో ఎవరైనా తాము ఇండియాతో ఉండాలో, పాకిస్తాన్‌తో ఉండాలో నిర్ణయించుకోవచ్చు. తుది నిర్ణయం ఆ సంస్థానపు రాజుదే. దీనికి ముందు చెప్పినట్టు పాకిస్తాన్, ఇండియా రెండు కట్టుబడ్డాయి. సర్దార్ వల్లభ్ భాయి పటేల్, ఈ సంస్థానాలను భారత దేశంలో విలీనం చేసె బాధ్యత తన తలకి ఎత్తుకున్నాడు. అంతే కాకుండా సమర్థవంతంగా 565 సంస్థానాలను విలీనం చేశాడు.

కానీ కాశ్మీరు దగ్గర చిక్కొచ్చి పడింది. ఎందుకంటే ప్రధాన మంత్రి నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్‌ని కాశ్మీరులో జోక్యం చేసుకోవద్దని, కాశ్మీరు వ్యవహారం తానే చక్కబెడతానని చెప్పాడు. నిజానికి ఇది రాజ్యాంగ విరుద్ధం. పటేల్ మినిస్టర్ అఫ్ స్టేట్స్ కాబట్టి, కాశ్మీరు కూడా ఆయన పరిధిలోకే వస్తుంది. కానీ నెహ్రూ మనసు నొప్పించడం ఎందుకని, పటేల్ సరేనన్నాడు.

కాశ్మీరు రాష్ట్రం మహారాజు హరిసింగ్. ఆయన ఎందుకనో పాకిస్తాన్, ఇండియాతో కాకుండా కాశ్మీరుని స్వతంత్ర్య రాజ్యంగా తానే ఏలుకోవచ్చని ఆశ పడ్డాడు. కాబట్టి ఇంస్ట్రుమెంట్ అఫ్ ఆక్సెషన్ మీద వెంటనే సంతకం పెట్టలేదు. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ ట్రైబల్స్ వేషంలో తన సైనికులని కాశ్మీరులోకి పంపించిందో అప్పుడు హరిసింగ్ చేతులెత్తేసి ఇండియాలో చేరడానికి తనకి అంగీకారమే అని, ఇన్స్ట్రుమెంట్ అఫ్ అక్సెషన్ మీద సంతకం పెడతానని కబురు పెట్టాడు.

ఇక్కడే నెహ్రు తన రాజకీయ చతురత అంతా ప్రదర్శించాడు.

షేక్ అబ్దుల్లా ఒక కాశ్మీరు రాజకీయ నాయకుడు. ఆయన హరిసింగ్ పాలన పట్ల తిరుగుబాటు చేసి జైలులో ఉన్నాడు. నెహ్రూకి ఎందుకనో షేక్ అబ్దుల్లా అంటే వల్లమాలిన అభిమానం. హరిసింగ్ అంటే చిన్న చూపు. ఈ కారణాల మేర నెహ్రూ హరి సింగ్‌ని భారత్ సహాయం కావాలంటే, ముందు షేక్ అబ్దుల్లాని విడుదల చేసి కాశ్మీరుకి ప్రైం మినిస్టర్ చేయాలని షరతు పెట్టాడు. తన అభిజాత్యం చంపుకుని హరి సింగ్ అందుకు ఒప్పుకున్నాడు. కానీ ఈ లావాదేవీల మధ్య ఇంకో రెండు రోజులు గడిచిపోయాయి. కాశ్మీరులో చెప్పలేనంత విధ్వంసం జరిగింది. ఐతే, కాస్త ఆలస్యమైనా భారత సైన్యం కాశ్మీరుని చేరుకుని పాకిస్తాన్ దాడి తిప్పి కొట్టడం మొదలు పెట్టింది.

సరే, ఏదో ఒకటిలే కాశ్మీరు మనకే వచ్చింది కద అని సరి పెట్టుకుందామనుకుంటే, నెహ్రూ గారు మళ్ళీ తన చాకచక్యం ప్రదర్శించారు. భారత సైన్యం, పాకిస్తాన్ సైనికులని రెండు వంతుల కాశ్మీరు నుంచి తరిమి వేసింది. ఇంకో ఒక వంతు మిగిలి ఉంది. ఆ సమయంలో నెహ్రూ పచ్చ జెండా ఊపి, ఐక్య రాజ్య సమితిని, అదే, U.N.O.ని కాశ్మీరు సమస్యలో మధ్యవర్తిత్వం నెరపమని ఆహ్వానించాడు. అప్పటికి U.N.O. ఏర్పడి రెండేళ్ళయ్యింది అంతే. ఈ నిర్ణయాన్ని వల్లభ్ భాయి పటేల్ నుంచి భారత్ సైన్యాధికారుల వరకు అందరూ వ్యతిరేకించారు. కానీ ఆఖరికి నెహ్రూ మాటే నెగ్గింది.

ఐక్య రాజ్య సమితి ఏం చేసింది? ముందుగా cease fire ప్రకటించింది. ఇరు వర్గాలని కాల్పులు విరమించమంది. యుద్ధం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నియంత్రణ రేఖ, line of control అని నిర్ణయించింది. ఆ రకంగా, ఒక వంతు పాకిస్తాన్ వద్ద, రెండు వంతులు మన వద్ద మిగిలిపోయాయి. ఆ రేఖ ఇప్పటికీ అలానే ఉంది.

నెహ్రూ చాచా వల్ల రూపు దిద్దుకున్న ఈ ప్రహసనం శుద్ధ దండగమారిది. ఎందుకంటే, ఎప్పుడైతే పాకిస్తాన్ కాశ్మీరులోకి తన సైన్యం పంపించి, ఇన్స్ట్రూమెంట్ అఫ్ అక్సెషన్‌ని ఉల్లంఘించిందో, అప్పుడే అది కాశ్మీరు మీద సర్వ హక్కులు కోల్పోయింది. హరి సింగ్ స్వయంగా భారత సైన్యాన్ని ఆహ్వానించాడు కాబట్టి, భారత్‌కి పాకిస్తాన్‌ని కాశ్మీరు అవతలకు తరిమివేసే నైతిక హక్కు ఉంది. కానీ, మన నెహ్రూ గారికి ఎంతసేపు మిగతా దేశాల దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడం ముఖ్యం. కాబట్టి ఆయన సమస్యని పై విధంగా సాగదీశాడు.

ఇది సరిపోదన్నట్టు నెహ్రూ గారు కాశ్మీరులో ప్లీబిసైటుకి కూడా ఒప్పుకున్నారు. ప్లీబిసైట్ అంటే కాశ్మీరు ప్రజలే ఏ దేశంతో ఉండాలో నిర్ణయించుకుంటారు. ఐతే ఐక్య రాజ్య సమితి ఒక షరతు పెట్టింది. ముందుగా పాకిస్తాన్ తన సైన్యాన్ని కాశ్మీరు నుంచి తొలగించాలి. ఆ తరువాత భారత్ సైన్యాలు వెనుకంజ వేయాలి. అప్పుడు ప్లీబిసైట్ జరుగుతుంది.

కానీ పాకిస్తాన్ ఒక్క అంగుళం కూడా కదల్లేదు. ఈ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించింది. కాబట్టి ప్లీబిసైట్ జరగలేదు. ఇప్పటికీ వేర్పాటు వాదులు ప్లీబిసైట్ అనడం, వారికి మన దేశంలోని అరుంధతి రాయ్‌లాంటి మేధావులు వత్తాసు పలకడం జరుగుతుంది. కాని ప్లీబిసైట్‌కి ఎప్పుడో కాలం చెల్లింది.

కాశ్మీరు అంటే మీకు గుర్తుకు రావల్సిన ఇంకో విషయం ఆర్టికల్ 370. క్లుప్తంగా చెప్పాలంటే, రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు తప్ప, భారత దేశానికి కాశ్మీరు పై ఏ ఇతర హక్కులు లేవు. భారత దేశానికే కాదు, మిగతా భారతీయులకు కూడా. ఉదహారణకు, మిగిలిన భారతీయులు, కాశ్మీరులో భూమి కొందామన్నా కొనలేరు. ఇది కాశ్మీరు ప్రత్యేకతని నిలబెట్టడానికి చేసుకున్న ఒప్పందమైనా, నిజానికి ఇది కాశ్మీరుని భారత దేశంతో పూర్తిగా కలిసిపోకుండా ఉండడానికే ఉపయోగపడింది. ఇంత నికృష్టమైన చట్టాన్ని అమలులోకి తెచ్చింది ఎవరు? ఆర్టికల్ 370 రూపు దిద్దుకోవడంలో కూడా చాచా నెహ్రూ ముఖ్య పాత్రే పోషించాడు.

షేక్ అబ్దుల్లాని విడిపించి అతన్ని కావలసిన దానికంటే పెద్ద నేతని చేయడమే కాకుండా అతనిని మంచి చేసుకోవడానికి, నెహ్రూ షేక్ ప్రతిపాదించిన ఆర్టికల్ 370ని కూడా ఒప్పుకున్నాడు. అర్టికల్ 370కి సంబంధించిన అత్యంత హేయమైన విషయం ఏమిటీ అంటే, కాశ్మీరుకి సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా తీసుకోవడానికి కాశ్మీరు అసెంబ్లీ ఆమోదం తప్పని సరి. అంటే, భారత ప్రభుత్వానికి కాశ్మీరు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం లేదు.

అర్టిక 370 గురించి అప్పటి మన పార్లమెంట్ ఆందోళన వ్యక్తం చేస్తే, నెహ్రూ గారు, “భయ పడాల్సిన పని లేదు, ఆర్టికల్ 370 దానంతట అదే అరిగిపోయి అదృశ్యం అయిపోతుంది,” అని సెలవిచ్చారు. ఆయన హిందిలో చెప్పిన మాటలు: “వొ గిస్తే గిస్తే గిస్ జాయెగా” అని. ఆర్టికల్ 370 ఎంత అరిగిపోయిందో, ఎంత అదృశ్యమయ్యిందో మనందరికి తెలుసు.

నెహ్రూ ఈ ఒక్క విషయంలోనే కాకుండా, కాశ్మీరుకి సంబంధించిన ప్రతి విషయంలోనూ, అనుచితంగానే ప్రవర్తించాడు. బహుశా, ఆయన తాత ముత్తాతలు కాశ్మీరు వాస్తవ్యులు కాబట్టి, ఆయన కాశ్మీరుని తన సొంత జాగీరుగా భావించాడేమో మరి.

( నెహ్రూ గారి కూతురైన ఇందిరా గాంధికి ఈ చారిత్రాత్మక తప్పిదాన్ని దిద్దుకునే సువర్ణ అవకాశం వచ్చింది. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోతున్న తరుణంలో భారత్ కూడా ఆ యుద్ధంలోకి లాగబడింది. తూర్పు వైపు భారత సైన్యం బంగ్లా ముక్తి బాహినికి సహాయం చేస్తూంటే, పాకిస్తాన్ మన దృష్టి అక్కడి నుంచి మరల్చడానికి భారత్‌ని పడమటి నుంచి ముట్టడించింది.

ఆ రకంగా వెస్టర్న్ ఫ్రంట్‌లో భారత్‌కి పాకిస్తాన్‌కి మాత్రమే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. ఈస్టర్న్ మరియు వెస్టర్న్ ఫ్రంట్స్ రెండు చోట్లా జరిగిన యుద్ధంలో, దాదాపు తొంభై వేల మంది పాకిస్తాను సైనికులు యుద్ధ ఖైదీలయ్యారు. మనం పాకిస్తాన్ గడ్డ మీద అడుగు పెట్టి, లాహోర్ వైపు దూసుకు పోతున్నాం. పాకిస్తాన్ తెల్ల జెండా ఊపింది. యుద్ధంలో ఓడిపోయామని ఒప్పుకుంది. Cease fire జరిగింది.

ఇంత గొప్ప విజయం సాధించిన ఏ దేశమైనా ఏం చేస్తుంది? ఇంకో సారి ఈ సమస్య తల ఎత్తనివ్వకుండా చూసుకుంటుంది. యుద్ధంలో సాధించిన విజయానికి తగిన ప్రతిఫలం చేజిక్కించుకుంటుంది. పాకిస్తాన్‌ని ఎలాగూ ఆక్రమిత కాశ్మీరు నుంచి భారత్ పూర్తిగా బయటకు తరిమేసింది కాబట్టి, కాశ్మీరు శాశ్వతంగా భారత్‌కు చెందినదే అని పాకిస్తాన్ అంగీకరిస్తేనే, ఆ తొంభై వేల యుద్ధ ఖైదీలని వదులుతాము అని మనం షరతు పెట్టి ఉంటే, ఒప్పుకోవడం తప్ప పాకిస్తాన్‌కి గత్యంతరం లేదు.

మరి మనమేం చేశాం? ఆ యుద్ధ ఖైదీలందరిని ఉత్తి పుణ్యానికి వదిలేసి, పాకిస్తాన్ 1947లో ఆక్రమించుకున్న కాశ్మీరుని తిరిగి వాళ్ళకే అప్పగించేసి, ఒక దరిద్రపు గొట్టు ఒప్పందం మాత్రం చేసుకున్నాం. దాని పేరే సింలా అగ్రీమెంట్. ఈ అగ్రీమెంట్ ప్రకారం కాశ్మీరు సమస్యని భారత్ మరియు పాకిస్తాన్, శాంతియుతంగానూ ద్వైపాక్షికంగానూ, అంటే bi-lateralగా, పరిష్కరించుకోవాలి. ఇది మనం యుద్ధంలో విజయానికి పొందిన ప్రతిఫలం!! ఇది ఇందిరమ్మ రాజనీతి.

ఇన్ని అవకాశలొచ్చినా మనకు మనమే సహాయం చేసుకోకపోతే ఆఖరికి ఆ దేవుడు కూడా మనకి సహాయం చేయడు. అందుకే కాశ్మీరు సమస్య ఇప్పటికీ రగులుతూనే ఉంది. చిత్రమేమిటంటే, ఒక పదకొండు ఏళ్ళు తప్ప, నెహ్రూ వంశస్తులు మొన్న మొన్నటి వరకు భారత దేశాన్ని పరిపాలించారు. చరిత్ర గురించి మనకు అవగాహన లేకపోవడం వల్ల జరిగే నష్టాలు ఇలానే ఉంటాయి. )

నెహ్రూ చేసిన రెండవ తప్పిదం, ఐక్య రాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో భారత్‌కి శాశ్వత సభ్యత్వం కోరి వస్తుంటే దాన్ని తిరస్కరించి చైనాకి కట్టబెట్టడం. అవును, మీరు సరిగ్గానే చదివారు. నెహ్రూ చేసిన రెండవ తప్పిదం ఇది.

ఎందుకిలా చేశాడు అంటే, ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ నెహ్రూ మాటల బట్టి, రాతల బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఆయనకి కేవలం భారత్‌లోనే కాకుండా మొత్తం ప్రపంచమంతా ఒక నాయకుడిగా ఒక స్టేట్స్‌మన్‌గా గుర్తింపబడాలని కోరిక ఉంది. ఇలా చేయడం వల్ల ఆయన తన విశాల హృదయాన్ని చాటుకున్నాను అని అనుకుని ఉండవచ్చు. కానీ ఏ చైనా ఐతే ఈ చర్య వల్ల లాభపడిందో అదే చైనా గత కొన్ని సంవత్సరాలుగా మనకు యూ.ఎన్. సెక్యూరిటీ కౌన్సి్‌లో శాశ్వత సభ్య్త్వం రాకుండా అడ్డు పడుతూంది. దీన్నే వ్రతం చెడినా ఫలితం దక్కక పోవడం అంటారు.

అసలు ఈ యూ.ఎన్. సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం పొందడం ఎందుకు ముఖ్యం అంటారా? యునైటెడ్ నేషన్స్ ప్రపంచాన్ని శాసించేంత శక్తివంతమైన సంస్థ కాకపోయినా, దాని సెక్యూరిటీ కౌన్సిల్‌కి మహాభారతంలో సైంధవుడిలా ఒక నెగటివ్ పవర్ ఉంది. అదే వీటో. ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన ఏ విషయం పైన నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఈ కౌన్సిల్‌లోని ఐదుగురు శాశ్వత సభ్యులు దానికి అనుకూలంగా వోటు వేయాలి. ఒక్కరు ప్రతికూలంగా వోటు వేసినా, అంటే వీటో చేసినా ఆ ప్రతిపాదన చెల్లదు.

యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యులు: అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, మరియు ఇంగ్లాండ్. కాబట్టి వీరిలో అందరూ ఒకే మాట మీద ఉంటేనే ఏదైనా పని జరిగేది. ఎవరు వీటో చేసినా ఏ ముఖ్యమైన నిర్ణయం అమలు కాదు.

భారత్‌కి ముఖ్యంగా సమస్యలున్నవి, పాకిస్తాన్‌తో, చైనాతోనే. కాని చైనా పాకిస్తాన్‌కి మిత్ర దేశం కావడం వల్ల, సెక్యూరిటీ కౌన్సిల్‌ పాకిస్తాన్‌కి ప్రతికూలంగా నిర్ణయం తీసుకోకుండా చైనా ప్రతి సారి అడ్డు పడింది. అంతే కాదు చైనా 1962లో మన మీద దండెత్తి వచ్చినప్పుడు కూడా ఇదే కారణం వల్ల మనం ఏమీ చేయలేకపోయాం.

మనం శాశ్వత సభ్యత్వాన్ని జార విడుచుకున్న సంఘటన ఇలా జరిగింది. అమెరికా 1953లో భారత్‌కి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరిక వెలి బుచ్చినప్పుడు, నెహ్రూ ఆ ప్రతిపాదనని తిరస్కరించాడు. ఇండియా కంటే చైనాకి ఇవ్వడమే సమంజసం అని చెప్పాడు. తద్వారా, చైనా సెక్యూరిటీ కౌన్సిల్‌లో పర్మనెంట్ మెంబర్ అయ్యింది.

మళ్ళీ ఎవరికైనా ఇదే ప్రశ్న వస్తుంది? నెహ్రూ ఎందుకిలా చేశాడు? మళ్ళీ నెహ్రూ మనస్తత్వాన్ని అనలైజ్ చేస్తే మనకొచ్చే సమాధానం ఇది. నెహ్రూ ఫారిన్ పాలసీనే దానికి కారణం. ఆయన ఫారిన్ పాలసీలో తటస్త విధానం అవలంబించాడు. అంటే రష్యా అమెరికా ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గక పోవడం. అమెరికా ఆఫర్ అంగీకరించడం వల్ల ఇండియా అమెరికా వైపు ఎక్కడ మొగ్గు చూపిస్తుందో అని అందరూ అనుకుంటారని, అలా కాకుండా చైనాకి ఈ సీటు కట్టబెడితే చైనాతొ మైత్రి అభివృద్ధి అవుతుందని ఆయన భావించి ఉండవచ్చు. అది జరగలేదు. చైనా మనకు పక్కలో బల్లెంలానే ఉంది. మనం ప్రపంచ రాజకీయాలు శాసించగల ఒక అమూల్యమైన అవకాశం కోల్పోయాము.

నెహ్రూ చేసిన మూడవ తప్పిదం, ఇండియాని సోషలిజం బాట పట్టించడం. సోషలిజం కమ్యూనిజం అంత నిరంకుశం కాక పోయినా అది కూడా చాలా ప్రమాదకరమైనదే. కమ్యూనిజం పౌరులకి ఏ హక్కు లేకుండా సమ సమానత్వం పేరిట, అంతా ప్రభుత్వం చెప్పినట్టే జరగాలని అంటే, సోషలిజం పౌరులకి కొన్ని హక్కులు ఇచ్చినా, సామాజిక న్యాయం పేరిట, సబ్సిడీలు అని, రిజర్వేషన్లు అని, ఋణాల మాఫీ అని, డబ్బున్న వారి నుంచి తీసుకుని పేదలకు పంచుతుంది.

ఇందులో తప్పేముంది అని మీరనొచ్చు. తప్పేమిటంటే, దీని వల్ల సామాజిక న్యాయం సిధ్ధించదు. సబ్సిడీలు, రిజర్వేషన్లు తీసుకునే వాళ్ళు, ఎన్నేళ్ళైనా వాటిని తీసుకుంటూనే ఉంటారు. అది అనంతం. ఎవరిని వారు సపోర్ట్ చేసుకోగలిగే వ్యవస్థ ఏర్పాటు చేయనంత వరకు, ఇలాంటి వాటి వల్ల ఏ పెద్ద మార్పు రాదు. పైగా ఇంకో వైపు, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయలకు, రోడ్లకు, పవర్ ప్రాజెక్టులకు, టెలి-కమ్యూనికేషన్స్‌కు అవసరమైన నిధులని “సామాజిక న్యాయం” కోసం కేటాయించడం వల్ల , ఆయా రంగాల్లో అభివృద్ధి కుంటు పడుతుంది. పైగా, సోషలిజం క్యాపిటలిస్టులని ఎప్పుడూ అనుమాన దృష్టితోనే చూస్తుంది. ఉద్యోగాలు సృష్టించేది క్యాపిటలిస్టులే కాబట్టి ఈ పోకడ నష్టాన్నే కలిగిస్తుంది. వెరసి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది.

దీనితో ప్రజలకు లాభం లేకపోయినా, రాజకీయ పార్టీలకు గొప్ప లాభం. ఎందుకంటే ఈ సమస్యలు ఎప్పటికి తీరవు కాబట్టి, ఎన్నేళ్ళైనా వారు ఇవే సమస్యలను తీరుస్తామని ప్రజలకు వాగ్ధానాలు చేస్తూ ఎన్నికలు గెలుస్తూ ఉండొచ్చు. ‘గరీబీ హటావో” అంటూ పేదవాళ్ళతో వోట్లు వేయించుకుంటూనే ఉండవచ్చు. అదే ప్రజలు అభివృద్ధి చెందితే, వాళ్ళ నుండి వోట్లు దండుకోవడం అంత సులభం కాదు. స్వాతంత్ర్యం వచ్చి అరవయి ఏడు ఏళ్ళైనా భారత్‌లో ఇంకా ప్రాధమిక సదుపాయలు లేవు అంటే, దానికి కారణం ఈ సోషలిజమే.

భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు, దక్షిణ కొరియా, భారత్ రెండూ ఇంచు మించు ఒకే ఆర్థిక స్థితిలో ఉండేవి. నెహ్రూ వల్ల మనం సోషలిజం మార్గంలో పయనించాం. దక్షిణ కొరియా క్యాపిటలిజం ఎన్నుకుంది.

1947లో, దక్షిణ కొరియా పర్ కాపిటా ఇన్‌కం భారత్‌కంటే దాదాపు రెండింతలు ఉండేది. అదే 1990లో దక్షిణ కొరియా పర్ కాపిటా ఇన్‌కం భారత్‌కంటే ఇరవయి ఇంతలు అయ్యింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, దక్షిణ కొరియాకి స్వాతంత్ర్యం 1948 ఆగస్ట్ 15వ తేదీన వచ్చింది.అంటే దాదాపు భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే. భారత్ దక్షిణ్ కొరియాల అభివృద్ధుల్లో ఈ వ్యత్యాసం చూపడానికే ఈ ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది.

ఇండియా సోషలిజం దారిలో పయనించడానికి నెహ్రూనే ముఖ్య కారణం.

1962లో జరిగిన భారత్-చైనా యుద్ధంలో భారత్ ఘోర పరాజయం చెందడానికి కారణమవ్వడం నెహ్రూ చేసిన నాలుగో చారిత్రాత్మక తప్పిదం.

ఇంతకు ముందు చెప్పినట్టు నెహ్రూ చైనాని గుడ్డిగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని చైనీయులు ముందు నుంచి నిలబెట్టుకోలేదనుకోండి. అది వేరే విషయం. అంతే కాకుండా నెహ్రూ భారత సైన్యం పెరుగుదల మీద, చేయాల్సిన ఆధునీకరణ మీద, సమకూర్చాల్సిన ఆయుధాలు, వనరుల పట్ల ఏ మాత్రం శ్రద్ధ వహించలేదు. భారత సైన్యాధికారులు ఎన్నో సార్లు సైన్యపు బడ్జెట్ పెంచమని మొర పెట్టుకున్నా ఆయన పట్టించుకోలేదు.

కాబట్టి 1962లో చైనా భారత్ మధ్య యుద్ధం సంభవించినప్పుడు భారత సైన్యం ఏ మాత్రం తయారుగా లేదు. ఈ యుద్ధానికి బీజాలు 1959లో ఏర్పడ్డాయి. టిబెట్‌ని చైనా అక్రమంగా ఆక్రమించిన తరువాత, 1959లో టిబెట్ మత గురువు ఐన దలైలామా ఇండియాకి పారిపోయి వచ్చి అక్కడ తలదాచుకున్నాడు. అప్పటి నుండి చైనా భారత్‌ని అనుమాన దృష్టితో చూడసాగింది. ఇది కాకుండా 1947లో బ్రిటీష్ వారు ఇండియాని వదిలి పెట్టి వెళ్ళిపోయినప్పుడు భారత్ చైనా మధ్య సృష్టించిన సరిహద్దు రేఖ పట్ల భారత్ చైనా ఇరువురు సంతృప్తిగా లేరు. దీన్ని McMahon line అని పిలుస్తారు.

నెహ్రూ 1961లో “ఫార్వర్డ్ పాలసీ”ని ప్రవేశపెట్టాడు. దీని లక్ష్యం, భారత సైన్యం McMohan lineని దాటి చైనా పాలిత ప్రాతంలో అడుగు పెట్టి ఒకొక్క అడుగు ముందుకి వేసుకుంటూ చైనాని వెనక్కి నెట్టడమే. నిజానికి ఈ భూభాగం,aksai chin, అవసరం ఇండియాకి లేదు. కాని చైనాకి తన సార్వభౌమాధికారాన్ని నిలుపుకోవడానికి ఈ ప్రదేశం చాలా కీలకం. అసలే టిబెట్‌కి స్నేహ హస్తం అందించి ఉన్న ఇండియా పట్ల అనుమానంగా ఉన్న చైనా, ఈ ఫార్వర్డ్ పాలసీని, ఇండియా టిబెట్‌ని ఆక్రమించుకునే చర్యగా భావించింది. ఫలితం యుద్ధం జరగడం, తద్వారా భారత్ పరాజయం పాలవ్వడం.

నెహ్రూ చైనా ఇండియాని ముట్టడిస్తుందని అనుకోలేదు. ఒక సోషలిస్ట్ దేశం ఇంకో సోషలిస్ట్ దేశాన్ని ఎప్పటికీ attack చేయదు అన్నది ఆయన విశ్వాసం. పైగా నెహ్రూకి భారత సైన్యపు శక్తి పట్ల తప్పు అంచనా కూడా ఉంది. ఈ వైఫల్యం నెహ్రూని కృంగదీసింది. యుద్ధం తరువాత నెహ్రూ దాదాపు పార్లమెంట్‌కి హాజరు కావడమే మానేశాడు. 1964లో ఆయన ఈ దిగులుతోనే గుండెపోటుతో మరణించాడు.

ఈ నాలుగు తప్పిదాలు మనల్ని చాలా సంవత్సరాలు, క్రికెట్ భాషలో చెప్పాలంటే, డిఫెన్స్ ఆడేలా చేశాయి. 1991లో పీ.వీ. నరసింహా రావుగారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల కొంత మటుకు సోషలిజం భారి నుంచి తప్పించుకోగలిగినా, మిగతా తప్పిదాలని మనం సరిదిద్దుకోలేక పోయాం.

నెహ్రూ చేసిన ఈ తప్పిదాలు ఏ మాత్రం చర్చకు నోచుకోకపోవడం భారతీయులలోని రెండు ముఖ్యమైన లోపాలని వేలెత్తి చూపిస్తుంది. ఆ లోపాల పేర్లు హీరో వర్షిప్, ఇంకా సామాజిక స్పృహ లేకపోవడం.

హీరో వర్షిప్‌ని విశదీకరించాలంటే, మనం వ్యక్తులని black and white లోనే చూస్తాం. ఒక నాయకుడు పరమ నీచుడైనా కావాలి, లేదా సాక్షాత్తు దేవుడై ఉండాలి. మన అభిమాన హీరో ఎప్పుడు ఎలాంటి తప్పు చేయడు, చేయలేదు. అవతల వారి అభిమాన హీరో ఎందుకు పనికి రాని వాడు. మన ఆలోచనా ధోరణి ఇలా ఉంటుంది. ఇది ముమ్మాటికి తప్పు. ఎంత గొప్ప వ్యక్తులైనా తప్పులు చేస్తారు. అది సహజం. దాన్ని మనం ఒప్పుకోవడం వల్ల వారి గొప్పదనం పూర్తిగా నశించిపోదు. ఆ తప్పుల్ని దాచివేయాలని ప్రయత్నించడం మాత్రం దుష్పరిణామాలకు దారి తీస్తుంది.

ఇక నా ఉద్దేశంలో సామాజిక స్పృహ అంటే నిజం తెలుసుకోవడానికి ఆసక్తి ఉండడమే. సామాజిక స్పృహ అంటే బావిలో కప్పల్లా బతకకుండా మన చుట్టు జరిగిన చరిత్రని, జరుగుతున్న చరిత్రని గమనించడమే.

నెహ్రూ లాంటి నాయకుడిని కానీ, అతగాడి వంశస్తులని కానీ భరించే శక్తి ఇక భారత్‌కి లేదు. ఇంకో పదేళ్ళు కానీ, చివరకి ఐదేళ్ళు కానీ కాంగ్రెస్ పాలన మళ్ళీ సాగితే, మనం ఇక ఎన్నటికి కోలుకోలేము.

నెహ్రూకి ప్రతీక ఐన కాంగ్రెస్, ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ అధికారంలోకి రాకూడదు.

మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలలు కనే “కాంగ్రెస్ ముక్త భారత్”ని మనందరం సాకారం చేద్దాం.

జై హింద్!

Advertisements
This entry was posted in చరిత్ర అడక్కు. Bookmark the permalink.

19 Responses to చాచా నెహ్రూకి జేజేలు!

 1. sk says:

  Excellent !! superb article sir, please continue this series and educate us. even I read some -ve about gandhi too, once nehru posts finished could you please focus on this. Thank you

 2. ఈ నిజాలన్నీ అందరికీ తెలియవలసిఉంది.

 3. Siva Kumar K says:

  జై హింద్!

 4. Jitu says:

  Hello Muraligaaru,

  Thanks for writing this and surmising it so well. 🙂

  I am reading about Nehru( again) after long. Had read about two years ago. In the meanwhile… many changes have happened in India… and are happening in India as we speak. Everyone is aware of the political changes happening, but I am talking about another change happening at the basic individual level in the society. That change is awareness.

  More and more people are getting aware of the facts and spreading this awareness to masses. And the social media is playing a major role in bringing about this surge in awareness. Where online links are available… those are shared. Where they are not… even screen shots and scanned pages are being shared. Articles are being written. Books are being written. I am yet to read Natwar Singh’s book but from what I have perceived from those who have read… he has dedicated quite a few pages to Nehru, Indira and their blunders.

  My first thought after reading your post was… “Ayyo! Idii English lo undi unte , inka entho mandi paathakulu chadivi Nehru gurinchi telusukundevaaru.” Then, as I started typing out my comment, I thought… ‘Not really’. In the past 12hrs I have seen about 15-20 links, articles, excerpts, scans being shared on social media and the online resources I follow. Amongst these there were articles in Marathi, Hindi, Bangla, Telugu, Tamil and English. I do not follow Tamil or Marathi much. But the comments under the posts made it amply clear what was being discussed. It laid to rest my thought that this post will not reach all the potential readers because of linguistic barriers. Cause if this won’t, some other article will. Coming from different sections of the society, spread across various geographical and linguistic regions… these ‘shares’ are doing their work chipping down the black and white heroes and showing the shades of grey in them.

  Another point… The fact that the present government at the center has no need to hide facts about Nehru from the public, is not only allowing this alternative narrative of history to surface, it’s in a way facilitating it. I am using the term alternative narrative loosely here as up until a few years ago… this narrative was not allowed to reach the masses. Now, there are many who are speaking the truth. Well… many who are refuting it too. 🙂

  Yet… so far the reach of the social media and the internet is restricted to the urban folks. Hopefully… that will change soon. It already is. As the change happens, and more people have access to unadulterated versions of history… the mindset of masses will change for the better.

  So both the causes you mentioned in your article… Hero worship and lack of social awareness are being dealt with as we speak. Knowledge is like ‘The magic of 99’. 🙂 When one does not have any knowledge, they don’t care to find out. But the moment people get to know a little, they get the urge to read more, to know more. 🙂

  Muraligaaru, I have seen people mince words and use caustic language when speaking of Nehru. You said all that you had to say without either. Kudos for that. This is a well written post. 🙂

  Regards!

  • Murali says:

   Jitu,

   You are right. There are authors doing what I am doing, in all Indian languages.

   Also, I feel there aren’t enough articles in Telugu explaining how truly “great” Mr. Nehru was. It probably makes more sense to direct my energies here. Telugu literature has always been overrun by left-wing thinkers, who adore Nehru.

   As Sagarika Ghose was bemoaning, the “Internet Hindus” are truly coming of age. 🙂 She must be having sleepless nights. 🙂

   Social media has indeed been good for India.

   Amen!

   • Jitu says:

    Oh Yes! She is having sleepless nights alright. She went on and wrote a two page article on a national daily on how the freedom of expression of journalists was being curbed under the new regime.
    One abominable internet Hindu had the audacity to question her…”So you rant about your freedom of expression being curbed… and that gets published on a A-list national daily… with a reach of a million readers… with no one to stop you and tell you that you are factually wrong. Do you even see the irony in this Ma’am??”
    And less we say about Sagarikapati… the better. :-/ :-/

    But I have to disagree with you. It is not just Telugu literature but almost all published works in almost all languages… including but not limited to fiction, non-fiction, articles, editorials, books, works of the so called scholars,even our History text books… were all dominated by Left wingers. :-/ Most of the celebrated artists and award winning authors have been pro left ideologies until now.

    The few authors who spoke up the alternative version… their works were shunned and even banned. Even when they were not… their reach was limited to right wing circles. University libraries in many places were barred from stocking such books.

    Thank god for the small mercy called social media.

   • Jitu says:

    Just to reiterate what I was saying…

    Here is a link that links 5 other links to articles on Nehru written yesterday. 🙂 🙂
    http://lite.swarajyamag.com/2014/11/15/nehru-nehru-and-more-nehru/

   • Jitu says:

    People are still writing. Spreading awareness. Here’s another piece on the occasion of his death anniversary… written in response to the call by congress to Remember Nehru.

    http://francoisgautier.me/2015/05/27/rememberingnehru-nehru-was-the-perfect-replica-of-a-certain-type-of-englishman/

 5. రవి says:

  ఆ చంచా హెన్రూ ఉండగా ప్రజలు చేయలేనిపనిని అతని మునిమనవడు చేయిస్తున్నాడు లెండి. పప్పుగాంధి ఉన్నంతవరకూ ప్రజలు భయభ్రాంతులై గాంక్రెసును ఓటు వేయకుందురు గాక.

 6. Satish says:

  what a brilliant expose
  very informative
  Bhrarat matha ki jai
  This should be clarified in history lessons

 7. Aruna says:

  Excellent article!!!

 8. eshwar says:

  Really good article.

 9. Cyno says:

  This is the bestest political post i read in years! kudos!! 🙂

 10. kinghari010 says:

  మురళి గారూ, లేటుగా నైనా నేనూ నెహ్రూ గురించి ఒక పోష్టు వేసాను – కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (జవహర్ లాల్ నెహ్రూ) – పేరుతో!
  ref:http://harikaalam.blogspot.in/2014/11/blog-post_25.html
  ఇంకో విషయం – మీరు బృందగానాలో సంబురాలు – పోష్టులో అనుకుంటాను ఇన్ని అచ్చరాలు దేనికన్నా అంతే మనం మొస్తావోళ్ళని తిట్టడానికి పైకొచ్చేవి చాలు అని వెక్క్కిరించారు గదా!ఇప్పుడు తెవాదులు యమా గంభీరంగా ఆ మాతే అంటున్నారు చిత్తగించండి:-)
  ref:http://telangaanaa.blogspot.in/2014/11/blog-post_28.html
  మీ పోష్టు లింకు వెతకదం కష్తంగా వుంది కొంచెం రెఫ్ ఇవ్వగలరా, నా పోష్టులో లింకుగా ఇద్దామనుకుంటున్నాను?

  • Murali says:

   హరి గారు,

   మీ టపాని తీరికగా చదివి నా అభిప్రాయం తెలియజేస్తాను. అసలే నెహ్రూ అంటే నాకు వల్లమాలిన అభిమానం. 🙂

   శ్రీకాంత్ చారి గారి టపా కూడా చదివాను. కానీ, ఆయన ఇంకా దోరని అనకుండా ధోరణి అని (ఇలాగే మిగతావి కూడా) ఎందుకు రాశారో అర్థం కాలేదు. బహుశా తెలంగాణా ప్రభుత్వ ఉత్తర్వు కోసం ఎదురు చూస్తున్నారు అనుకుంటా. ఆయనకి అవకాశం ఇస్తే పది అక్షరాలతో పని జరిపించేలా ఉన్నారు. దొడ్డ వ్యక్తి. తెలంగాణాకి కావల్సింది ఇలాంటి స్ఫూర్తిదాయకులే!

   ఈ టపా లింక్: https://tetageeti.wordpress.com/2014/11/14/nehru_the_great/

   -మురళి

 11. kinghari010 says:

  కానీ, ఆయన ఇంకా దోరని అనకుండా ధోరణి అని (ఇలాగే మిగతావి కూడా) ఎందుకు రాశారో అర్థం కాలేదు.
  ..?
  LOL
  నిజమే,అక్కడ అలాంటి వాళ్ళుంటేనే మనం ఇంకా తొందరగా ముందుకెళ్తాం.ఇలాంటి పైత్యాలన్నింటితో వాళ్ళు తెలంగాణా దాటిపోలేరు.ఈలోగా మనం మన రేవుపట్నాలు బాగుపడీతే ప్రపంచ మంతతా వ్యాపిస్తాం!వాళ్ళు అక్షరాలు కుదించే ప్రయోగంలో సఫలీక్ర్తులయ్యే లోపు మ్నం జపాను భాష కూడా నేర్చేసుకోగలం?!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s