త్వరలో “అతుకుల బొంత”!


బ్లాగ్‌జనులారా!

వచ్చే వారం నుంచి తేటగీతి బ్లాగ్ మీద “అతుకుల బొంత” అనే category మొదలు కానుంది.

ఇది దేని గురించి అంటే చెప్పడం చాలా కష్టం. ఇందులో అన్ని టాపిక్స్ ఉంటాయి. బోలెడు పాత్రలు కూడా ఉంటాయి. సినిమాలు, రాజకీయలు, ఆటలు, పాటలు, ఒకటేమిటి, అన్ని అంశాలు, ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా, ఇందులో ఇమిడి ఉంటాయి. అందుకనే దీనికి “అతుకుల బొంత” అన్న పేరు పెట్టడం జరిగింది.

ఇక పోతే, ఈ కథ జరిగేది ఒక ఊహా లోకంలో. ఈ ఊహా లోకానికి మనం బ్రతుకుతున్న ప్రపంచంతో పోలికలు ఉన్నా, అది కేవలం యాధృచ్చికం మాత్రమే.

మనం బతుకుతున్న ఈ ప్రపంచం వంక పెట్టడానికి వీలు లేనిది. ఇది మనందరికి తెలుసు. అలాగే మన లోకంలో రాజకీయ నాయకులంతా నీతిపరులు, హీరోలంతా నిజ జీవితంలో కూడా ఉత్తమోత్తములు, వ్యాపారులంతా నిజాయితీ పరులు అన్న విషయం మనకు తెలిసిందే. హీరోల వారసులైన వారి బిడ్డలు పుట్టక ముందే యాక్టింగ్ క్షుణ్ణంగా నేర్చుకున్నవారని కూడా మనవి చేస్తున్నా. అలాగే ఈ హీరోల అభిమానులు గొప్ప సంస్కారవంతులు అని కూడా నొక్కి వక్కాణిస్తున్నాను. మన ప్రపంచంలో అన్ని కులాల వారు కలిసి మెలిసి ఉంటారు. అన్ని మతాలు సామరస్యంగా ఉంటాయి.

ఈ ఊహలోకంలో మాత్రం పరిస్థితులు ఇంత బాగా ఉండవు. కాబట్టి వాటిలో జరిగే సంఘటనలకి మన ప్రపంచంలో ఏవైనా పోలికలు కనిపిస్తే నొచ్చుకోకండి. మనది ఒక perfect world అన్న విషయం ఇంకో సారి మననం చేసుకోండి.

Advertisements
This entry was posted in డియర్ రీడర్స్!. Bookmark the permalink.

8 Responses to త్వరలో “అతుకుల బొంత”!

 1. Jitu says:

  Looking forward to it. All the best.

 2. అతుకుల బొంత, గతుకుల బతుకు అనే మకుటం సంపూర్ణముగా ఉంటుందేమో ఆలోచించండి. మంచి ప్రయత్నం. అభినందనీయులు.

 3. Siva Kumar K says:

  😉 ఊహా లోకానికి మనం బ్రతుకుతున్న ప్రపంచంతో పోలికలు ఉన్నా, అది కేవలం యాధృచ్చికం మాత్రమే 😀 😀 😀
  Waiting…But expecting the best.. 😉

 4. >వచ్చే వారం నుంచి తేటగీతి బ్లాగ్ మీద “అతుకుల బొంత” అనే డైలీ సీరియల్ మొదలు కానుంది.
  శుభం

  > “ఒకటేమిటి, అన్ని అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. అందుకనే దీనికి “అతుకుల బొంత” అన్న పేరు పెట్టడం జరిగింది.”
  అదేమిటండీ. అలాంటప్పుడు కలగూరగంప అని పెట్టాలి కదా పేరు.
  కథకు ఒక పధ్ధతీ పాడూ లేకుంటేనే అతుకులబొంత అంటే బాగుంటుంది అనుకుంటాను.
  మీ సీరియల్ మీ బ్లాగు మీ టపాలు మీ యిష్టం.

  • Murali says:

   ముందు కలగూర గంపే అనుకున్నాను కానీ ఆ పేరుతో ఒక బ్లాగ్ ఉంది. కాబట్టి అతుకుల బొంతకి సెటిల్ అయ్యాను.

   Made the required change as per your suggestion. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s